
దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వినియోగదారులు యూపీఐ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సుమారు 79 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. 19 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారు. మరో 2 శాతం ఫిర్యాదులు UPI ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను నివేదించారు.
యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్‌పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.
ఇదీ చదవండి: తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీ
స్పందించిన ఎన్‌పీసీఐ
కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లావాదేవీలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎన్‌పీసీఐ ట్వీట్ చేసింది.
NPCI is currently facing intermittent technical issues, leading to partial UPI transaction declines. We are working to resolve the issue, and will keep you updated.
We regret the inconvenience caused.— NPCI (@NPCI_NPCI) April 12, 2025