మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్‌ | Man forced to lick another man feet in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్‌

Published Sun, Jul 9 2023 6:28 AM | Last Updated on Sun, Jul 9 2023 7:05 AM

Man forced to lick another man feet in Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట వెలుగుచూసింది. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను మరవకమునుపే ఈ ఘటన బయటకు వచ్చింది.

గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట వెలుగుచూసింది. సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను మరవకమునుపే ఈ ఘటన బయటకు వచ్చింది. కదులుతున్న వాహనంలో ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అరికాళ్లు నాకించారు. వ్యక్తిగత వైరం నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కదులుతున్న వాహనంలో గోలూ గుర్జర్‌ అనే వ్యక్తి మరో వ్యక్తిని పదేపదే కొట్టడం, దూషిస్తూ అతడితో బలవంతంగా అరికాళ్లు నాకించడం ఉన్నాయి.

అతడు చెప్పినట్లుగానే గోలూ గుర్జర్‌ను బాధితుడు పొగిడాడు. మరో వీడియో క్లిప్‌లో గోలూ గుర్జర్‌ చెప్పుతో బాధితుడి మొహంపై కొడుతున్నట్లుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకు గోలూ గుర్జర్, సుదీప్‌ గుర్జర్‌ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు, బాధితుడు దబ్రా పట్టణానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. బాధితుడు మొహ్సిన్‌ ఖాన్‌ మే 21వ తేదీన గోలూ గుర్జర్‌ను కొట్టాడని గ్వాలియర్‌ పోలీసుఅధికారి రాజేశ్‌ చందేల్‌ చెప్పారు. దాడిపై గోలూ డబ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. కక్ష గట్టిన గోలూ గుర్జర్‌ తన వారితో కలిసి జూన్‌ 30న ఖాన్‌ను నిర్బంధించి, దాడికి దిగినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement