ఎస్సెమ్మెస్‌ ద్వారా లావాదేవీలు | Awareness should be created on cashless transactions | Sakshi
Sakshi News home page

ఎస్సెమ్మెస్‌ ద్వారా లావాదేవీలు

Published Sun, Nov 27 2016 11:50 PM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM

ఎస్సెమ్మెస్‌ ద్వారా లావాదేవీలు - Sakshi

ఎస్సెమ్మెస్‌ ద్వారా లావాదేవీలు

  • కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు
  • నెల్లూరు(పొగతోట):
    ఎస్‌ఎంఎస్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ట్రాన్సాక‌్షన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 99 శాతం మంది ప్రజలకు సెల్‌ఫోన్స్‌ ఉన్నాయన్నారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా ట్రాన్సాక‌్షన్స్‌ చేసే విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలన్నారు. ముందు మీరు అవగాహన చేసుకుని అనంతరం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండలానికి ఒక గ్రామంలో ఒక పర్యాయం ఎస్‌ఎంఎస్‌ ట్రాన్సాక‌్షన్స్‌ నిర్వహించాలన్నారు. అక్కడ జరిగిన లోపాలను సవరించుకుని ప్రతి గ్రామంలోనూ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఽ పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement