cashless transactions
-
రేపటి నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం నుంచి నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇంటిపన్ను సహా ఏ అవసరానికి పంచాయతీకి డబ్బు చెల్లించాలన్నా.. కేవలం నగదు రహిత విధానంలోనే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి నగదు రహిత లావాదేవీల నిర్వహణను తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోను ఈ విధానం అమలుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేసింది. సాధారణంగా ఆన్లైన్ విధానంలో నగదు చెల్లింపులు.. నెట్ బ్యాంకింగ్ విధానంలోగానీ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పీవోఎస్ మిషన్లలో డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారాగానీ, ఫోన్‌పే, పేటీఎం వంటి విధానాల్లో మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్లను స్కాన్‌చేయడం ద్వారాగానీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డులను ఎక్కువమంది వినియోగించకపోవచ్చన్న అంచనాతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల్లో రెండురకాల విధానాల్లో నగదు రహిత ఆన్లైన్ చెల్లింపుల విధానం అమలుకు ఏర్పాట్లు చేసింది. మూడువేలకు తక్కువగా జనాభా ఉండే చిన్న గ్రామాల్లో కేవలం మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానం, మూడువేలకు పైగా జనాభా ఉండే గ్రామాలకు వివిధ రకాల కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుగా పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు బ్యాంకుల్లో పంచాయతీల పేరిట ప్రత్యేక ఖాతాలు ఆగస్టు 15 నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపుల నిర్వహణకు వీలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇందుకు నాలుగు ప్రముఖ బ్యాంకులతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. 11 జిల్లాల్లో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (యూబీఐ)లో, తొమ్మిది జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో, ఐదు జిల్లాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో, ఒక జిల్లాలో ఐడీఎఫ్సీ బ్యాంకులో పంచాయతీల వారీగా ఖాతాలు తెరిచారు. ♦ రాష్ట్రంలో మొత్తం 13,325 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో మూడువేలకన్నా తక్కువ జనాభా ఉన్నవి 10,003. ఈ పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు మొబైల్ ఫోన్ల చెల్లింపులకు వీలుగా ప్రత్యేక క్యూఆర్ కోడ్లను ఇప్పటికే కేటాయించాయి. ♦ మూడువేలకు పైగా జనాభా ఉన్న 3,322 పంచాయతీల్లో కార్డుల ద్వారా నగదు చెల్లించేందుకు పీవోఎస్ మిషన్లను ఆయా పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు ఉచితంగా ఇస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒకటి చొప్పున, ఏదైనా పెద్ద పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలున్న చోట, అదనంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒకటి చొప్పున మొత్తం 5,032 పీవోఎస్ మిషన్లను అందజేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఎల్జీడీ కోడ్ నంబరు ఆధారంగా బ్యాంకులు ఆయా పంచాయతీలకు ఆన్లైన్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కోడ్లను కేటాయిస్తున్నాయి. ♦ బ్యాంకులో పంచాయతీ ఖాతాకు జమ అయిన సొమ్మును ఆ పంచాయతీ కార్యదర్శి ట్రెజరీ అకౌంట్లో జమచేస్తారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ.. పంచాయతీ కార్యదర్శులకు విధివిధానాలతో ఆదేశాలు జారీచేసింది. -
తొమ్మిది జిల్లాలకు డిజిటల్ బ్యాంకింగ్ హోదా
సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటికే తొమ్మిదింటిని 100 శాతం డిజిటల్ జిల్లాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. మరో 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చే ప్రక్రియను మొదలు పెట్టింది. ఒక జిల్లాలో బ్యాంకు ఖాతాలు కలిగిన వారంతా డెబిట్ కార్డు లేదా ఫోన్, నెట్ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకటి వినియోగిస్తుంటే ఆ జిల్లాను డిజిటల్ జిల్లాగా గుర్తిస్తారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఈ ప్రాజెక్టును చేపట్టగా రాష్ట్రంలో తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో వైఎస్సార్, గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాలు డిజిటల్ జిల్లాలుగా మారాయి. ఇప్పుడు నాలుగో దశలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు 100 శాతం డిజిటల్ బ్యాంకింగ్ జిల్లాలుగా మారడంపై సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మిగిలిన 17 జిల్లాలను డిజిటల్‌గా మార్చడానికి కృషి చేయాలని బ్యాంకింగ్ వర్గాలను కోరారు. విద్యార్థి దశ నుంచే బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన కల్పిం చడానికి పాఠశాలల సిలబస్‌లో ఆరి్థక సేవలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వికాస్ జైస్వాల్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,12,419 బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా ఆర్థి క సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7,769 బ్యాంక్ బ్రాంచ్‌లు కాగా బిజినెస్ కరస్పాండెంట్లు 94,097, ఏటీఎంలు 10,553 ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను డిజిటల్ జిల్లాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఇక ఫోన్‌పే, గూగుల్ పేతో పనిలేకుండానే ఈ-ట్రాన్జాక్షన్స్!
