imprisoned
-
16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎవరి ఊహకూ అందని ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను పోలీసులు రక్షించిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను ఆమె అత్తమామలు 16 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించారు. బాధితురాలు రాణి సాహుకు 2006లో వివాహం జరిగింది. మొదట్లో సంసారం బాగానే ఉన్నా 2008 నుండి అత్తామామలు ఆమెను ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు. తాజాగా ఆమె తండ్రి కిషన్ లాల్ సాహూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.2008 నుంచి తన కూతురు రాణి సాహును కలవడానికి తమను అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ బృందం జహంగీరాబాద్‌లోని కోలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంట్లోని మూడో అంతస్తులో ఒక మంచంపై రాణి సాహు హృదయవిదారక స్థితిలో పడివుండటాన్ని వారు గమనించారు. ఆమె శరీరం ఎముకల గూడుగా మారడాన్ని చూసి వారు కంగుతిన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక, ఆమె నుంచి వివరాలు సేకరించి ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ -
చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..
టైం బాగోకపోతే ఎంతటి వారైన దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోవాల్సిందే. అంతేగాదు చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది, నిందలు కూడా పడాల్సి వస్తుంటుంది. శిక్ష అంత అనుభవించాక గానీ అసలు నిజం వెలుగులోకి రాదు. తీరా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు కూడా. ఎందుకంటే దాని తాలుకా చేదు అనుభవాలన్ని భరించేసి ఉంటారు బాధితులు. ఇక వాస్తవం ఏంటో తేలినా..చివరికి సమాజం నుంచి వచ్చే టన్నుల కొద్ది జాలి బాధిస్తుందే తప్ప ఓదార్పునివ్వదు. పైగా అవేమీ వారి కోల్పోయిన సంతోషాన్ని, పరువును తెచ్చి ఇవ్వలేవు. 'నాకే ఎందుకు ఇలా'.. అన్న మాటలకందని వేదనే మిగులుతుంది. ఇలాంటి బాధనే ఫేస్ చేసింది యూఎస్‌కి చెందిన ఓ మహిళ. చేయని నేరానికి ఎన్నేళ్లు కటకటాల్లో మగ్గిందో వింటే కంగుతింటారు. అసలేం జరిగిందంటే..సాండ్రా హెమ్మె అనే 64 ఏళ్ల మిస్సౌరీ మాజీ పోలీసు అధికారి. తన సహ పోలీసు అధికారిణి జెష్కేని హత్య చేసిన కేసులో ఏకంగా 40 ఏళ్లకు పైగానే జైల్లో గడిపింది. అంతేగాదు యూఎస్ చరిత్రలోనే ఎక్కువకాలం తప్పుగా ఖైదు చేయబడిన మహిళగా నిలిచింది. ఆమె ఎన్నో ఏళ్ల నుంచి నిర్ధొషిగా విడుదలవ్వటం కోసం ఆశగా పోరాడుతోంది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కేవలం హెమ్మె నుంచి తీసుకున్న వాగ్మూలం ఒక్కటే ఆధారం చేసుకుని దోషిగా నిర్థారించి కోర్టు శిక్ష విధించినట్లు పిటిషన్లో ఉంది. నిజానికి ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. వాటికోసం వాడిన బలమైన మందులు ప్రభావంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అస్ఫష్టంగా ఇచ్చిన సమాధానాలనే బేస్ చేసుకుంది కోర్టు. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాలు, కొన్ని భౌతిక సాక్ష్యాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. అలాగే హెమ్మె ఇచ్చిన సమాధానాల్లో నేరానికి లింక్ అప్ అయ్యేలా ఎలాంటా సమాధానాలు కూడా ఇవ్వలేదని బాధితరుపు న్యాయవాది హార్స్‌మన్ పిటిషన్లో పేర్కొన్నారు. పైగా కోర్టు మాత్రం ఆమె వాగ్ములాన్నే ప్రధానంగా తీసుకుని ఇంతలా శిక్ష విధించడం అమానుషమని వాదించారు కూడా. అంతేగాదు న్యూయార్క్‌లో ఉన్న ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ హెమ్మీ కేసును స్వీకరించి ఆమెకు న్యాయ చేసేందుకు ముందుకొచ్చింది. అంతేగాదు ప్రాజెక్ట్‌కి సంబంధించిన పోలీసులు హెమ్మెని ఈ కేసులో ఇరికించేలా సాక్ష్యాధారాలను సృష్టించారని ఆరోపణలు చేశారు. ఎందుకంటే..ఇన్నోసెన్స్ చేసిన దర్యాప్తులో.. హత్య జరిగిన తరువాత రోజే తన సహ పోలీసు అధికారి క్రెడిట్ కార్డుని హెమ్మె ఉపయోగించిందని, అలాగే ఆమె ట్రక్ చనిపోయిన బాధితురాలి ఇంటి వద్ద పార్క్ చేసి ఉందని పిటిషన్లో పోలీసులు చెప్పారు. అలాగే ఆ ప్రదేశంలోనే బాధితురాలి చెవిపోగులు గుర్తించినట్లు కూడా తెలిపారు. అయితే ఇవేమీ క్లియర్‌గా హెమ్మెనే ఈ హత్య చేసిందనేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు కావు. పైగా బాధితురాలు పోలీసు అధికారి జెష్కే హత్యకు ముందు తర్వాత కూడా ఇలాంటి నేరాలు మహిళలపై చాలా జరగాయని, అందువల్ల ఈ నేరం హెమ్మె చేసే అవకాశం లేదని వెల్లడించింది. దీంతో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఏదీఏమైనా చేయని నేరానికి మానసిక సమస్యల రీత్యా ఓ అమాయకురాలు ఏకంగా 40 ఏళ్లుకు పైగా జైలు శిక్ష అనుభవించి రావడం నిజంగా చాలా బాధకర విషయం. వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి అన్యాయంగా శిక్షపడకూడదు అన్న మాట ఈమె విషయంలో రివర్స్ అయ్యింది కదూ!.(చదవండి: మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి! ఎవరీమె..?) -
ఔషధ చట్టం ఉల్లంఘిస్తే జైలుకే’
అరసవల్లి: జిల్లాలో అనధికారికంగా మందులు నిల్వ చేసే వారికి జైలు శిక్ష తప్పదని ఔషధ ని యంత్రణ శాఖ సహాయ సంచాలకులు ఎం. చంద్రరావు హెచ్చరించారు. ఆయన గురు వారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా టెక్కలి పరిధిలో ఔషధ చట్టం (1940) నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానాను టెక్కలి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విధించిందని గుర్తు చేశారు. 2018లో లైసెన్సు లేకుండా మందులు నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో అప్పట్లో టెక్కలి, శ్రీకాకుళం డ్రగ్ ఇన్స్పెక్టర్లు లావణ్య, కళ్యాణి బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కూర్మినాయుడుపై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు, నిల్వలున్న వ్యాపారులపై కఠిన చర్య లు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం) -
ప్రేమ పేరుతో లొంగదీసుకుని లైంగిక దాడి.. పదేళ్లు శిక్ష..
సాక్షి,ఖమ్మం లీగల్: బాలికపై అత్యాచారం చేసి మోసగించిన కేసులో సింగరేణి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పాయం నవీన్‌కు స్థానిక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎండీ..అఫ్రోజ్ అక్తర్ పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ముత్యాలగూడెం గ్రామానికే చెందిన బాలిక ఇంటర్ చదివే సమయంలో నవీన్ ఆమె వెంట పడి ప్రేమించానని నమ్మబలికాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2019 ఆగస్టు 18న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయాన శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలిక, కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని కోరితే నిందితుడి కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆ తర్వాత నవీన్‌ను వేరే గ్రామానికి పంపించగా, ఆయన మేనమామ చనిపోవడంతో 2020 జనవరి 11న గ్రామానికి వచ్చాడు. అప్ప్పుడు పెళ్లి విషయమై అడగగా గొడవ పడడంతో కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్, ఆయన కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం, మోసం తదితర నేరాలపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్నాక నవీన్‌పై అత్యాచారం, మోసం చేసినట్లు కేసులు రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ.. మిగిలిన నిందితులపై కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ టి.హైమావతి వాదించగా.. లైజన్ అధికారి భాస్కర్‌రావు, కోర్టు కానిస్టేబుల్ సర్దార్‌సింగ్, హోంగార్డు చిట్టిబాబు సహకరించారు. చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి.. -
ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు కట్టుకున్న భర్తల ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. వారం వ్యవధిలో కోదాడ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడు ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపరుస్తున్నాయి. మూడు ఘటనల్లో రెండింటిలో భార్యలే భర్తల హత్యకు సూత్రధారులుగా వ్యవహరించగా ప్రియులు పాత్రధారులుగా మారి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. మరో ఘటనలో ఓ భర్త తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ప్రియుడిని దారుణంగా హత్యచేసాడు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి జైలుపాలు కావడంతో మూడు కుటుంబాల్లో చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సాక్షి, కోదాడ : మూడు హత్యలను పరిశీలిస్తే తాత్కాలిక ఆకర్షణకు లోనైన వీరు కుంటుంబ పరిస్థితులను పట్టించుకోకుండా వివాహేతర సంబంధాలను కొనసాగించారు. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తలను పొట్టన పెట్టుకున్నారు. గుడిబండ గ్రామానికి చెందిన పులికాశయ్య హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్ద ఓ అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న యువకుడితో కాశయ్య భార్య నాగలక్ష్మి విహహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరో ఘటనలో చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన కుక్కల గోపిని అతని భార్య రేణుక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో దారుణంగా హత్య చేయించింది. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో పట్టుమని పది సంవత్సరాలు కూడా లేని వీరి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. భార్యభర్త చేతిలో ప్రియుడు ఇక నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఓ భర్త తన భార్యతో కలిసి యువకుడిని దారుణంగా హత్య చేసి సాగర్ కాలువలో పడవేశాడు. పక్షం రోజుల తర్వాత ఘటన వెలుగు చూడడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో యువకుడు రహీం హత్యకు గురికాగా భార్యభర్తలు కోటయ్య, త్రీవేణిలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీరి కొడుకు ఇపుడు దిక్కులేనివాడయ్యాడు. ఇటీవల హత్యకు గురైన కుక్కల గోపి గుడిబండ వాసి పులి కాశయ్యరహీమ్ (ఫైల్) పాపం పసివాళ్లు ఇలాంటి బంధాల వల్ల అభం శుభం తెలియని పసిపిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయ్యారయ్యింది. కోదాడలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లో పదేళ్ల లోపు ఐదుగురు పిల్ల అనాథలు గా మారారు. తండ్రి మరణించడం, తల్లి జైలుపాలు కావడంతో వారి అలనాపాలనా చూసే వారు కరువయ్యారు. అసలేం జరిగిందో కూడా అర్థం చేసుకోలేని వయస్సులో జరిగిన ఈ ఘటనలు వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతా యని ఇలాంటి బంధాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
ఎక్సైజ్ ఎస్ఐపై దాడి కేసులో నలుగురికి జైలు
ఆకివీడు: ఆకివీడు ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో నలుగురు వ్యక్తులకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధిస్తూ భీమవరం ప్రిన్సిపల్ జ్యుడిషియల్ సివిల్ జడ్జి సుంకర శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్ఐ ఆకుల రఘు విలేకరులకు తెలిపారు. 2014 ఏప్రిల్ 28న కుప్పనపూడి శివారు తాళ్లకోడు గ్రామంలో సారా తయారు చేస్తున్నారని అప్పటి ఎక్సైజ్ ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీకి సమాచారం రావడంతో సిబ్బందితో తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో నాగ వెంకట సత్యనారాయణ అతని బంధువులు ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బందిని నిర్బంధించి దౌర్జన్యం చేసి దుర్భాషలాడినట్టు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ పురుషోత్తం కేసు నమోదు చేశారు. ఈ కేసులో సత్యనారాయణ, లక్ష్మి, అనగాని ఏడుకొండలు, అనగాని కనకలక్షి్మని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వాదోపవాదాల అనంతరం నిందితులకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వి.సామయ్య వాదించారని ఎస్ఐ రఘు వివరించారు. -
జైలు పాలైన యువజన కాంగ్రెస్ నేత
బెదిరించిన కేసులో రమాకాంత్‌రెడ్డి అరెస్టు వరంగల్ : ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దూషించంతో పాటు దాడి చే సిన ఘటనలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి జైలు పాలయ్యారు. బాధితుల ఫిర్యాదు, ఆధారాల మేరకు ఆయనను అరెస్టు చేసి శనివారం రిమాండ్ చేసినట్లు సుబేదారి సీఐ వాసాల సతీష్ తెలిపారు. హన్మకొండకు చెందిన మలియాల సుమిత్‌కుమార్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని, ఇతరత్రా ఖర్చుల కోసం రమాకాంత్‌రెడ్డి రూ.2లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుల విషయమై ఫోన్లో డబ్బులు అడిగితే నానా దుర్భాషలాడిన రమాకాంత్.. డబ్బులు పదే పదే అడుగుతున్నందుకు సుమిత్‌కుమార్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇదే క్రమంలో రోడ్డుపై అతని సోదరుడు రోడ్డుపై కనిపిస్తే డబ్బులు ఎక్కడివిరా... అంటూ చేయి చేసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పాటు సెల్ఫోన్లో రికార్డు చేసిన ఆధారాలతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రమాకాంత్‌రెడ్డిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. వరస ఘటనలతో నాయకుల్లో ఆందోళన కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావాలని పార్టీ నాయకులు అష్టకష్టాలు పడుతుంటే యువజన కాంగ్రెస్ నాయకుల వైఖరితో ఉన్న కాస్తా పరువు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మేడారం పాస్‌ల దొంగతనంలో యువజన కాంగ్రెస్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి జైలు పాలుకాగా, దబ్బులు తీసుకొని భౌతికదాడులు చేసిన కేసులు యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రమాకాంత్‌రెడ్డి జైలు పాలు కావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల జిల్లా నాయకత్వంపై ఆరోపణలు చేయడం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న కారణంతో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రమాకాంత్‌రెడ్డిని రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర, జాతీయ నాయత్వాన్ని కోరుతామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.