technical snag
-
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
ముంబై: ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో (ఏఐ129) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాన్ని తిరిగి ముంబైకు దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అనంతరం విమానానికి ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.‘ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI129లో సాంకేతిక సమస్య కారణంగా ముంబైకి తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’ అని ఎయిర్ ఇండియా వెల్లడించింది.విమానయాన సంస్థ ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అంతేగాక విమాన టికెట్ రద్దుపై ప్రయాణీకులకు విమాన ఛార్జీల పూర్తి వాపసును కూడా అందించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా సదరు అధికారి పేర్కొన్నారు. -
శ్రీలంక విమానంలో సాంకేతిక లోపం: చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, చెన్నై: శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి కొలంబోకు బయలు దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఈ రోజు (జూలై 15) ఉదయం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణీకులు అంతా క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కొలంబో-చెన్నై విమానం (UL121)లో లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అత్యవసర ప్రోటోకాల్ ప్రకారం రన్‌వే వద్ద విమానాన్ని ల్యాండ్ చేశారని చెన్నై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల చెన్నై నుంచి వచ్చే ఏ ఇతర సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించాయి. కాగా ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక రాజకీయ సంక్షభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ ఆర్థిక మాంద్యంపై సామూహిక నిరసనల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంవిడిచిపోవంతో మరింత తీవ్ర గందర గోళ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. -
నిలిచిపోయిన ఎయిర్ ఇండియా కార్యకలాపాలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా ప్రధాన సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య చోటుచేసుకోవడంతో.. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నిలిచిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సీటా-డీసీఎస్ సిస్టమ్స్ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా అన్ని సర్వీసులకు అంతరాయం కలిగిందని వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించడానికి తమ సాంకేతిక బృందం పని చేస్తోందని.. తొందరలోనే దీనిని పరిష్కరిస్తామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది. -
బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం నిలిపివేత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీ ష్ఎయిర్లైన్స్ విమానంను నిలిపివేశారు. సోమవారం ఉదయం 7గంటలకు బయలుదేరాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానం నిలిచి పోయింది. విమానంలోని 285 మంది ప్రయాణికులను వివిధ హోటళ్లకు తరలించినప్పటికీ ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్నటి నుంచి హోటళ్లలో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నా, బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందించడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. -
పీఎస్ఎల్వీ సీ–41లో సాంకేతిక లోపం
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ సీ–41 రాకెట్ అనుసంధానం పనుల్లో సోమవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తి పీఎస్–2 దశను వెనక్కి తీసుకొచ్చేశారు. రాకెట్ మొదటి దశను (పీఎస్–1) ఇటీవల పూర్తి చేసి రెండో దశను (పీఎస్–2) అనుసంధానం చేసేందుకు సోమవారం లాంచ్ ప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు. పీఎస్–1 నుంచి పీఎస్–2కు కనెక్షన్ ఇచ్చే ఎలక్ట్రానిక్స్ కేబుల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుసంధానాన్ని నిలిపేశారు. -
ట్రూజెట్ విమానానికి తప్పిన ముప్పు
హైదరాబాద్ సిటీ: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ట్రూజెట్ విమానానికి ముప్పు తప్పింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గాల్లోనే 10 నిమిషాలు చక్కర్లు కొట్టింది. అత్యవసరంగా విమానాన్ని పైలట్లు దించివేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో 51 మంది ప్రయాణికులు ఉన్నారు. ముప్పు తప్పడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. -
నిలిచిపోయిన న్యూయార్క్ విమానం
న్యూఢిల్లీ: ఇంజన్లో హైడ్రాలిక్ వైఫల్యం నెలకొనడంతో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం బుధవారం నిలిచిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 300 మంది ప్రయాణికులకు సమీప హోటల్లో బస కల్పించామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. మంగళవారం రాత్రి 1.40 గంటలకు న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా 101 విమానంలో ఈ సమస్య తలెత్తింది. ప్రయాణికులను తీసుకెళ్లడానికి మరో విమానాన్ని సిద్ధం చేయాలని ఎయిరిండియా చేసిన యత్నాలు సఫలం కాలేదు. సమస్యను పరిష్కరించడానికి ఇంజినీర్లు కృషిచేస్తున్నారని, బుధవారం సాయంత్రం 5 గంటలకు విమానం బయల్దేరే అవకాశముందని ఎయిరిండియా అధికారి వెల్లడించారు. -
శంషాబాద్‌లో ఆగిన ఇండిగో విమానం
శంషాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే నిలిచిపోయినట్లు సమాచారం. విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నా ఎయిర్‌లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. ప్రయాణికుల్లో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కేశవరావు ఉన్నారు. -
కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం
జైపూర్: విజయవాడ-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కలకలం రేగింది. ఢిల్లీ విమానాశ్రయంలో కిందకు దిగకుండా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరకు విమానాన్ని జైపూర్ మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఎయిర్ ఇండియా నిపుణులు రంగంలోకి దిగారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఉదయం 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యలతో కొద్ది నిమిషాలకే వెంటనే మళ్లీ ల్యాండయింది. ఆ విమానంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దాంతో ఓ ప్రకటన చేసి, విమానాన్ని మళ్లీ ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో ప్రయాణికులంతా టెన్షన్‌కు గురయ్యారు. అయితే కాసేపటికి విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటుచేస్తామని విమానయాన సంస్థ వర్గాలు అన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆదివారం కూడా తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్యే తలెత్తింది. దాంతో దాన్ని కూడా కొద్దిసేపటికే మళ్లీ ల్యాండ్ చేశారు. సోమవారం ఏకంగా వీఐపీలు ఉన్న విమానంలోనే లోపం రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో
దేశరాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు నరకం చూపించింది. అందులో ఓ సాంకేతిక లోపం తలెత్తడంతో పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడచాయి, చాలా సేపటి పాటు కొన్ని స్టేషన్లలో ఆగిపోయాయి. దాంతో వాటిలో జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా సిటీ సెంటర్ / వైశాలి ప్రాంతానికి వెళ్లే బ్లూలైనులో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. నోయిడా నుంచి బయల్దేరిన ఒక రైలు ద్వారకా సెక్టార్ 14 స్టేషన్ వద్ద ఆగిపోయిందని ఢిల్లీ మెట్రో రైలు అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత రైలును పక్కకు తీసుకెళ్లిపోయి సమీపంలోని డిపోలో మరమ్మతులు చేయించామని, అందులో ఉన్న ప్రయాణికులందరినీ దించేశామని చెప్పారు. అయితే, ప్రయాణికులు చెప్పేది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తాను ఉదయం 9.15 గంటలకు ద్వారకా సెక్టార్ 9 స్టేషన్ వద్ద రైలు ఎక్కానని, అది 10 గంటల వరకు అక్కడే ఉండిపోయిందని, తాను మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆఫీసుకు వెళ్లలేకపోయానని సంగీత అనే ప్రయాణికురాలు చెప్పారు. బ్లూలైన్ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. -
ఇంజన్లో స్క్రూ లూజ్.. వెనుదిరిగిన విమానం
విమానం ఇంజన్లో ఓస్క్రూ లూజ్ అయ్యింది. అయితే సకాలంలో లోపాన్ని గుర్తించి, విమానాన్ని వెనక్కి తిప్పడంతో దాదాపు 175 మంది ప్రయాణికులకు ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఎస్జి-451 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఇంజన్లో సమస్యను గుర్తించిన పైలట్.. దాన్ని సింగిల్ ఇంజన్‌తోనే సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేశారు. మొదటి ఇంజన్‌లోని ఫ్యూయెల్ పంపును ముందురోజు రాత్రి మరమ్మతు చేశారని, ఆ తర్వాత దానికున్న నాలుగు స్క్రూలలో ఒకదాన్ని సరిగ్గా బిగించలేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. దాంతో ఆ విమానానికి మెయింటెనెన్స్ ఇంజనీర్‌గా వ్యవహరించి, సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి అధికారాలను డీజీసీఏ తొలగించింది. ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దాంతో విమానాన్ని వెనక్కి తిప్పి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశామని, తర్వాత వేరే విమానాల్లో వారిని పంపామని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
తెగిపోయిన ఓవర్‌హెడ్‌వైర్
సాక్షి, ముంబై: ముంబై లైఫ్లైన్లుగా పేర్కొనే లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది. ఘాట్కోపర్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం 7.16 గంటలకు ‘స్లో ట్రాక్’పై ఓవర్‌హెడ్ వైర్ తెగిపోయింది. తత్ఫలితంగా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ములూండ్-మాటుంగా రైల్వేస్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు చాలాసేపు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ములూండ్-మాటుంగా రైల్వేస్టేషన్ల మధ్య ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లించి నడిపించారు. దీంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. అయితే అంతా విధులకు వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేకమంది విధులకు ఆలస్యంగా చేరుకోగా మరికొందరు విధులకు వెళ్లకుండానే ఇంటికి వెనుదిరిగారు. మరోవైపు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ఆయా స్టేషన్లలో రద్దీ కనిపించింది. ప్లాట్‌ఫాంలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. సుమారు నాలుగు గంటల అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయినప్పటకీ రైళ్లు సాయంత్రం వరకు ఆలస్యంగానే నడిచాయి. మరోవైపు పలు రైళ్లను రద్దు చేయాల్సివచ్చింది. మరోవైపు అనేకమంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు బెస్టు బస్సులతోపాటు ఆటో ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో బెస్టు సంస్థ కూడా అదనంగా బస్సులను నడిపింది. తత్ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది.