mobile application
-
సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ వెర్షన్ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేంద్ర శాఖల నోడల్ అధికారులు రియల్ టైమ్‌లో వీక్షించవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఐఓఎస్ వెర్షన్ మరో వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. యాప్‌లో లాగిన్ కావడం ద్వారా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. కేసులు, ఉత్తర్వులు, తీర్పులు, పెండింగ్ కేసుల స్థితిగతులను తెలుసుకొనేందుకు వీలవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక -
అవినీతిపరుల గుండెల్లో 14400
సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడేవారు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేద్దామన్నా పెద్ద తతంగమే ఉండేది. కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నా సమయం పడుతుంది. దీనికి పరిష్కారంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొబైల్ యాప్‌ను రూపొందించమని ఏసీబీని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏసీబీ 14400 యాప్‌ను రూపొందించింది. లిఖితపూర్వక ఫిర్యాదు, డాక్యుమెంట్లే కాదు... తక్షణం ఆడియో, వీడియో క్లిప్లతోసహా ఫిర్యాదు చేసే అవకాశం ఇందులో కల్పించింది. ఆ ఫిర్యాదులపై తక్షణం స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, కాల్‌సెంటర్‌ను పటిష్టపరిచింది. దాంతో అవినీతిపై బాధితులు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తూ వివిధ రీతుల్లో పరిష్కరిస్తున్నారు. చాలావరకు ఫిర్యాదుదారులు కేసులు పెట్టకుండా సమస్య పరిష్కారాన్ని కోరుతున్నారు. దాంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిన తరువాత వెనక్కి తగ్గడం, తప్పుడు ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి ఏసీబీ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆకస్మిక తనిఖీలు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులు మొదలైనవి నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభించిన ఈ మొబైల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 2,402 ఫిర్యాదులు అందాయి. వాటిలో 2,127.. అంటే 88 శాతం ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. మరో 275 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. యాప్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ముగ్గురు అధికారులను అరెస్టు చేసింది. 8 సాధారణ తనిఖీలు, రెండు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 14400 కాల్‌సెంటర్‌కు ఈ ఏడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు 4,363 ఫిర్యాదులు రాగా వాటిలో 4,132 సమస్యలను పరిష్కరించడం విశేషం. మరో 231 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. అంటే ఏకంగా 94 శాతం సమస్యలను పరిష్కరించింది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ 13 మంది అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒకటి నమోదు చేసింది. 14 సాధారణ విచారణలు చేపట్టగా 20 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అవినీతి అంతమే లక్ష్యం: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అవినీతిపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన 14400 మొబైల్ యాప్ విజయవంతమైంది. మొబైల్ యాప్, కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నాం. 100 శాతం కేసులు పరిష్కరించి బాధితులకు అండగా నిలవడమే ధ్యేయంగా ఏసీబీ పనిచేస్తోంది. ► తిరుపతిలో ఓ మందుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా డ్రగ్ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డి.బాలమురళీ కల్యాణ్ చక్రవర్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నివాసాల్లో తనిఖీలు చేసి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులు కూడా నమోదు చేశారు. ► కాకినాడలో ఓ డెయిరీ ఫాం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న తూర్పు డిస్కం ఏఈ మడికి చంటి బాబు, లైన్‌మేన్ ఎం.సిద్ధార్థ కుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ► కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటున్న ఏఎస్సై షేక్ ఖాదర్ వలీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ► ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్ఆర్ పురం తహశీల్దార్ కె.సతీశ్ ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యాపార సంస్థకు విద్యుత్ సర్వీస్ లైన్ వేసి మీటర్ పెట్టేందుకు అనకాపల్లి జిల్లాలో తూర్పు డిస్కం ఏఈ ఎం.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న 14400 యాప్ ద్వారా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీబీ అధికారులు బాధితునితో మాట్లాడి రంగంలోకి దిగారు. ఆ ఏఈ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్క రోజులోనే అవినీతి అధికారి ఆటకట్టించడంలో ఏసీబీ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషించింది. 14400.. ఈ నంబర్ వింటేనే రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ యాప్‌లో ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి, అవినీతి అధికారుల ఆట కట్టిస్టున్నారు. ఇందుకు పై సంఘటనే తాజా ఉదాహరణ. -
చైనా ‘ఉద్యోగ’ యాప్‌పై ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీ వీడియోలను ‘లైక్’ చేయడం, ‘అప్లోడ్’ చేయడం వంటి పలు విభాగాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పిస్తామని అనేక మంది యువకులను మోసగించిన చైనీస్ ‘నియంత్రిత’ మొబైల్ యాప్– ‘కీప్షేర్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. బెంగుళూరు కేంద్రంగా యాప్‌తో కలిసి పనిచేస్తున్న 12 అనుబంధ సంస్థల పై దాడిజరిపి రూ.5.85 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈడీ పేర్కొంది. ఈ యాప్ నిర్వాహకులు యువత నుంచి అక్రమంగా, మోసపూరితంగా డబ్బు వసూలు చేసినట్లు కూడా ఈడీ ప్రకటన తెలిపింది. ‘‘చైనీయులు ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది భారతీయులను డైరెక్టర్లుగా, అనువాదకులుగా (మాండరిన్ నుండి ఇంగ్లీష్– ఇంగ్లీష్ నుంచి మాండరిన్, హెచ్ఆర్ మేనేజర్లు, టెలి కాలర్లుగా నియమించుకున్నారు’’ అని ఈడీ తెలిపింది. వాట్సాప్, టెలి గ్రామ్‌ల ద్వారా ఉపాధి కల్పనకు సంబంధించి చైనీయులు విస్తృతంగా ప్రకటనలు చేశారని తెలిపింది. ఇండియన్ల డాక్యుమెంట్లు పొందారని, బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయించారని వివరించింది. -
ఏపీఐఐసీ ఆన్లైన్ సేవలకు ఆదరణ
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే ఒక్క క్లిక్‌తో ఆన్లైన్ ద్వారానే అన్ని సేవలు అందించేలా ఏపీఐఐసీ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 14 సేవలను అందిస్తుండగా.. త్వరలోనే అన్ని సేవలను అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం ‘సాక్షి’తో చెప్పారు. ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు అనుమతుల కోసం 389 దరఖాస్తులు రాగా, నిర్ణీత గడువులోగా 144 అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. కొన్ని అనుమతులకు మరింత సమాచారం అవసరం కావడంతో తిరిగి పంపగా, మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్టు చెప్పారు. సేవల విస్తరణ ప్రస్తుతం వెబ్ ద్వారా సేవలను అందిస్తున్నామని, ఏపీఐఐసీ సేవల కోసం ఒక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్లైన్ ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమ పేర్లు మార్చుకోవడం, కేటాయింపుల్లో మార్పు, కేటాయింపుల బదిలీ, పునఃకేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, ఐదెకరాల్లోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ఐదెకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్‌ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాట్‌కు సంబంధించిన ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు.. తదితర సేవలను ఆన్లైన్లో అందిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సేవలనూ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఏపీఐఐసీ ఎండీ వివరించారు. -
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయంలో వేగంగా చెకిన్..
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆధారిత ‘డిజి యాత్రా’ బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ బెంగళూరు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభమైంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు విమానాశ్రయంలోకి వేగంగా చెకిన్ కావచ్చని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత 20వేల మంది ప్రయాణికులు మొదటి రోజు అవాంతరాల్లేని, సురక్షిత ప్రయాణ అనుభవాన్ని చూసినట్టు తెలిపింది. బయోమెట్రిక్, ఇతర కీలక వివరాలను ప్రయాణికులు మూడో నంబర్ టెర్మినల్ వద్ద సమర్పించిట్టు ప్రకటన విడుదలైంది. ఈ యాప్‌నకు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పలు తనిఖీలను మానవ ప్రమేయం లేకుండా, డీజిటల్‌గా పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. డిజి యాత్రా బీటా వెర్షన్‌ను పరీక్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలనే ఎంపిక చేశారు. విస్తృత పరిశీలన తర్వాత అన్ని విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెడతారు. -
ఎలన్‌మస్క్ ఎందుకిలా జరుగుతోంది? టెస్లా కార్లలో సాంకేతిక సమస్యలు
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రపంచ రారాజుగా ఉన్న టెస్లాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా టెస్లా కారు ఓనర్లు చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ కారు యజమానులు టెస్లా యజమాని ఎలన్‌మస్క్‌ని డిమాండ్ చేస్తున్నారు. పని చేయని యాప్ టెస్లా కంపెనీ నుంచి మార్కెట్లో మోడల్ 3 వై, మోడల్ ఎస్, ఎస్ ప్లెయిడ్ కార్లు మార్కెట్లో విపరీతంగా అమ్ముడయ్యాయి. యూరప్, అమెరికా మార్కెట్లో టెస్లా కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ప్రయత్నంలో భాగంగా టెస్లా కార్లకు మొబైల్యాప్ రూపంలో డిజిటల్ కీస్‌ని అమర్చారు. అంటే టెస్లా యాప్ ద్వారా కారును డోర్స్ ఓపెన్ చేయడం, కారును స్టార్ చేయడం తదితర కంట్రోల్స్ అన్నీ ఈ మొబైల్ యాప్ ద్వారానే కంట్రోల్ చేయోచ్చు. ఇబ్బందులు గత కొంత కాలంగా ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తరచుగా యాప్ మోరాయిస్తోంది. దీంతో యూజర్లు టెస్లా కారును వినియోగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కారు పక్కనే ఉండి గంటల తరబడి డోర్ ఓపెన్ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ట్రాఫిక్ వల్లే మొదట ఈ సమస్య కెనడాలో ఎక్కువగా కనిపించగా ఆ తర్వాత అమెరికాలోనూ ఈ సమస్య వెలుగు చూసింది. ఇటీవల మొబైల్యాప్కి అప్డేట్ని టెస్లా రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ సమస్య ఉత్పన్నమైనట్టు యూజర్లు అంటున్నారు. మరోవైపు నెట్వర్క్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ సమస్య వచ్చిందని త్వరలో పరిష్కరిస్తామని టెస్లా తరఫున ఎలన్‌మస్క్ బదులిచ్చారు. చదవండి:ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్! -
గ్రామాల్లో మొబైల్ యాప్‌తో ఇంటిపన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఇక నుంచి గ్రామాల్లో ఇంటి పన్నును అన్లైన్ విధానంలోనే వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఇంటిపన్ను పూర్తి పారదర్శకంగా నూరు శాతం వసూలవుతుందని తెలిపారు. గ్రామాల్లోని సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సేకరించి, ఆ వివరాలను యాప్‌తో ఇప్పటికే అనుసంధానం చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామాల్లో మాన్యువల్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇలా అన్లైన్ విధానంలో పన్ను చెల్లించిన వెంటనే అన్లైన్లోనే రశీదు తయారై, ఆ రశీదు వెంటనే పన్ను చెల్లించిన వారి మొబైల్ నెంబరుకు వెళ్తుందని మంత్రి చెప్పారు. అంతేకాక.. ఇంటి యజమానులకు ఎంత పన్ను చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలి అనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా ఆయా పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని వివరించారు. పొదుపు సంఘాల కార్యక్రమాలపైనా సమీక్ష పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పెన్షన్ల పంపిణీ అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సచివాలయంలోని తన ఛాంబరులో సెర్ప్ అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
Apps: గోప్యత, భద్రతపై యూజర్లలో ఆందోళన
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటలీకరణ వేగవంతమవుతోన్నా.. వ్యక్తిగత వివరాల గోప్యత, భద్రతపైనా యూజర్లలో ఆందోళన ఉంటోంది. ఇటీవల వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా వ్యాపార సంస్థలతో యూజర్లు నిర్వహించే వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనిపరై టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ విపత్తులో మార్చి 12–26 మధ్య నిర్వహించిన ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని వయస్సుల వారు ఎంతో కొంత డిజిటల్ మాధ్యమం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండగా .. 35 సంవత్సరాలకు పైబడిన వర్గాల్లో ఇది గణనీయంగా పెరిగింది. ‘కోవిడ్ నేపథ్యంలో వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా దేశీ యూజర్లు అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలతో లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ (65 శాతం), షాపింగ్/రిటైల్ (54 శాతం) విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది‘ అని ఐబీఎం పేర్కొంది. గోప్యతపై ఇప్పటికీ పలువురు యూజర్లు యాప్‌లను వాడటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణాలు గోప్యత, భద్రతపై సందేహాలే. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు.. షాపింగ్ చేసేందుకు లేదా ఆర్డరు చేసేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను వాడటానికి ఇష్టపడటం లేదు. యాప్ లేదా వెబ్సైట్లో గోప్యతపై (40 శాతం), భద్రతపై (38 శాతం) సందేహాలు ఇందుకు కారణం‘ అని నివేదిక తెలిపింది. సౌకర్యవంతం మహమ్మారి వ్యాప్తి సమయంలో డిజిటల్ లావాదేవీలందించే సౌకర్యానికి చాలా మంది వినియోగదారులు కాస్త అలవాటు పడినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోందని ఐబీఎం టెక్నాలజీ సేల్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సేల్స్ లీడర్ ప్రశాంత్ భత్కల్ తెలిపారు. కరోనా పూర్వ స్థాయికి పరిస్థితులు తిరిగి వచ్చినా ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయని వివరించారు. భారత్ సహా 22 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 22,000 మంది (ఒక్కో దేశంలో 1,000 మంది) పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు.. - మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశీ యూజర్లు వివిధ కేటగిరీల్లో సుమారు 19 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. సోషల్ మీడియా, వినోదం కోసం సగటున 3 కొత్త ఖాతాలు తీసుకున్నారు. - 50 ఏళ్లు పైబడిన వారు వివిధ కేటగిరీల్లో దాదాపు 27 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. ఒక్కో కేటగిరీలో మిగతా వయస్సుల వారికన్నా ఎక్కువ అకౌంట్లు తెరిచారు. - దాదాపు సగం మంది (47 శాతం) భారతీయ యూజర్లు చాలా సందర్భాల్లో ఇతర అకౌంట్లకు కూడా ఒకే రకం లాగిన్ వివరాలను ఉపయోగిస్తున్నారు. ఇక 17 శాతం మంది కొత్త, పాత వివరాలు కలిపి ఉపయోగిస్తున్నారు. 35–49 ఏళ్ల మధ్య వారిలో దాదాపు సగం మంది యూజర్లు ఇతర అకౌంట్లకు ఉపయోగించిన క్రెడెన్షియల్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. - వెబ్సైట్ లేదా యాప్ భద్రతపై సందేహాలు ఉన్నప్పటికీ జనరేషన్ జెడ్ తరం (1990ల తర్వాత, 2000 తొలినాళ్లలో పుట్టిన వారు) మినహా 57 శాతం మంది యూజర్లు.. భౌతికంగా స్టోర్‌కి వెళ్లడం లేదా ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేయడం కన్నా డిజిటల్‌గా ఆర్డరు, చెల్లింపులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. - తాము సందర్శించే యాప్‌లు, వెబ్సైట్లను ఇతర యాప్‌లు ట్రాక్ చేసేందుకు యూజర్లు ఇష్టపడటం లేదు. ట్రాకింగ్‌కు సంబంధించి పలు యాప్‌లకు అనుమతులు నిరాకరించినట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పైగా వెల్లడించారు. - తమ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతాయని యూజర్లు అత్యధికంగా నమ్ముతున్న కేటగిరీల సంస్థల్లో హెల్త్‌కేర్ (51 శాతం), బ్యాంకింగ్/ఆర్థిక సంస్థలు (56%) ఉన్నాయి. సోషల్ మీడియాపై యూజర్లు అత్యంత అపనమ్మకంతో ఉన్నారు. చదవండి : SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక! -
ట్రెండింగ్: 'కాల్కస్' ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్‌కు అద్భుత స్పందన
‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’ అనే లక్ష్యంతో పాఠశాల స్థాయి అకడమిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల నుండి సివిల్ ఎంట్రన్స్ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా కేవలం 99 రూపాయలకే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో CALCUS EDUCATIONAL INSTITUTE ఆధ్వర్యంలో ‘IIT-IIM ALUMNI’ సహకారంతో విడుదలైన ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’నకు విద్యార్ధుల నుండి అద్భుత స్పందన వస్తోందని కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, జెఈఈ, నీట్, టీచింగ్, సీబీఎస్ఈ, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ వంటి పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్ధులు సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు కాల్కస్ ఎడ్యుకేషనల్ వాణీ కుమారి వెల్లడించారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1325 విభాగాలతో 42 వేలకు పైగా ప్రాక్టీస్ టెస్ట్‌లు కాల్కస్ ఇండియా యాప్‌లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేవీపీవై, ఎన్సీఓ, ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండారైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్ అండ్ పోలీస్, ఎస్ఎస్సీ, టీచింగ్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, లా-కామర్స్-ఆర్ట్స్, సివిల్స్ లాంటి మొదలైన పరీక్షలకు సంబదించిన ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు వీలుగా ఉండేలాగా 42600కు పైగా మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్నపత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను 25 బండిల్స్ (కాటగిరీలు) రూపంలో పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ఉచిత ప్రాక్టీస్ టెస్ట్స్ యాప్ విడుదల సందర్భంగా, కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్ధుల కోసం పరిమిత సంఖ్యలో ఉచిత టెస్టులను ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం అపరిమిత టెస్టులు కావాలనుకున్నవారు వార్షిక ప్లాన్ కొరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చును. ఏడాదికి రూ.99 ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగాప్రాక్టీసు చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, యాప్ విడుదల సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ ముందుగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, త్వరలో ఈ ఆఫర్ గడువు ముగుస్తుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్లో మాత్రమే లభ్యమయ్యే Calcusindia App ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు Calcusindia వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చును. (అడ్వర్టోరియల్) -
నాటి అమెరికన్ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఎలా ఉండేవారో..
మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసింది జో బైడెన్ కాదనుకుందాం. అబ్రహం లింకన్ అనుకుందాం! పోనీ థామస్ జెఫర్సన్, పోనీ జాన్ ఆడమ్స్, పోనీ జేమ్స్ మ్యాడిసన్ అనుకుందాం. పోనీ అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్నే మొన్న స్వోర్న్–ఇన్ చేశారని అనుకుందాం. రాతియుగం నాటి ఆ ప్రెసిడెంట్ ల ముఖాలు ఈ పాలరాతి యుగంలో ఎలా ఉంటాయి? ఎంత పాలిష్డ్ గా, ఎంత ఫెయిర్ గా, ఎంత గ్లో గా, ఎంత లవ్లీ గా, ఎంత స్మార్ట్ గా.. అండ్, ఎంత ముద్దుగా (సేమ్ అదే వయసులో) ఉంటాయి? ఎలా ఉంటాయో అవార్డ్ విన్నింగ్ అమెరికన్ కామిక్ బుక్ రైటర్ ఒకావిడ ఊహించి పెయింట్ చేశారు! ‘అబ్బ! ఈ ప్రాచీన పురుష విగ్రహాలను ఇంతగా ఎలా ఈ న్యూ ఏజ్ లోకి మోసుకు రాగలిగారండీ..‘ అంటే.. ‘ఏం లేదు. ముఖం పై కనిపించీ కనిపించకుండా కాస్త స్మైల్ పులిమానంతే..’ అని ఆమె నవ్వుతూ చెబుతున్నారు. ఫొటోగ్రఫీ పుట్టక ముందే యూఎస్ ప్రెసిడెంట్ పుట్టారు! సరాసరి ప్రెసిడెంట్‌గా పుట్టడం కాదు లెండి. యూఎస్‌కు స్వాతంత్య్రం వచ్చాక తొలి అధ్యక్షుడిగా జార్జి వాషింగ్టన్ 1789 లో ప్రమాణ స్వీకారం చేస్తే, 1826 లోనో 1827 లోనో మానవాళికి ఫొటోగ్రఫీ చేతనైంది. అంతకు పూర్వం, ఆ తర్వాత కూడా ఏళ్ల పాటు అమెరికన్ అధ్యక్షులు చిత్రలేఖనాల్లో మాత్రమే ఫొటోలుగా ఉండేవారు. యు.ఎస్. ప్రెసిడెంట్లు వచ్చి ఇప్పటికి 232 ఏళ్లు గడిచాయి. ఫొటోలు వచ్చి 195 ఏళ్లు అయ్యాయి. ఇన్నేళ్లగా పాలకులు నాగరికం అవుతూ వస్తున్నట్లే ఫొటోగ్రఫీ కూడా అత్యాధునికం అవుతూ వచ్చింది. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కనుక మొన్న జో బైడెన్‌కు బదులుగా ప్రమాణం స్వీకారం చేసి ఉంటే అప్పటికన్నా ఆయన భిన్నంగా ఉండేవారు. అలాగే ఆ పందొమ్మిదో శతాబ్దపు అధ్యక్షులంతా! అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కూడా మోడర్న్‌గా ఉండేవారు. ఏమిటీ వింత ఊహ! వింత ఊహే కానీ ఆసక్తిని కలిగించే ఊహ. ప్రముఖ కామిక్ పుస్తకాల అమెరికన్ రచయిత్రి 36 ఏళ్ల మగ్దలీన్ విసాజియోకు వచ్చిన ఒక ‘అందమైన’ ఆలోచన ఇది. ఆలోచన వచ్చిన వెంటనే ఆమె తొలినాళ్ల అమెరికా అధ్యక్షులను ఎంపిక చేసుకుని వారిని ఈ కాలానికి తగ్గట్లుగా ఫొటో తీశారు! అలాగని ఆమె చిత్రకారిణి గానీ, ఫొటోగ్రాఫర్ కానీ కాదు. తన స్మార్ట్ ఫోన్లోని ఫేస్‌యాప్, ఎయిర్ బ్రెష్‌లను ఉపయోగించి అధ్యక్షుల వారిని ఆధునాతనంగా ‘చిత్రీకరించారు’. మగ్దలీన్ ఇప్పటి వరకు ఐదు సార్లు కామిక్ పుస్తకాలకు ఇచ్చే ఔట్‌స్టాండింగ్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఫేస్ మార్ఫింగ్‌కి ప్రత్యేకంగా అవార్డులు ఉంటే కనుక ఈ ముఖ రచనలకు నామినేట్ అవడమే కాదు, తప్పనిసరిగా అవార్డును సాధిస్తారు కూడా. అంత నాణ్యంగా, ఓ గంట క్రితమే ఈ అధ్యక్షులు అందరూ దివి నుంచి భువికి దిగి, మేకోవర్ చేయించుకుని వచ్చినట్లుగా ఉన్నారంటే అది.. పోలికలు పోకుండా పూర్వపు ఏలికల్ని సృష్టించిన మగ్దలీన్ ప్రావీణ్యమే! ఒక్కో ఫొటోకి జీవం పోయడానికి 15–30 నిముషాలు మాత్రమే పట్టిందట. అమెరికా తొలి పదిహేడు మంది అధ్యక్షుల ఆధునిక రూపాలివి. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు. -
ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, 'జోకర్' మాల్వేర్ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. ఒక్కసారి మొబైల్‌లోకి ఎంటరైతే.. 'జోకర్' మాల్వేర్ అత్యంత ప్రమాదకరమైనదని టెక్ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ 'జోకర్' బారిన పడితే మీ మొబైల్ ఇక మీ మాట వినదు. మొబైల్లోని కాంటాక్ట్స్‌ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ యాక్సెస్ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. (చదవండి: సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్) ఇప్పటికే లక్షా 20 వేల డౌన్లోడ్స్ ఈ సెప్టెంబర్‌లో ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌ను గూగుల్ పరీక్షించింది. 17 యాప్స్ భారీగా ఇన్ఫెక్ట్ అయినట్టు గుర్తించి.. వెనువెంటనే వాటిని తొలగించింది. ఐతే.. అప్పటికే ఆ 17 యాప్స్‌ను దాదాపు లక్షా 20 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు గుర్తించిన గూగుల్.. తక్షణమే మొబైళ్ల నుంచి వాటిని అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఇటీవల గూగుల్ గుర్తించిన 17 ఇన్ఫెక్టెడ్ యాప్స్ ఇవే.. One Sentence Translator - Multifunctional Translator Style Photo Collage Meticulous Scanner Desire Translate Talent Photo Editor - Blur focus Care Message Part Message Paper Doc Scanner Blue Scanner Hummingbird PDF Converter - Photo to PDF All Good PDF Scanner Mint Leaf Message-Your Private Message Unique Keyboard - Fancy Fonts & Free Emoticons Tangram App Lock Direct Messenger Private SMS -
రూట్ మొబైల్ ఐపీవోకు యాంకర్ నిధులు
ఐపీవోలో భాగంగా ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితరాలున్నాయి. లాట్ 40 షేర్లు రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమైంది. శుక్రవారం(11న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్ దాఖలు చేయవచ్చు. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్ కుమార్ గుప్తా, రాజ్‌దీప్ కుమార్ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్ మొబైల్ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ వివరాలు రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్ మొబైల్ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. -
ఎలిమెంట్స్ యాప్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
-
మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : పంటల సేకరణ విధానాల్లో లోపాలు ఉంటే క్షుణ్ణంగా అధ్యయనం చేసి సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్‌పై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం పరిస్థితులపై ప్రతి రోజు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ‘కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’ యాప్‌పై జాయింట్ కలెక్టర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు అధికారులు యాప్‌లో మార్పులు చేశారు. ఈ కొత్త యాప్ వివరాలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. యాప్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. (జర్నలిస్ట్‌లకు అండగా సీఎం జగన్ ) మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో పంట సేకరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలను ఒక జేసీకి అప్పగించాలని, జేసీలందరికీ ఈ యాప్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (‘బాబు డబ్బులు ఇచ్చి మరీ లైన్లోకి పంపుతున్నారు’ ) -
సమాచారమంతా ‘టీ కోవిడ్–19’లో
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘టీ కోవిడ్–19’యాప్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తోందన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రజలు, ప్రభుత్వానికి ఉపకరించేలా ఏడబ్ల్యూఎస్, సిస్కోతో పాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ క్వాంటెలా సహకారంతో రాష్ట్ర ఆరోగ్య, ఐటీ మంత్రిత్వ శాఖలు ‘టీ కోవిడ్–19’యాప్‌ను రూపొందించాయని తెలిపారు. ఈ యాప్ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనవసరమైన భయాందోళనకు గురి కాకుండా పౌరులు తమ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. కాల్ హెల్త్ అనే టెలీమెడిసిన్ మాడ్యూల్తో ఈ యాప్‌ను అనుసంధానం చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా బులెటిన్లు, ప్రభుత్వ ప్రకటనలు, ఇతర అత్యవసర సేవలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని కేటీఆర్ వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలు ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆల్ ఇన్ వన్ తరహాలో కోవిడ్‌కు సంబంధించి పౌరులకు అవసరమైన సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుందని క్వాంటెలా వ్యవస్థాపకులు శ్రీధర్ గాంధీ వెల్లడించారు. కలిసికట్టుగా సంక్షోభాన్ని ఎదుర్కొందాం కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం త్వరలో గట్టెక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ శాఖకు చెందిన సుమారు 100 మంది వ్యాపారవేత్తలతో ఆయన శనివారం భేటీ అయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధింపు తదితర పరిణామాలపై మంత్రి వివరిస్తూ, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. లాక్‌డౌన్‌తో లక్షలాది మంది జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు. లాక్డౌన్ మూలంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అభినందించింది. -
వామ్మో.. ఖైజాలా?
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే.. కామారెడ్డిలోని పంచాయతీ కార్యదర్శులను మాత్రం ఆ యాప్ పరుగులు పెట్టిస్తోంది. యాప్ భయంతో రెండుమూడు రోజులుగా ఉదయం 8 గంటలకే తమ పంచాయతీకి చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలు దాటేవరకు గ్రామంలోనే ఉంటున్నారు. ∙ సాక్షి నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నెలరోజుల్లో గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలతో కూడిన జాబితాను పంచాయతీ కార్యదర్శులతోపాటు గ్రామసర్పంచ్‌లకు అప్పగించారు. ఈ పనుల విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులదే కీలక భూమిక. కానీ కొన్నిచోట్ల వారు సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. మంత్రి ఆదేశాలతో.. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. వేదికపైకి జిల్లాలోని ఒక సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శిని పిలిచి గ్రామంలోని ఇళ్లు, నాటాల్సిన మొక్కలు, నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాల గురించి ప్రశ్నించారు. వారు సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతిపై సరైన అవగాహన లేదని, వారికి సరిగ్గా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పనితీరును మెరుగు పర్చాలని జిల్లాయంత్రాంగం ఆలోచనచేసి మొదట పంచాయతీ కార్యదర్శులంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లోనే ఉండేలా చూడాలని నిర్ణయించారు. హాజరును పర్యవేక్షించడానికి ఖైజాలా అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా వారి హాజరును పర్యవేక్షించేందుకు రెండుమండలాలకు ఒక అధికారిని నియమించారు. ఈ యాప్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు హాజరు నమోదు చేసుకుంటే వారు ఉన్న ప్రదేశంతోపాటు సమయం కూడా అందులో స్పష్టంగా తెలిసిపోతుంది. పనులపై ప్రణాళిక... మార్చి నెలాఖరు వరకు గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి జిల్లాఅధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. గ్రామాల్లో మురికి కాలువలను నిరంతరం శుభ్రంగా ఉండేలా చూడడం, పచ్చదనాన్ని పకడ్బందీగా అమలు చేయడం, గ్రామాల్లోని అంగన్వాడి, పాఠశాల, ఓహెచ్‌ఆర్ ట్యాంకులు తదితర ప్రాంతాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం, నర్సరీల ఏర్పాటు, పవర్‌వీక్ కార్యక్రమాలు, ట్రాక్టర్ల కొనుగోలు, ఇంకుడుగుంతల ఏర్పాటు, ఫీల్డ్‌అసిస్టెంట్ల పనితీరుపై పర్యవేక్షణ, గ్రామాల్లోని ప్రతిఇంటికి చెత్తబుట్టల పంపిణీ, ప్రధాన కూడళ్లల్లో చెత్తకుండీల ఏర్పాటు, 100 శాతం పన్నులు వసూలు చేయడం, వార్షిక బడ్జెట్ తయారుచేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పనుల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. కార్యదర్శుల్లో టెన్షన్ ఖైజాలా యాప్ భయంతో పంచాయతీ కార్యదర్శులు రెండు, మూడురోజులుగా ఉదయాన్నే పల్లెలకు పరుగులు తీస్తున్నారు. ఈ యాప్‌తో కొంతమంది కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలతోపాటు గర్భిణులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో ఉండేందుకు ఇబ్బందిపడాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఇళ్లల్లో పనులు ముగించుకొని గ్రామాలకు వెళ్లేందుకు వారు నానా యాతన పడుతున్నారు. తమ కష్టానికి ప్రతిఫలంగా గ్రామాలు బాగుపడితే అంతకన్నా ఆనందం ఉండదని వారు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం పల్లెప్రగతి కార్యక్రమాల నిర్వహణకు సహకరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లాయంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఎన్పీఆర్పై త్రిపుర కీలక నిర్ణయం!
అగర్తలా: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)పై నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపుర రాష్ట్రం తాజాగా జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టికకు సంబంధించిన వివరాలను ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తామని త్రిపుర రాష్ట్ర జనాభా లెక్కల కార్యకలాపాల డైరెక్టరేట్ పీకే చక్రవర్తి శుక్రవారం తెలిపారు. ఎన్పీఆర్ డేటాను సేకరించటం కోసం 11 వేల మంది అధికారులను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి దశలో రాష్ట్రంలో ఉన్న ఇళ్ల జాబితాను తయారు చేసి.. గృహ గణన చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం మే 16 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. (మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్ట్) కాగా మొదటిదశ ఎన్‌పీర్ డేటా సేకరణ ఈ ఏడాది జూన్ 29 వరకు కొనసాగుతుందని పీకే చక్రవర్తి తెలిపారు. అదే విధంగా రెండో దశ ఎన్పీఆర్ డేటా సేకరణ కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎన్పీఆర్ డేటా సేకరణ ప్రక్రియ పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. డేటా సేకరణ కార్యక్రమంలో పాల్గొననున్న 11 వేల మంది అధికారుల్లో దాదాపు 9062 మంది జనాభా లెక్కల అధికారులు, 1556 మంది సూపర్వైజర్లు, తొమ్మిది మంది ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. పదహారు మాస్టర్ ట్రైనర్లు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు 169 మంది ఫీల్డ్ ట్రైనీలకు త్రిపుర రాజధాని అగర్తలలో శిక్షణ ఇస్తారని పీకే చక్రవర్తి తెలిపారు. (డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు) -
విజయ ఉత్పత్తులకు యాప్: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే తమ ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసే వ్యవస్థను మొబైల్ ఫోన్ వరకు విస్తరించాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన డెయిరీ బోర్డు సమావేశంలో మంత్రి తలసాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్‌ను త్వరలోనే సిద్ధం చేయాలని సూచించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డెయిరీ చైర్మన్ లోకభూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పాస్‌పోర్ట్ యాప్ సూపర్ హిట్!
న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేలా కేంద్రం తీసుకొచ్చిన ‘ఎం పాస్‌పోర్ట్ సేవ యాప్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే ఒక మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్లో స్పష్టం చేశారు. ‘ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన పాస్‌పోర్ట్ సేవ మొబైల్ యాప్‌ను అప్పుడే 1 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.’ అని ఆమె ట్వీట్ చేశారు. Passport Seva mobile App launched recently by the Ministry of External Affairs recently has already registered 1 million downloads. https://t.co/P2sQEGWETp — Sushma Swaraj (@SushmaSwaraj) June 29, 2018 ఆరో పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సుష్మా స్వరాజ్ గత మంగళవారం ఈ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పాస్‌పోర్టు దరఖాస్తు, ఫీజు చెల్లింపు, అపాయింట్మెంట్ షెడ్యూల్ తదితర సౌకర్యాలను ఈ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ విధానం కింద .. పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం(ఆర్పీఓ), పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఎస్కే) లేదా పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఆర్పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్ పంపొచ్చు. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత.. సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది. -
ఏలియన్ డ్యాన్స్.. పీక్స్‌కి చేరింది!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండయితే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వాటిని అనుసరించేస్తున్నారు. ఈ మధ్య ఏలియన్ డ్యాన్స్ పేరిట ఓ వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఓ మ్యూజిక్ యాప్ సాయంతో సెలబ్రిటీలు ఆ వీడియోకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా నటి యామీగౌతమ్ ఏలియన్‌తో డ్యాన్స్ చేశారు. ఓవైపు ఏలియన్ డ్యాన్స్ , మరోవైపు తన బృందంతో కలిసి యామీ లయబద్ధంగా ఆ వీడియోకు స్టెప్పులేశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 7.7 లక్షల మంది వీడియో వీక్షించగా, మరో లక్షమంది నెటిజన్లు లైక్ చేశారు. ఇక ఈ మధ్యే ఈ గ్రహంతర వాసి డాన్సులకు క్రికెటర్ రోహిత్ శర్మ, కమెడియన్ మలైకా దువా, నటి దివ్యాంక త్రిపాఠిలు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. వీరి వీడియోలకు విశేష స్పందన రావడంతో యామీ కూడా ట్రై చేశారు. ఫిట్నెస్ను చూపిస్తూ ఇటీవల ఆమె చేసిన విన్యాసాల వీడియో, ఫొటోల కంటే కూడా మ్యూజికల్ యాప్‌తో ఏలియన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు 67 లక్షల మంది ఫాలోయర్లున్నారు. -
అరచేతిలో టీటీడీ సేవలు
పశ్చిమగోదావరి, నిడమర్రు: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలంటే టీటీడీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారా ఎ ప్పుడైనా.. ఎక్కడి నుంచైనా స్వామి దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్‌చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.. గోవింద యాప్‌తో.. గోవింద అనే మొబైల్ యాప్‌తో టీటీడీ సేవలు సులువుగా పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ద్వారా శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు, గదు ల బుకింగ్, ఈ– హుండీ, ఈ– డొనేషన్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. టీసీ ఎస్ సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం యాప్‌ను రూపొందించింది. దర్శనం ఖాళీగా ఉన్న రోజులు, సమయాలను మొబైల్లో చూ సుకుని టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వివరాలు ♦ గూగుల్ ప్లేస్టోర్‌లో ‘గోవింద–తిరుమల తిరుపతి’ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్ చేసి గోవింద నామాలతో ఉన్న ముఖచిత్రం గల యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకోవాలి. ♦ అనంతరం కనిపించే యాప్ ముఖచిత్రం కింది భాగంలో రిజిస్ట్రేషన్ కాలం వద్ద క్లిక్ చేయాలి. ♦ అక్కడ కనిపించే కాలమ్‌లో మీపేరు, చిరునామా, పిన్‌కోడ్, గుర్తింపు టైపు, గుర్తింపు కార్డు నంబర్ నమోదు చేయాలి. ♦ పాన్ కార్డ్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డుల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. ఆ కార్డు సంఖ్య ఎంటర్ చేయాలి. ♦ తర్వాత యూజర్ నేమ్ కాలమ్‌లో వినియోగంలో ఉన్న మీ ఈ– మెయిల్ ఐడీ మాత్రమే నమోదు చేయాలి. తర్వాత 8 క్యారెక్టర్స్ పైబడిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి (పాస్‌వర్డ్‌లో ఆంగ్ల అక్షరాలు, అంకెలు, స్టార్, యాష్ వంటి గుర్తులు కలిగి ఉండేలా చూసుకోవాలి). ♦ మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గమనిక: గూగుల్ ప్లేస్టోర్‌లో టీటీడీ ఆన్లైన్ బుకింగ్ పేరుతో అనేక మొబైల్ అప్లికేషన్ కనిపిస్తున్నాయి. అయితే ‘గోవింద– తిరుమల తిరుపతి’ అనే యాప్ మాత్రమే టీటీడీ అధికారిక యాప్ అని గమనించాలి. దర్శనం టికెట్ల బుకింగ్ ఇలా.. ♦ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. దర్శనం ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తితో పాటు మరో తొమ్మిది మంది వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అందరి ఆధార్ నంబర్లు లేదా గుర్తింపు కార్డుల నంబర్లు నమోదు చేయాలి. ♦ దర్శనంతోపాటు ప్రత్యేక పూజల వివరాలు కూడా కనిపిస్తాయి. ♦ దర్శనం / పూజ అనంతరం ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల చొప్పున యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ప్రతి లడ్డూకు రూ.25 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులు సులభం ♦ టికెట్లకయ్యే ఖర్చులను యాప్ ద్వారానే చెల్లించవచ్చు. దర్శనం టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.300 చొప్పున చెల్లించాలి. ఆన్లైన్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోపాటు క్రెడిట్ / డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ♦ బ్యాంక్ వివరాలు యాప్‌లో డిస్ప్లే అవుతున్నాయి. దాని ప్రకారం భక్తుల సంఖ్య, లడ్డూలు, ప్రత్యేక పూజలకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించవచ్చు. -
టెలిగ్రాం యాప్‌లో సరికొత్త ఫీచర్..!
న్యూయార్క్: ఇన్స్టంట్ మెసేజింగ్ మొబైల్ యాప్ ‘టెలిగ్రాం’లో యూజర్లకు ఎంతో ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో మూడు టెలిగ్రాం అకౌంట్లను వాడుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ టెలిగ్రాం అకౌంట్లు ఉన్నవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తున్న టెలిగ్రాం ఆప్‌లో కూడా రెండు కొత్త థీమ్‌లను జత చేశారు. ఇక రెండు ప్లాట్‌ఫాంలపై కూడా టెలిగ్రాం యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌లకు క్విక్ రిప్లై ఇవ్వవచ్చు. టెక్ట్స్, ఎమోజీ, స్టిక్కర్, జిఫ్ ఇమేజ్‌లను పంపుకోవచ్చు. తాజా వెర్షన్ 4.7ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించే క్రమంలో రైల్వేలు సరికొత్త వెబ్‌సైట్‌ను లాంఛ్ చేయనున్నాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మలుచుకునేందుకు వేగంగా,సులభంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు అనువుగా ఆండ్రాయిడ్ ఆధారిత ఐఆర్సీటీసీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త వెబ్సైట్ ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటూ ఈజీ లాగిన్, నేవిగేషన్ సౌకర్యాలను అందిస్తుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో టైమ్డ్ అవుట్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇతర ట్రావెల్ వెబ్సైట్లు, యాప్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కొత్త వెబ్సైట్, యాప్ ద్వారా పెద్ద ఎత్తున రాబడి పెంచుకోవాలని రైల్వేలు యోచిస్తున్నాయి. కన్ఫర్మ్ అయిన టికెట్ల డిస్ప్లే, డేటా ఎనలిటిక్స్ ద్వారా ప్రయాణ తేదీలను ఖరారు చేసుకోవడం వంటి కొత్త ఫీచర్లను వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. రైళ్ల రాకపోకలను రియల్‌టైమ్ ప్రాతిపదికన ప్రయాణీకులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల ద్వారా చేరవేసేందుకూ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణ సమయంలో జాప్యం, జాప్యానికి కారణాలు, తదుపరి స్టేషన్‌కు రైలు చేరే సమయం వంటి వివరాలను ప్రయాణీకుడి మొబైల్‌కు టెక్స్ట్ అలర్ట్‌లు పంపాలని రైల్వేలు భావిస్తున్నాయి. రైలు ఎక్కడ ఉన్నదనే వివరాలను ఇస్రో సాయంతో శాటిలైట్ల ఆధారంగా ప్రయాణీకులకు చేరవేసేలా నూతన ఫీచర్లనూ అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. -
మొబైల్ య్యాప్ ద్వారా నగదురహిత లావాదేవీలు
హిందూపురం అర్బన్ : స్వైపింగ్ మిషన్ల ఉత్పత్తి కొరత ఉన్నందున మొబైల్లోనే బీమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా నగదు రహిత లావాదేవీలు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. లేబర్‌వార్డు, చిన్నపిల్లల వార్డుతో పాటు, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరత ఉన్నందున కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేయడానికి కృషి చేస్తామన్నారు. హంద్రీ-నీవా పూర్తయితే నీటికొరత లేకుండా చూస్తామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ వారితో సంప్రదించి రక్త ప్యాకెట్ల కొరత లేకుండా చూస్తామన్నారు. త్వరలోనే తూమకుంట పారిశ్రామివాడ సందర్శించి ప్రభుత్వానికి నివేదికలు పంపి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు జేఈ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణమ్మ పాల్గొన్నారు. -
ఫోన్‌తో క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
-
డిజిటల్ మనీతో జాగ్రత్తలు ఇవీ..
నగదు రహిత లావాదేవీలతో లాభాలు ఎన్ని ఉన్నా.. సైబర్ ప్రపంచం తీరుతెన్నులపై అవగాహన లేకుంటే మాత్రం నష్టపోక తప్పదు. అందుకే నగదు రహిత లావాదేవీలు జరిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ► క్రెడిట్, డెబిట్ కార్డుల పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్)ను గోప్యంగా ఉంచుకోవాలి. దానిని తరచుగా మార్చుకుంటూ ఉండాలి. ► నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంటిపేర్లను పాస్‌వర్డ్‌లుగా వాడుతూంటారు. అలా కాకుండా.. ప్రతి పాస్‌వర్డ్‌లో కొన్ని అక్షరాలు, ఒకట్రెండు అంకెలు, ప్రత్యేక సంకేతాలు ఉండేలా రూపొందించుకోవాలి. పాస్వర్డ్ ఎనిమిది అక్షరాలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది. ► వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు వాడాలి. వాటిని ఎక్కడైనా రాసిపెట్టుకోవడం కూడా మంచిది కాదు. బదులుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండే పాస్వర్డ్ మేనేజర్లను వాడటం మేలు. వీటిలో మీ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లను నిక్షిప్తం చేసినా.. అవి ఎన్‌స్క్రిప్ట్ అవుతారుు కాబట్టి ఇతరులు తెలుసుకునే అవకాశం తక్కువ. ► ఇటీవల చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాంటి బహిరంగ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలను చేయకపోవడమే మేలు. ► స్మార్ట్ఫోన్లలో అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ నుంచి కొన్ని వివరాలు తీసుకునేందుకు అప్లికేషన్ తయారీదారులు అనుమతులు కోరతారు. ఏయే వివరాలు కోరుతున్నారో గమనించడం అవసరం. ► స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలో లేటెస్ట్ యాంటీ వైరస్, మాల్వేర్, స్పైవేర్ సాఫ్ట్వేర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ► మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి ప్రలోభాలు ఎర చూపుతూ వచ్చే మెయిళ్లను, అటాచ్మెంట్లను ఓపెన్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ► ఏ బ్యాంకు, ఆర్థిక సంస్థ మెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా మీ వివరాలు కోరదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
మొబైల్ వాలెట్లు జేబులో ఉన్న పర్సు మొబైల్ ఫోన్లోకి మారితే దాన్ని మొబైల్ వ్యాలెట్ అనవచ్చు. సొమ్మును బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ రూపంలో మొబైల్ అప్లికేషన్లోకి బదలారుుంచుకుని వాడుకునేందుకు వీలు కల్పించే సౌకర్యం ఇది. క్రెడిట్ కార్డులతో కూడా మొబైల్ వాలెట్లలో డిజిటల్ నగదు చేర్చుకోవచ్చు. పేటీఎం, ఫ్రీచార్జ్, మొబీక్విక్ వంటివి మొబైల్ వ్యాలెట్లలో కొన్ని. మీరు ఉపయోగించే మొబైల్ వ్యాలెట్ ఆధారంగా మీకు అందే సేవలు ఉంటారుు. ప్లాస్టిక్ మనీ క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను ప్లాస్టిక్ నగదు లావాదేవీలుగా పరిగణిస్తారు. బ్యాంకులు, కొన్ని ఇతర సంస్థలు ఈ కార్డులు జారీ చేస్తారుు. ఆన్‌లైన్‌లోనూ వీటిని తీసుకోవచ్చు, రీచార్జ్ చేసుకో వచ్చు కూడా. పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాలు ఉన్న చోట్ల వీటిని స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ మొబైల్ వ్యాలెట్ల అవసరం లేకుండా నేరుగా ఇంటర్నెట్లో ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా అన్ని రకాల సేవలు పొందేందుకు వీలు కల్పించేది నెట్ బ్యాంకింగ్. కంప్యూటర్ల ద్వారా, స్మార్ట్ఫోన్ల ద్వారా కూడా నెట్ బ్యాంకింగ్ నిర్వహించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు (సొంత ఖాతా లేదా ఇతరుల ఖాతా దేనికై నా సరే) నగదు బదిలీ చేయవచ్చు. ఇందుకు మూ డు పద్ధతులున్నారుు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స ట్రాన్సఫర్ (నెఫ్ట్ - అధిక మొత్తాల బది లీకి) వీటిల్లో ఒకటి. రెండోది రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్ - తక్కువ మొత్తాల బదిలీకి), మూడోది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్ - తక్షణ బదిలీ కోసం). ఈ మూడు పద్ధతుల ద్వారా నగదు బదలారుుంపులకు అయ్యే ఖర్చు ఐదు రూపాయల నుంచి రూ. 55 వరకూ ఉంటుంది. -
యాప్ ని విడుదల చేసిన బ్రాండ్ మిర్రర్స్
-
ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్‌లెస్ టిక్కెట్లు
♦ ఢిల్లీలో ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ♦ వీడియో లింకేజీ ద్వారా మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభం ♦ 2017 నాటికి ఎంఎంటీఎస్ ♦ రెండో దశ పూర్తి చేస్తామన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో మొబైల్ అప్లికేషన్ ద్వారా కాగిత రహిత టిక్కెట్లను పొందే సదుపాయాన్ని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో తిరిగే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్లలోనే అన్రిజర్వ్డ్ టిక్కెట్లను బుక్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని వీడియో లింకేజీ ద్వారా మంత్రి అందుబాటులోకి తెచ్చారు. బడ్జెట్లో ప్రకటించిన వివిధ రకాల ప్రాజెక్టులను అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఖాళీ బెర్తుల సమాచారాన్ని అందజేసే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆన్లైన్ ద్వారా బెడ్‌రోల్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆన్లైన్ బుకింగ్ వివరాలను తెలుసుకునేందుకు టీటీఈలకు హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్(హెచ్‌హెచ్‌టీ) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎంఎంటీఎస్ రైళ్లలో పేపర్ లెస్ టిక్కెట్ సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైళ్లలో ఐటీ ఆధారిత సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. జీపీఎస్ ఆధారంగా ఈ రైళ్లలో రాబోయే స్టేజీల అనౌన్స్మెంట్, ఎల్ఈడీ బోర్డులపై ప్రదర్శన వంటి సదుపాయాలకు ఐటీని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులను 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పేపర్‌లెస్ అన్రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లోనూ అన్రిజర్వ్డ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. అన్రిజర్వ్డ్ టిక్కెట్లతో పాటు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌లను కూడా పొందే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వి.హనుమంతరావు, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్‌గుప్తా, చీఫ్ కమర్షియల్ మేనేజర్ పాపిరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్లు ఆశీష్ అగర్వాల్, అరుణా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్-వ్యాలెట్ ద్వారా రీచార్జ్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేపర్‌లెస్ అన్రిజర్వ్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ‘యూటీఎస్ ఆన్ మొబైల్ డాట్ ఇండియన్ రైల్ డాట్ జీవోవీ డాట్ ఇన్’ వెబ్సైట్లో ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలి. టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆర్-వ్యాలెట్‌ను రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. రూ.100 నుంచి రూ.5,000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. ఆర్-వ్యాలెట్‌ను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. బయలుదేరవలసిన స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకోవాలి. టిక్కెట్ ఇలా బుక్ చేసుకోండి.. ► పేపర్‌లెస్ అన్రిజర్వ్డ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ‘బుక్ టిక్కెట్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ► తర్వాత స్క్రీన్‌పైన ‘నార్మల్ బుకింగ్’ను ఎంపిక చేసుకోవాలి. ► ఆ తర్వాత బయలుదేరవలసిన స్టేషన్ పేరు, చేరుకోవలసిన స్టేషన్ పేరు నమోదు చేసి ‘డన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ► ఎంతమంది ప్రయాణించేది, పిల్లలు ఉంటే ఆ వివరాలను ఎంపిక చేసుకోవాలి. దాంతో ఆర్-వ్యాలెట్ సెలెక్ట్ అవుతుంది. ► ఆర్-వ్యాలెట్ నుంచి ప్రయాణానికి అయ్యే టిక్కెట్ చార్జీలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ‘బుక్ టిక్కెట్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టిక్కెట్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. టీటీఈలు వచ్చినప్పుడు ఈ మొబైల్ టిక్కెట్ చూపిస్తే చాలు. -
సదా 'మీ సేవ'లో..
2011లో కేంద్రాల ఏర్పాటు అందుబాటులో 334 సేవలు మొబైల్ యాప్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం సాక్షి: ఏదేని ప్రభుత్వ ధ్రువపత్రాలు పొందాలంటే సంబంధిత కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. వారం గడిచినా సర్టిఫికెట్లు అందుతాయన్న నమ్మకం ఉండదు. ఈ సమస్యలను అధిగమించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో ‘మీ సేవా’ కేంద్రాలు ప్రారంభించింది. మనకు కావాల్సిన పత్రాల వివరాలు, రుసుం చెల్లిస్తే రెండు లేదా మూడు రోజుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. ఏపీ ప్రభుత్వం మీ సేవా ద్వారా పోందే అన్ని సేవలను ఇక నుంచి మొబైల్ ద్వారా అందించనుంది. ఇందుకు సంబంధించిన యాప్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ సందర్భంగా ‘మీ సేవ’ విశేషాలు మీకోసం.. కేంద్రాల పనితీరు దర ఖాస్తుదారులు ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ’ రూపొందించిన నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా సిబ్బంది దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా తహశీల్దార్/ఆర్డీఓ కార్యాలయాలకు చేరవేస్తారు. తహశీల్దారు వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర విచారణాధికారులకు పంపిస్తారు. డిజిటల్ కీ ఆధారంగా వీఆర్వో, ఆర్ఐ, డీటీలు విచారణ నివేదికలు తహశీల్దారుకు సమర్పిస్తారు. నివేదికలపై సంతృప్తి చెందితే వాటిని రెండు కాపీలు తీస్తారు. ఒక దానిపై సంతకం చేసి కార్యాలయ స్టాంప్ వేసి భద్రపరుస్తారు. మరో దానిని డిజిటల్ సంతకంతో దరఖాస్తుదారునికి జారీ చేస్తారు. వ్యక్తిగతంగానూ జారీ ఈసేవా కేంద్రాల ద్వారానే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా ధ్రువపత్రాలు పొందే అవకాశాన్ని కల్పించారు. పుట్టినరోజు, నివాస తదితర ధ్రువపత్రాలతోపాటు, పెన్షన్ కోసం వ్యక్తిగత దరఖాస్తులు తీసుకోవడానికి సీసీఎల్ఏ ఆయోదం తెలిపింది. పత్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చేసిన తరువాత సంబంధిత అధికారుల సంతకంతో జారీ చేస్తారు. అయితే అత్యవసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన వారికి మాత్రమే ఈ విధానంలో జారీ చేస్తున్నారు. అక్రమాలకు చెక్ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇసుక అమ్మకాలను మీ సేవా కేంద్రాలతో మిళితం చేసింది. కరీంనగర్ జిల్లాలోని ఖాజీపూర్‌లో మొదటి ఇసుక విక్రయ కేంద్రాన్ని 2015 ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇసుక కావాలనుకునేవారు మీసేవా కేంద్రాల్లో టన్నుకు రూ.375 చెల్లించాలి. రశీదు తీసుకుని ఇసుక కేంద్రాలకు వెళ్లి లోడ్ చేసుకోవచ్చు. వాహనాలు సొంతంగా సమకూర్చుకోవాలి. ప్రారంభం కుల, ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ, తదితర పత్రాల జారీలో చోటు చేసుకుంటున్న అవకతవకలు నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు రూపొందించింది. సర్టిఫికెట్లను ఆన్లైన్ విధానంలో జారీచేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ‘మీ సేవా’ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని 2011 నవంబర్ 4న చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. 10 సేవలతో మొదలై, ప్రస్తుతం 34 శాఖలకు చెందిన 334 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7 వేలకు పైగా కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు క్రోడీకరించి కొత్త నిబంధనలు రూపొందించింది. సంబంధిత అధికారుల సంతకాన్ని డిజిటలైజ్ చేసింది. రాష్ర్ట విభజన అనంతరం రెండు రాష్ట్రాలు వేరుగా సేవలు అందిస్తున్నాయి.ఈ కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగానూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ అప్లికేషన్ మీ సేవలో అందిస్తున్న సేవలన్నింటినీ మొబైల్ ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. తొలి విడతలో 19 పౌర సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు చెల్లింపు, డాష్‌బోర్డు, చెల్లింపు స్థితి, మీ సేవ కేంద్రాలు వివరాలు తెలుసుకోనే వెసలుబాటు కల్పించారు. మీ సేవకు సంబంధించి వాట్సాఫ్ నంబరు 9100199992కు మెసేజ్ కూడా చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బ స్టాఫ్లు, ఆసుపత్రుల వివరాలు ఇందులో ఉంటాయి. క్షేత్రస్థాయిలో వయోజన విద్య సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ధ్రువపత్రాల జారీ ఆలస్యంగా జరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు సమయానికి సర్టిఫికెట్లు పొందలేక పోతున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ‘స్టేట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం’ కమిటీని నియమించింది. ఈ కమిటీకి డెరైక్టర్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి చక్రపాణిని నియమించారు. -
రైలు టికెట్లు ఇక సెల్ఫోన్లో కొనొచ్చు
న్యూఢిల్లీ: రైలు టికెట్ కోసం ఇక గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. సెల్ఫోన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్‌ను భారతీయ రైల్వే బుధవారం ప్రారంభించనుంది. రైల్వే శాఖ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాలు తెలిపారు. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు గూగుల్ యాప్ స్టోర్ నుంచి రైల్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రైల్వే ఈ-వాలెట్ సృష్టించడం కోసం యూజర్‌కు రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. టికెట్ల కొనుగోలు సొమ్మును ఈ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదంటే, ఏ రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్లోనైనా చెల్లించవచ్చు. టికెట్లు తనిఖీ చేసే వారికి ఫోన్లోని సాఫ్ట్ కాపీ చూపితే చాలు. ఏ రైల్వే స్టేషన్‌కైనా వెళ్లి ఈ-వాలెట్‌ను టాప్అప్ చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్లోనూ టాప్అప్ చేయించుకోవచ్చు. అంతేకాదు, సీజన్ టికెట్లనూ రెన్యువల్ చేసుకోవచ్చు. ముంబై సబర్బన్ సెక్టార్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. విజయవంతం కావడంతో దేశమంతటా ప్రవేశపెడుతున్నారు. -
‘స్మార్ట్‌ఫోన్’లో రైళ్ల సమాచారం
సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకల సమయాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునే ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే మరింత విస్తరించింది. మొబైల్ అప్లికేషన్ (యాప్)తో రైళ్ల వేళలను తెలుసుకునే పద్ధతిని దక్షిణ మధ్య రైల్వే ఫిబ్రవరిలో ప్రారంభించింది. తాజాగా ఈ యాప్‌లో మరిన్ని స్టేషన్లకు సంబంధించిన రైళ్ల సమాచారంతో పాటు ఆయా స్టేషన్లలో ఉన్న వసతుల వివరాలనూ జోడించింది. తొలుత ఈ యాప్‌ను హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎన్‌క్వైరీ సిస్టం (హైలెట్స్) పేరుతో ఎంఎంటీఎస్ రైళ్ల సమాచారం తె లిపేందుకు ప్రారంభించింది. తర్వాత ట్రైన్ అరైవల్ డిపార్చర్ అండ్ ఎమినిటీస్ ఎట్ స్టేషన్స్ (తథాస్త్) పేరుతో విస్తరించింది. ప్రస్తుతం ఈ యాప్‌లో రెండు రాష్ట్రాల్లోని 25 ప్రధాన స్టేషన్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైళ్ల రాకపోకల వేళల తాజా సమాచారం, స్టేషన్లలో ఉన్న వసతులు, స్టేషన్ లేఅవుట్ చిత్రాలు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు, అనకాపల్లి, భువనగిరి, భీమవరం, గుంతకల్, చిత్తూరు, కడప, ఖమ్మం, మంచిర్యాల, నాందేడ్, రామగుండం, తెనాలి, తాడేపల్లిగూడెం, వికారాబాద్, తాండూరు, సిర్పూర్-కాగజ్‌నగర్, సేడం స్టేషన్ల వివరాలను కొత్త యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గూగుల్ ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్), ఆపిల్ యాప్ స్టోర్ (ఐఓఎస్ ఆధారిత స్మోర్ట్ఫోన్స్) ద్వారా ఈ యాప్‌ను ఉచితంగా స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్‌కు ‘యాప్’
సోమవారం నుంచి అందుబాటులోకి.. తొలుత హైదరాబాద్ నుంచి వెళ్లే బస్సులకు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు రిజర్వేషన్‌కు బస్టాం డ్కో, ప్రైవేటు రిజర్వేషన్ కేంద్రాలకో వెళ్లాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని మొబైల్ అప్లికేషన్ రూపంలో ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. సోమవారం నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది. ఇదీ పద్ధతి...: రిజర్వేషన్ కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా రూపొం దించిన ఈ మొబైల్ అప్లికేషన్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్సుల వివరాలు ఉంటాయి. కోరుకున్న బస్సులో సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా నిర్ధారిత రుసుము ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని ఇప్పుడు హైదరాబాద్‌కే పరిమితం చేశారు. ఇమ్లీబన్ బస్‌స్టేషన్ సహా ఇతర ముఖ్యకేంద్రాల నుంచి రెండు రాష్ట్రాల్లోని ప్రధా న కేంద్రాలకు వెళ్లే బస్సులకే ఈ సేవలు పరిమితమవుతాయి. బస్సు ఎప్పుడొస్తుందో తెలుసుకునేలా... ఎదురుచూసే బస్సు స్టాప్‌లోకి ఎంతసేపట్లో వస్తుందో ముందే అక్కడి ఎలక్ట్రానిక్ బోర్డులో డిస్ప్లే చేసే ఆధునిక వసతిని ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. జీపీఎస్ సాయంతో ఇది పనిచేస్తుంది. తొలుత హైదరాబాద్‌లోని 100 ముఖ్యమైన బస్టాప్‌లను ఇందుకోసం ఎంపిక చేశారు. మూడు వేల బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లో తిరిగే మరో ఐదొందల బస్సులను కూడా జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానిస్తున్నారు. మరో వారం పదిరోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ విధానా న్ని అందుబాటులోకి తేవాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రాకెట్ ప్రయోగాలను వివరించేందుకు నాసా ఆప్!
న్యూయార్క్: రాకెట్ ప్రయోగాల గురించి పిల్లలకు తెలియజేసేందుకుగాను నాసా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ‘ఎల్ఎస్పీ యాక్టివిటీ బుక్’ అనే ఈ ఉచిత ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆప్.. రాకెట్ ప్రయోగానికి ఎలా సన్నద్ధం అవుతారు? ఏ ప్రయోగానికి ఏ వాహకనౌకను ఎంచుకుంటారు? వంటి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఆప్‌లో ఉండే ‘పీటర్ ద పేలోడ్’ అనే పాత్ర పిల్లలకు మార్గనిర్దేశం చేస్తుంది. -
భలే ఆప్స్
చదివి వినిపిస్తుంది.... మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఎంచక్కా ఈ బుక్స్ చదువుకోవచ్చునని చాలామంది అంటూంటారు. ఇది నిజమేకానీ... కొన్ని సందర్భాల్లో పుస్తకం చదివే ఓపిక కూడా మనకు ఉండకపోవచ్చు. ఎంచక్కా ఎవరైనా ఈ పుస్తకంలోని కథ మనకు వినిపిస్తే బాగుండునని అనిపిస్తూంటుంది కూడా. అచ్చంగా అలాంటి సందర్భాల కోసమే ఆమెజాన్ కంపెనీ ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆడిబుల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ మీ కోసం పుస్తకాలను చదివి వినిపిస్తుంది. అప్లికేషన్తోపాటే దాదాపు 1,50,000 ఈబుక్స్ కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి... ఇకపై మీకు బోర్ అనిపించే సందర్భాలే ఎదురుకావు. బ్యాక్‌గ్రౌండ్‌లో కథలు వింటూనే, లేదా డౌన్లోడ్ చేసుకుంటూనే ఇతర పనులూ చక్కబెట్టుకునే అవకాశముండటం మరో విశేషం. అంతేకాదు... ఈ ఆడిబుల్ అప్లికేషన్ ద్వారా మీ పుస్తక అభిరుచులను ఇతరులతో పంచుకోవచ్చు కూడా. కూరగాయల ధరలను చెప్పే ‘మన రైతుబజార్’ కూరగాయల ధరల గురించి తెలుసుకోవడానికి మార్కెట్ వరకూనో, షాపింగ్‌మాల్ వరకూనో వెళ్లాల్సిన అవసరం లేకుండా... స్మార్ట్‌ఫోన్ నుంచే ఆ వివరాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది ‘మన రైతుబజార్’ అనే ఈ అప్లికేషన్. సాధారణంగా కూరగాయల ధరలు రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని ప్రముఖ నగరాల్లోని రైతు బజార్లలో కూరగాయల ధరలను చెబుతుంది ఈ అప్లికేషన్. వాటి మధ్య పోలికను కూడా చూపుతూ అవగాహన నింపుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఫొటో ఎడిటింగ్ కోసం ‘మిక్స్’ గూగుల్ ప్లే స్టోర్‌లో ఫొటో ఎడిటింగ్ కోసం ఇప్పటికే అనేకానేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ‘మిక్స్’ పేరుతో మరో అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నో అవార్డులు సాధించిన కెమెరా 360, హెలో కెమెరా వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేసిన బృందమే ‘మిక్స్’ను కూడా అభివృద్ధి చేయడం విశేషం.ఈ అప్లికేషన్‌ను వాడటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో తీసే ఫొటోలను కూడా ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరాల స్థాయి నాణ్యత తీసుకురావచ్చు. దాదాపు 115 ఫిల్టర్లు 40 వరకూ ఒరిజినల్ టెక్స్చర్లు, పది వరకూ ప్రొఫెషనల్ అడ్జస్ట్మెంట్ టూల్స్ దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు మల్టీ లేయర్ ప్రాసెసింగ్ వంటి ఫీచర్లు కూడా దీంట్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వంటివాటితో కలిసి పనిచేసేందుకు ఇది మెరుగైన అప్లికేషన్ అని కంపెనీ అంటోంది. మీరు ఫొటోలకు చేసే ఎటిటింగ్ను ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుని ఇతర ఫొటోలకు ఫార్ములా మాదిరిగా వాడుకోవడం కూడా ‘మిక్స్’ ఫీచర్లలో ఒకటి కావడం విశేషం. ఆండ్రాయిడ్‌లోనూ వీఎల్సీ.. డెస్క్‌టాప్ కంప్యూటర్లకు చిరపరిచితమైన వీడియో ప్లేయర్ వీఎల్సీ ఇప్పుడు స్మార్ట్ఫోన్లకూ అందుబాటులోకి వచ్చింది. వీఎల్సీ ఫర్ ఆండ్రాయిడ్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ మీడియా ప్లేయర్ ప్రస్తుతం బీటా దశలోనే ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఏఆర్ఎం 7 సీపీయూ లేదా ఎక్స్86 ఆర్కిటెక్చర్ సీపీయూలతో మాత్రమే పనిచేస్తుంది. ఆడియో, వీడియోలతోపాటు నెట్వర్క్ స్ట్రీమ్స్‌ను కూడా ప్లే చేయగలదు ఈ మీడియా ప్లేయర్. మీడియా లైబ్రరీని ఏర్పాటు చేసుకోగలగడం, సబ్‌టైటిల్స్‌తో మల్టీట్రాక్ ఆడియోలను వినిపించగలగడం ఈ అప్లికేషన్‌కు ఉన్న ఫీచర్లలో కొన్ని. వీడియో కంట్రోల్ కోసం ప్రత్యేకమైన విడ్జెట్, హెడ్సెట్స్కూ సపోర్ట్ ఉంటుంది. బీటా వెర్షన్ కావడం వల్ల దీంట్లో ఇప్పటికీ చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల స్మార్ట్ఫోన్లతోనే పనిచేస్తుంది. అకస్మాత్తుగా క్రాష్ అవుతూంటుంది. యూఎస్బీలో ఉండే ఆడియో, వీడియో ఫైళ్లను గుర్తించి ప్లే చేయడం లాంటి ఫీచర్లు కూడా దీంట్లోకి ఇంకా చేరాల్సి ఉంది. -
కామెర్లను గుర్తించే ఆప్
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే ‘బైలీక్యామ్’ అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని బట్టి కామెర్లను గుర్తిస్తారు. కానీ కొన్నిసార్లు సరిగా గుర్తించకపోతే శిశువులకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌తో ఓ ఫొటో తీస్తే చాలు.. శిశువులకు కామెర్ల సమస్య ఉందా? లేదా? అన్నది వెంటనే తెలియజేసే ఈ ఆప్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. తొలుత ఆప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, పిల్లల శరీరంపై ఎక్కడైనా ఓ ప్రామాణిక రంగుల పట్టీని ఉంచి ఫొటో తీస్తే చాలు.. ఆ ఫొటోపై క్లౌడ్ పద్ధతిలో ఆన్లైన్లో విశ్లేషణ జరిగి ఆటోమేటిక్‌గా ఫోన్‌కు కామెర్ల తీవ్రతను తెలియజేస్తూ సమాచారం అందుతుందని వర్సిటీకి చెందిన భారత సంతతి పరిశోధకులు శ్వేతక్ పటేల్ వెల్లడించారు. -
సెల్ ఉంటే చాలు..
సాక్షి, ముంబై: మీ దగ్గర మొబైల్ ఉందా.. అయితే ఇంకేం.. మీకు ఇకపై కార్పొరేషన్ వరకు వెళ్లి నీటిపన్ను.. ఇంటిపన్ను.. ఆస్తిపన్ను.. ఇలా అన్ని రకాల పన్నులు కట్టేందుకు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ముంబైకర్లకు ఇకపై కార్పొరేషన్ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. వివిధ పన్నులు చెల్లించేందుకు కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూల్లో నిలబడి విలువైన సమయం, వ్యయప్రయాసలను పూర్తిగా తగ్గించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది. అందుకు బీఎంసీకి చెందిన మొబైల్ అప్లికేషన్ వచ్చే వారం నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో నీటి పన్ను చెల్లించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆ తరువాత ఆస్తి, ఆదాయ పన్నులతోపాటు అనుమతి ఇచ్చే శాఖలకు చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించేందుకు అప్లికేషన్లు ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు నమోదుచేసే సౌకర్యం కూడా నవంబర్‌లో ప్రవేశపెట్టనుంది. ‘ఎంసీజీఎం 24/7’ అనే అప్లికేషన్ అండ్రాయిడ్ మొబైల్‌పై డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీఎన్ఎన్ నంబర్ చేర్చగానే చెల్లింపు దారుడికి వివరాలు అందులో వస్తాయి. ఆ తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అలాగే ఐఎంపీఎస్ లాంటి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు. పన్ను చెల్లించడానికి ఈ సేవలు అందిస్తున్న సంబంధిత కంపెనీకి దాదాపు ఒక శాతం అదనపు పన్ను విధిస్తారు. రుసుం చెల్లించగానే ఎస్ఎంఎస్ ద్వారా మనకు మెసేజ్ వస్తుంది. దీన్ని రసీదుగా భావించాల్సి ఉంటుందని మేయర్ సునీల్ ప్రభు స్పష్టం చేశారు. ఇదివరకే బీఎంసీ పరిపాలన విభాగం ముంబైకర్లకు కన్జ్యూమర్ కన్వీనియెన్స్ సెంటర్ (గ్రాహక్ సువిధ కేంద్రం) తోపాటు సైబర్ కన్వీనియెన్స్ సెంటర్లో పేమెంట్ గెట్ వే, బీఎంసీకి చెందిన ఆధీకృత వెబ్‌సైట్‌పై డబ్బులు చెల్లించడం, ఫిర్యాదు నమోదు చేయడం లాంటి సౌకర్యాలు కల్పించింది. నేటి ఆధునిక కాలంలో ప్రస్తుతం అందరి వద్ద మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు గంటల తరబడి క్యూలో నిలబడి పన్నులు చెల్లించే ఓపిక ఉండదు. దీంతో తమ చేతిలో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు బీఎంసీ సౌకర్యాలు కల్పిస్తోందని మేయర్ అన్నారు. -
ఫేస్బుక్లో అమ్మాయి ఫొటోతో 14 లక్షలు కుచ్చుటోపి
ఫేస్బుక్లో అమ్మాయి ఫొటోతో అకౌంట్ ఓపెన్ చేసి మోసం మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆడ గొంతుతో ఎర కంప్యూటర్ వ్యాపారికి రూ. 14 లక్షలు కుచ్చుటోపి సైబర్ నేరగాడి అరెస్ట్ వందమంది దాకా బేబీ బాధితులు బెంగళూరు : సామాజిక వెబ్సైట్లు ఉపయోగించి కొందరు ఘరానా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫేస్బుక్లో ఓ అందమైన యువతి ఫొటో పెట్టి యువకులను ఆకర్షిస్తూ వారి నుంచి రూ. లక్షలు వసూలు చేస్తున్న ఓ మోసగాన్ని ఇక్కడి కేజీహళ్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేజీహళ్లిలోని బిలాల్ నగరలో ఉంటున్న షేర్‌ఖాన్(23)ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇంటర్ చదివిన షేర్‌ఖాన్ మూడేళ్లుగా మంగళూరులో నివాసం ఉంటున్నాడు. డబ్బు సంపాదించడానికి ఒక పథకం వేశాడు. ఒక అందమైన యువతి ఫొటోను సేకరించి ఫేస్బుక్లో బేబీ పేరుతో అకౌంట్ ప్రారంభించాడు. ఇక్కడి హెచ్ఆర్బీఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న వాసీం అహమ్మద్ కుట్టి అనే యువ కుడితో ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నాడు. కంప్యూటర్ విడి భాగాలు విక్రేత అయిన వాసీం సదరు ఫొటో యువతి అందానికి ముగ్ధుడై చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. కొన్ని నెలల పాటు చాటింగ్ అనంతరం మొబైల్ నెంబర్లు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే వాసీం ఫోన్ చేసినప్పుడల్లా షేర్‌ఖాన్ తన స్వరాన్ని మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆడగొంతుతో మోసం చేసేవాడు. గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకునేవారు. కొన్ని నెలల క్రితం షేర్‌ఖాన్ వాసీంకు ఫోన్ చేసి తాను గోవాలో ఉన్నానని, పర్సు పోయిందని డబ్బు పంపమని కోరాడు. తన ప్రియురాలు (షేర్‌ఖాన్) అడిగిందని వాసీం మూడు వేలు అకౌంట్లో వేశాడు. అదే విధంగా కొన్ని రోజుల క్రితం ఒక ఇంటి స్థలం పరిష్కారం కోసం రూ. లక్ష ఇవ్వాలని కోరాడు. పాపం అమాయక వాసీం చెప్పిన కొన్ని గంటల్లోనే రూ. లక్ష అకౌంట్లోకి జమ చేశాడు. ఇలా తరచూ ఆడ గొంతుతో మోసం చేస్తూ వాసీం నుంచి రూ. 14 లక్షలు వసూలు చేశాడు. దీంతో విసిగి పోయిన వాసీం నేరుగా కలవాలని కోరాడు. దీంతో అనుమానించిన షేర్‌ఖాన్ వాసీంతో చాటింగ్, ఫోన్ చేయడం మానేశాడు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాసీం దుకాణంలోకి చొరబడి కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ఘరానా మోసం బయటపడుతుందని భావిం చిన షేర్‌ఖాన్ స్నేహితులతో కలిసి వాసీం దుకాణంపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. షేర్‌ఖాన్ ఫేస్బుక్ ఆధారంగా ట్రాప్ చేసి అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు యువతి ఫొటోతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ప్రారంభించి, వివిధ సిమ్‌కార్డులు ఉపయోగించి 100 మందికి పైగా యువకులను మోసం చేశాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు తెలి పారు. మోసం చేసిన నగదుతో షేర్‌ఖాన్ గోవా, ముంబాయి తదితర ప్రాంతాల్లో విలాసవంతమైన జీవితం గడిపేవాడని శనివారం కేజీ హళ్లి పోలీసులు తెలిపారు. -
బ్లాక్‌బెర్రీ మొబైల్‌కు 16 పట్టణాల సమాచారం
న్యూఢిల్లీ: మరొకరి సాయం లేకుండా దేశవ్యాప్తంగా 16 పట్టణాలలో సొంతంగానే పర్యటించేందుకు ఉపకరించే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ సహకారంతో ‘ఇంక్రెడిబుల్ ఇండియా వాకింగ్ టూర్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ అప్లికేషన్లో హైదరాబాద్, చెన్నై, జైపూర్, గోవా, బెంగళూరు, ముంబై సహా 16 పట్టణాల సమాచారం ఉంటుందని పర్యాటక శాఖ వెల్లడించింది. నిపుణుల బందం ఈ సమాచారాన్ని పొందుపరిచిందని, ఈ అప్లికేషన్ ద్వారా పట్టణాల్లోని వీధులను 360 డిగ్రీల కోణంలో ఆమూలాగ్రం చూడవచ్చని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది బ్లాక్‌బెర్రీ మొబైల్స్ కోసమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. -
ఈ యాప్‌తో ఆహార వృధాకు అడ్డుకట్ట...
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అందరికీ ఈ సంగతి తెలిసినా చాలాసార్లు ఆహారాన్ని మాత్రం వ్యర్థం చేస్తుంటారు. ఇళ్లలో, హోటళ్లలో, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా ఎన్నో రకాలుగా ఆహారం పెద్ద ఎత్తున వృథా అవుతుంటుంది. అందుకే ఆహారం వృథా కాకుండా నివారించాలని ఆలోచించిన భారత సంతతి ఆవిష్కర్త ఒకరు దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆకలితో ఉన్న వినియోగదారులకు, రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయే ఆహారాన్ని చౌకగానే అందించేందుకు వీలుగా ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్(యాప్)ను రూపొందించారు. ఒక్క అమెరికాలోనే ఏటా 16,500 కోట్ల డాలర్ల విలువైన ఆహారం చెత్తకుప్పల పాలు అవుతోందని తెలుసుకున్న తాను మరో ఇద్దరితో కలసి ‘పేర్అప్’ అనే ఈ యాప్‌ను అభివృద్ధిపర్చినట్లు న్యూయార్క్‌కు చెందిన అనూజ్ ఝంఝన్‌వాలా తెలిపారు. ఏ హోటల్లో ఎంత ఆహారం మిగిలిపోయి ఉంది? అది ఎంత చౌక ధరకు లభిస్తుంది? అన్నది ప్రతిరోజూ వినియోగదారులు ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. వినియోగదారులకు, హోటళ్ల నిర్వాహకులకు ఉపయోగకరమైన ఈ ఉచిత యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. -
''ఓట్ ఫర్ జగన్'' పేరుతో అఫ్లికేషన్ విడుదల
-
ఒత్తిడిని తరిమేసే ‘స్ట్రెస్బస్టర్స్’ యాప్!
