
సాక్షి, హైదరాబాద్: కేం ద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందని సీపీఐ కార్య దర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చేసిన అనేక వాగ్దానాల అమల్లో మోదీ విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనే ది లేకుండా చేసేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం పాలు చేస్తున్నారన్నారు. బుధవారం మఖ్దూంభవన్‌లో జరిగిన మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో చాడ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా డీజీ సాయిల్‌గౌడ్‌ను నిర్ణయించారు. కేశవరం, ఏదులాబాద్ ఎంపీటీసీ స్థానాలకు పోటీచేయాలని నిర్ణయించారు.