ప్రజలను సన్నద్ధం చేయండి
ప్రజలను సన్నద్ధం చేయండి
Published Fri, Dec 2 2016 1:29 AM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM
నగదు రహిత లావాదేవీలపై జిల్లా కలెక్టర్లకు నీతి ఆయోగ్ సీఈవో ఆదేశం
సాక్షి,హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలను సన్నద్ధం చేయాలని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. నగదురహిత లావాదేవీల నిర్వహణలో దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు డిజిటల్ లావాదేవీలు నిర్వహించేలా సిద్ధం చేయాల్సిన అతిపెద్ద చాలెంజ్ అని, దీన్ని ప్రజా ఉద్యమంగా మలచినప్పుడే విజయవంతం అవుతుందన్నారు. తహశీల్దార్ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని సూచించారు.
ఈ-సేవా కేంద్రాలు, కమర్షియల్ బ్యాంకుల మేనేజర్లు, తహశీల్దార్లతో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో వందమంది వ్యక్తులకు లింకప్ చేసేలా 20 మంది వ్యాపారులను వారంలోగా గుర్తించాలన్నారు. ప్రీపెయిడ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్, ఆధార్ లింక్ చెల్లింపులు, మొబైల్ యాప్ చెల్లింపులపై చర్చించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీఆర్‌వో కిరణ్ కుమార్, అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, ఎన్‌ఐసీ ఆఫీసర్ భద్రయ్య పాల్గొన్నారు.
Advertisement