వాషింగ్టన్: పరీక్షల కోసం రేయింబవళ్లు చదువుతూ.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా? ఇతరులతో సంబంధాలు దెబ్బతినడం లేదా పని ఒత్తిడి, సమస్యల వల్ల కుంగుబాటుకు లోనవుతున్నారా? అయితే మీ లాంటివారి ఒత్తిడిని, ఆందోళనను తరిమేసేందుకు ఉపయోగపడే ‘స్ట్రెస్బస్టర్స్’ అనే ఓ మొబైల్ అప్లికేషన్‌ను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ పరిశోధకులు రూపొందించారు. అమెరికా, ఇతర పలు దేశాల యూనివర్సిటీల విద్యార్థులు ఉపయోగిస్తున్న ఈ ‘స్ట్రెస్బస్టర్స్’ యాప్‌తో ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడేలా న్యూస్ అలర్ట్స్, స్ఫూర్తిదాయకమైన మాటలు, వీడియోలు పరస్పరం అందుకోవచ్చు. ఒకే ఒక్క బటన్‌ను నొక్కి నేరుగా ఇతరులకు రిప్లై ఇవ్వవచ్చు. విద్యార్థులకు బాగా ఉపయోగపడే ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. ఆపిల్ కంపెనీ యాప్ స్టోర్, గూగుల్ ప్లే నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
మగాడి కోసం కొన్ని మొబైల్ యాప్స్!
వృత్తిగతమైన, వ్యక్తిగతమైన బాధ్యతలతో సూర్యుడితో పాటు నిద్రలేచే మగాడికి కొంచెం విరామం కావాలి... ఆ విరామంలో కొంత వినోదం కావాలి... ఏకాంతంగా ఉన్నప్పుడు, అవసరం అనుకొన్నప్పుడు అలరించే కొన్ని ఆనందాలు కావాలి... ఇలాంటి అవసరాలను గమనించి హాయ్ చెబుతున్నాయి కొన్ని మొబైల్ అప్లికేషన్లు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే, అందులో ఈ అప్లికేషన్లు ఉంటే సంపూర్ణమైన వినోదం దొరికినట్టే! సంగీతం కోసం స్పాటిఫై... మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో సంగీతానికి మించిన సాధనం లేదు. అలాంటి సంగీతాన్ని స్టోర్ చేసుకోవడంలో స్పాటిఫైకి మించిన అప్లికేషన్ లేదు. ఇందులో లెక్కలేనన్ని మ్యూజిక్ట్రాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే ఈ అప్లికేషన్ కొంచెం ఖరీదైనది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద పని చేస్తుంది. ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ సమాచారం... అంతులేని వినోదాన్ని ఇచ్చేవి క్రీడలు. ఆడే అవకాశం లేకపోయినా వాటిని చూడటం కూడా వినోదమే. అలా చూసే అవకాశం లేనప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం కావాలంటే స్ఫోర్ట్స్ ఛానల్ అప్లికేషన్లను స్టోర్చేసుకోవడమే. అప్డేట్స్ను, ఎప్పటికప్పుడు స్కోర్స్‌ను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాయి స్పోర్ట్ అప్లికేషన్లు. ఈఎస్పీఎన్, స్టార్ స్పోర్ట్స్ వంటి చానల్స్‌కు సంబంధించిన అప్లికేషన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఐఓస్ అయినా, ఆండ్రాయిడ్ అయినా వీటి ఇన్స్టలేషన్ ఉచితమే! ఆరోగ్యంపై అవగాహనకై.... ఇన్స్టంట్ హాట్‌రేట్ ఆరోగ్యం గురించి సెల్ఫ్ చెకింగ్‌కు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్స్ తెరపై చూపుడు వేలిని పెడితే చాలు పల్స్ రేట్ డిస్ప్లే అవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం గురించి ఆసక్తిని ఉంటే ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతాల నిర్వహణ కోసం మనిల్లా బ్యాంక్ బ్యాలెన్స్‌ను, బ్యాంక్స్టేట్మెంట్స్ను రికార్డు చేస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్. నెల నెలా చెల్లించాల్సి పేమెంట్స్‌ను గుర్తు చేస్తూ గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఉచిత అప్లికేషన్ ఇది. గూగుల్ గాగుల్స్ ఈ అప్లికేషన్‌ను ఇచ్చినందుకు గూగుల్‌కు మరోసారి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు, అర్థం కాని విషయాలను తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయుక్తంగా ఉంటుంది.ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేస్తే చాలు అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత! -
సెల్లో ‘తెలుగు మాట’
హైదరాబాద్: మాతృభాషలోనే సంక్షిప్త సందేశాలు, శుభాకాంక్షలు పంపుకునేందుకు అవకాశం కల్పించే మొబైల్ అప్లికేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో పనిచేసే ఈ అప్లికేషన్‌ను ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారమిక్కడ సచివాలయంలో ఆవిష్కరించారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ అప్లికేషన్‌ను వినియోగించి తెలుగులో సందేశాలు పంపుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్జ్ వర్క్స్ అమలుచేస్తున్న తెలుగు విజయం ప్రాజెక్టులో భాగంగా ‘తెలుగు మాట’ పేరుతో ప్రభుత్వం ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ అనువర్తనం యాపిల్ వారి యాప్ స్టోర్‌లోనూ,ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లోనూ ఉచితంగా పొందవచ్చని పొన్నాల తెలిపారు. ‘తెలుగుమాట’ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ఫోన్లలోను, ఆండ్రాయిడ్ ఆధారిత సాంకేతిక పరికరాల్లోనూ అందుబాటులో ఉంటుంది. తెలుగు భాషను సాంకేతికంగా ఉపయోగించుకునే దిశలో ఇది మరొక ముందడుగు అని పొన్నాల పేర్కొన్నారు. -
పట్టించిన వాట్స్‌యాప్
=మొబైల్ అప్లికేషన్‌తో చిక్కిన ‘మెంటల్ ఖురేషీ’ =మొదటి వారంలో ‘ఎర్రగడ్డ’ నుంచి పరారీ =19 రోజుల్లో పద్దెనిమిది ప్రాంతాల్లో ‘పర్యటన’ =రెండో భార్యతో ఉన్న ఫొటోలు మొదటామెకు షేర్ =బయటి నుంచి నలుగురు సహకరించినట్లు నిర్ధారణ సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లను పట్టుకునేందుకు వెస్ట్‌జోన్ పోలీసులకు టెక్నాలజీ బాగా ఉపకరిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌గౌడ్ కిడ్నాప్, హత్య మిస్టరీని ఫేస్బుక్ ఫొటోలు విప్పితే... ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి నుంచి పరారైన ఖైదీ ఖురేషీ జాడను మొబైల్ అప్లికేషన్ ‘వాట్స్‌యాప్’ తెలిపింది. రెండో భార్యతో ములాఖత్ అంగీకరించలేదనే కారణంగా ఈ నెల 3న తెల్లవారుజామున మరికొందరు ఖైదీలతో కలిసి ఖురేషీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఖురేషీ ‘గ్రేట్ ఎస్కేప్’కు బయట నుంచి మరో నలుగురు సహకరించినట్లు ఆధారాలు లభించాయని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖురేషీ అరెస్టును ఆయన ప్రకటించారు. నాంపల్లి చాపెల్ రోడ్లో నివసించే మహ్మద్ అహ్మద్ ఫాహుద్దీన్ ఖురేషీపై అబిడ్స్ ఠాణాలో ఆరు, నాంపల్లి పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదై ఉన్నాయి. అబిడ్స్ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా ఉన్న ఖురేషీని ఆ ఠాణా పోలీసులు మాదకద్రవ్యాల కేసులో అక్టోబర్ 15న అరెస్టు చేసి జైలుకు పంపారు. మానసికస్థితి సరిగ్గా లేదన్న కారణంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పించుకున్నాడు. నిత్యం ‘రోమింగ్’లోనే... ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్ వద్దకు వెళ్లిన ఖురేషీ.. ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్’ ప్రారంభించాడు. మొదటి భార్య ఉన్నప్పటికీ ఖురేషీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అల్మాస్‌ను పెళ్లి చేసుకున్నాడు. గడిచిన 19 రోజుల్లో వాహనాలతో పాటు విమానాలు, రైళ్లలో గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్‌కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. ఎక్కడా ఒకరోజుకు మించి బస చేయలేదు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్స్‌యాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేశాడు. దీంతో అతడి ఆచూకీని సాంకేతికంగా కనిపెట్టిన పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి టోలిచౌకి చేరుకోగా మాటు వేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. సహకరించిన వారిలో చీతాపూర్ కార్పొరేటర్ ఖురేషీ తప్పించుకోవడానికి సహకరించిన వ్యక్తులు నలుగురని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మీరాలం మండీకి చెందిన రెండోభార్య అల్మాస్‌కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించింది. ఈమె సోదరుడైన సయ్యద్ ముస్తాఫా అలీఖాన్ రిజ్వీ అలియాస్ ఫజల్ తరచూ ఆస్పత్రిలో ఖురేషీని క లుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి సహకరించాడు. అల్మాస్ నివసిస్తున్న ఇంటి యజమాని సయ్యద్ అలీ హుస్సేన్ వీరిద్దరూ సిటీ వదిలి పారిపోవడానికి తన టవేరా వాహనాన్ని సమకూర్చాడు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న చీతాపూర్ కార్పొరేటర్ సయ్యద్ జఫార్ సైతం రూ.25 వేల వరకు ఇచ్చి సహకరించాడు. వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఇంకా ఎవరి ప్రమేయం ఉందనేది తేల్చడానికి ఖురేషీని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ కూడా.. ప్రస్తుతం అబిడ్స్ ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న, ‘మెంటల్’గా ముద్రపడిన ఖురేషీలో మరో ఆసక్తికర కోణమూ ఉంది. అతను ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్. ఫహద్ ఖురేషీ పేరుతో 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఎందరో మల్లయోధుల్ని మట్టికరిపించి నాలుగైదు మెడల్స్ కూడా సంపాదించాడు. 2004 ఆగస్టు 22-25 మధ్య ఒడిశాలోని పూరీలో జరిగిన 28వ సీనియర్ నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో అత్యుత్తమన ప్రతిభ కనబరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. ఖురేషీ మానసికస్థితి పక్కాగా ఉంది ఎస్కేప్‌కు ప్లాన్ చేయడం నుంచి పట్టుబడే వరకు ఖురేషీ తీరును పరిశీలిస్తే అతడి మానసికస్థితి పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు జైలు నుంచి మెంటల్ ఆస్పత్రికి ఎందుకు వచ్చాడనేది బయటపడాలి. ఖురేషీ సైతం తనను ఆ ఆస్పత్రికి ఎందుకు పంపారో తెలియదని చెబుతున్నాడు. అందుకే గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందంతో పరీక్షలు చేయిస్తున్నాం. నివేదికల్ని కోర్టుకు సమర్పించి న్యాయమూర్తి ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఖురేషీ ఆస్పత్రిలో ఉండగా ఫోను వాడాడని తెలుస్తోంది. ఈ విషయంతో పాటు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నాం. ఆ రోజు తప్పించుకున్న వారిలో తిరుమలేష్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. - డీసీపీ సత్యనారాయణ -
సమైక్యాంధ్రకోసం మొబైల్ అప్లికేషన్
-
సాక్షి అభయ మొబైల్ అప్లికేషన్స్‌కు మంచి క్రేజ్