ఎక్సైజ్ ఎస్‌ఐపై దాడి కేసులో నలుగురికి జైలు
Published Thu, Feb 9 2017 1:04 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
ఆకివీడు: ఆకివీడు ఎక్సైజ్ ఎస్‌ఐ, సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో నలుగురు వ్యక్తులకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధిస్తూ భీమవరం ప్రిన్సిపల్ జ్యుడిషియల్ సివిల్ జడ్జి సుంకర శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్‌ఐ ఆకుల రఘు విలేకరులకు తెలిపారు. 2014 ఏప్రిల్ 28న కుప్పనపూడి శివారు తాళ్లకోడు గ్రామంలో సారా తయారు చేస్తున్నారని అప్పటి ఎక్సైజ్ ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీకి సమాచారం రావడంతో సిబ్బందితో తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో నాగ వెంకట సత్యనారాయణ అతని బంధువులు ఎక్సైజ్ ఎస్‌ఐ, సిబ్బందిని నిర్బంధించి దౌర్జన్యం చేసి దుర్భాషలాడినట్టు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్‌ఐ పురుషోత్తం కేసు నమోదు చేశారు. ఈ కేసులో సత్యనారాయణ, లక్ష్మి, అనగాని ఏడుకొండలు, అనగాని కనకలక్షి్మని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వాదోపవాదాల అనంతరం నిందితులకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వి.సామయ్య వాదించారని ఎస్‌ఐ రఘు వివరించారు.
Advertisement
Advertisement