న్యూఢిల్లీ: శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల వేళ ఉత్తర ఢిల్లీలోని కిక్కిరిసిన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లింలపై ఒక పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించాడు. రోడ్డు దిగ్బంధం చేయొద్దని తిడుతూ వీరావేశంతో కొట్టడం మొదలెట్టాడు. తన్నుతూ అక్కడి వారిని పక్కకు నెట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మసీదు జనంతో నిండిపోవడంతో రోడ్డుపై నమాజ్ చేయాల్సి వచి్చందని కొందరు ఆ సబ్‌ఇన్‌స్పెక్టర్ మనోజ్‌కుమార్ తోమర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నమాజ్ చేయొద్దని ఒక పోలీసు నెమ్మదిగా వారిస్తుండగా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సబ్‌ఇన్‌స్పెక్టర్ కొట్టడాన్ని ముస్లింలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సైను సస్పెండ్‌చేయాలటూ స్థానిక ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ నార్త్ డెప్యూటీ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment