నగదు రహిత లావాదేవీలే నిర్వహించాలి
Published Sat, Dec 10 2016 2:45 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM
న ల్లగొండ టూటౌన్ :అందరూ నగదు రహిత లావాదేవీలు చేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది అలవాటు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నగదు రహిత నోడల్ అధికారుల బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలపై కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని, ప్రణాళికలో రూపొందించిన అంశాల ప్రకారంగా ముందుకు పోవాలన్నారు. అధికారులు, బ్యాంకర్లతో తరుచూ గ్రామాన్ని సందర్శించాలన్నారు. బ్యాంకు ఖాతాలేని వారిని గుర్తించి ఖాతాలు ఓపెన్ చేయించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ఖాతాదారులను గుర్తించి ఉపయోగంలోని తేవాలన్నారు.
ప్రతి ఇంటికి, ఖాతాదారునికి ఏటీఎం, డెబిట్‌కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చురుకై న యువతీ, యువకులను గుర్తించి మొబైల్ లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతంలోని దుకాణాలలో స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో తేవాలన్నారు. ఉపాధిహామీ చెల్లింపులు, అన్ని నగదు రహితంగా జరిగేందుకు చర్యలు, ప్రైవేటు సంస్థలైన కిరాణషాపులు, జనరల్ స్టోర్స్, మెడికల్ షాపులు, ఎరువుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా కమిటీ సభ్యులు చ ర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, పీడీ హౌ సింగ్ రాజ్‌కుమార్, తదితరులున్నారు.
పనుల్లో నాణ్యత పాటించాలి
జిల్లాలో రోడ్డు, భవనాల శాఖా ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించి నిర్దేశించిన కాలపరిమితి మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. శుక్రవారం రోడ్లు,భవనాల శాఖ ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కాంట్రాక్టర్లు పనిచేయకపోతే నోటీసులతో కాలం వృథా చేయవద్దని, వెంట నే కాంట్రాక్టు రద్దు చేయాలన్నారు. కాం ట్రాక్టుల సహాయాధికారిగా పనిచేసే అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. తప్పులు చేస్తే ఎవరూ ఆదుకోరన్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతు సందర్భంలో సూచికబోర్డులను పెట్టాలని, కొన్ని బ్రిడ్జిలు ప్రమాదాలుజరిగే విధంగా ఉన్నందున ఆ బ్రిడ్జిలపై దృష్టి సారించాలని, కోర్టు కేసులు ఉన్న పక్షంలో తన దృష్టికి తేవాలని సూచించారు. సిబ్బం దికి ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఈఈ, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Advertisement