
'నగదు రహితం దేవుడికే సాధ్యం కాదు'
సిద్దిపేట: నగదు రహిత లావాదేవీలను నడపడం దేవుడి వల్ల కూడా సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనే నగదు రహితం సాధ్యం కాలేదని అలాంటిది తెలంగాణా ముఖ్యమంత్రి రాష్ట్రంలో వంద శాతం నగదు రహితం చేస్తామనడం విడ్డూరమన్నారు.
అమెరికాలో-41 శాతం, చైనాలో-10 శాతం, సింగపూర్‌లో-60 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు నడుస్తున్నాయని అలాంటిది మన దేశంలో పూర్తిస్థాయిలో చేస్తానంటున్న ప్రధాని అవగాహన రాహిత్యం అన్నారు. మోదీ కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెడ్ వేసి సామాన్యులను రోడ్డు పాలు చేస్తున్నారని చాడ మండిపడ్డారు.