లక్నో: మాస్క్ డ్రైవ్ చెకింగ్‌లో భాగంగా ఓ సీనియర్ ఉద్యోగి, అతడి బృందం జనాలపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దాంతో సదరు సీనియర్ అధికారిపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరగింది. వివరాలు.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌదరి, అతని బృందం మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులను ఒక దుకాణం నుంచి బలవంతంగా బయటకు నెట్టి, కర్రలతో కొట్లారు. ఆ వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే.. కొట్టడానికి గల కారణం తెలపాల్సిందిగా హోం గార్డులను కోరారు.
కానీ వారు ఇదేమి పట్టించుకోకుండా వ్యక్తుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారులు బల్లియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌద్రేను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అధికారులు అతడిని విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం)
Comments
Please login to add a commentAdd a comment