రిజర్వేషన్లపై కలెక్టరేట్ల ముట్టడి భగ్నం | bjp dharna at collectarates | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై కలెక్టరేట్ల ముట్టడి భగ్నం

Published Mon, Apr 17 2017 3:32 PM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM

bjp dharna at collectarates

నల్గొండ: మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడిని.. పోలీసులు భగ్నం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, నల్లగొండ బీజేపీ అధ్యక్షుడు నూకల నర్సింహ్మారెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలెక్టరేట్‌ గేట్‌ ముందే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కాస్త తోపులాట జరిగింది.
 
రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు మొట్టికాయలేసినా.. కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని ఆయన అన్నారు. అరెస్టైన నాయకులు, కార్యకర్తలను పీఎస్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement