టైం బాగోకపోతే ఎంతటి వారైన దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోవాల్సిందే. అంతేగాదు చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది, నిందలు కూడా పడాల్సి వస్తుంటుంది. శిక్ష అంత అనుభవించాక గానీ అసలు నిజం వెలుగులోకి రాదు. తీరా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు కూడా. ఎందుకంటే దాని తాలుకా చేదు అనుభవాలన్ని భరించేసి ఉంటారు బాధితులు. ఇక వాస్తవం ఏంటో తేలినా..చివరికి సమాజం నుంచి వచ్చే టన్నుల కొద్ది జాలి బాధిస్తుందే తప్ప ఓదార్పునివ్వదు. పైగా అవేమీ వారి కోల్పోయిన సంతోషాన్ని, పరువును తెచ్చి ఇవ్వలేవు. 'నాకే ఎందుకు ఇలా'.. అన్న మాటలకందని వేదనే మిగులుతుంది. ఇలాంటి బాధనే ఫేస్ చేసింది యూఎస్‌కి చెందిన ఓ మహిళ. చేయని నేరానికి ఎన్నేళ్లు కటకటాల్లో మగ్గిందో వింటే కంగుతింటారు.
అసలేం జరిగిందంటే..సాండ్రా హెమ్మె అనే 64 ఏళ్ల మిస్సౌరీ మాజీ పోలీసు అధికారి. తన సహ పోలీసు అధికారిణి జెష్కేని హత్య చేసిన కేసులో ఏకంగా 40 ఏళ్లకు పైగానే జైల్లో గడిపింది. అంతేగాదు యూఎస్ చరిత్రలోనే ఎక్కువకాలం తప్పుగా ఖైదు చేయబడిన మహిళగా నిలిచింది. ఆమె ఎన్నో ఏళ్ల నుంచి నిర్ధొషిగా విడుదలవ్వటం కోసం ఆశగా పోరాడుతోంది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కేవలం హెమ్మె నుంచి తీసుకున్న వాగ్మూలం ఒక్కటే ఆధారం చేసుకుని దోషిగా నిర్థారించి కోర్టు శిక్ష విధించినట్లు పిటిషన్‌లో ఉంది.
నిజానికి ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. వాటికోసం వాడిన బలమైన మందులు ప్రభావంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అస్ఫష్టంగా ఇచ్చిన సమాధానాలనే బేస్ చేసుకుంది కోర్టు. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాలు, కొన్ని భౌతిక సాక్ష్యాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. అలాగే హెమ్మె ఇచ్చిన సమాధానాల్లో నేరానికి లింక్ అప్ అయ్యేలా ఎలాంటా సమాధానాలు కూడా ఇవ్వలేదని బాధితరుపు న్యాయవాది హార్స్‌మన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పైగా కోర్టు మాత్రం ఆమె వాగ్ములాన్నే ప్రధానంగా తీసుకుని ఇంతలా శిక్ష విధించడం అమానుషమని వాదించారు కూడా.
అంతేగాదు న్యూయార్క్‌లో ఉన్న ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ హెమ్మీ కేసును స్వీకరించి ఆమెకు న్యాయ చేసేందుకు ముందుకొచ్చింది. అంతేగాదు ప్రాజెక్ట్‌కి సంబంధించిన పోలీసులు హెమ్మెని ఈ కేసులో ఇరికించేలా సాక్ష్యాధారాలను సృష్టించారని ఆరోపణలు చేశారు. ఎందుకంటే..ఇన్నోసెన్స్ చేసిన దర్యాప్తులో.. హత్య జరిగిన తరువాత రోజే తన సహ పోలీసు అధికారి క్రెడిట్ కార్డుని హెమ్మె ఉపయోగించిందని, అలాగే ఆమె ట్రక్ చనిపోయిన బాధితురాలి ఇంటి వద్ద పార్క్ చేసి ఉందని పిటిషన్‌లో పోలీసులు చెప్పారు. అలాగే ఆ ప్రదేశంలోనే బాధితురాలి చెవిపోగులు గుర్తించినట్లు కూడా తెలిపారు. అయితే ఇవేమీ క్లియర్‌గా హెమ్మెనే ఈ హత్య చేసిందనేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు కావు.
పైగా బాధితురాలు పోలీసు అధికారి జెష్కే హత్యకు ముందు తర్వాత కూడా ఇలాంటి నేరాలు మహిళలపై చాలా జరగాయని, అందువల్ల ఈ నేరం హెమ్మె చేసే అవకాశం లేదని వెల్లడించింది. దీంతో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఏదీఏమైనా చేయని నేరానికి మానసిక సమస్యల రీత్యా ఓ అమాయకురాలు ఏకంగా 40 ఏళ్లుకు పైగా జైలు శిక్ష అనుభవించి రావడం నిజంగా చాలా బాధకర విషయం. వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి అన్యాయంగా శిక్షపడకూడదు అన్న మాట ఈమె విషయంలో రివర్స్ అయ్యింది కదూ!.
(చదవండి: మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి! ఎవరీమె..?)
Comments
Please login to add a commentAdd a comment