సాక్షి, హైదరాబాద్: తూనికలు, కొలతల శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేస్తోంది. పలు రకాల సేవలను ఆన్‌లైన్ పద్ధతిలోకి మారుస్తోంది. నగదు రహిత లావాదేవీలు చేపట్టే దిశగా చర్యలు వేగిరం చేసింది. ప్రస్తుతం తయారీ లైసెన్స్, ప్యాకర్ లైసెన్స్, రిపేరింగ్ లైసెన్స్, లైసెన్స్‌ల రెన్యువల్ వంటి ఇతర సేవలు ఆన్‌లైన్ పరిధిలోకి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా శాఖా ధికారులకు ల్యాప్‌టాప్‌లు సైతం అందిస్తోంది. ఆన్‌లైన్ సేవల నేపథ్యంలో పలు రకాల ఫీజుల చెల్లింపులు ఇకపై ఆన్‌లైన్ కానున్నాయి.
దీంతో నగదు చెల్లింపులకు అవకాశం లేకుండా, పారదర్శకంగా సేవలందించడం కోసం నగదురహిత లావాదేవీలు చేపట్టబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులకు స్వైపింగ్ మిషన్లు ఇవ్వనుంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో అధికారులు స్టాంపింగ్ ఫీ, పెనాల్టీలను నగదు రూపంలో తీసుకొని మాన్యువల్‌గా రసీదులు ఇచ్చేవారు. ఇక నుంచి ఈ లావాదేవీలన్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.
శాఖలోని ఉన్నతస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ లావాదేవీలను పర్యవేక్షించనున్నారు. తూనికలు, కొలతల శాఖకు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో తనిఖీలను ముమ్మరం చేసింది. గత 4 నెలల్లో 1,400 కేసులను నమోదు చేసింది. ఈ కేసుల పరిష్కారానికి నూతన విధా నం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్‌లో యాప్ సహాయంతో డి.డి, ఆన్‌లైన్ పేమెంట్, ఈ వాలెట్స్ ద్వారా కాంపౌండ్ ఫీజును వసూలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment