
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా ప్రధాన సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య చోటుచేసుకోవడంతో.. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నిలిచిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సీటా-డీసీఎస్ సిస్టమ్స్ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా అన్ని సర్వీసులకు అంతరాయం కలిగిందని వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించడానికి తమ సాంకేతిక బృందం పని చేస్తోందని.. తొందరలోనే దీనిని పరిష్కరిస్తామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment