చేతిలో డబ్బు లేకున్నా మెట్రోలో ప్రయాణం
ముంబై: బ్యాంకు ఎకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంటే చాలు.. చేతిలో డబ్బు లేకున్నా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ‍్చు. ముంబై మెట్రో బుధవారం నగదు రహిత ఆన్‌లైన్ టికెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ ద్వారా ఎకౌంట్‌లో నుంచి డబ్బు చెల్లించి సింగిల్, రిటర్న్ జర్నీ మెట్రో రైలు టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) మొబైల్ వాలెట్ పేటీఎంతో ఒప్పందం చేసుకుంది.
పేటీఎం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని దీని ద్వారా ముంబై మెట్రో రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా టికెట్ బుక్ చేసినపుడు రైల్వే స్టేషన్ కౌంటర్‌లోని ఉద్యోగికి ఎస్‌ఎంఎస్ వెళ్తుంది. పేటీఎం, మొబైల్ ఫోన్, కౌంటర్‌లలో ఒకే ట్రాక్షన్ ఐడీ కనిపిస్తుంది. ఇది మ్యాచ్ అయిన తర్వాత టికెటింగ్ ఆఫీసర్ టోకన్ మంజూరు చేస్తాడు. కొన్ని సెకన్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎంఎంఓపీఎల్ అధికారి చెప్పారు.