ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో | Snag hits services on Delhi Metro's Blue Line | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో

Sep 17 2014 3:16 PM | Updated on Sep 2 2017 1:32 PM

ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో

ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో

దేశరాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు నరకం చూపించింది.

దేశరాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు నరకం చూపించింది. అందులో ఓ సాంకేతిక లోపం తలెత్తడంతో పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడచాయి, చాలా సేపటి పాటు కొన్ని స్టేషన్లలో ఆగిపోయాయి. దాంతో వాటిలో జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా సిటీ సెంటర్ / వైశాలి ప్రాంతానికి వెళ్లే బ్లూలైనులో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది.

నోయిడా నుంచి బయల్దేరిన ఒక రైలు ద్వారకా సెక్టార్ 14 స్టేషన్ వద్ద ఆగిపోయిందని ఢిల్లీ మెట్రో రైలు అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత రైలును పక్కకు తీసుకెళ్లిపోయి సమీపంలోని డిపోలో మరమ్మతులు చేయించామని, అందులో ఉన్న ప్రయాణికులందరినీ దించేశామని చెప్పారు. అయితే, ప్రయాణికులు చెప్పేది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తాను ఉదయం 9.15 గంటలకు ద్వారకా సెక్టార్ 9 స్టేషన్ వద్ద రైలు ఎక్కానని, అది 10 గంటల వరకు అక్కడే ఉండిపోయిందని, తాను మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆఫీసుకు వెళ్లలేకపోయానని సంగీత అనే ప్రయాణికురాలు చెప్పారు. బ్లూలైన్ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement