checkings
-
సికింద్రాబాద్: రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక, ఇక నుంచి..
వేలాదిమంది ప్రయాణికులు... ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఒకటి– పది.. ప్లాట్‌ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశద్వారాల్లో బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పని చేయదు. పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా పట్టించుకోరు.. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో... వెరసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకొంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. వెరసి ఈ స్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహాలో పటిష్టమైన భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందిన ఘనతను సాధించుకున్నది భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. కానీ, అక్కడ భారీ వ్యయంతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా.. అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు అటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.లగేజీ చెకింగ్ తర్వాతే లోనికిసికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెకింగ్ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు రైలు బయలుదేరే వేళ కంటే కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి విమానాశ్రయాల్లోనే ఉంటోంది. విమాన ప్రయాణికులకు లగేజీ చెకింగ్ అనేది నిర్బంధ ప్రక్రియ. అది జరక్కుంటే విమానంలోకి అనుమతి ఉండదు. అదే పద్ధతిని సికింద్రాబాద్ స్టేషన్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.రైలు అనౌన్స్మెంట్ అయ్యాకే ప్లాట్‌ఫామ్ పైకిప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌పామ్‌లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతిస్తారు.ఆలస్యంగా వస్తే అంతేసరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్‌ఫామ్ మీదకు పరుగెత్తుకు రావటం స్టేషన్లలో నిత్యకృత్యం. కానీ, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వారిని అనుమతించకూడదన్న యోచనలో అధికారులున్నారు. కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకునే ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే.కునుకు కోసం వచ్చే వారికి ఇక నో ఎంట్రీప్రయాణాలతో ప్రమేయం లేకుండా చాలా మంది చీకటిపడగానే స్టేషన్లోకి చేరుకుని ఏ ఖాళీ బెంచీనో చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక అలాంటి వారికి లోనికి అనుమతి ఉండదు. టికెట్ ఉన్న వారిని మాత్రమే.. రైలు వచ్చే వేళకు ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతిస్తారు. లేని వారికి నో ఎంట్రీ. వెరసి ఇక ప్లాట్‌ఫామ్ ప్రాంతాలు అడ్డదిడ్డంగా పడుకునేవారితో కనిపించవన్నమాట.మిగతావాటి సంగతేంటి..?ప్రపంచస్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. ఏపీ పరిధిలో తిరుపతి, నెల్లూరు ఉండగా, తెలంగాణలో ఒక్క సికింద్రాబాద్ మాత్రమే ఉంది. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్‌భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇవి ఉన్న భవనాలను మెరుగు పరుస్తారు. సికింద్రాబాద్ తరహాలో మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించరు. అమృత్‌భారత్ స్టేషన్లలో ఈ పద్ధతులు ఉండాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అమృత్‌భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగానే అభివృద్ధి చేస్తున్న నగరంలోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో మాత్రం సికింద్రాబాద్ తరహా విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు. -
ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇంతే.. తనిఖీలెక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇకపై ఇలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, మంత్రులు, అధికారులు ప్రకటించడం పరిపాటిగా మారింది. అంతకుమించి ఆ తర్వాత చర్యలుండటం లేవు. భవనాలు కూలినా అంతే. అగ్నిప్రమాదాలు జరిగినా అదే వైఖరి. తాజాగా సికింద్రాబాద్ మినిస్టర్రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జనావాసాల మధ్య అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన గోడౌన్లు, తదితరమైన వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. గత సంవత్సరం బోయగోడలో స్క్రాప్గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించినప్పుడు సైతం ఇలాంటి ప్రకటనలే చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏంచేశారో ఎన్ని భవనాలు తనిఖీలు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం వెల్లడించలేదు. అప్పట్లో హోంమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఏమైందో తెలియదు. గోడౌన్లు, షోరూమ్‌లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పబ్‌ల దాకా అదే పరిస్థితి వేటికీ నిబంధనల మేరకు సెట్‌బ్యాక్‌లుండవు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు అసలే ఉండవు. గత సంవత్సరమే ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లోనూ జరిగిన అగ్ని ప్రమాదాలు నగర ప్రజలింకా మరచిపోలేదు. చర్యలేవీ? జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం అగ్నిప్రమాదాలు జరిగితే ఎక్కువ మందికి అపాయం జరిగే బార్లు, పబ్‌ల వంటివాటిపై తొలుత చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వాటి తర్వాత హోటళ్లు, హాస్పిటళ్లపై చర్యలుంటాయని హెచ్చరించింది. కానీ ఇప్పటి వరకు ఒక్కదానిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నగరంలో, చుట్టుపక్కల దాదాపు 20వేలకు పైగా గోడౌన్లే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం పదిశాతం భవనాలకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. గతంలో నగరంలోని భవనాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం– పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులను బృందాలుగా ఏర్పాటుచేసి, తనిఖీలు నిర్వహించి, ఫైర్‌సేఫ్టీ లేని భవనాలపై చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలు కాలేదు. కనీసం ఫైర్‌సేఫ్టీ విభాగమైనా చర్యలు తీసుకుందా అంటే అదీ లేదు. జీహెచ్ఎంసీలో ఫైర్‌సేఫ్టీతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారాలు ఉన్న విభాగం కూడా.. ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయంలో వేగంగా చెకిన్..
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆధారిత ‘డిజి యాత్రా’ బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ బెంగళూరు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభమైంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు విమానాశ్రయంలోకి వేగంగా చెకిన్ కావచ్చని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత 20వేల మంది ప్రయాణికులు మొదటి రోజు అవాంతరాల్లేని, సురక్షిత ప్రయాణ అనుభవాన్ని చూసినట్టు తెలిపింది. బయోమెట్రిక్, ఇతర కీలక వివరాలను ప్రయాణికులు మూడో నంబర్ టెర్మినల్ వద్ద సమర్పించిట్టు ప్రకటన విడుదలైంది. ఈ యాప్‌నకు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పలు తనిఖీలను మానవ ప్రమేయం లేకుండా, డీజిటల్‌గా పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. డిజి యాత్రా బీటా వెర్షన్‌ను పరీక్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలనే ఎంపిక చేశారు. విస్తృత పరిశీలన తర్వాత అన్ని విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెడతారు. -
పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీలు
-
ముందు రాతలు, తర్వాత అధికారులు.. వాహ్ క్యా ప్లాన్
ముందు రికార్డుల్లో రాతలు మార్చాలి. తర్వాత అధికారులను ఏమార్చాలి. ఇదీ ప్లాన్. కానీ అంతా అనుకున్నట్టు జరగదు కదా.. సంపూర్ణ పోషణ పాల అక్రమ రవాణా కేసులో కొందరు అంగన్వాడీ సిబ్బంది తప్పు మీద తప్పు చేస్తున్నారు. పాత తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త తప్పులు చేస్తున్నారు. అష్ట దిగ్బంధనమవుతున్న దశలో రికార్డుల రూపురేఖలు కూడా మార్చేస్తున్నారు. వీరి తీరు అధికార వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సాక్షి, శ్రీకాకుళం: వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల దిద్దుబాట్లు జోరుగా జరుగుతున్నాయి. పాల ప్యాకెట్ల సరఫరాలో తేడాలు స్పష్టంగా కనిపించడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డుల్లో అంకెలు మార్చుతున్నారు. రెండు రోజులుగా సెక్టార్ మీటింగ్‌లని చెప్పి, కార్యకర్తలను పిలిచి, సూపర్వైజర్లు దగ్గరుండి ఈ తంతు జరిపి స్తున్నారు. ఈ నెల 3వ తేదీన భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పాలప్యాకెట్ల అక్రమ రవాణా వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఒకవైపు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తుంటే.. మరోవైపు ప్రాజెక్టు పరిధిలో ఆ చర్యల నుంచి తప్పించుకునేందుకు, న్యాయపరంగా దొరకకుండా ఉండేందుకు రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. ఇదే విషయమై సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసేసరికి రికార్డులు మూసేయండంటూ కార్యకర్తలు సైగలు చేశారు. కానీ లాభం లేకపోయింది. ఏం జరిగిందంటే..? ►ఇటీవల భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడిన పాల ప్యాకెట్లలో తేడాలపై రికార్డులు దిద్దుబాట్లు జరపాలంటూ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ పట్టుబట్టారు. ►ఐసీడీఎస్ స్టాక్ పాయింట్ నుంచి డెలివరీ చేసిన రికార్డులకు, అంగన్వాడీ కేంద్రాలకు చేరిన పాలు నిల్వల రికార్డులకు వ్యత్యాసం ఉంది. ►ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సరఫరా చేసిన పాల నిల్వల్లో వ్యత్యాసం ఉండడం, అవే నెలలకు సరఫరా చేసిన పాల ప్యాకెట్లు పోలీసు లు పట్టబడడంతో దర్యాప్తు చేస్తున్నారు. ►వీరఘట్టం ఐసీడీఎస్ పీఓ, సూపర్వైజర్లు స్టాక్ పాయింట్ వద్ద పర్సంటేజీ రూపంలో పాల ప్యా కెట్లు మినహాయించి మిగిలిన పాలను నెలల వా రీగా అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే సీడీపీఓ సెలవులో ఉన్నారు. ప్రస్తుతం సూపర్వైజర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే..? వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్ జె.జ్ఞానమ్మ ఆధ్వర్యంలో వంగర, వీరఘట్టం మండలాల సెక్టార్ పరిధి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం గురు, శుక్రవారాల్లో జరిగింది. ►ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రికార్డులను అంగన్వాడీ కార్యకర్తలు దిద్దుబా టు చేసేశారు. వాటిలో కూడా తేడాలుండటంతో సెక్టార్ సమావేశంలో సూపర్ వైజర్ జె.జ్ఞానమ్మ ఒత్తిడి మేరకు పీఓ కార్యాలయం వద్ద ఉన్న రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. తొలుత కార్యకర్త లు సతాయించినా.. ఈ గండం నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న రికార్డుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నా రులు పేర్లు కొన్ని చోట్ల(ఏప్రిల్, మే, జూన్) నెలలకు సంబంధించి తొలగించడం, కొన్ని తప్పుడు పేర్లు యాడ్ చేయడంతో నిల్వలకు సరిపడినట్లు కాగితాలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ►కొంత మంది అంగన్వాడీ కేంద్రాల్లో లొసుగులు ఉండడంతో కార్యకర్తలంతా ఏమీ చేయలేక ఐసీడీఎస్ అధికారులు మాటలకు తలొగ్గి దిద్దుబాటే శరణ్యంగా భావించి రికార్డులు తారుమారు చేస్తున్నారు. ►అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రతి నెల నిల్వ ఉన్న పాలను ఆ తదుపరి నెలకు లెక్క చూపిస్తారు. అ యితే పాల రికార్డులు తప్పుల తడకగా ఉండడంతో ఆ పాలను సూపర్వైజర్లు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో నమోదు చేయడం లేదు. దీని కారణంగా దర్యాప్తులో గుర్తించిన పాలతోపాటు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో షార్టేజీ చూపించారు. దీన్ని దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దిద్దుబాటు సరికాదు సెక్టార్ సమావేశాల్లో రికార్డులు దిద్దుబాటు చేయకూడదు. సీడీపీఓ సెలవులో ఉన్నారు. ఇన్చార్జి పా లనలో ఉంది. అక్కడేం జరిగిందో తెలుసుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శనివారం ఆ ప్రాజెక్టుకు వెళ్తాం. రికార్డులన్నీ పరిశీలిస్తాం. – జి.జయదేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం -
వైరల్: జనాలపై విచక్షణారహితంగా దాడి
లక్నో: మాస్క్ డ్రైవ్ చెకింగ్‌లో భాగంగా ఓ సీనియర్ ఉద్యోగి, అతడి బృందం జనాలపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దాంతో సదరు సీనియర్ అధికారిపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరగింది. వివరాలు.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌదరి, అతని బృందం మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులను ఒక దుకాణం నుంచి బలవంతంగా బయటకు నెట్టి, కర్రలతో కొట్లారు. ఆ వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే.. కొట్టడానికి గల కారణం తెలపాల్సిందిగా హోం గార్డులను కోరారు. కానీ వారు ఇదేమి పట్టించుకోకుండా వ్యక్తుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారులు బల్లియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌద్రేను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అధికారులు అతడిని విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం) -
పోలీసు వలయంలో కడప నగరం
కడప అర్బన్ : మంగళవారం రాత్రి 8.30 గంటల సమయం. పనులు ముగించుకున్న ప్రజలు ఎవరి వాహనాల్లో వారు ఇళ్లకు బయలుదేరారు. ఇంతలో నగరంలోని ప్రధాన కూడళ్లు ఒక్కసారిగా పోలీసు వలయంలోకి వెళ్లాయి. వాహనాల తనిఖీ చేపట్టి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాలతో మంగళవారం రాత్రి కడప డీఎస్పీ షేక్ మాసుం బాషా పర్యవేక్షణలో కూడళ్లన్నింటిలో పోలీ సులు నాకాబందీ నిర్వహించారు. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటలకు పైగా ఈ తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. ఈ తనిఖీలలో డీఎస్పీతోపాటు సీఐలు విశ్వనాథరెడ్డి, పద్మనాభన్, హమీద్‌ఖాన్, నాయకుల నారాయణ, శ్రీధర్‌నాయుడు, నాగరాజరావు, చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది అంతా మొత్తం 150 మంది పాల్గొన్నారు. కడప నగరంలోని కోటిరెడ్డిసర్కిల్, అప్సర సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి, ఐటీఐ సర్కిల్, వన్‌టౌన్ సర్కిల్, అల్మాస్‌పేట సర్కిల్, రాజంపేట బైపాస్ సర్కిల్‌లలో ఈ తనిఖీలను నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు మొదలు కుని కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సమగ్రంగా దర్యాప్తు చేసి వివరాలను వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
నాసిరకం ఔషధాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ఔషధాల సరఫరాలో నాసిరకాలపై ‘గోలీమాల్!’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ సంచికలో వచ్చిన కథనంపై ఔషధ నియంత్రణ పరిపాలన(డీసీఏ) అధి కారులు స్పందించారు. నాసిరకం మందుల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తామని డీసీఏ డీడీ వెంకటేశం అన్నారు. అనుమానాస్పదంగా ఉన్న అల్ట్రాసెట్ మాత్రల సరఫరాను పర్యవేక్షించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని డిస్పెన్సరీలో నాసిరకం మాత్రలను సరఫరా చేసిన అంశంపై ఖైరతాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ భవానీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఆదర్శనగర్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని డిస్పెన్సరీ స్టోర్లను పరిశీలించారు. అల్ట్రాసెట్ మాత్రలు ఢిల్లీ నుంచి కర్నూల్లోని ఒక ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చాయని అధికారులు నిర్ధారించారు. మాత్రలో ఉండాల్సిన ఔషధాలు మోతాదు స్థాయిలో లేవని పరీక్షల్లో తేలింది. దీంతో వీలైనన్ని తనిఖీలు నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని శివబాలాజీ ఫార్మా ఏజెన్సీలో నాసిరకం అల్ట్రాసెట్ మాత్రలను సరఫరా చేసినట్లు గుర్తించారు. సైదాబాద్ ప్రాంతంలో ఏజెన్సీ అడ్రస్ ఉన్న ప్రదేశానికి అధికారులు వెళ్లారు. ఏజెన్సీ నిర్వాహకుడు కె.శ్రీధర్ కుటుంబసభ్యులు మాత్రమే ఉండడంతో అధికారులు వివరాలను సేకరించలేకపోయారు. ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి వివరాలు సేకరించి చర్యలు తీసుకోనున్నట్లు డీసీఏ అధికారులు వివరించారు. -
నిబంధనలు అతిక్రమిస్తే గుర్తింపు రద్దు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో అమలు చేస్తున్న విద్యా విధానంపై తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను పాటించనట్లు తేలితే ఆయా విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించేలా కాలేజీలు, స్కూళ్ల విద్యా విధానం ఉండాల్సిందేనని పేర్కొంది. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడటం బా«ధాకరమన్నారు. ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో నేడు (మంగళవారం) సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యల నివారణకు, పిల్లలపై మానసిక ఒత్తిడి లేకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారికి తగిన కోర్సులు, కాలేజీల్లోనే చేర్పించాలని, వారికి ఇష్టమైన కోర్సులు, కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. సెలవుల్లో పిల్లలు ఇళ్లకు వెళ్లనివ్వకుండా ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి పెంచడం మానుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్లకు తల్లిదండ్రులను అనుమతించి వారి సందేహాలను, అనుమానాలను నివృత్తి చేయాలని, పిల్లల్లో భయాలను తొలగించాలన్నారు. కాలేజీల్లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తల్లిదండ్రుల దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతామన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్‌యార్డు గోడౌన్ , మైనర్ ఇరిగేషన్ చెరువు, పలు ప్రభుత్వ భవనాలను, బ్రహ్మసముద్రం మండలంలో నిర్మాణంలో ఉన్న పలు కార్యాలయాలను తనిఖీ చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు తెలిపారు. తనిఖీల్లో కాంక్రీట్ కోర్ సామర్థ్యం నమూనాలు సేకరించామన్నారు. పరిశోధనశాల నుంచి వచ్చిన నివేదికల మేరకు లోటుపాట్ల గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు రవీంద్రకుమార్, విజయకుమార్, బాలరంగారెడ్డి, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంజినీరింగ్ కళాశాలల తనిఖీ
జేఎన్టీయూ : జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ నెల 30 నుంచి నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు చేయనుంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు తనిఖీలు చేయనుంది. అలాగే ఏప్రిల్ 6, 7,8 తేదీలలో నెల్లూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీ చేయనున్నారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడానికి వర్సిటీ అనుమతి ఇస్తుంది. విద్యార్థి, అధ్యాపక నిష్పత్తి, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, విద్యా ప్రమాణాలు తదితర అంశాలను నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తుంది. -
ఎక్సైజ్ ఎస్ఐపై దాడి కేసులో నలుగురికి జైలు
ఆకివీడు: ఆకివీడు ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో నలుగురు వ్యక్తులకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధిస్తూ భీమవరం ప్రిన్సిపల్ జ్యుడిషియల్ సివిల్ జడ్జి సుంకర శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్ఐ ఆకుల రఘు విలేకరులకు తెలిపారు. 2014 ఏప్రిల్ 28న కుప్పనపూడి శివారు తాళ్లకోడు గ్రామంలో సారా తయారు చేస్తున్నారని అప్పటి ఎక్సైజ్ ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీకి సమాచారం రావడంతో సిబ్బందితో తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో నాగ వెంకట సత్యనారాయణ అతని బంధువులు ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బందిని నిర్బంధించి దౌర్జన్యం చేసి దుర్భాషలాడినట్టు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ పురుషోత్తం కేసు నమోదు చేశారు. ఈ కేసులో సత్యనారాయణ, లక్ష్మి, అనగాని ఏడుకొండలు, అనగాని కనకలక్షి్మని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వాదోపవాదాల అనంతరం నిందితులకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వి.సామయ్య వాదించారని ఎస్ఐ రఘు వివరించారు. -
బ్యాంకుల మెడకు ఆర్బీఐ ఉచ్చు
తణుకు : బ్యాంకు అధికారుల మెడకు ఆర్బీఐ ఉచ్చు బిగుసుకుంటోంది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు ఇటీవల వెలుగు చూడగా.. కీలక బాధ్యుడిగా భావించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై వేటు వేసిన ఆర్బీఐ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం తణుకు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 5 బృందాలుగా విడిపోయి సోమవారం వేకువజామునుంచి సోదాలు చేపట్టారు. కొందరు బ్యాంకు మేనేజర్లు ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఒక బ్యాంక్ మేనేజర్ నివాసంలో అధికారులు గంటల కొద్దీ సోదాలు నిర్వహించి వారినుంచి వాంగ్మూలం సేకరించారు. బొమ్మల వీధిలో నివాసం ఉంటున్న మరో బ్యాంకు మేనేజర్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. తణుకు ఎస్బీఐ శాఖలోని కొందరు సిబ్బందిని సైతం సోమవారం పొద్దుపోయేవరకు విచారించినట్టు తెలుస్తోంది. సోదాలకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
శంషాబాద్ దగ్గర ఆర్టీఏ తనీఖీలు
-
సిబ్బంది కొరత లేకుండా చూస్తాం
లేపాక్షి / చిలమత్తూరు : ఎంపీడీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు. గురువారం ఆయన లేపాక్షి, చిలమత్తూరు ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా మండలాల ఎంపీడీఓలతో పలు అంశాలపై చర్చించారు. సిబ్బంది కొరత ఉందని ఎంపీడీఓలు ఆయన దష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన లేపాక్షిలో విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ప్రహరీ ఏర్పాటుపై ప్రత్యేక దష్టి సారిస్తామన్నారు. తాగునీరు, ప్రహరీ లేని పాఠశాలలను గుర్తించి మండల ఇంజనీర్లతో నివేదికను తయారు చేసి జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపి నిధులు మంజూరు కావడానికి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో పబ్లిక్ మరుగుదొడ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు చిన్న ఓబన్న, నాగభూషణ, సర్పంచ్ నరసింహమూర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
విజిలెన్స్ కమిటీ తనిఖీలు
మన్ననూర్ : పేద విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విచారణ చేపడుతున్నామని సెల్ సైడ్ ఆఫ్ డిపార్టుమెంట్ (విజిలెన్స్) ఆఫీసర్ ఎంబీఎల్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం మన్ననూర్లోని పీటీజీ పాఠశాలలో వివిధ రికార్డులను విజిలెన్స్ బందం సభ్యులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తమ దష్టికి వచ్చిందన్నారు. తమ నివేదికను త్వరలో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు అందజేస్తామన్నారు. ఇందులో విజిలెన్స్ ఏఎస్ సూర్యప్రకాష్‌రెడ్డి, సూపర్వైజర్ మహమూద్‌అలీ, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భాస్కర్‌రావ్, ప్రిన్సిపాల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఇంట్లో మరోసారి సోదాలు
హైదరాబాద్: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ఎన్కౌంటర్ తదనంతరం రెండు రోజులుగా జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్కాపురిలోని నయీం ఇంట్లో గురువారం మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించనున్నారు. నయీం ఇంట్లో పెద్ద ఎత్తునా బంగారం, ఏకే 47, ఫారెన్ వాచ్‌లు, వందల సంఖ్యలో డాక్యుమెంట్లు ఉన్నట్టు సమాచారం ఉంది. దాంతో పోలీసులు నయీం ఇంట్లో నేడు సోదాలు నిర్వహించి అతడి ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు తెలుపనున్నారు. నేడు నయీం పనిమనిషి ఖాజా ఉద్దీన్‌ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. నిన్న గోవాలో నయీం బంగ్లాలో అనుచరుడు ఖాజాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయీం అక్కా బావను మహబూబ్‌నగర్ జైలుకు పోలీసులు తరలించారు. కాగా, నయీం ఇంట్లో బుధవారం పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అల్కాపురిలోని నయీం ఇంట్లోని బెడ్రూంను పోలీసులు తెరిచి అతడి బెడ్రూంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ రోజు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)తో నార్త్‌జోన్ ఐజీ, సిట్ చీఫ్ నాగిరెడ్డి భేటీ కానున్నారు. నయీం కేసుపై అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల టార్గెట్‌తో విచారణ ను సిట్ వేగవంతం చేసే పనిలో పడింది. -
నయీమ్ ఇంట్లో మరోసారి సోదాలు
హైదరాబాద్: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ఎన్కౌంటర్ తదనంతరం జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయీం ఇంట్లో బుధవారం మరోసారి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అల్కాపురిలోని నయీం ఇంట్లోని బెడ్రూంను పోలీసులు తెరవనున్నట్టు తెలుస్తోంది. అతడి బెడ్రూంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా నగదు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో తమ కస్టడీలో ఉన్న నయీం వంటమనిషి ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్షాలను నయీమ్ ఇంటికి పోలీసులు తీసుకెళ్లినట్టు తెలిసింది. నయీం ఇంట్లో పనిచేసే వీరిద్దరిని మూడురోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నయీం బాడిగార్డ్స్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
నయీమ్ ఇంట్లో మరోసారి సోదాలు
-
అల్‌కబీర్‌లో తనిఖీలు
పటాన్చెరు: పశుమాంస ఉత్పత్తి సంస్థ అల్‌కబీర్‌లో మంగళవారం అర్థరాత్రి సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతినిధులు నలుగురు ఆకస్మిక తనిఖీలు చేశారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఐఏఎస్ అధికారులిద్దరితో పాటు మరో ఇద్దరు సభ్యులు తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మొత్తం పరిశ్రమలో వారు కలియ తిరిగి ఫొటోలు, వీడియోలు తీసుకొని వెళ్లారు. సంస్థ ప్రతినిధులను కంపెనీ యాజమాన్యం లోపలికి వెళ్లనీయలేదు. దాంతో వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అనంతరం ఆ సంస్థ ప్రతినిధులు తమ గుర్తింపును చెప్పుకుంటూ పోలీసులను ఆశ్రయించి పరిశ్రమలోకి వెళ్లారు. పోలీసులు పరిశ్రమలోకి రావడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. అది కూడా రాత్రి పూట రావడం పరిశ్రమలోని కార్మికులు కొంత అయోమయానికి గురయ్యారు. వారు సేకరించిన సమాచారం, ఇతర వివరాలను గోప్యంగా ఉంచారు. జయరాజ్, రవి అనే ఇద్దరు అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారని తెలిసింది. -
మీరు మారరా..?
నగరంలో మౌలిక సదుపాయాలపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి అర్ధరాత్రి పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు అధికారుల తీరుపై ఆగ్రహం {పజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశం రోడ్లు, బస్షెల్టర్లు, ఫుట్‌పాత్‌ల పరిశీలన మరిన్ని తనిఖీలుంటాయని హెచ్చరిక రహదారులు, బస్షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, మురికి కాలువలు, నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి మౌలిక అంశాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎలా?. ఇవి పరిష్కరించలేని సమస్యలు కావు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉంటే వీటిని అధిగమించడం కష్టం కాదు. ప్రజలకు ఉత్తమ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనదే. ఇకపై అధికారుల తీరు మారాలి. ప్రభుత్వ పరమైన అన్ని సౌకర్యాలు ప్రజలకు సక్రమంగా అందాలి. లేకుంటే తగిన చర్యలు తప్పవు... - మంగళవారం అర్ధరాత్రి సిటీలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ హెచ్చరిక -సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: నగరంలోని అధ్వాన్నపు రహదారులు, మౌలిక సదుపాయాల లేమిపై మునిసిపల్ మంత్రి కేటీ రామారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి 2.50 గంటల వరకు ఆయన నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక విధుల నిర్వహణలో విఫలమైన జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. రహదారులతోపాటు బస్టాపులు, నీటి సరఫరా తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అర్ధరాత్రి సమయంలో పర్యటన ప్రారంభించారు. కూకట్పల్లి నుంచి ఉషాముళ్లపూడి రోడ్డు, కూకట్పల్లి నుంచి పంజగుట్ట రోడ్డు తదితర మార్గాల్లో పర్యటించారు. హంగూ ఆర్భాటం లేకుండా, మీడియాకు సైతం సమాచారం ఇవ్వకుండా ఈ తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఆకస్మిక పర్యటనతో అధికారులు ఒక్కసారిగా ఉరుకులు, పరుగులు పెట్టారు. కూకట్పల్లి నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన ఉషాముళ్లమూడి మార్గంలో జరుగుతున్న రోడ్డు పనుల్ని, బస్టాపుల్ని పరిశీలించారు. నిర్వహణ లోపాలపై మండిపడ్డారు. కూకట్పల్లి నుంచి పంజగుట్ట వైపు రోడ్లు, ఆయా సదుపాయాల తీరును పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. నెల రోజుల క్రితం ఆదేశించినా.... ఉషాముళ్లపూడి మార్గంలో పనులను పరిశీలిస్తూ వేగంగా జరగకపోవడంపై అధికారులను నిలదీశారు. తాను నెలరోజుల క్రితం వచ్చి ఆదేశించినా జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణ పనుల్ని పూర్తిచేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఇలాగే రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహిస్తానని హెచ్చరించారు. అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని, నిర్దేశించిన సమయంలోగా పనులన్నింటినీ పూర్తిచేయాలన్నారు. కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద ముంబై హైవేపై రోడ్డు పక్కన వాననీరు నిలిచిపోవడంపై మంత్రి బాగా సీరియస్ అయ్యారు. జాతీయ రహదారులు, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరితంగా తగిన ప్రణాళిక రూపొందించి నీరు నిలవకుండా , ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అనంతరం బస్టాప్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు వీల్లేకుండా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బస్టాప్గల్లీలోని రోడ్డును పరిశీలించారు. సీన్ మారేనా..? నెల రోజుల క్రితం నగరంలోని శ్రీనగర్‌కాలనీ, ఉషాముళ్లపూడి తదితర మార్గాల్లో తనిఖీలు నిర్వహించి, వెంటనే రహదారుల మరమ్మతుల పనులు చేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్...మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఉషాముళ్లపూడి, పంజగుట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పనుల్లో జాప్యంపై మండిపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆదేశించినా జాప్యంపై విరుచుకుపడ్డారు. అయితే వర్షాకాలంలో బీటీ రోడ్ల పనులు చేయలేకపోవడంపై అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. బాగు కావడానికి ఎంతకాలం పడుతుందని అడగ్గా, రెండు నెలలని సమాధానమివ్వడంతో అప్పటిదాకా ప్రజలు చావాలా? అని ప్రశ్నించారు. మరమ్మతులు చేసినా, వర్షానికి కొట్టుకుపోతుందని తెలిపారు. మరమ్మతులు చేసినా.. వర్షం వెలిశాక చిన్న కంకర మళ్లీ రోడ్లపై చేరి మోటర్‌బైక్‌లు కూడా స్లిప్ అవడాన్ని మంత్రి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరి పరిష్కారమెలా..అని అడిగారు ప్రజలకు ఇబ్బందుల్లేకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. వాస్తవానికి నగరంలో రహదారులు దెబ్బతినడానికి కారణం.. వాననీరు పోయే నాలాలు లేకపోవడమేనని ఎంతోకాలం క్రితమే గుర్తించారు. నాలాల ఆధునీకరణతోనే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని గుర్తించారు. అందుకు రూ. పదివేల కోట్లు కావాల్సి ఉండటంతో , ప్రస్తుతానికి తాత్కాలిక చర్యలకు సిద్ధమవుతున్నారు. అయితే తాత్కాలిక చర్యలు సైతం వర్షాకాలంలో ఫలితమివ్వవని తెలిసిందే. దాంతో మంత్రి తనిఖీలు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేవు. ఆ సంగతలా ఉన్నప్పటికీ తన పర్యనటనలో మంత్రి పలు అంశాలను గుర్తించారు. వాటి పరిష్కారానికి ఆదేశాలూ జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. గుర్తించిన సమస్యలు.. ►ప్రధాన రహదారుల్లో ఎక్కడా సైడ్డ్రైన్లు లేకపోవడం. ► అనేక ప్రాంతాల్లో నీరునిల్వ ఉండటం. ► కూకట్పల్లి బాటా షోరూమ్ వద్ద సివర్లైన్ నిర్వహణ లేకపోవడం. ప్రధాన రహదారికి ఏడాది కాలంగా మరమ్మతులు జరగకపోవడం. ►సర్వీసు రోడ్లు, సైడ్రోడ్లు అధ్వాన్నంగా ఉండటమే కాక ప్రధాన రహదారుల నంచి వచ్చే ట్రాఫిక్‌కు తగిన విధంగా లేకపోవడం. ► ఫుట్‌పాత్‌ల నిర్వహణను గాలికొదిలేశారు. ►దాంతో అనేక ప్రాంతాల్లో అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారు. ►కూకట్పల్లి ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు. ►దీనిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. ఆదేశాలు.. ► రహదారుల మరమ్మతులు, వర్షాకాల సమస్యల వంటి అత్యవసర అవసరాలను ఆపదలు రాక ముం దే గుర్తించి ఇంజినీర్లు ముందస్తుగా పనులు చేయాలి. ►రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో, పాట్‌హోల్స్ ప్రాంతాల్లో కనీసం మోటార్లు వెళ్లేలా వెంటనే చర్యలు చేపట్టాలి. ►{పధాన మార్గాల్లో శాశ్వత నిర్మాణాలు రాకుండా సంబంధిత డిప్యూటీ కమిషనర్లు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. ►చిరువ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవారిపై నిఘావేసి పోలీసులకు తెలియజేయాలి. ► కూకట్పల్లి-బి సర్కిల్లో రచ్చబండ, రుషి కాలేజీ వద్ద వేసిన గోడను తొలగించడంతో పాటు అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ►కేపీహెచ్‌బీలోని పురాతనకట్టడాలను కూల్చివేయాలి. ►చిన్నారి రమ్య మృతిచెందిన పంజగుట్ట వద్ద ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలి. ఈమేరకు నివేదిక అందజేయాలి. ► ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులకు స్పెషలిస్టుల సేవలు పొందాలి. ►మీడియన్ల అభివృద్ధికి, పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి. చిన్నారి రమ్య మృతిచెందిన ప్రదేశం పరిశీలన.. పంజగుట్టలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మృతిచెందిన ప్రదేశాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పరిశీలించారు. అక్కడ ప్రమాదాలు జరగడానికి కారణాలేమిటని ఇంజినీర్లను అడిగారు. అక్కడి శ్మశానవాటికల వల్ల రోడ్డు బాటిల్‌నెక్‌గా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్కడ రహదారి వెడల్పు చేయలేమనడంతో, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అందుకుగాను జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ తదితర విభాగాలు సమన్వయంతో నెలరోజుల్లో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పలు ఏరియాల్లో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంతోపాటు నిర్వహణ ను లక్ష్యంగా చేసుకొని పనులు చేయాలన్నారు. మౌలిక సదుపాయాలైన రహదారులు, బస్షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, సివరేజి నిర్వహణ బాగుండాలని, అధికారులంతా సమర్ధవంతంగా తమ విధుల్ని నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్, ఎస్ఈ మోహన్‌సింగ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
రాజేంద్రనగర్‌లో కార్డన్ సెర్చ్
-
ఇక కాకి లెక్కలు చెల్లవ్!
సాక్షి,సిటీబ్యూరో: పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు దండుకుంటున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు జలమండలి సామాజిక తనిఖీలు చేయించాలని నిర్ణయించింది. మహానగరం పరిధిలో ఏటా సుమారు రూ.50 నుంచి రూ.75 కోట్ల విలువ చేసే పైప్లైన్ల లీకేజీల నివారణ, మ్యాన్‌హోళ్లు, స్టోరేజీ రిజర్వాయర్ల నిర్వహణ, మరమ్మతు పనులు జరుగుతుంటాయి. వీటిని తనిఖీ చేసేందుకు జలమండలి.. విజిలెన్స్ విభాగాన్ని త్వరలో రంగంలోకి దింపనుంది. సదరు విభాగం అధికారులు కాంట్రాక్టర్ పూర్తిచేసిన పనుల నాణ్యత, మన్నికను పరిశీలించడంతో పాటు స్థానికంగా ప్రజల నుంచి సదరు పని జరిగిన తీరు, సమస్య పరిష్కారమైందో లేదో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాకే బిల్లులు మంజూరు చేయాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. గతేడాది జరిగిన నిర్వహణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో తనిఖీలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. అంతా గోప్యమే... జలమండలి పరిధిలో రోజూ పలుప్రాంతాల్లో జరిగే కలుషిత జలాల సరఫరా నివారణ, మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లకు ఏర్పడే లీకేజీలకు మరమ్మతులు, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ, స్టోరేజీ రిజర్వాయర్లకు మరమ్మతు పనులను నిర్వహణ, మరమ్మతు పనులుగా పరిగణిస్తారు. నిర్వహణ పనుల్లో సింహభాగం భూమిలోపల జరిగేవి, రాత్రి పూట జరిగేవే ఉంటాయి. దీంతో ఎక్కడ ఏ పైప్‌లైన్‌కు ఎంతమేర మరమ్మతులు చేశారో తెలుసుకోవడం బ్రహ్మరహస్యమే. ఇక క్షేత్రస్థాయి అధికారులతో మిలాఖత్ అవుతున్న కాంట్రాక్టర్లు కొన్నిసార్లు భూమిలోపల జరిగే పైప్‌లైన్ లీకేజీల నివారణ, మ్యాన్‌హోల్ పునరుద్ధరణ వంటి పనులు చేయకుండానే బిల్లులు సమర్పించి బోర్డు ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. కాగితాలపై కాంట్రాక్టర్లు చూపే కాకిలెక్కలకు క్షేత్రస్థాయి మేనేజర్లు తమ వాటా దండుకొని బిల్లులను ధ్రువీకరిస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి చేరవేయడం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు అనివార్యమని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అక్రమాలకు చెక్ ఇలా.. నిర్వహణ పనులు చేపట్టిన ప్రతిసారి కాంట్రాక్టర్ స్థానికుల నుంచి ఈ పనులు చేసినట్టుగా విధిగా సంతకాలు తీసుకోవాలి. పనిని పూర్తి చేయకముందున్న పరిస్థితిని, పూర్తై తరవాత పరిస్థితిని క్షేత్రస్థాయి అధికారులు ఫొటోలు తీసి వాట్సప్‌లో అధికారులకు పంపాలి. నిర్వహణ, మరమ్మతు పనులు పూర్తయ్యాక విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి వాస్తవంగా పని జరిగిందీ లేనిదీ నిర్ధారిస్తారు. ఈ విషయంలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. సామాజిక తనిఖీలో సదరు పని జరగనట్టు తేలితే సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతారు. బోర్డుకు సమర్పించిన బిల్లును తిరస్కరిస్తారు. అక్రమాలు పెద్ద ఎత్తున జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. -
సబ్ ట్రెజరీ కార్యాలయంలో తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్నతాధికారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ ట్రెజరీ కార్యాలయం సిబ్బంది తీరుపై అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నట్టు జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి రామనాథం తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను తనిఖీ చేయడంతోపాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. -
దిల్‌సుఖ్‌నగర్‌లో విస్తృత తనిఖీలు
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయనే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం మలక్‌పేట పోలీస్‌ష్టేషన్ పరిధిలో పోలీసులు విస్తతంగా తనిఖీలు చేశారు. వాహనాలు, ఫుట్‌పాత్‌లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సోదాలు చేశారు. మలక్‌పేట ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో సీఐ అల్లూరి గంగారెడ్డి సిబ్బందితో దిల్సుఖ్నగర్, గడ్డిఅన్నారం, దిల్సుఖ్నగర్ బస్టాండ్, వెంకటాద్రి, హనుమాన్ టెంపుల్ రోడ్డుకు రెండువైపులా తనిఖీలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నత అధికారుల ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. -
ఐటీ కారిడార్‌లో హై అలర్ట్!
గచ్చిబౌలి (హైదరాబాద్): నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కారిడార్‌లో పోలీసులు వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. అందుకోసం మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో జంక్షన్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సాయుధ పోలీసులు రాత్రి, పగలు తనిఖీలు నిర్వహిస్తారని ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ జె.రమేశ్ కుమార్ బుధవారం తెలిపారు. అంతే కాకుండా ఇనార్బిట్ మాల్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిరంతరాయంగా వాహనాల తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఐటీ కారిడార్‌లో ఇంటర్ సెక్టార్ మొబైల్ గస్తీ నిర్వహిస్తుంటుంది. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, సెక్టార్ ఎస్సైలు అప్రమత్తమయ్యారు. -
పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన మంత్రి సునీత
అనంతపపురం (ధర్మవరం టౌన్) : అనంతపురం జిల్లా ధర్మవరంలోని పలు పెట్రోల్ బంకులను రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం శివానగర్, గాంధీనగర్, దుర్గమ్మ గుడి వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. దుర్గమ్మ గుడి వద్ద ఉన్న బంకులోని డీజిల్‌లో కల్తీ ఉన్నట్లు వెల్లడి కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం బంక్‌ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. యంత్రాలకు సీల్ లేకుండా మోసాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి సునీత మండిపడ్డారు. ప్రజలను మోసం చేసే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. నాణ్యమైన ఇంధనాన్ని వినియోగదారులకు సరఫరా చేయాలని బంకుల నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట ఆర్డీవో నాగరాజు, డీఎస్పీ వేణుగోపాల్, తహశీల్దార్ విజయకుమారి, పట్టణ సీఐ విజయ్‌భాస్కర్ గౌడ్, తూనికలు కొలతల అధికారి వై.వి.శంకర్ తదితరులు ఉన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ
వరంగల్ టౌన్: వరంగల్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్లో భద్రత, ప్రయాణికులు అందుకుంటున్న సౌకర్యాలు, సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ స్టేషన్లో 108 సేవలు, అత్యాధునికమైన వెయిటింగ్ హాల్‌ను, ఎస్కలేటర్లను ఆయన ప్రారంభించారు. స్టాల్స్‌లో కూల్‌డ్రింక్స్ ధరలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే గోదాం హమాలీలు తమ సమస్యలపై జీఎంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైల్వే ఉద్యోగులకు సంబంధించిన పుస్తకాన్ని శ్రీవాస్తవ విడుదల చేశారు. -
6 గంటలు.. రూ.63 వేలు
భైంసా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఆదేశాల మేరకు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రాలపై ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ నేతృత్వంలో తనిఖీలు కొనసాగించారు. 61వ జాతీయ రహదారిపై భైంసా-బాసర, భైంసా -నాందేడ్ కూడలి వద్ద భైంసా పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రంలో ఆదిలాబాద్ ఏసీబీ ఇన్స్పెక్టర్ సీహెచ్ వేణుగోపాల్, కరీంనగర్ ఇన్స్పెక్టర్ వీరభద్రం, రమణమూర్తి, కాశయ్య, ఇతర సిబ్బంది ఆకస్మి క తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువజామున 2.30 గంటల ప్రాంతంలో వచ్చిన తనిఖీ బృందం ఆర్టీవో, ఏసీటీవో కేంద్రాల్లో తనిఖీలు చేపట్టింది. వి ధుల్లో ఉన్న సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని తప్పించి.. తనిఖీలకు వచ్చిన ఏసీబీ అధికారుల బృందం రెండు చెక్‌పోస్టుల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని తప్పించి వారి స్థానంలో కూర్చొని కార్యకలాపాలను కొనసాగించా రు. 61వ జాతీయ రహదారిపై తెలంగాణ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే భారీ వాహనాలు, లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు తీసుకువచ్చే మాముళ్లు అనుమతిపత్రాలను పరిశీలించారు. ఎప్పటిలాగే లారీ డ్రైవర్లు సంబంధిత పత్రాలతోపాటు ‘మాముళ్లు’గా ఇచ్చే డబ్బులను చేతిలో పట్టుకొచ్చారు. సిబ్బంది స్థానంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులకు అప్పజెప్పి ఎప్పటిలాగే వెనుదిరిగారు. ఏసీబీ అధికారులు డబ్బులు ఇచ్చిన డ్రైవర్ల నుంచి ఎంత నగదు ఇస్తున్నారో అనే వివరాలను లిఖిత పూర్వకంగా రాయించుకున్నారు. రోజూలాగే డబ్బులు ఇస్తున్నట్లు లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఏసీబీ అధికారులకు వెల్లడించారు. సంబంధిత వివరాలన్నింటినీ ఏసీబీ అధికారులు రికార్డు చే శారు. లారీల డ్రైవర్లు ఏసీటీవో చెక్‌పోస్టులో నేరుగా డబ్బులతో వచ్చి ఏసీబీ అధికారులకే మాముళ్లు ఇస్తూ పోయారు. తదుపరి ఎంవీఐ మోహన్‌గౌడ్, ఏసీటీవో చెక్‌పోస్టులో ఇన్చార్జి అధికారి కొండారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. ముందస్తు సమాచారం ఉందా..? ఏసీబీ తనిఖీలు చేపడుతున్నట్లు చెక్‌పోస్టుల్లో ముంద స్తు సమాచారం ఉందా అనే విషయంపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం వేకువజామున 2.30 గంటల నుంచి ఉదయం 8.30 వరకు తనిఖీలు కొనసాగాయి. సిబ్బంది స్థానంలో ఏసీబీ అధికారులు వసూళ్లు కొనసాగించారు. అయితే.. ఆ రు గంటల్లోనే రెండు చెక్‌పోస్టుల్లో సుమారు రూ.63 వేలు అక్రమంగా కట్టిన మామూళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులే వివరిస్తున్నారు. అలాగైతే రాత్రి 2.30 గంటల వరకు ఈ చెక్‌పోస్టుల్లో అక్రమం గా వసూలు చేసిన మాముళ్ల లెక్క ఎంత ఉంటుందో ఆ మొత్తాన్ని ఏ ప్రైవేటు వ్యక్తుల వద్ద దాచి ఉంచారో అనే విషయంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భైంసా చెక్‌పోస్టులో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఈ విషయంపైనా లోతైన దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిస్తీల్లో కోడిగుడ్లు.. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కేంద్రంలో సిబ్బంది కోసం ఏ ర్పాటు చేసిన కౌంటర్లో కోడిగుడ్ల కిస్తీలు కనిపించా యి. చెక్‌పోస్టుగుండా వెళ్లే వాహనాల నుంచి అక్కడి సిబ్బంది కోడిగుడ్లను కూడా వదలకుండా అక్రమం గా తీసుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు భద్రపరిచారు. స్వాధీనం చేసుకున్నాం భైంసా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహిం చాం. వాహన డ్రైవర్లు చెక్‌పోస్టు వద్ద అక్రమంగా కట్టి న మాముళ్లు స్వాధీనం చేసుకున్నాం. ఆర్టీవో చెక్‌పోస్టులో రూ.52 వేలు, ఏసీటీఓ చెక్‌పోస్టులో రూ. 4,380 స్వాధీనం చేసుకున్నాం. డ్రైవర్ల నుంచి వివరా లు సేకరించాం. ఈ విషయంపై ప్రభుత్వంతోపాటు ఆయాశాఖల ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. ఎక్కడ అక్రమాలు జరిగినా ఏసీబీ అధికారులకు సంప్రదించాలి. - సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ -
వరంగల్ రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్లో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో వారం రోజుల కింద జిలెటిన్‌స్టిక్స్, మందుసామగ్రి దొరకడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు మావోయిస్టులు, అటు ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు పొంచి ఉందోనని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు జీఆర్పీ ఎస్ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.