server down
-
టీజీబీపాస్ సర్వర్‌డౌన్.. వీకెండ్స్‌లోనే ఎందుకిలా?
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్లు, భవనాల నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ తదితర అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన సింగిల్‌విండో సాంకేతిక వ్యవస్థ టీజీబీపాస్ శుక్రవారం మరోసారి స్తంభించింది. దీంతో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పనులు నిలిచిపోయాయి. ఫైళ్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. వివిధ రకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. టీజీబీపాస్లో సర్వర్‌డౌన్ కావడం వల్లనే సమస్యలు తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హెచ్ఎండీఏ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.మరోవైపు ఇళ్లు, భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయలేకపోయారు. పలు కన్సల్టెన్సీల్లో సైతం పనులు నిలిచిపోయాయి. టీజీబీపాస్లో తరచుగా సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సకాలంలో ఫైళ్లను పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఎండీఏలోని ఘట్కేసర్, మేడ్చల్–1, మేడ్చల్–2, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2 జోన్లలో ప్రతి రోజు వివిధ రకాల అనుమతుల కోసం సుమారు 100 వరకు వస్తాయి. ప్రణాళికా విభాగంలోని వివిధ స్థాయిల్లో ఈ ఫైళ్లను పరిశీలించి, చివరకు కమిషనర్ ఆమోదంతో అనుమతులు అందజేస్తారు.చదవండి: హైదరాబాద్‌లోనే ఎక్కువ.. సూపర్ పవర్! ఫైళ్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కోసం చర్యలు చేపట్టారు. 10 రోజుల్లోనే దరఖాస్తుదారులకు అనుమతులను అందజేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. కానీ తరచుగా తలెత్తే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఆటంకం కలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీకెండ్స్‌లోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పలువురు దరఖాస్తుదారులు చెప్పారు. టీజీబీపాస్ సర్వర్‌డౌన్ కావడంతో హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, నగర శివార్లలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అనుమతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. -
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. విశాఖ, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులకు టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/విశాఖ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్య కాస్తా ఎయిర్‌లైన్స్ సర్వర్లపై ప్రభావం చూపించడంతో పలు విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి.కాగా, విశాఖలో ఎయిర్ లైన్స్‌లో సాంకేతిక సమస్య కారణంగా విమానాల ఆపరేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో, ఎయిర్‌పోర్టు సిబ్బంది మాన్యువల్‌గా బోర్డింగ్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు రద్దీ పెరిగింది. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.ఇదిలా ఉండగా.. ఇటు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సర్వర్‌లో టెక్నికల్ సమస్య కారణంగా దాదాపు 35 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు సంబంధించిన డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో అధికారులు మాన్యువల్‌గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక, వివిధ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గన్నవరంలో ఇదీ పరిస్థితి..మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో గన్నవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గన్నవరం నుండి ప్రతీరోజూ 23 విమాన సర్వీసులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంతో 13 సర్వీసులు మాత్రమే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయి. మరో ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులో ఇదే పరిస్థితి ఉంది. గన్నవరంలో టికెట్ కౌంటర్లో ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడం నిలిపివేయడం జరిగింది. మాన్యువల్‌గా బోర్డింగ్ పాస్ ఇచ్చి ప్రయాణికులను పంపిస్తున్నామని తెలిపారు. -
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలు కొన్ని గంటలుగా నిలిచిపోయాయి. ఆధార్‌కు సంబంధించిన విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సర్వర్ మొరాయించింది. దీంతో ఆధార్ సంబంధిత ఓటీపీలు, ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడింది.ఆధార్ డౌన్లోడ్, ఇతర సేవల కోసం యూఐడీఏఐ వెబ్సైట్లో ప్రయత్నిస్తుంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తోందని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. బ్యాంకులు, రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో ఆధార్ అనుసంధానిత సేవలకు సంబంధించి ఓటీపీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. #Aadhaar #gvt must if time internal server Error why? When we need that time sooing now a days pic.twitter.com/rs1LDr7GhA— dipullb comedyn (@SinhaDipu59035) July 11, 2024 -
TS: బీసీలకు ఆర్థిక సాయం.. గడువు ముగుస్తోంది.. దరఖాస్తు ఎలా?
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన కులవృత్తుల కుటుంబాల్లో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని తలపెట్టారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, నివాస, ఆహార భద్రత తదితర ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్ లోడ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు విధించడంతో అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ► గడచిన వారం రోజులుగా ఖైరతాబాద్, షేక్‌పేట మండల కార్యాలయాలకు బీసీ కులవృత్తుల అర్హులు ధ్రువపత్రాల కోసం బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం కింద సుమారు లక్ష మంది అర్హులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ధ్రువీకరణ పత్రం మంజూరయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుండటంతో లబి్ధదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ►దరఖాస్తు చేసుకునేందుకు ఆహార భద్రతా కార్డులు తప్పనిసరి చేయడంతో నాలుగేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు కానివారంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇలా నష్టపోతున్నవారిలో సుమారు 50 వేల మంది వరకు అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ► దీనికి తోడు సర్వర్ డౌన్ మరింత తీవ్ర సమస్యగా మారింది. అసలే గడువు సమీపిస్తున్నదని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా మూడు రోజులుగా సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీని వల్ల మండల కార్యాలయాల్లో పత్రాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. దళారులను ఆశ్రయిస్తున్న వైనం... ►నిబంధనల ప్రకారం నూతన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచాలని సూచించడం, గడువు తేదీ సమీపిస్తుండటంతో చాలా మంది లబ్ధిదారులు వీటిని పొందేందుకు పక్కదారులు చూస్తున్నట్లు సమాచారం అందుతున్నది. ► దరఖాస్తుదారుల స్థోమతను బట్టి కొంత మంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మీసేవా కేంద్రాల్లో ఈ పత్రాలు అప్లోడ్ చేసేందుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు. ► లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మీ సేవా కేంద్రాలు అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఎలాంటి నిఘా లేకపోవడంతో సమస్య రోజురోజుకు జఠిలమవుతూ లబి్ధదారులు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది. గడువు పెంచాలి:నాయీ బ్రాహ్మణ సేవాసంఘం రహమత్‌నగర్: బీసీ చేతి వృత్తులవారికి ప్రభుత్వం అందించే రూ. లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు గడువును పెంచాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయీ మాట్లాడుతూ... దరఖాస్తు చేసేందుకు ఈ నెల 20వ తేదీన ఆఖరి కావడంతో కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం చేతి వృత్తుల వారు తహసీల్దార్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారన్నారు. విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కులవృత్తుల వారు దరఖాస్తుల చేస్తుండటంతో మీ సేవ సర్వర్ పనిచేయక జాప్యం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు నిరుపేదలు చాలా మందికి రేషన్ కార్డులేక పోవడంతో ఆర్థిక సాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించి, రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన మినహాయించాలని ఆయన కోరారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సత్యనారాయణ, రహమత్‌నగర్ సత్యనారాయణ, కృష్ణానగర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
EPFO: పెన్షనర్లు ఆగ్రహం.. నాలుగు నెలలని వారంలోనే ముగింపా?
సిరిపురం మాధవరావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసి.. 2013 మేలో పదవీ విరమణ పొందారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడే అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చారు. అయితే ఈపీఎఫ్ఓ అధికారులు దానిని తిరస్కరించడంతో సాధారణ పెన్షన్ పొందుతున్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరిగి అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, కొన్నిసార్లు ఓపెన్ అయినా వివరాలు నమోదు చేసేటప్పుడు స్తంభించిపోవడం ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంతలో గడువు ముగిసింది. దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్ల విషయంలో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)’తీరుపై పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు, ఆప్షన్ నమోదులో గందరగోళం, త్వరగా గడువును ముగించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ పొందినవారు దరఖాస్తు చేసుకోలేక నష్టపోయామని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ తాత్సారం, సర్వర్ సమస్యతోపాటు నమోదు విషయంలో అవగాహన లోపంతో జాయింట్ ఆప్షన్ ఇవ్వలేకపోయామని అంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాము చేసేదేమీ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఈపీఎఫ్ఓ చందాదారులు, పెన్షనర్లకు సంబంధించి అధిక పెన్షన్ అమలుపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 4న తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి నాలుగు నెలల పాటు దరఖాస్తులకు గడువు ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 3వ తేదీ వరకు గడువును నిర్దేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన ఈపీఎఫ్ఓ.. చాలా తాత్సారం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 20న దీనిపై ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అంతేకాదు దరఖాస్తులు, జాయింట్ ఆప్షన్‌కు సంబంధించిన లింకును మరో ఐదురోజులు ఆలస్యంగా 25వ తేదీన అందుబాటులోకి తెచ్చింది. మార్చి 3వ తేదీతో గడువు ముగియనుండగా.. కేవలం వారం రోజుల ముందు మాత్రమే లింకును అందుబాటులోకి తేవడం గమనార్హం. అయితే 2014 సెప్టంబర్ 1 తర్వాత పదవీవిరమణ పొందినవారు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ మరో రెండునెలల పాటు అవకాశం కల్పించింది. వారు మే 3 నాటికల్లా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీనితో వారిలో చాలా మంది అధిక పెన్షన్‌కు దూరమయ్యారు. దేశవ్యాప్తంగా 91,258 దరఖాస్తులే.. 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైనవారిలో దేశవ్యాప్తంగా కేవలం 91,258 మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ ఇవ్వగలిగారు. పేరుకు నాలుగు నెలలు అవకాశం ఇచ్చినా.. సర్క్యులర్ జారీ, ఆన్లైన్ లింకు అందుబాటులోకి తేవడంలో ఈపీఎఫ్ఓ జాప్యం చేసిందని సీనియర్ పెన్షనర్లు మండిపడుతున్నారు. తమకు మరో అవకాశం కల్పించాలంటూ ఈపీఎఫ్ఓకు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్.. అంత ఈజీ కాదు!? -
హజ్ యాత్ర దరఖాస్తుదారులకు ‘సర్వర్ డౌన్’ సమస్య
సాక్షి, సిటీబ్యూరో: 2023 హజ్ యాత్రకు దరఖాస్తుల ప్రక్రియ తీవ్ర అంతరాయాలతో కొనసాగుతోంది. దరఖాస్తులు అప్లోడ్కాక నానా తిప్పలు పడుతున్నారు. ఈ నెల 10న ఆన్లైన్ ద్వారా హజ్ యాత్ర దరఖాస్తుల స్వీకరణ ప్రాంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర హజ్ కమిటీ సర్వర్ డౌన్ చూపుతుండడంతో దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హజ్ కమిటీ యాత్రికుల సౌకర్యార్థం హజ్ హౌస్‌లో ఎనిమిది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సర్వర్ డౌన్ ఉండడంతో ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ కాలేదు. 16వ తేదీ నుంచి దరఖాస్తులు అప్లోడవుతున్నా మధ్య మధ్యలో సర్వర్ పనిచేయడం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దరఖాస్తు కోసం ఓటీపీ వస్తుంది. అయితే సమయానికి ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తు మధ్యలోనే ఆగిపోతుందని యాత్రికులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర హజ్ కమిటీలు సమన్వయంతో స్పందించి దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు. కాగా దీనిపై హజ్‌కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి.షఫీవుల్లా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. గతంలో దరఖాస్తులకు సంబంధించిన సర్వర్ నిర్వహణ కేంద్ర హజ్ కమిటీ ముంబయి అధీనంలో ఉండేదని, ప్రస్తుతం ఎన్ఐసీ డిల్లీ నిర్వహణలోకి మారిందని తెలిపారు. దరఖాస్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సర్వర్ డౌన్ సమస్య ఏర్పడిందని, కేంద్ర హజ్‌కమిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు. -
8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. గత ఎనిమిది రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తోంది. ఎనిమిది రోజులు గడిచినా పరిస్థితి అలాగే కొనసాగుతుండటంతో.. ఢిల్లీకి చెందిన ఇద్దరు విశ్లేకులను సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కింద మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ‘సర్వర్ హ్యాక్ అయిన క్రమంలో శానిటైజింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 50 సర్వర్లలో ఇంతకు ముందు 15 మాత్రమే శానిటైజింగ్ చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 25కు పెంచారు. అలాగే 400లకుపైగా ఎండ్‌పాయింట్ కంప్యూటర్లను స్కాన్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సైతం అప్లోడ్ చేస్తున్నారు.’ అని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. సర్వర్ డౌన్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎయిమ్స్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. సర్వర్లలో ఈ-హాస్పిటల్ డేటా పునరుద్ధరణ చేసినట్లు పేర్కొంది. సేవలను పునరుద్ధరించే ముందు నెట్వర్క్ శానిటైజింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, సర్వర్లు, డేటా ఉండటం వల్ల ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్, ల్యాబ్‌లు వంటి అన్ని సేవలు మాన్యువల్‌గా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసు, ఇంటలిజెన్స్ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), కేంద్ర హోంశాఖలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తు సంస్థల సూచలన మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదీ చదవండి: షాకింగ్:హైస్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్, గర్భనిరోధకాలు..! -
రిస్టోర్ అయిన వాట్సాప్ సేవలు
-
వాట్సాప్ సేవలు పునరుద్ధరణ
భారత్‌తో పాటు పలు దేశాల్లో నిలిచిపోయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 95 నిమిషాల తర్వాత సేవలను పునరుద్ధరించించి మాతృ సంస్థ మెటా. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల యూజర్లు మెసేజ్‌లు పంపేందుకు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత.. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవటం, డబుల్ టిక్, బ్లూటిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో పడ్డారు యూజర్లు. సమస్య తలెత్తిన తర్వాత వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు! -
Whatsapp: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. అయోమయంలో యూజర్లు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో మంగళవారం అంతరాయం ఏర్పడింది. కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించడం లేదు. వాట్సాప్‌లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు. ఇప్పటికే వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్లో వాట్సాప్ యూజర్లు.. ‘వాట్సాప్ డౌన్’ (#Whatsapp Down) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ — Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022 When WhatsApp is Down.#whatsappdown pic.twitter.com/xHgsHd9h8v — ɅMɅN DUВΞY (@imAmanDubey) October 25, 2022 When your WhatsApp is playing up but you come to Twitter and see that everyone else is having the same problem #WhatsAppDown pic.twitter.com/pMcJm0Zn56 — Jamie (@GingerPower_) October 25, 2022 People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU — Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022 చదవండి: షాపింగ్ బంద్, అల్లాడిన యూపీఐ లావాదేవీలు.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
దేశంలో స్తంభించిన ఎస్బీఐ సేవలు..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్, యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్ సేవలు స్తంభించడంపై ఎస్బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తెలంగాణలో భూముల ధరల పెంపు ఎఫెక్ట్.. ‘ధరణి’ డౌన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ‘ధరణి’ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు మీసేవ సెంటర్లలో స్లాట్ బుకింగ్‌లు సైతం నిలిచి పోయాయి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో భూ, ఇతర స్థిరాస్తుల క్రయవిక్రయదారులు తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. 4,5 రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే గురువారం పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఉండ డం, స్లాట్ బుక్‌చేసుకునే వారు సైతం మీసేవ సెంటర్లకు భారీగా తరలిరావడంతో ధరణి సర్వర్‌పై ప్రభావం చూపింది. ఎక్కువ లోడ్ పడడంతో సర్వర్ మొరాయించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6:30 తర్వాత ధరణి వెబ్సైట్ పనిచేయడంతో తహసీల్దార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టగా.. పలు చోట్ల రాత్రి 10:30గంటల వరకు కొనసాగింది. ఒక్కసారిగా పెరిగిన రిజిస్ట్రేషన్లు.. మరో నాలుగు రోజుల్లో వ్యవసాయ, వ్యవ సాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలు వల సవరణ అమల్లోకి రానుండడంతో ఇప్ప టికే భూములు కొనుగోలు చేసుకుని రిజి స్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నవారు మీసేవ సెం టర్లకు పరుగులు పెడుతున్నారు. స్లాట్ బుకిం గ్ల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్, తహసీ ల్దార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. సాధారణ రోజుల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు సుమారు మూడింతలు పెరిగినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు, మూడు రోజులు సైతం ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇదీ పరిస్థితి ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాధారణ రోజుల్లో 500 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి. గురువారం ఒక్కరోజే 1,290 వరకు కావడం విశేషం. ► ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజువారీ 72 స్లాట్లు బుక్ చేస్తుండగా.. అన్ని డాక్యుమెంట్లను అధికారులు రిజిస్ట్రేషన్ చేసేవారు. గురువారం 120కిపైగా స్లాట్లు బుక్కయ్యాయి. ► కరీంనగర్ పట్టణంలో 97 డాక్యుమెంట్లకు సంబంధించి చలాన్లు తీసుకోవడానికి సర్వర్ మొరాయించడంతో సుమారు 60 వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలాగే 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 550 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. దాదాపుగా 145 మీసేవ కేంద్రాల్లోనూ సర్వర్ సమస్యతో స్లాట్ బుక్‌కాలేదు. తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవాంతరాలు ఎదురయ్యాయి. ► వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 30 – 40 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. గురువారం 200కుపైబడి వచ్చాయి. దీంతో రాత్రి 10.30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వం మరింత సమయమివ్వాలి రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలానా తీద్దామని వెళ్తే సర్వర్ మొరాయించింది. మూడు గంటల పాటు ఇబ్బందిపెట్టింది. రేపు చూద్దామని ఇంటికొచ్చేశా. ఆస్తుల విలువలు పెంచేందుకు ప్రభుత్వం మరింత గడువివ్వాలి. ఇలా పెంచుకుంటూ పోతే రిజిస్ట్రేషన్లంటేనే భయపడాల్సిన పరిస్థితి. – వేల్పుల వెంకటేష్, వ్యాపారి, కరీంనగర్ (27ఎంబీఎన్ఆర్ఎల్13) సర్వర్ పనిచేయట్లేదు ఈ రెండ్రోజులు రైతులు, భూ వ్యాపారులు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. రెట్టింపు సంఖ్యలో దరఖాస్తుదారులు ఉండడంతో రిజిస్ట్రేషన్ల సర్వర్ సరిగా పనిచేయట్లేదు. – అశోక్, మీసేవ నిర్వాహకుడు, కోడేరు, నాగర్‌కర్నూల్ (27ఎంబీఎన్ఆర్ఎల్14) -
టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్..!
ప్రముఖ మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ సేవలు నేడు కొద్ది సేపు నిలిచిపోయాయి. మన దేశంలో చాలా మంది ఈరోజు రాత్రి 7 నుంచి యాప్ సేవలను వినియోగించుకోలేక పోతున్నట్లు ట్విటర్ వేదికగా పిర్యాదు చేస్తున్నారు. #TelegramDown అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టెలిగ్రామ్ వినియోగదారులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్ విషయాన్ని డౌన్ డిటెక్టర్ వెబ్ సైటు దృవీకరించింది. టెలిగ్రామ్ యూజర్లు యాప్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "Updating" లేదా "Connecting" అనే మెస్సేజ్ వచ్చినట్లు పేర్కొన్నారు. కంపెనీకి ఈ సమస్య గురించి తెలుసో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. డౌన్ డిటెక్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రకారం.. ప్రస్తుతం యు.ఎస్, యూరప్, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో టెలిగ్రామ్ యాప్ లో అంతరాయం ఏర్పడింది. ఫిలిపెన్స్ దేశంలో మొదట ఈ సమస్య ఏర్పడింది. యాప్ సర్వర్ డౌన్ చాలా మంది యూజర్లు ట్విటర్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. Me switching from Telegram to WhatsApp after #telegramdown pic.twitter.com/rsr9UmeXrU — Anuజ్ఞ (@Anugnareddy11) January 17, 2022 Telegram Showing "Updating"#Telegram#TelegramDown pic.twitter.com/FEhH4ZLr0d — Patel Meet (@mn_google) January 17, 2022 #TelegramDown Telegram Right Now: pic.twitter.com/AVsqTzDGYu — Gyan Prakash (@Gyaaaaani) January 17, 2022 Telegram Down Users be like:#Telegram #telegramdown pic.twitter.com/80rsvliakq — Koushik Yuvaan (@koushi_yuvaan) January 17, 2022 Everyone running to tweeter to check weather Telegram is down or not😂😂#TelegramDown #Telegram pic.twitter.com/mEu0xOZKeb — P R A J J U L L 💜 (@Prajjull) January 17, 2022 (చదవండి: వస్తువులు కొని మోసపోతున్నారా? ఇలా పరిహారం రాబట్టుకోండి) -
మొన్న ఫేస్బుక్ డౌన్..! ఇప్పుడు జీ మెయిల్..!
Gmail Services Down In India: ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో జీమెయిల్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జీమెయిల్ సేవలు డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటలనుంచి జీమెయిల్ సేవలు పనిచేయడం లేదంటూ ట్విటర్ వేదికగా యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! ఊక్లాకు చెందిన డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో సుమారు 68 శాతం మంది యూజర్లు జీమెయిల్ పనిచేయడం లేదంటూ రిపోర్ట్ చేశారు. 18 శాతం యూజర్లు సర్వర్ సమస్యలను, 14 శాతం మంది యూజర్లకు లాగిన్ సమస్యలు తలెత్తిన్నట్లు డౌన్ డిటెక్టర్‌లో వెల్లడించింది. కొంత మంది యూజర్లు #GmailDown పేరిట ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా నిలిచిపోయిన జీమెయిల్ సేవలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. గూగుల్ ఈ సమస్యలకు పరిష్కారం వెంటనే గూగుల్ చూస్తోందని యూజర్లు భావిస్తున్నారు. #gmaildown Sending or receiving mails is being difficult for the past hour. — M.r Kamessh (@Rkamesh97) October 12, 2021 🔔 #Gmail down? 🔗 Real-time status: https://t.co/zJn0p8lynr 🔁 RETWEET if you are affected too.#GmailDown #GmailOutage (Possible problems since 2021-10-12 04:37:05) — Services Down (@servicesdown_) October 12, 2021 చదవండి: ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే...! -
సర్వర్ పరేషాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీకి సర్వర్ అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది. వందల సంఖ్యలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని తీసుకునేందుకు ఎగబడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్వర్ మొరాయిస్తోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా చేరడం, కొన్ని చోట్ల వాగ్వాదానికి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దుకాణాల వద్ద శనివారం సర్వర్ పనిచేయక లబ్ధిదారులు గంటల కొద్దీ బారులు తీరారు. పోర్టబిలిటీ పెరగడంతో.. రేషన్ పంపిణీ మొదలైన ఈ నెల ఒకటవ తేదీ నుంచి శుక్రవారం వరకు 22 లక్షల కుటుంబాలు 88 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నాయి. మొత్తం 87.59 లక్షల కుటుంబాల్లో మూడ్రోజుల్లోనే 25 శాతం తీసుకున్నారు. ఇక శనివారం ఉదయం 5 గంటల నుంచే రేషన్ దుకాణాల వద్ద జనాల రద్దీ కనిపించింది. మల్కాజ్గిరి, ఖైరతాబాద్, కుషాయిగూడ, నాగారం, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి వందల సంఖ్యల్లో కూపన్లు ఉన్నవారు, లేనివారు అంతా దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పంపిణీ గంట సేపు సజావుగా సాగినా, ఆ తర్వాత సర్వర్ పనిచేయకపోవడంతో గందరగోళంగా మారింది. ఒక పది నిమిషాలు పనిచేస్తే, మరో పదిహేను నిమిషాలు సర్వర్ పనిచేయకపోవడంతో లబ్ధి దారులు డీలర్లతో గొడవకు దిగారు. చాటాచోట్ల వెంట తెచ్చుకున్న సరుకులను వరుసల్లో పెట్టేసి ఒకే దగ్గర గుమికూడారు. చాలా చోట్ల వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోలేక నీరసించిపోయారు. శనివారం మధ్యాహ్నానికి 4.50 లక్షల మంది బియ్యం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే ఎక్కువగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సమస్య ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌లో 5.80 లక్షలు, రంగారెడ్డిలో 5.24 లక్షలు, మేడ్చల్‌లో 4.95 లక్షల మంది రేషన్ కార్డుదారులుండగా, వీటికి అదనంగా వివిధ ప్రాంతాల వలసదారులు ఇక్కడే రేషన్ పోర్టబిలిటీని వినియోగించుకోవడంతో సాంకేతిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో సర్వర్ పనిచేయక బియ్యం పంపిణీ నెమ్మదిగా సాగింది. ఖైరతాబాద్‌లోని ఓ దుకాణంలో సర్వర్ సమస్య కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 15 మందికి మాత్రమే బియ్యం పంపిణీ చేయగలిగారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపించడంతో అధికారులు స్టేట్ డేటా సెంటర్ వారితో మాట్లాడి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. టోకెన్ ఉన్నవారే రావాలి: మారెడ్డి సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టోకెన్ తీసుకున్న లబ్ధిదారులు మాత్రమే బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ బియ్యం పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. -
మరోసారి ‘రవాణా’ సర్వర్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ సర్వర్లు సోమవారం నిలిచిపోయాయి. పౌరసేవలు స్తంభించాయి. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రవాణాశాఖ వెబ్సైట్ కూడా పనిచేయలేదు. వివిధ రకాల పౌరసేవల కోసం స్లాట్లు నమోదు చేసుకొని ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన 5 వేలమందికిపైగా వినియోగదారులు గంటల తరబడి పడిగాపులు కాసి తిరిగి వెళ్లిపోయారు. సోమవారం కోసం స్లాట్లు నమోదు చేసుకున్నవాళ్లు మంగళవారం తిరిగి అదేవేళల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. కేవలం వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు రవాణా కార్యకలాపాలు ఆగిపోవడం గమనార్హం. రవాణాశాఖలో విస్తరించిన పౌరసేవలకు అనుగుణంగా హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో మార్పు చేయకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణకు, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయి. లక్ష్యం గొప్పదే... రవాణాశాఖ పౌరసేవలన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ టూటైర్ నుంచి త్రీటైర్‌కు సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. అప్పటివరకు ఎక్కడికక్కడ ఆర్టీఏ కార్యాలయాల్లో అందజేసే పౌరసేవలన్నింటినీ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి అందజేసేవిధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, చిరునామా మార్పు, యాజమాన్య మార్పు, పర్మిట్ల జారీ, పన్నువసూళ్లు వంటి అన్ని రకాల కార్యకలాపాల డేటా ప్రధాన కార్యాలయం నుంచి ప్రాంతీయ కార్యాలయాలకు అందుతుంది. పౌరసేవల అమలును ఏకీకృతం చేసేవిధంగా తెచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం రవాణాశాఖలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని రోజుల్లోనే ఆర్టీఏలో ఆన్‌సేవలు అందుబాటులోకి వచ్చాయి. దళారులను నియంత్రించేందుకు ఇది కొంతవరకు దోహదం చేస్తుందని అధికారులు భావించారు. ఈ లక్ష్యం గొప్పదే అయినా ఆచరణలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయకపోవడమే అందుకు కారణం. సర్వీసులు 63.. సర్వర్లు 2 మొదట్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని పరిమితమైన సర్వీసుల కోసం ఏకీకృతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. కానీ 2010 నుంచి ఇప్పటి వరకు సుమారు 63 రకాల పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అందజేస్తున్నారు. ఆర్టీఏ నుంచి ఎలాంటి సర్వీసు కావాలన్నా ఇప్పుడు ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవలసిందే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు వాహనాల సంఖ్య కోటి దాటింది. రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో కేవలం 2 సర్వర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 టెర్రాబైట్(టీబీ)ల సామర్థ్యంతో పనిచేస్తోంది. వాటిపైన పడుతున్న భారం అంతకు రెట్టింపుగానే ఉంది. ఈ సర్వర్ల సామర్థ్యాన్ని 80 టీబీ నుంచి 150 టీబీకి పెంచాలని అధికారులు ప్రతిపాదించారు, సర్వర్ల సామర్థ్యం పెంపుతోపాటు సాంకేతిక సేవలను మరింత పటిష్టం చేయడం, పాత కంఫ్యూటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం తదితర అన్ని రకాల సాంకేతిక అవసరాల కోసం రూ.26 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, రవాణాశాఖలో సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. -
సర్వర్ డౌన్ : ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిన ప్రయాణీకులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున 12.20 గంటల ప్రాంతంలో ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్ 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. సర్వర్ సమస్యతో ఇమిగ్రేషన్ చెక్ కోసం ప్రయాణీకులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. సర్వర్ సమస్యపై ఎయిర్‌పోర్ట్‌లో బహిరంగ ప్రకటన చేయడంతో పాటు విమానాశ్రయ సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియను చేపట్టారని కొందరు ప్రయాణీకులు వెల్లడించారు. మరికొందరు ప్రయాణీకులు ఇమిగ్రేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొందని ట్విటర్లో ఫిర్యాదు చేయగా, విమానాశ్రయంలో పొడవాటి క్యూలను చూపే ఫోటోలను ట్వీట్ చేశారు. కాగా ఎయిర్ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ ఇటీవల ఐదు గంటల పాటు మొరాయించిన కొద్దిరోజులకే ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం గమనార్హం. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం పట్ల అధికారుల తీరుపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. -
నిలిచిపోయిన ఎయిర్ ఇండియా కార్యకలాపాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా ప్రధాన సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య చోటుచేసుకోవడంతో.. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నిలిచిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సీటా-డీసీఎస్ సిస్టమ్స్ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా అన్ని సర్వీసులకు అంతరాయం కలిగిందని వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించడానికి తమ సాంకేతిక బృందం పని చేస్తోందని.. తొందరలోనే దీనిని పరిష్కరిస్తామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. -
స్తంభించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్
ప్రపంచంలోని పలు దేశాల్లో ఫేస్బుక్ దాని అనుబంధ సంస్థలు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు స్తంభించిపోయాయి. అమెరికా, కెనడా, యూరప్‌లతో పాటు ఇండియాలో కూడా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ డేటా ఆధారంగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల ప్రాంతంలో సేవలు ఆగిపోయాయి. సోషల్ మీడియా సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని తెలియజేశారు. ఫేస్బుక్ వినియోగదారులు లాగిన్‌తోపాటు, పోస్టింగ్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలు/సందేశాలు కనబడకపోవడంతో నెటిజన్లు ఆందోళన చెందారు. వాట్సాప్‌లోనైతే మెసేజ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ట్విటర్‌ను ఆశ్రయించిన నెటిజన్లు ఫేస్బుక్ నువ్వు ఎక్కడికి వెళ్లావు, ఫేస్బుక్ డౌన్.. లాంగ్ లీవ్ ట్విటర్.. అంటూ తమ సమస్యలను షేర్ చేశారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమస్య కొనసాగినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఫేస్బుక్ అధికార ప్రతినిధి జే నాన్కర్రో స్పందిస్తూ.. సమస్య తలెత్తగానే తాము వెంటనే స్పందించామని, వీలైనంత త్వరగా సేవలు పునరిద్ధరించామని తెలిపారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. -
ధరణి సర్వర్ డౌన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల సమగ్ర వివరాల కోసం రూపొందించిన ‘ధరణి’వెబ్సైట్ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఈ వెబ్సైట్ బుధవారం సాయంత్రం నుంచి మొరాయిస్తోందని, పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణకు సహకరించడం లేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఇప్పటికే పాస్‌పుస్తకాల సవరణ విషయంలో జాప్యం జరుగుతుండగా, అధికారికంగా రూపొందించిన వెబ్సైట్ సర్వర్ డౌన్ కావడం రెవెన్యూ వర్గాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన అన్ని మండలాల్లో ఒకేసారి తప్పుల సవరణకు ఉపక్రమించడంతో సర్వర్ డౌన్ అయిందని, దీన్ని వెంటనే పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నత్తనడకన తప్పుల సవరణ ధరణి వెబ్సైట్ ద్వారా పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణల కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వాస్తవానికి, గతనెల 28 నుంచి ఈనెల 3వ తేదీలోపు ఈ తప్పుల సవరణ కార్యక్రమం పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తొలుత ఆధార్ నంబర్ల మార్పులు, డబుల్ ఖాతాల మార్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇచ్చారు. కానీ ఎక్కువ మొత్తంలో నమోదయిన విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లు, పేర్లలో తప్పుల గురించిన ఆప్షన్లు ఇవ్వలేదు. అయితే, సర్వే నంబర్లు, పేర్లలో మార్పులకు సంబంధించిన ఆప్షన్లను గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. కానీ, సర్వర్ డౌన్ కావడంతో ఆ పని కూడా ముందుకు సాగడం లేదు. దీనికి తోడు మరో 10 రకాల తప్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈ ఆప్షన్ల ద్వారా పాస్‌పుస్తకాల్లో తప్పులను సవరించాల్సి ఉంది. కానీ, దశలవారీగా ఇస్తున్న ఈ ఆప్షన్లు క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. అసలే అన్ని ఆప్షన్లు అందుబాటులోకి రాక తిప్పలు పడుతున్న రెవెన్యూ యంత్రాంగానికి ఈ సర్వర్ డౌన్ సమస్య మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుండటం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని రకాల తప్పులకు సంబంధించిన ఆప్షన్లను ఇచ్చి, సర్వర్ సమస్యలు లేకుండా చూస్తేనే ఇంకో రెండు నెలల్లో అయినా తప్పులు లేని పాస్‌పుస్తకాలు రాష్ట్ర రైతాంగానికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పొదుపు డబ్బు కోసం..అష్టకష్టాలు!
బిడ్డల చదువు కోసమో... ఆడబిడ్డ పెళ్లి ఖర్చుకోసమో... అత్యవసర సమయంలో ఆసుపత్రి ఖర్చు కోసమో... అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసిన సిక్కోలు ప్రజలకు మూడేళ్లుగా చిక్కులు మొదలయ్యాయి! గుంటూరులో హాయ్‌ల్యాండ్, వైజాగ్‌లో వేల ఎకరాల భూములు, టేకు తోటలు అంటూ సంస్థ భరోసా ఇవ్వడంతో తాము కష్టపడి సంపాదించినదంతా పెట్టుబడి పెట్టారు! కొంతమంది అప్పులు చేసిమరీ నెలవారీ వాయిదాలు కట్టారు! రెండు దశాబ్దాల పాటు నమ్మకంగా సాగిన వ్యవహారం కాస్త మూడేళ్ల క్రితం నుంచి తిరగబడింది! కొన్ని దుష్టశక్తులు, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థచింతనతో సంస్థ ఆస్తులపై కన్నేయడమే బాధితుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు లాభం వద్దు... తాము పొదుపు చేసిన సొమ్ము అణాపైసలతోనైనా చెల్లించాలని బాధితులు నిరసనలతో రోడ్డెక్కినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధితులకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం కూడా కొరడా ఝుళిపించింది. కానీ బాండ్ల పరిశీలన పేరుతో ప్రభుత్వం ప్రక్రియను సాగదీసే కార్యక్రమం చేపట్టిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో 1,43,643 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని అధికారుల అంచనా. కానీ శుక్రవారానికి కేవలం 33,500 మంది మాత్రమే ఈ పరిశీలన ప్రక్రియ పూర్తి చేయించుకోగలిగారు. తొలుత ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు సీఐడీ అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పుడు మండలాల్లో పోలీసుస్టేషన్లవారీగా