e-RUPI: ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డులు..... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపులు చేసేలా కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తేనుంది. మరింత తేలికగా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. ఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ స్కీం(E-RUPI)ని ప్రవేశపెట్టనుంది. ఎలాగంటే.. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ- రూపీ పద్దతి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తొలిదశలో వీళ్లకే? ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతీ నెల ఔషధాలు అందిస్తోంది, అవసరమైన రోగ నిర్థారణ పరీక్షలు చేయిస్తోంది, అంతేకాదు మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది కేంద్రం. క్లారిటీ రేపే! ఈ-రూపీ పథకం ఆగస్టు 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త విధానాన్ని లాంఛ్ చేయనున్నారు. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌కి క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేది రానిది కూడా తెలిసేది రేపే!. -
కిరాణా.. క్యాష్‌లెస్‌కే ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్న కిరాణా దుకాణాలు.. డిజిటల్ చెల్లింపుల బాటపట్టాయి. వినియోగదారుల కోసం నగదు రహిత (క్యాష్‌లెస్) చెల్లింపులను అందుబాటులో ఉంచుతున్నాయి. దేశ వ్యాప్తంగా కిరాణాల్లో లాక్‌డౌన్‌కు ముందు 35 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు రెండింతలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వంద మంది ప్రజానీకానికి ఒక దుకాణం అందుబాటులో ఉంది. లాక్డౌన్ సమయంలో దూరపు ప్రయాణాలపై ఆంక్షలు, భౌతిక దూరం వంటి నిబంధనలతో సమీపంలోని చిన్న కిరాణాలపైనే కొనుగోలుదారులు అధికంగా ఆధారపడ్డారు. సూపర్ మార్కెట్లు, మార్ట్‌లకు వెళ్లేందుకు జంకడం, పెద్ద పెద్ద వరుసల్లో నిలుచొని సరుకుల కొనుగోళ్లకు ఆసక్తి చూపక దగ్గర్లోని కిరాణాలవైపే మొగ్గు చూపారు. అయితే అన్ లాక్ ప్రక్రియ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కిరాణా దుకాణాల బాటే పట్టారు. మెట్రో పట్టణాల్లో 50 శాతం, చిన్న పట్టణాల్లో 75 శాతం మంది పెద్దపెద్ద మార్కెట్లను కాదని కిరాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వాట్సాప్‌లో ఆర్డర్లు... ఇంటికే సరుకులు... అయితే కొనుగోలుదారుల తాకిడి ఎక్కువ కావడంతో కిరాణా దుకాణ యజమానులకు వైరస్ సోకిన ఉదంతాలు అనేకం. దీన్ని ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానంవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను గణనీయంగా పెంచారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం, క్యూర్ కోడ్ల ద్వారా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ తరహా చెల్లింపులు కిరాణాల్లో గతంతో 35 శాతం ఉంటే ఇప్పుడు 75 శాతానికి పెరిగాయని బెంగళూర్‌కు చెందిన ఓ సర్వే సంస్థ వెల్లడించింది. కొన్ని నగరాల్లో కిరాణా దుకాణదారులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో నిత్యావసర సరుకుల ఆర్డర్లను మెసేజ్‌లు, వాట్సాప్‌ల ద్వారా తీసుకొని ఇంటికే పంపిణీ చేస్తున్నారు. చిన్నచిన్న పట్టణాల్లో సైతం కాంటాక్ట్‌లెస్ డెలివరీలను అందించేందుకు వీలుగా వాట్సాప్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాయి. మా కిరాణా దుకాణానికి ప్రతిరోజూ 100 మంది కస్టమర్లు వస్తారు. లాక్‌డౌన్‌కు ముందు కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఫోన్ పేలో చెల్లించేవారు. ఇప్పుడు డెబిట్ కార్డు, గూగుల్‌పే, క్యూడర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. కనీసం 80 మంది ఈ తరహా చెల్లింపులే చేస్తున్నారు. – మధుసూదన్, కిరాణాదారు, మెదక్ పరిశుభ్ర వాతావరణం, ఇంటి పక్కనే ఉండటం, డిజిటల్ లావాదేవీలు చేస్తుండటం, ఎమ్మార్పీ ధరలకే విక్రయాలతో కిరాణా దుకాణాల్లోనే వస్తువులు కొనుగోలు చేస్తున్నా. సూపర్ మార్కెట్ల వైపు చూడటమే మరిచిపోయా. – రామ్మూర్తి, సంగారెడ్డి -
నగదు లేకున్నా ఆర్టీసీలో ప్రయాణం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి పైలెట్ ప్రాజెక్టును ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు విజయవాడలో బుధవారం ప్రారంభించారు. దానిలో భాగంగా ఆర్టీసీ వైఎస్ చైర్మన్, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఛలో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. 2.5 లక్షల ప్రయాణికులకు ఛలో యాప్ ఉపయోగకరంగా మారనుంది. యాప్‌తో పాటు స్మార్ట్ కార్డులను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. టిమ్ మిషన్ ద్వారా స్మార్ట్ కార్డులను ఉపయోగించకోవచ్చని ఆర్టీసీ ఎండీ ప్రతాప్ తెలిపారు. ప్రయోజనాలివి.. చిల్లర సమస్య ఎదురుకాదు. ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది. నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయొచ్చు. ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉటుంది. -
పైరవీలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న ఈ శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దళారులు, పైరవీకారుల ప్రభావం శాఖపై లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ విషయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. ఈసీల జారీ నుంచి నగదు రహిత లావాదేవీల అమలు వరకు జరుగుతున్న సమూల మార్పు లు శాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇక అంత వీజీ కాదు గతంలో ఫలానా భూములకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (సీసీ)ల జారీ అడ్డగోలుగా జరిగేది. ఒక్క చలానా మీదనే పలు ఈసీలు, సీసీలు తీసుకునే వెసులుబాటుండేది. కానీ, ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురావడం ద్వారా ఈ విధానానికి చెక్ పెట్టారు. ఈసీ లేదా సీసీ కావాలంటే చలానా నెంబర్‌ను ఆన్లైన్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్రిజిస్ట్రార్ల లాగిన్ ద్వారానే వీటిని జారీ చేస్తున్నారు. దీంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. దీనికితోడు డాక్యుమెంట్ రైటర్ల ప్రభావం శాఖ పనితీరుపై పడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్రయ, విక్రయ లావాదేవీల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి డాక్యుమెంట్ల స్కానింగ్ ప్రక్రియలో ఆటోమేటెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగు డాక్యుమెం ట్లను మాత్రమే స్కానింగ్ వరుసలో ఉంచి వాటి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే మరో డాక్యుమెంట్‌కు అవకాశం లభించే విధానాన్ని తీసుకువచ్చారు. తద్వారా డాక్యుమెంట్ రైట ర్లు, శాఖ సిబ్బంది తమ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్లను వెనుకా ముందు చేసే ఆస్కారం లేకుండా పోయింది. దీనికి తోడు స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చిన లావాదేవీలను బుకింగ్ కన్ఫర్మ్ అయిన రోజు మధ్యాహ్నం ఒంటిగంటలోపే రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ తర్వాతే మాన్యువల్‌గా వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీంతో దాదాపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పైరవీలకు ఆస్కారం లేకుండా పోయింది. వచ్చే నెల డబ్బులతో పనికాదు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ టి.