
ఆర్టీసీ రిజర్వేషన్‌కు ‘యాప్’
సోమవారం నుంచి అందుబాటులోకి..
తొలుత హైదరాబాద్ నుంచి వెళ్లే బస్సులకు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు రిజర్వేషన్‌కు బస్టాం డ్‌కో, ప్రైవేటు రిజర్వేషన్ కేంద్రాలకో వెళ్లాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని మొబైల్ అప్లికేషన్ రూపంలో ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. సోమవారం నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది.
ఇదీ పద్ధతి...: రిజర్వేషన్ కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా రూపొం దించిన ఈ మొబైల్ అప్లికేషన్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ముఖ్యమైన బస్సుల వివరాలు ఉంటాయి. కోరుకున్న బస్సులో సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా నిర్ధారిత రుసుము ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని ఇప్పుడు హైదరాబాద్‌కే పరిమితం చేశారు. ఇమ్లీబన్ బస్‌స్టేషన్ సహా ఇతర ముఖ్యకేంద్రాల నుంచి రెండు రాష్ట్రాల్లోని ప్రధా న కేంద్రాలకు వెళ్లే బస్సులకే ఈ సేవలు పరిమితమవుతాయి.
బస్సు ఎప్పుడొస్తుందో తెలుసుకునేలా...
ఎదురుచూసే బస్సు స్టాప్‌లోకి ఎంతసేపట్లో వస్తుందో ముందే అక్కడి ఎలక్ట్రానిక్ బోర్డులో డిస్‌ప్లే చేసే ఆధునిక వసతిని ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. జీపీఎస్ సాయంతో ఇది పనిచేస్తుంది. తొలుత హైదరాబాద్‌లోని 100 ముఖ్యమైన బస్టాప్‌లను ఇందుకోసం ఎంపిక చేశారు. మూడు వేల బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లో తిరిగే మరో ఐదొందల బస్సులను కూడా జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానిస్తున్నారు. మరో వారం పదిరోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ విధానా న్ని అందుబాటులోకి తేవాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.