పరిశీలన కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పుడు వాటి చుట్టూ జిల్లాలోని ప్రజలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది చివరి నెల వాయిదా చెల్లింపు రసీదులు లేకపోవడం, బ్యాంకు ఖాతా నంబరుతో పాటు పాలసీదారుడు కూడా తప్పనిసరిగా హాజరుకావాలనే నిబంధనలు పెట్ట డంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గంటల తరబడి వరుసలో నిలుచున్నా సర్వర్లు తరచుగా మొరాయిస్తుండటంతో పనిపూర్తి కావట్లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో తమ పాలసీలను నమోదు చేయించుకునేందుకు మూడు నాలుగు రోజుల పనిమానుకొని ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ బాండ్ల వివరాలన్నీ అగ్రిగోల్డ్ సంస్థ వద్ద ఉన్నప్పుడు మళ్లీ ఈ పరిశీలన కార్యక్రమం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఏదోలా కాలం గడిపేయడానికే తప్ప తమకు మేలు జరిగే అవకాశం కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చినా... ప్చ్! ప్రతి మండలంలోనూ పోలీసుస్టేషన్ల పరధిలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన, డిపాజిట్‌దారుల వివరాల నమోదు ప్రక్రియను సీఐడీ అధికారులు చేపట్టారు. ఏయే తేదీల్లో ఏయే గ్రామాల నుంచి అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు రావాలో ముందుగా ప్రకటించారు. జిల్లాలో డిపాజిట్‌దారులు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారే. వారిలో నిరక్షరాస్యులు ఎక్కువమంది ఉండటం, తాము ఎప్పుడు హాజరుకావాలనేదీ సమాచారం లేక స్పష్టత కొరవడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలాల వారీగా తహసిల్దారు కార్యాలయాల వద్ద, పోలీసుస్టేషన్ల వద్ద అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల జాబితా అతికించామని అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ ఆ వివరాలు అర్థం కాకపోతే బాధితులకు వివరించేవారే కరువయ్యారు. తీరా ఎలాగో తెలుసుకొని వచ్చినా ముందు రోజుల్లో ప్రకటించిన గ్రామాల వారి బాండ్ల పరిశీలనే పూర్తికావట్లేదు. సాంకేతిక సమస్యలతో బాధితులు బారులు తీరుతున్నారు. పోలీసుస్టేషన్ల ఆవరణలోనే చెట్ల కింద, షెడ్లలో నీరసంతో కూలబడిపోతున్నారు. చాలాచోట్ల వారిక మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవు. నిబంధనలతో ఇక్కట్లు బాండ్ల పరిశీలనకు కూడా పలు నిబంధనలు విధించడంతో బాధితులకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ చుక్కలను చూపిస్తోంది. డిపాజిట్‌దారుడి ఆధార్‌కార్డులో చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే పరిశీలన చేయించుకోవాలని కొన్ని సెంటర్లలో తిప్పి పంపించేస్తున్నారు. మరికొన్నిచోట్ల అగ్రిగోల్డ్‌కు చెందిన ఏ బ్రాంచిలోనైతే సొమ్ము డిపాజిట్ చేశారో దాని పరిధిలో ఉన్న మండలంలోనే పరిశీలన చేయించుకోవాలని చెప్పడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. తాము ఏజెంట్లకు సొమ్ములు ఇచ్చామే తప్ప బ్రాంచి ఎక్కడో తమకు తెలియదని వాపోతున్నారు. వలసలకు పేరొందిన ఈ జిల్లాలో వెరిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడానికి ఈ నిబంధనలేనన్న విమర్శలు వస్తున్నాయి. తమ ఆధార్‌కార్డుపై ఉన్న చిరునామాకు, తమ సొమ్ము సొమ్ము డిపాజిట్ చేసిన బ్రాంచి చిరునామాకు పొంతన లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. దీనికితోడు బాండ్ల పరిశీలనకు డిపాజిట్దారుడే స్వయంగా హాజరుకావాలన్న నిబంధన కూడా ఇబ్బందిగా మారింది. దీంతో పదేపదే తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. రసీదులు లేనివారికి కష్టాలే బాండ్‌తో పాటు వాయిదా చెల్లింపు చివరి నెల రసీదు కూడా పోలీసులు అడుగుతుండటంతో బాధితులు సమర్పించలేకపోతున్నారు. వారిలో చాలామంది రూ.20 నుంచి రూ.50, రూ.100 వరకూ నెలవారీ వాయిదాలు చెల్లించినవారే ఎక్కువ మంది ఉన్నారు. అదీ చెల్లింపులు జరిగి ఏళ్ల కాలం గడిచిపోవడంతో ఇప్పుడవి తెమ్మంటే ఎలాగని పోలీసుల వద్ద ప్రాథేయపడుతున్నారు. దీనికితోడు ఆ రసీదులు పోగొట్టుకున్నవారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కొంతమంది వద్ద బాండ్లు కూడా ఉండట్లేదు. మరికొంతమంది వాయిదాలు ముగియడంతో బాండ్లను ఏజెంట్లకు అప్పగించేశారు. అవన్నీ అగ్రిగోల్డ్ బ్రాంచిల్లో ఉన్నాయి. వారంతా అసలు బాండ్లను పరిశీలనకు ఇవ్వలేని పరిస్థితి. ఆయా బాండ్ల కోసం ఏజెంట్లను కొంతమంది నిలదీస్తున్నా వారుకూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో తమ వివరాలు ఎలా నమోదు చేయించుకోవాలనీ తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు తాము కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు తమకివ్వడానికి ఇన్ని ఆంక్షలు అవసరమా అని వాపోతున్నారు. -
సర్వర్ డౌన్.. రిజిస్ట్రేషన్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో పాత కష్టాలు తప్పడం లేదు. కొత్త నెట్వర్క్ ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో రెండు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలను సర్వర్ డౌన్ సమస్య వేధిస్తోంది. దీంతో ఈసీలు, రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత కనీసం ఫొటోలు కూడా అప్లోడ్ కావడం లేదని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. సర్వర్ డౌనా.. నెట్వర్క్ అంతరాయమా? రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రోజూ వేలాది రిజిస్ట్రేషన్ లావాదేవీలు నడుస్తాయి. ఇందుకోసం ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్లైన్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవసరమైన అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ నుంచి ఫొటోల అప్లోడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్కానింగ్ వరకు ఈ వ్యవస్థలోనే పనిచేయాలి. అయితే రెండు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయడం లేదు. రాష్ట్ర ఐటీ విభాగం ద్వారా నడుస్తున్న సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అన్ని జిల్లాలకు కలిపి హైదరాబాద్‌లో ఒకటే సర్వర్ ఉందని, సర్వర్‌పై లోడ్ ఎక్కువ కావడంతో సమస్య వస్తోందని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మాత్రం సర్వర్ డౌన్ కాలేదని, కేవలం నెట్వర్క్ సమస్య ఏర్పడిందని గురువారం మధ్యాహ్నానికే సమస్య పరిష్కారం అయిందని స్పస్టం చేస్తున్నారు. కానీ పలు జిల్లాల్లో శుక్రవారం కూడా ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. గురువారం యాదాద్రి జిల్లా పరిధిలోని భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండంటే రెండే రిజిస్ట్రేషన్లు జరిగాయని సమాచారం. కొత్త నెట్వర్క్ ఎప్పుడు? గతంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకే నెట్వర్క్ పరిధిలో ఉండేవి. అయితే తెలంగాణకు ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌లో తలెత్తే ట్రాఫిక్ బిజీని తగ్గించుకోవచ్చని, మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)తో పాటు ఇండియన్ రైల్వేకు చెందిన ఐటీ సంస్థ రెయిల్‌టెల్ ద్వారా కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. అయితే ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకునే మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు గతంలో ఉన్న విధంగా ఏ జిల్లా సర్వర్‌ను ఆ జిల్లాలోనే ఉంచకుండా అన్నింటిని కలిపేయడంతో ఈ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకుంటున్న కొత్త నెట్‌వర్క్‌ను వీలున్నంత త్వరగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. -
సర్వర్ డౌన్..విత్తన పంపిణీకి బ్రేక్
అనంతపురం అగ్రికల్చర్: సర్వర్ డౌన్ కావడంతో ప్రత్యామ్నాయ సాగు విత్తన పంపిణీకి బ్రేక్ పడింది. చాలా చోట్ల బయోమెట్రిక్ మొరాయించడంతో అటు రైతులు, అటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరెండు రోజుల్లో ఓ మోస్తరు విత్తన పంపిణీ చేసినా... మూడో రోజు పంపిణీ దాదాపుగా నిలిచిపోయింది. అనంతపురం, గార్లదిన్నె, ఆత్మకూరు, రొద్దం తదితర మండలాల్లో ఉదయం 8 గంటలకే కౌంటర్ల వద్ద రైతులు బారుతీరి కనిపించారు. ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో వరుసల్లో నిలబడేందుకు ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. సర్వర్ సమస్య గురించి జిల్లా కేంద్రంలో ఉన్న సీడ్సెల్, ఎన్ఐసీ సెంటర్లకు తెలిపినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘ప్రత్యామ్నాయ’ విత్తనాల కోసం వచ్చిన వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. -
సర్వర్ డౌన్
- ‘కానుక’ల పంపిణీలో జాప్యం అనంతపురం అర్బన్ : జిల్లాలో చౌక దుకాణాల్లోని ఈ-పాస్ యంత్రాల సర్వర్ డౌన్ అవడంతో బుధవారం జిల్లాలోని పలు చౌక దుకాణాల్లో సంక్రాంతి కానుకల పంపిణీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచే సంక్రాంతి కానుకల పంపిణీ ప్రారంభించినప్పటికీ సర్వర్ డౌన్ అవుతుండటంతో పంపిణీ ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 11.24 లక్షల మంది బీపీఎల్ కార్డుదారులు ఉన్నారు. ఇందులో 22 వేల మంది ఇప్పటికే క్రిస్మస్ కానుకలు అందుకున్నారు. మిగిలిన 11.02 లక్షల మందికి సంక్రాంతి కానుకలు అందించాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం బుధవారం నాటికి కేవలం 79 వేల మంది కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేశారు. ఎప్పుడొస్తుందో... ఎప్పుడు పోతుందో సర్వర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదని పలువురు డీలర్లు చెబుతున్నారు. ఒక గంట సక్రమంగా పని చేస్తుందని, వెంటనే డౌన్ అయిపోతుందని, ఎప్పుడు వస్తుందో తెలీక ఈ-పాస్ యంత్రాన్ని ముందు పెట్టుకుని కూర్చోవాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతకీ రాకపోతుండటంతో చేసేది లేక మళ్లీ రావాలని లబ్ధిదారులను పంపించి వేస్తున్నామన్నారు. సంక్రాంతి కానుకల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని, ఇక్కడ చూస్తే మూడు రోజులుగా సర్వర్ సతాయిస్తోందని ఆవేదన చెందుతున్నారు. వాస్తవమే సర్వర్ డౌన్ అవుతున్న మాట వాస్తవమే. జిల్లాకు చెందిన సమస్య అయితే వెంటనే పరిష్కరించి ఉండేవాళ్లం. కాకపోతే హైదరాబాద్‌లోని ప్రధాన సర్వరే డౌన్ అవుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృషికి తీసుకెళ్లాము. - ప్రభాకర్‌రావు, డీఎస్ఓ -
ఆ సినిమా దెబ్బకు ’బుక్ మై షో’ సర్వర్ డౌన్!
మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ తాజా సినిమా ‘దంగల్’ శుక్రవారం విడుదల అవుతుండటంతో ఈ సినిమా టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవడానికి జనం పోటెత్తారు. దీంతో ఒక దశలో బుక్ మై షో.కామ్ వెబ్సైట్ సర్వర్ డౌన్ అయి.. క్రాష్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కొంతసేపు వెబ్సైట్ సర్వర్ మొరాయించినట్టు తెలుస్తోంది. దీంతో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కొంతమంది వినియోగదారులకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సినిమాలు, ప్రత్యేక షోల ఈ-టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకొనే సదుపాయన్ని బుక్‌మైషో వెబ్సైట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఇతివృతంతో వస్తున్న ఆమిర్ తాజా చిత్రం ’దంగల్’కు సానుకూల రివ్యూలు పోటెత్తడం, మంచి మౌత్‌టాక్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముంబై, పుణె వంటి నగరాల్లో ఇప్పటికే చాలా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అయిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రారంభ వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ మంచి టాక్‌తో ఈ సినిమా థియేటర్లు ఫుల్ అవుతున్నాయని తెలుస్తోంది. తెలుగులోనూ ’దంగల్’ సినిమా ’యుద్ధం’ పేరిట డబ్ అయింది.