
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో భూ ప్రక్షాళన, గొర్రెల పంపిణీ కార్యక్రమాలు బాగా చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్‌ను అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా భూ ప్రక్షాళన, గొర్రెల పంపిణీలో ముందంజలో ఉందని కలెక్టర్‌ను ప్రశంసించారు. అలా గే కొత్త గ్రామ పంచాయతీల జాబితాను వచ్చే వారంలోగా తయారు చేసి పంపాలని ఆదేశించారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్స్, ఇతర పరికరాల కోసం జిల్లా కలెక్టర్‌కు రూ.1.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సాదాబైనామా దరఖాస్తులను మార్చి 11లోగా పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల కుటుం బ, ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టాలని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకాలకు వర్తింపు జేయాలని సూచించారు. మార్చి 11 నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment