దిల్‌సుఖ్‌నగర్‌లో విస్తృత తనిఖీలు | huge checkings around dilsukhnager | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్‌లో విస్తృత తనిఖీలు

Published Fri, Aug 14 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

huge checkings around dilsukhnager

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయనే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం మలక్‌పేట పోలీస్‌ష్టేషన్ పరిధిలో పోలీసులు విస్తతంగా తనిఖీలు చేశారు. వాహనాలు, ఫుట్‌పాత్‌లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సోదాలు చేశారు.

మలక్‌పేట ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో సీఐ అల్లూరి గంగారెడ్డి సిబ్బందితో దిల్‌సుఖ్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్, వెంకటాద్రి, హనుమాన్ టెంపుల్ రోడ్డుకు రెండువైపులా తనిఖీలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నత అధికారుల ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement