
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్(Gwalior)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఒక ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో ఆస్పత్రి అంతటా మంటలు వ్యాపించడంతో కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
గ్వాలియర్ మున్సిపల్ కార్యాలయ అధికారి అతిబల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఆస్పత్రి లేబర్ రూమ్(Labor room)లో మంటలు అంటుకున్నాయని తనకు సమాచారం రాగానే, తాను ఈ విషయాన్ని ఫోనులో అగ్నిమాపకశాఖకు తెలియజేశానన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారన్నారు. ఆస్పత్రిలోని ఏసీ పేలిపోయి, మంటలు అంటుకోగానే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి రోగులను బయటకు తరలించారన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని తెలిపారు. గ్వాలియర్ సబ్ డివిజినల్ మేజిస్టేట్ వినోద్ సింగ్ మాట్లాడుతూ ఎయిర్ కండిషన్డ్ గైనకాలజీ యూనిట్‌లో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో అక్కడ దాదాపు 22 మంది ఉన్నారన్నారు. వైద్య సిబ్బంది అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారన్నారు.
ఇది కూడా చదవండి: 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?
Comments
Please login to add a commentAdd a comment