న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు కొత్త మెట్రో లైన్లను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెట్రో రైల్ ఫేజ్-4లో భాగంగా ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు, లజపతి నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ వరకు నిర్మాణం చేపట్టనుంది. రూ. 8,339 కోట్లతో ఈ రెండు కొత్త కారిడార్ల నిర్మాణం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమవేశమైన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు 8.4 కి.మీ మెట్రో లైన్ ఎనిమిది స్టేషన్‌లను కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.4 కి.మీ పొడవు ఉంటుందని పేర్కొన్నారు. వీటి మధ్య పది స్టేషన్లు ఉండనున్నట్లు తెలిపారు. మార్చి 29 నాటికి వీటి నిర్మాణం పూర్తవ్వనున్నట్లు చెప్పారు. దీనితో రాజధాని మెట్రో నెట్‌వర్క్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 450 కి.మీకి విస్తరించనుంది.
ప్రధాని మోదీ అధ్యతన సమవేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ టర్మ్‌కు ఇదే చివరి కేబినెట్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
చదవండి: బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం
Comments
Please login to add a commentAdd a comment