
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్‌లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. వెంటనే ‘వికసిత్ భారత్’ గంపగుత్త మెసేజ్‌లను వాట్సాప్ ద్వారా పంపడం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనడమే తమ ఉద్దేశమని ఈసీ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రచారం చేయడం నిషేధమని ఈసీ పేర్కొంది.