దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్‌లైన్ సేవలు ఈ నెలలో రెండు వేర్వేరు తేదీల్లో కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ మరోసారి మెయింటెనెన్స్ షెడ్యూల్ ను ప్రకటించడంతో పలు కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.
(అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన ప్రకారం.. బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లను జూన్ నెలలో రెండు వేర్వేరు తేదీలలో అప్‌గ్రేడ్ చేయనుంది. దటి షెడ్యూల్ మెయింటెనెన్స్ జూన్ 9న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండో మెయింటెనెన్స్ జూన్ 16న ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు నాలుగు గంటల పాటు ఉంటుంది. ఈ కాలంలో పలు సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.
ప్రభావితమయ్యే సేవలు ఇవే..
» ఖాతా సంబంధిత సేవలు
» డిపాజిట్లు
» నిధుల బదిలీలు (ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్)
» అకౌంట్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్స్
» ఎక్స్‌టర్నల్/మర్చంట్ చెల్లింపు సేవలు
» ఇన్‌స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్
» యూపీఐ చెల్లింపులు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత మే 25న కూడా బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో సహా చాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ మెయింటెనెన్స్‌తో పాటు యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్‌లోనూ బ్యాంక్ మార్పులు చేసింది. జూన్ 25 నుంచి రూ .100 కంటే తక్కువ విలువ యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లను బ్యాంక్ కస్టమర్లకు పంపదు. అయితే రూ.100, అంతకంటే ఎక్కువ విలువ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment