
క్యాష్‌లెస్ లావాదేవీలు ఇలా..
మొబైల్ వాలెట్లు
జేబులో ఉన్న పర్సు మొబైల్ ఫోన్‌లోకి మారితే దాన్ని మొబైల్ వ్యాలెట్ అనవచ్చు. సొమ్మును బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ రూపంలో మొబైల్ అప్లికేషన్‌లోకి బదలారుుంచుకుని వాడుకునేందుకు వీలు కల్పించే సౌకర్యం ఇది. క్రెడిట్ కార్డులతో కూడా మొబైల్ వాలెట్లలో డిజిటల్ నగదు చేర్చుకోవచ్చు. పేటీఎం, ఫ్రీచార్జ్, మొబీక్విక్ వంటివి మొబైల్ వ్యాలెట్లలో కొన్ని. మీరు ఉపయోగించే మొబైల్ వ్యాలెట్ ఆధారంగా మీకు అందే సేవలు ఉంటారుు.
ప్లాస్టిక్ మనీ
క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను ప్లాస్టిక్ నగదు లావాదేవీలుగా పరిగణిస్తారు. బ్యాంకులు, కొన్ని ఇతర సంస్థలు ఈ కార్డులు జారీ చేస్తారుు. ఆన్‌లైన్‌లోనూ వీటిని తీసుకోవచ్చు, రీచార్జ్ చేసుకో వచ్చు కూడా. పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) యంత్రాలు ఉన్న చోట్ల వీటిని స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
నెట్ బ్యాంకింగ్
మొబైల్ వ్యాలెట్ల అవసరం లేకుండా నేరుగా ఇంటర్నెట్‌లో ఆయా బ్యాంకు ఖాతాల ద్వారా అన్ని రకాల సేవలు పొందేందుకు వీలు కల్పించేది నెట్ బ్యాంకింగ్. కంప్యూటర్ల ద్వారా, స్మార్ట్‌ఫోన్ల ద్వారా కూడా నెట్ బ్యాంకింగ్ నిర్వహించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు (సొంత ఖాతా లేదా ఇతరుల ఖాతా దేనికై నా సరే) నగదు బదిలీ చేయవచ్చు. ఇందుకు మూ డు పద్ధతులున్నారుు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్‌స ట్రాన్‌సఫర్ (నెఫ్ట్ - అధిక మొత్తాల బది లీకి) వీటిల్లో ఒకటి. రెండోది రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్ - తక్కువ మొత్తాల బదిలీకి), మూడోది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్ - తక్షణ బదిలీ కోసం). ఈ మూడు పద్ధతుల ద్వారా నగదు బదలారుుంపులకు అయ్యే ఖర్చు ఐదు రూపాయల నుంచి రూ. 55 వరకూ ఉంటుంది.