న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్‌లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్‌ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు.
ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్‌ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్‌తో మెసేజ్‌ల షేరింగ్‌లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది.
ఏఏ యాప్‌లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్‌ను టెస్ట్‌చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్‌లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment