హిందూపురం అర్బన్ : స్వైపింగ్ మిషన్ల ఉత్పత్తి కొరత ఉన్నందున మొబైల్‌లోనే బీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తద్వారా నగదు రహిత లావాదేవీలు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. లేబర్‌వార్డు, చిన్నపిల్లల వార్డుతో పాటు, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరత ఉన్నందున కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేయడానికి కృషి చేస్తామన్నారు. హంద్రీ-నీవా పూర్తయితే నీటికొరత లేకుండా చూస్తామన్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ వారితో సంప్రదించి రక్త ప్యాకెట్ల కొరత లేకుండా చూస్తామన్నారు. త్వరలోనే తూమకుంట పారిశ్రామివాడ సందర్శించి ప్రభుత్వానికి నివేదికలు పంపి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలోని అన్నా క్యాంటీన్‌లో ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు జేఈ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ పాల్గొన్నారు.
మొబైల్ య్యాప్ ద్వారా నగదురహిత లావాదేవీలు
Published Sat, Jan 7 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
Advertisement