
నగదు రహిత లావాదేవీలపై సీఎం సమీక్ష
హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై సీఎం కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకుల పనితీరు సంస్థాగతంగా మెరుగుపడాలని ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గం తర్వాత మొత్తం జిల్లాను నగదు రహిత లావాదేవీల జిల్లాగా మార్చాలన్నారు.
వినియోగదారుల డిమాండ్కు తగ్గట్టుగా స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకు అధికారులకు సూచించారు. మొబైల్ యాప్ల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో స్వైప్ మిషన్లు వినియోగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా ఆర్టీసీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.