చిరంజీవులు ఆదేశాలతో సంయుక్త ఐజీ వి.శ్రీనివాసులు పర్యవేక్షణలో మరో కీలక నిర్ణయాన్ని కూడా అమలు చేయనున్నారు. ఈ జూన్ మాసం నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యా లెట్ యాప్‌ను రూపొందించే పనిలో పడ్డారు. ఈ యాప్ ద్వారానే మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.1000లోపు విలువైన లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగనుంది. మొత్తంమీద ఇటీవల కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అమలవుతున్న సంస్కరణలు శాఖ పనితీరును మెరుగుపర్చడంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేస్తుండటం గమనార్హం. మార్పు ఇలా.. డాక్యుమెంట్ల స్కానింగ్‌లో అటోమేటెడ్ విధానంతో దళారులు, డాక్యుమెంటు రైటర్ల ప్రభావం లేకుండా మార్పులకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. జూన్ నుంచి పూర్తిగా నగదురహిత లావాదేవీలే నిర్వహిస్తారు. వ్యవహారమంతా ఆన్లైన్లో జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ లాగిన్ ద్వారా సేవలు అందిస్తుండటంతో అడ్డగోలు ఈసీల జారీకి అడ్డుకట్ట పడింది. -
తూనికలు, కొలతల శాఖలో ఆన్లైన్ సేవలు
సాక్షి, హైదరాబాద్: తూనికలు, కొలతల శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేస్తోంది. పలు రకాల సేవలను ఆన్లైన్ పద్ధతిలోకి మారుస్తోంది. నగదు రహిత లావాదేవీలు చేపట్టే దిశగా చర్యలు వేగిరం చేసింది. ప్రస్తుతం తయారీ లైసెన్స్, ప్యాకర్ లైసెన్స్, రిపేరింగ్ లైసెన్స్, లైసెన్స్‌ల రెన్యువల్ వంటి ఇతర సేవలు ఆన్లైన్ పరిధిలోకి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా శాఖా ధికారులకు ల్యాప్‌టాప్‌లు సైతం అందిస్తోంది. ఆన్లైన్ సేవల నేపథ్యంలో పలు రకాల ఫీజుల చెల్లింపులు ఇకపై ఆన్లైన్ కానున్నాయి. దీంతో నగదు చెల్లింపులకు అవకాశం లేకుండా, పారదర్శకంగా సేవలందించడం కోసం నగదురహిత లావాదేవీలు చేపట్టబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులకు స్వైపింగ్ మిషన్లు ఇవ్వనుంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో అధికారులు స్టాంపింగ్ ఫీ, పెనాల్టీలను నగదు రూపంలో తీసుకొని మాన్యువల్‌గా రసీదులు ఇచ్చేవారు. ఇక నుంచి ఈ లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. శాఖలోని ఉన్నతస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ లావాదేవీలను పర్యవేక్షించనున్నారు. తూనికలు, కొలతల శాఖకు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో తనిఖీలను ముమ్మరం చేసింది. గత 4 నెలల్లో 1,400 కేసులను నమోదు చేసింది. ఈ కేసుల పరిష్కారానికి నూతన విధా నం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్లో యాప్ సహాయంతో డి.డి, ఆన్లైన్ పేమెంట్, ఈ వాలెట్స్ ద్వారా కాంపౌండ్ ఫీజును వసూలు చేయవచ్చు. -
రైల్వే టిక్కెట్ల బుకింగ్‌పై రివార్డ్స్
నగదు రహిత మాధ్యమాల ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు దేశీయ రైల్వే ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలవారీ ట్రావెల్ పాస్‌పై 0.5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేవారికి ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఇదే మాదిరి సౌకర్యాన్ని అన్రిజర్వ్డ్ కేటగిరీలకు విస్తరిస్తోంది. నగదు రహితంగా టిక్కెట్లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ప్యాసెంజర్ ఇన్సూరెన్స్‌ను కూడా రైల్వే అందించనుంది. నగదు లావాదేవీలను తగ్గించడానికి తమవంతు సహకరిస్తున్నామని, ఇప్పటికే ప్రయాణికులకు పలు ప్రోత్సాహకాలను ప్రారంభించినట్టు రైల్వే బోర్డు మెంబర్-ట్రాఫిక్ మహ్మద్ జంషెడ్ చెప్పారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే ప్రయాణికులకు సర్వీసు ఛార్జీలను రద్దు చేయడంతో, దేశీయ రైల్వే ఇప్పటికే రూ.400 కోట్లను కోల్పోయింది. ప్రస్తుతం 60 శాతం లావాదేవీలు నగదురహితంగానే జరుగుతున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయి. 2016 నవంబర్‌కు ముందు వరకు చాలా డిజిటల్ లావాదేవీలు ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా జరిగేవి. డిమానిటైజేషన్ తర్వాత రైల్వే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను టిక్కెట్ కౌంటర్ల వద్ద అందించింది. అంతేకాక డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా చెల్లింపులను అంగీకరిస్తోంది. 15వేల టిక్కెట్ కౌంటర్లలో పీఓఎస్ మిషన్లను రైల్వే అందించింది. మొత్తం చెల్లింపుల్లో 85-90 శాతం నగదురహితంగా జరగాలని దేశీయ రైల్వే టార్గెట్‌గా పెట్టుకుంది. -
జూన్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు
► పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందే ► జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు కనబరిచిన పాతపట్నం చౌకధర దుకాణ డీలర్ కోట్ని శ్రీరామచంద్ర గుప్తకు శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో 8 లక్షల 50 వేల రేషన్ కార్డుదారులు ఉండగా లక్షా 30 వేల మంది నగదు రహిత లావాదేవీలను నిర్వహించారన్నారు. ఇందుకు సహకరించిన సీఎస్డీటీలు, రేషన్ డీలర్లను జేసీ అభినందించారు. రేషన్ డీలర్ల కోసం కంట్రోల్ రూమ్‌ను (08942–240563) ఏర్పాటుచేశామని, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తెరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించా రు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా జిల్లాలో ఒకరికి రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా పాతపట్నానికి చెందిన రేషన్ డీలర్ కోట్ని శ్రీరామచంద్ర గుప్తాకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. మండలస్థాయిలో ఏడుగురికి సెల్ఫోన్లు పంపిణీ చేయనున్నామని చెప్పారు. ఇటీవల విద్యార్థి సేవలో రెవెన్యూ శాఖ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, సుమారు 30వేల మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారని జేసీ వివరించారు. ఆదివారం జరగనున్న పల్స్‌పోలియోపై రేషన్ డీలర్లు కూడా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నగదు రహిత ప్రతిభా పురష్కార గ్రహీత కోట్ని శ్రీరామచంద్ర, మండలస్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన రేషన్ డీలర్ సంజీవరావుకు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావు, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మేరీ సగారియా, శ్రీకాకుళం, పాలకొండ ఆర్డీఓలు బి.దయానిధి, ఆర్.గున్నయ్య, తహసీల్దార్లు, సీఎస్డీటీలు తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహితం.. మంచిదే!
పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి దేశంలో నగదు లావాదేవీల స్వరూపమే మారిపోయింది. సామాన్యులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడుతున్నారు. దీంతో మున్ముందు నగదురహిత లావాదేవీల ప్రాధాన్యం మరింత పెరగనుంది. సాధారణంగా ఆర్థికాంశాలన్నీ ఎక్కడో ఒక దగ్గర పన్నులతోనే ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పన్నులకు సంబంధించి నగదురహిత లావాదేవీల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియజేసే ప్రయత్నమే ఈ కథనం. ఆదాయ పన్ను చెల్లింపులు పెరుగుతాయి నగదు రహిత లావాదేవీలన్నీ బ్యాంక్ ఖాతాలతో లింక్ అయి ఉండటం వల్ల లావాదేవీల మూలాలను ఇట్టే గుర్తించవచ్చు. కాబట్టి ఎవరూ కూడా తమ ఆదాయాలను దాచి పెట్టే అవకాశం ఉండదు. పైగా ప్రతి ఒక్కరి అకౌంటును పాన్, ఆధార్ నంబరుతో అనుసంధానం చేయడం వల్ల ఎవరిదగ్గర ఎంత మొత్తం ఉందన్నది సులువుగా కనిపెట్టేయొచ్చు. కనుక.. ఆదాయాన్ని తక్కువ చూపించడం, తక్కువ ఆదాయ పన్ను కట్టడం వంటివి కుదరవు. దీంతో.. మరింత మంది ప్రజలు వాస్తవంగా కట్టాల్సినంత పన్ను కట్టక తప్పదు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల చెల్లింపుల పెరుగుదల వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా.. కంపెనీలు, కార్పొరేట్లు నిర్వహించే ఆర్థిక లావాదేవీల్లోనూ డీమోనిటైజేషన్ పారదర్శకత పెంచింది. నగదు లావాదేవీల పరిమాణం తగ్గింది. కార్డు లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు పెరిగాయి. ఇది ఆయా కంపెనీల అకౌంటింగ్ పుస్తకాల్లో కూడా పారదర్శకత పెరిగేందుకు దోహదపడుతుంది. ఆ రకంగా అవి వాస్తవంగా కట్టాల్సినంత ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్నులు కూడా కచ్చితంగా కడతాయి. ఈ పన్ను చెల్లింపులు పెరుగుతాయి. భవిష్యత్‌లో పరోక్ష పన్నుల తగ్గుదల అక్రమంగా డబ్బు కూడబెట్టడాన్ని నిరోధించడం, పన్ను చెల్లింపుదారులు నిజాయితీగా తమ ఆదాయాలను వెల్లడించి.. కట్టాల్సిన పన్నులు కట్టేలా చూడటమే డిజిటల్, నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఆదాయ పన్నుల చెల్లింపులు పెరిగే కొద్దీ ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతాయి. దీంతో మనం కొనుగోలు చేసే వస్తువులు, సర్వీసులపై చెల్లించే పరోక్ష పన్నుల వడ్డింపు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రజల్లో ఖర్చు చేసే సామర్థ్యాలు కూడా కొంత పెరగవచ్చు. పన్ను మినహాయింపులు నగదురహిత లావాదేవీలను ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం.. పలు సర్వీసులపై చార్జీలు మొదలైన వాటికి మినహాయింపులు ప్రకటించింది. రూ. 2,000 దాకా చెల్లింపులు కార్డు ద్వారా చేస్తే సర్వీస్ ట్యాక్స్ మినహాయింపునిస్తోంది. అలాగే నెట్ బ్యాంకింగ్ లేదా కార్డుల ద్వారా రైలు టికెట్లు, హైవే టోల్, పెట్రోల్.. డీజిల్ మొదలైనవాటికి చెల్లింపులు చేస్తే కనిష్టంగా 0.5 శాతం మేర లావాదేవీ మొత్తంపై డిస్కౌంటు ప్రకటించింది. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు ఆన్లైన్లో ప్రీమియం చెల్లిస్తే కొంత డిస్కౌంటు ఉంటోంది. సింహభాగం నగదు వాడకమే ఉన్న దేశం.. రాత్రికి రాత్రే నగదురహిత లావాదేవీలకు మారిపోవడం అంత సులభమైన వ్యవహారమేమీ కాదు. ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ.. అంతా సర్దుకునేందుకు కాస్త సమయం పడుతుంది. దైనందిన జీవితంలోని ఇతరత్రా లావాదేవీలతో పాటు పన్నులు కూడా సామాన్య ప్రజానీకానికి చాలా ప్రాధాన్యమైన అంశమే. ఎందుకంటే ఖర్చు చేయగలిగేంత నగదు చేతిలో ఉండటమనేది ... పన్నులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఏదైతేనేం..క్యాష్‌లెస్ లావాదేవీల వల్ల చోటు చేసుకునే అత్యంత కీలకమైన పరిణామం ఏదైనా ఉందంటే.. అది ఆదాయ పన్నుల వసూళ్లు పెరగడమే. భవిష్యత్‌లో పన్నులు తగ్గేందుకు, కొనుగోలు శక్తి పెరిగేందుకు ఇదే దోహదపడే అవకాశం ఉంది. -
రూ.10 నాణాలపై వదంతులు నమ్మొద్దు
నాణాలు తీసుకోకపోతే సమాచారం ఇవ్వండి పథకాల లబ్ధిదారులకు ప్రోత్సాహం అవసరం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): రూ.10 నాణాలను రద్దు చేసినట్టు వస్తున్న వదంతులు నమ్మొద్దని, ఇందులో వాస్తవం లేదని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్ని రకాల నగదు లావాదేవీల్లోను రూ.10 నాణాలను అనుమతిస్తారని, ఎక్కడైనా అనమతించకపోతే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, అధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బ్యాంకుల ప్రతినిధులు మాట్లాడుతూ గతంతో పోల్చితే ఆర్బీఐ నుంచి నోట్ల సరఫరా తగ్గిందని, ఇందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనేదే ప్రధాన లక్ష్యం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకుల మధ్య సమన్వయం ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా కృషి చేయాలని సూచించారు. పింఛన్లు, పౌర సరఫరా, ఉపాధి హామీ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ శత శాతం చేయాలని, ఈ అంశంపై బ్యాంకర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకూ ఆధార్ సీడింగ్ కాని సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను బ్యాంకర్లకు అందజేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నైట్ షెల్టర్ల నిర్వహణ మెరుగుపరచాలి నగరంలో ప్రస్తుతం నడుస్తున్న ఆరు నైట్ షెల్టర్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని జీవీఎంసీ అధికారులు, నిర్వహణ సంస్థలను కలెక్టర్ ఆదేశించారు. నిరాదరణకు గురై రోడ్లపై తిరిగే నిరాశ్రయులను గుర్తించి ఆయా కేంద్రాల్లో చేర్చాలన్నారు. కేంద్రాల్లో ఉన్న వారికి ఆధార్, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. నగరంలో మరో ఎనిమిది నైట్ షెల్టర్ల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ భవనాలను గుర్తించాలన్నారు. ఎకనమిక్ సిటీ ఒప్పందాలను అమల్లోకి తేవాలి ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో నగరంలో ఎకనమిక్ సిటీల ఏర్పాటుపై చేసుకున్న ఎనిమిది ఒప్పందాలను సత్వరమే అమల్లోకి తెచ్చేందుకు అధికారులు, బిల్డర్లు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ అంశంపై కలెక్టర్ సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరసమైన గృహాల పథకాన్ని అనుసంధానిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలకే ఇళ్ల నిర్మాణం జరిపేందుకు ఈ ఎకనమిక్ సిటీల ప్రతిపాదన జరిగిందన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 డి.వెంకటరెడ్డి, ఎల్డీఎం శరత్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహితం అంతంత మాత్రమే
► డల్‌గా..డిజిటల్ టాన్సాక్షన్ ► సైబర్‌నేరగాళ్ల భయంతో వెనకడుగు.. ► ఏప్రిల్ 1 నుంచి క్యాష్‌లెస్ సాధ్యమేనా? రాజంపేట: జిల్లాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ డల్‌గానే కొనసాగుతోంది. నగదు లావాదేవీల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి నాటికి డిజిటల్ లావాదేవీలు తగ్గినట్లు రిజర్వుబ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వా త నగదు ఉపసంహరణ పరిమితిలో సడలింపుల వల్ల మార్కెట్లో డబ్బు అందుబాటులో ఉంటోంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం గత ఏడాది నవంబరులో 675.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. డిసెంబరు 957.5, ఈ ఏడాది జనవరిలో 870.4 మిలియన్లు, ఫిబ్రవరిలో 537.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది డిసెంబరుతో పోలీస్తే జనవరిలో 87.1 మిలియన్ల మేర లావాదేవీల్లో తగ్గుదల ఉంది. నగదు అందుబాటులో..: జిల్లాలో వ్యాపార కేంద్రాలైన కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల పరిధిలో నగదు అందుబాటులో ఉండటంతో డిజిటల్ లావాదేవీలు తగ్గిపోయాయి. గత ఏడాది నవంబరులో నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద పెద్దనోట్లు ఉన్నా అవి చిత్తు కాగితాలుగా మిగలడంతో బ్బం దులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ దశలో నగదు రహితంపై ప్రభుత్వంపై దృష్టి సారిం చింది. దాదాపు జిల్లాలో 25 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు చేసే స్ధాయికి వెళ్లింది. ప్రచారం చేసినా స్పందనేది..: నగదు రహితలావాదేవీలపై విద్యార్ధులతో ప్రచారం..ప్రతిరోజు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించిన ప్రజల నుంచి స్పందన లేదరు. డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ చార్జి మినహాయించినా ప్రజలు, వ్యాపారుల నుంచి నిరాస్తకత కనిపిస్తోం ది. డిజిటల్ లావాదేవీల పెంపునకు ఎపీ పర్స్ అనే యాప్‌ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. లక్షకుపైగా డౌన్‌లోడ్‌తో 3.2 స్టార్ రేటింగ్‌తో ఇది కొనసాగుతోంది. చౌక దుకాణాల్లో రేషన్‌ను పూర్తి స్ధాయిలో నగదు రహితంగా అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు, ఆధార్‌తో అనుసంధానం కాకపోడవం, డీలర్ల ఖాతాలు కూడా అనుసంధానం కాకపోవడం, సాప్ట్వేర్, సర్వర్ సమస్యలతో ఇది పూర్తిగా అమలులోకి రాలేదు.ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీలు నిర్వహించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం కష్టమేనని పలువురు అంటున్నారు. సైబర్ నేరగాళ్ల భయంతోనే..: పెద్దనోట్లు రద్దు చేశాక నగదు రహిత లావాదేవీలు కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. 75శాతం అక్షరాస్యత దాటని మనదేశంలో ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై పూర్తి స్ధాయిలో అవగాహన లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్‌నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బు జమ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని, స్వైపింగ్ బాగోతం గోరుచుట్టుపై రోకలిపోటుగా తయారైందని సామాన్య ప్రజలు, వ్యాపారులు అంటున్నారు.చిరు వ్యాపారులు చేసుకొనేవారికి వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. -
మొబైల్ య్యాప్ ద్వారా నగదురహిత లావాదేవీలు
హిందూపురం అర్బన్ : స్వైపింగ్ మిషన్ల ఉత్పత్తి కొరత ఉన్నందున మొబైల్లోనే బీమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా నగదు రహిత లావాదేవీలు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. లేబర్‌వార్డు, చిన్నపిల్లల వార్డుతో పాటు, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరత ఉన్నందున కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేయడానికి కృషి చేస్తామన్నారు. హంద్రీ-నీవా పూర్తయితే నీటికొరత లేకుండా చూస్తామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ వారితో సంప్రదించి రక్త ప్యాకెట్ల కొరత లేకుండా చూస్తామన్నారు. త్వరలోనే తూమకుంట పారిశ్రామివాడ సందర్శించి ప్రభుత్వానికి నివేదికలు పంపి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు జేఈ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణమ్మ పాల్గొన్నారు. -
బాసరలో నగదు రహిత లావాదేవీలు
- ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నగదు రహిత లావాదేవీలకు నూతన సంవత్సరం ఆరంభం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచే ప్రారంభించనున్నారు. రూ. 1000, రూ.500 నోట్ల రద్దుతో బాసరలోని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని విభాగాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని కౌంటర్లలో స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర కొరత సైతం ఈ మిషన్ల ఏర్పాటు తో తీరనుంది. కాగా, ఆలయంలో స్వీపర్, ఉద్యోగులు, అర్చకులు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 180 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. 30 నిమిషాలు ఆలస్యమైతే గైర్హాజరుగా నమోదు అవుతుందని ఈఓ తెలిపారు. -
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
మార్కాపురం: పీఓఎస్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా సూచించారు. పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, ట్రేడ్ లైసెన్స్‌దారులు, వర్తక సంఘాల సమాఖ్య, మెప్మా సిబ్బందికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవటం వలన కలిగే ఉపయోగాలు వివరించారు. పేటీఎం సిబ్బందిచే యంత్రాలు ఉపయోగించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ డానియేల్ జోసఫ్, ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన మండలంలోని చింతగుంట్ల గ్రామంలో శనివారం నాబార్డు ఆర్ధిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు బ్యాంక్‌లు, ఏటీఎంల చుట్టూ తిరగకుండా మొబైల్ ఫోన్‌తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. మొబైల్ వ్యాలెట్ గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ సిబ్బంది కాశయ్య ఉన్నారు. -
స్వైప్ రిజర్వేషన్
కాజీపేట రైల్వేస్టేషన్లో ప్రారంభం నగదు రహిత లావాదేవీల్లో ముందడుగు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి స్వైప్ మిషన్ ఈ–పాయింట్ సిస్టంను రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్ వైజర్ ఐఎస్ఆర్.మూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ స్వైప్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వీసా కార్డు, రూపే కార్డు, మ్యాస్ట్రో, మ్యాస్టర్ డెబిట్ కార్డులు ఇందులో స్వైప్ చేయవచ్చని, ఈ సౌకర్యం కేవలం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికుల మాత్రమేనని తెలిపారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్లలో ఈ స్వైప్ సర్వీస్ విధానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సజ్జన్‌లాల్, సిబ్బంది పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలపై సీఎం సమీక్ష
హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకుల పనితీరు సంస్థాగతంగా మెరుగుపడాలని ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గం తర్వాత మొత్తం జిల్లాను నగదు రహిత లావాదేవీల జిల్లాగా మార్చాలన్నారు. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్టుగా స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకు అధికారులకు సూచించారు. మొబైల్ యాప్‌ల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో స్వైప్ మిషన్లు వినియోగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా ఆర్టీసీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
'నగదు రహితం దేవుడికే సాధ్యం కాదు'
సిద్దిపేట: నగదు రహిత లావాదేవీలను నడపడం దేవుడి వల్ల కూడా సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనే నగదు రహితం సాధ్యం కాలేదని అలాంటిది తెలంగాణా ముఖ్యమంత్రి రాష్ట్రంలో వంద శాతం నగదు రహితం చేస్తామనడం విడ్డూరమన్నారు. అమెరికాలో-41 శాతం, చైనాలో-10 శాతం, సింగపూర్‌లో-60 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు నడుస్తున్నాయని అలాంటిది మన దేశంలో పూర్తిస్థాయిలో చేస్తానంటున్న ప్రధాని అవగాహన రాహిత్యం అన్నారు. మోదీ కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెడ్ వేసి సామాన్యులను రోడ్డు పాలు చేస్తున్నారని చాడ మండిపడ్డారు. -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు విధివిధానాల కోసం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహిత విధానంలోనే చేపట్టాలని నిశ్చయించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించాలని సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. ఇక కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త భూసేకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు సభ ముందుకు రానుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం ఆర్థికశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. -
నగదు రహిత లావాదేవీలే నిర్వహించాలి
న ల్లగొండ టూటౌన్ :అందరూ నగదు రహిత లావాదేవీలు చేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది అలవాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నగదు రహిత నోడల్ అధికారుల బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలపై కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని, ప్రణాళికలో రూపొందించిన అంశాల ప్రకారంగా ముందుకు పోవాలన్నారు. అధికారులు, బ్యాంకర్లతో తరుచూ గ్రామాన్ని సందర్శించాలన్నారు. బ్యాంకు ఖాతాలేని వారిని గుర్తించి ఖాతాలు ఓపెన్ చేయించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ఖాతాదారులను గుర్తించి ఉపయోగంలోని తేవాలన్నారు. ప్రతి ఇంటికి, ఖాతాదారునికి ఏటీఎం, డెబిట్‌కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చురుకై న యువతీ, యువకులను గుర్తించి మొబైల్ లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతంలోని దుకాణాలలో స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో తేవాలన్నారు. ఉపాధిహామీ చెల్లింపులు, అన్ని నగదు రహితంగా జరిగేందుకు చర్యలు, ప్రైవేటు సంస్థలైన కిరాణషాపులు, జనరల్ స్టోర్స్, మెడికల్ షాపులు, ఎరువుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా కమిటీ సభ్యులు చ ర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, పీడీ హౌ సింగ్ రాజ్‌కుమార్, తదితరులున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలి జిల్లాలో రోడ్డు, భవనాల శాఖా ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించి నిర్దేశించిన కాలపరిమితి మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. శుక్రవారం రోడ్లు,భవనాల శాఖ ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కాంట్రాక్టర్లు పనిచేయకపోతే నోటీసులతో కాలం వృథా చేయవద్దని, వెంట నే కాంట్రాక్టు రద్దు చేయాలన్నారు. కాం ట్రాక్టుల సహాయాధికారిగా పనిచేసే అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. తప్పులు చేస్తే ఎవరూ ఆదుకోరన్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతు సందర్భంలో సూచికబోర్డులను పెట్టాలని, కొన్ని బ్రిడ్జిలు ప్రమాదాలుజరిగే విధంగా ఉన్నందున ఆ బ్రిడ్జిలపై దృష్టి సారించాలని, కోర్టు కేసులు ఉన్న పక్షంలో తన దృష్టికి తేవాలని సూచించారు. సిబ్బం దికి ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఈఈ, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పెరిగిన నగదు రహిత లావాదేవీలు
ముంబై : పాత పెద్ద నోట్ల రద్దు వల్ల నగరంలోని 250 పెట్రోల్ బంక్‌ల వద్ద నగదు రహిత లావాదేవీలు జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో 16 నుంచి 18 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు జరిగేవి. కానీ ఇప్పుడు వీటి సంఖ్య 60 శాతానికి చేరుకుంది. పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సగటు విక్రయ చార్ట్ లో పొందుపర్చిన వివరాల మేరకు.. పాత పెద్ద నోట్లు రద్దుకు ముందు ప్రతి పెట్రోల్ బంక్ వద్ద 652 నుంచి 700 మంది వినియోగదారులు నగదు రహిత పేమెంట్‌ను చెల్లించేవారు. సదరు వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం రోజుకు ప్రతి పెట్రోల్ బంక్‌లో 2,400కు పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్‌ల వద్ద నగదు రహిత లావాదేవీలు ఒక్కసారిగా పెరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అసోసియేషన్ అధ్యక్షులు రవి శిండే చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం నగర వాసులను క్రెడిట్, డెబిడ్ కార్డులను ఎక్కువగా ఉపయోగించే విధంగా ప్రేరేపించిందని తెలిపారు. అంతేకాకుండా పాత పెద్ద నోట్లను రద్దు చేసిన మొదటి వారంలో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిందని శిండే తెలిపారు. ఈ సమయంలో తమ విక్రయాలు కూడా 70 శాతం పెరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీ, ఇతర వాహనాలు తమ వద్దకు రూ.500, రూ.1,000 నోట్లతో వచ్చేవారని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్‌లకు మొదటి రెండు మూడురోజుల్లోనే రూ.63 కోట్లు అదనంగా విక్రయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓ పెట్రోల్ బంక్ యజమాని ఒకరు మాట్లాడుతూ.. ఈ-వాలెట్ కంపెనీలతో కూడా సంబంధాలు ఏర్పర్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నామన్నారు. -
ప్రజలను సన్నద్ధం చేయండి
నగదు రహిత లావాదేవీలపై జిల్లా కలెక్టర్లకు నీతి ఆయోగ్ సీఈవో ఆదేశం సాక్షి,హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలను సన్నద్ధం చేయాలని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. నగదురహిత లావాదేవీల నిర్వహణలో దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు డిజిటల్ లావాదేవీలు నిర్వహించేలా సిద్ధం చేయాల్సిన అతిపెద్ద చాలెంజ్ అని, దీన్ని ప్రజా ఉద్యమంగా మలచినప్పుడే విజయవంతం అవుతుందన్నారు. తహశీల్దార్ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ-సేవా కేంద్రాలు, కమర్షియల్ బ్యాంకుల మేనేజర్లు, తహశీల్దార్లతో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి డివిజన్లో వందమంది వ్యక్తులకు లింకప్ చేసేలా 20 మంది వ్యాపారులను వారంలోగా గుర్తించాలన్నారు. ప్రీపెయిడ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్, ఆధార్ లింక్ చెల్లింపులు, మొబైల్ యాప్ చెల్లింపులపై చర్చించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీఆర్వో కిరణ్ కుమార్, అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, ఎన్ఐసీ ఆఫీసర్ భద్రయ్య పాల్గొన్నారు. -
ఫలితమేంటి?
-
ఎస్సెమ్మెస్ ద్వారా లావాదేవీలు
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): ఎస్ఎంఎస్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఎస్ఎంఎస్ ద్వారా ట్రాన్సాక్షన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 99 శాతం మంది ప్రజలకు సెల్‌ఫోన్స్ ఉన్నాయన్నారు. ఎస్ఎంఎస్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసే విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలన్నారు. ముందు మీరు అవగాహన చేసుకుని అనంతరం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండలానికి ఒక గ్రామంలో ఒక పర్యాయం ఎస్ఎంఎస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలన్నారు. అక్కడ జరిగిన లోపాలను సవరించుకుని ప్రతి గ్రామంలోనూ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఽ పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): జిల్లాలోని ప్రతి మండలంలోను నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగళాలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 27వ తేదీన స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10.30 నుంచి 1.00 గంట వరకు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు తహసీల్దార్లు, ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డీఆర్డీఏ ఏపీఎంలు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, స్వయం సహాయక సంఘాల లీడర్లు, డ్వామా సిబ్బంది ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. డెబిట్, రూపే కార్డులు, స్వైపింగ్ మిషన్లపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జన్‌ధన్ అకౌంట్లు రన్నింగ్‌లోకి తీసుకురావాలన్నారు. షాపింగ్‌మాల్స్, వ్యాపారసంస్థలు, పెట్రోలు బంకులు, కూరగాయల మార్కెట్లలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై శిక్షణ పొందిన వారితో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన 46 గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల్లోని కంప్యూటర్ అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అధికారుల ప్రతిజ్ఞ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికారులందరిచేత కలెక్టర్ ముత్యాలరాజు ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్లో డీఆర్ఓ మార్కండేయులు ఉద్యోగులఽతో ప్రతిజ్ఞ చేయించారు. కాగా సౌదీఅరేబియాలో గుండెపోటుతో మరణించిన శోభన్‌బాబు భార్య, పిల్లలు కలెక్టర్‌ను జీవనోపాధి కల్పించమని కోరారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి, డ్వామా పీడీ హరిత, డీఈఓ మువ్వా రామలింగం పాల్గొన్నారు. -
బ్యాంక్ ఖాతాదారులకు టెల్కోల ఊరట
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ కారణంగా టెలికాం సంస్థలు వినియోగదారులకు మరో వెసులుబాటును కల్పించాయి. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో డిసెంబర్ 31 దాకా మొబైల్ బ్యాంకింగ్ పై వసూలు చేసే చార్జీలను రద్దు చేసింది. ఏ అదనపు ఖర్చు లేకుండా ఫీచర్ ఫోన్ల లో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజలకు మరింత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మూడు ప్రధాన టెలికాం కంపెనీలు అంగీకారం తెలిపినట్టు వరుస ట్వీట్లలో వెల్లడించారు. ముఖ్యంగా యూఎస్ఎస్డీ చార్జీలుగా పిలువబడే మొబైల్ బ్యాంకింగ్ సేవలను టెలికాం ఆపరేటర్లు ఉచితంగా అందించనున్నట్టు ట్వీట్ లో తెలిపారు. సామాన్యులకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యం, కరెన్సీ కష్టాలను తగ్గించడంకోసం డిసెంబర్ 31, 2016 వరకు ఈ చార్జీలను రద్దుచేయడానికి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. డీమానిటైజేషన్ సమయంలో వినియోగదారుల సౌలభ్యంకోసం అన్ని ఎస్ఎస్డి ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చార్జీలను డిసెంబర్ 31 వరకు మాఫీ చేసినట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈమేరకు వోడాఫోన్ ఇండియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ కూడా ఒక ప్రకటన చేశారు. మరోవైపు ట్రాయ్ కూడా షార్ట్ కోడ్ మెసేజ్ చార్జీలను కూడా భారీగా కోత పెట్టనుంది. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 31 తరువాత ఈ చార్జీలను గరిష్టంగా 50పైసలు వసూలు చేయనున్నట్టు ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. 3/ telecom operators have decided to waive off charges for mobile banking services till 31st December 2016.@DoT_India — Manoj Sinha (@manojsinhabjp) November 22, 2016 -
క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించండి
బ్యాంక్ కరస్పాండెంట్లుగా రేషన్ డీలర్లు బ్యాంకుల వద్ద క్యూలను తగ్గించండి కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితరాలను క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో వివిధ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిందన్నారు. ఈ ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వ్యాపార సంస్థ వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్ టికెట్లు రద్దు చేసేలా ఉన్నతాధికారులతో చర్చించాలన్నారు. బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూఽలో ఉండకుండా ప్రత్యామ్నాయమార్గాలు చూపాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి రూపే కార్డులు పంపిణీ చేయాలన్నారు. దేవాలయాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో నగదు లెక్కించి బ్యాంకుల్లో జమ చేయాలని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా విత్తనాలు, ఎరువులు పాత నోట్లతో సరఫరా చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతూ చౌకదుకాణాల డీలర్లను బ్యాంక్ కరస్పాండెంట్లుగా(బీసీ) ప్రభుత్వం నియమించిందన్నారు. చౌకదుకాణాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 24 వరకు పాత నోట్లతో ఎరువులు, విత్తనాలు ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లతో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని జేసీ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు పాత కరెన్సీ నోట్లను తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో జేసీ 2 రాజ్‌కుమార్, ఏఎస్పీ శరత్‌బాబు, ఎల్డీఎం వెంకట్రావు పాల్గొన్నారు. -
చేతిలో డబ్బు లేకున్నా మెట్రోలో ప్రయాణం
ముంబై: బ్యాంకు ఎకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే చాలు.. చేతిలో డబ్బు లేకున్నా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ముంబై మెట్రో బుధవారం నగదు రహిత ఆన్లైన్ టికెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా ఎకౌంట్లో నుంచి డబ్బు చెల్లించి సింగిల్, రిటర్న్ జర్నీ మెట్రో రైలు టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) మొబైల్ వాలెట్ పేటీఎంతో ఒప్పందం చేసుకుంది. పేటీఎం యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని దీని ద్వారా ముంబై మెట్రో రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా టికెట్ బుక్ చేసినపుడు రైల్వే స్టేషన్ కౌంటర్లోని ఉద్యోగికి ఎస్ఎంఎస్ వెళ్తుంది. పేటీఎం, మొబైల్ ఫోన్, కౌంటర్లలో ఒకే ట్రాక్షన్ ఐడీ కనిపిస్తుంది. ఇది మ్యాచ్ అయిన తర్వాత టికెటింగ్ ఆఫీసర్ టోకన్ మంజూరు చేస్తాడు. కొన్ని సెకన్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎంఎంఓపీఎల్ అధికారి చెప్పారు.