headgear
-
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్‌గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్‌కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్‌ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్‌గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్‌కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్‌గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కనికట్టు కాదిది.. తలకట్టు! 5 అడుగుల 5 అంగుళాలు.. 1999 నుంచి
అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ ఎవిన్ డుగాస్(47) తన 5 అడుగుల 5 అంగుళాల భారీ తలకట్టుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. అతిపెద్ద తలకట్టును కలిగిన ఆఫ్రికా సంతతి మహిళగా గత 13 ఏళ్లలో ఆమె మూడు పర్యాయాలు తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. లూసియానాకు చెందిన డుగాస్ 1999 నుంచి కురులను పెంచుతోంది. -
టోపీ పెడతాం, పాగా వేస్తాం
రాజకీయ నాయకులు టోపీలు పెడతారని చాలా మంది అంటారు. కానీ ఎన్నికల వేళ టోపీలే కాదు... పాగాలు కూడా పెట్టుకుంటారు. కులాలు, మతాలు, జాతుల ఓట్లను కొల్లగొట్టి ఢిల్లీ కోటలో పాగా వేయాలంటే తలకు పాగాలు పెట్టుకోవాల్సిందే. చాలా సందర్భాల్లో స్థానిక కార్యకర్తలు కూడా తమ తమ సంస్కృతులను ప్రతిబింబించే పాగాలను పెట్టుకొమ్మని నాయకులను కోరుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఓట్లు రాలతాయా అన్నది మాత్రం యక్ష ప్రశ్నే. అసలీ ప్రక్రియను ప్రారంభించింది ఇందిరాగాంధీ. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఆమె పర్యటించినంత విస్తృతంగా బహుశః మరే నాయకుడూ పర్యటించి ఉండరు. ఆయా ప్రాంతాల విశిష్ట దుస్తులను ధరించి, అక్కడి వారితో కలిసి నృత్యం చేయడం వంటివి కూడా ఆమె చేసేవారు. ముఖ్యంగా లంబాడీ, నాగా, అరుణాచల్ వంటి తెగల దుస్తులను ఆమె ధరించేవారు. తరువాత కాలంలో ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ ట్రెండ్ ను క్యాచ్ చేసేశారు. ఈ సారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ, నరేంద్రమోడీలు ఈ పాగాలు, టోపీలను తెగ ఉపయోగించేస్తున్నారు. దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్న నరేంద్ర మోడీ పొద్దున కర్నాటక పాగా వేసుకుంటే, మధ్యాహ్నం పంజాబ్ పాగా కట్టుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గిరిజనుల వెదురు టోపీ ఒక సారి వేసుకుంటే మరో సారి అస్సాం ప్రజలు వాడే జాపీ అనే టోపీని వేసుకుంటున్నారు. మొత్తం మీద ఎవరు అధికార కోటలో పాగా వేస్తారో, ఎవరికి ప్రజలు టోపీ పెడతారో త్వరలోనే తేలిపోనుంది.