
అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ ఎవిన్ డుగాస్(47) తన 5 అడుగుల 5 అంగుళాల భారీ తలకట్టుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది.
అతిపెద్ద తలకట్టును కలిగిన ఆఫ్రికా సంతతి మహిళగా గత 13 ఏళ్లలో ఆమె మూడు పర్యాయాలు తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. లూసియానాకు చెందిన డుగాస్ 1999 నుంచి కురులను పెంచుతోంది.