Whatsapp Down-Users Facing Issues Sending Receiving Messages - Sakshi
Sakshi News home page

WhatsApp Down: దేశవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!

Published Tue, Oct 25 2022 1:01 PM | Last Updated on Tue, Oct 25 2022 1:53 PM

Whatsapp Down Users Facing Issues Sending Receiving Messages - Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో మంగళవారం అంతరాయం ఏర్పడింది. కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్‌ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్‌ చూపించడం లేదు. వాట్సాప్‌లో డబుల్‌ టిక్‌ , బ్లూటిక్‌ మార్కులు చూపించడం లేదు.

దీంతో మెసేజ్‌ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు. ఇప్పటికే  వేల మంది వినియోగదారులు వెబ్‌సైట్‌లో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్‌ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్‌లో వాట్సాప్‌ యూజర్లు.. ‘వాట్సాప్ డౌన్’ (#Whatsapp Down) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనిపై ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 
 


చదవండి: షాపింగ్‌ బంద్‌, అల్లాడిన యూపీఐ లావాదేవీలు.. ఏమయ్యా విరాట్‌ కోహ్లీ ఇదంతా నీ వల్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement