న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆధారిత ‘డిజి యాత్రా’ బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ బెంగళూరు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభమైంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు విమానాశ్రయంలోకి వేగంగా చెకిన్ కావచ్చని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత 20వేల మంది ప్రయాణికులు మొదటి రోజు అవాంతరాల్లేని, సురక్షిత ప్రయాణ అనుభవాన్ని చూసినట్టు తెలిపింది.
బయోమెట్రిక్, ఇతర కీలక వివరాలను ప్రయాణికులు మూడో నంబర్ టెర్మినల్ వద్ద సమర్పించిట్టు ప్రకటన విడుదలైంది. ఈ యాప్‌నకు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పలు తనిఖీలను మానవ ప్రమేయం లేకుండా, డీజిటల్‌గా పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. డిజి యాత్రా బీటా వెర్షన్‌ను పరీక్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలనే ఎంపిక చేశారు. విస్తృత పరిశీలన తర్వాత అన్ని విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment