on the road
-
ఢిల్లీ ఎస్సై అత్యుత్సాహం
న్యూఢిల్లీ: శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల వేళ ఉత్తర ఢిల్లీలోని కిక్కిరిసిన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లింలపై ఒక పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించాడు. రోడ్డు దిగ్బంధం చేయొద్దని తిడుతూ వీరావేశంతో కొట్టడం మొదలెట్టాడు. తన్నుతూ అక్కడి వారిని పక్కకు నెట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మసీదు జనంతో నిండిపోవడంతో రోడ్డుపై నమాజ్ చేయాల్సి వచి్చందని కొందరు ఆ సబ్ఇన్స్పెక్టర్ మనోజ్‌కుమార్ తోమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నమాజ్ చేయొద్దని ఒక పోలీసు నెమ్మదిగా వారిస్తుండగా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సబ్ఇన్స్పెక్టర్ కొట్టడాన్ని ముస్లింలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సైను సస్పెండ్చేయాలటూ స్థానిక ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ నార్త్ డెప్యూటీ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాలిచ్చారు. -
డబుల్ ధమాకా..
రహదారి మీద, రైలు పట్టాల మీద దూసుకెళ్లే వాహనమిది. ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడల్ వెహికల్(డీఎంవీ) ఇదేనని జపాన్ చెబుతోంది. టొకుషిమా పరిధిలోని కయో ప్రాంతంలో ఇది శనివారం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనం రహదారిపై వెళ్లేపుడు రబ్బరు టైర్లను, పట్టాలపై ప్రయాణించేటపుడు ఇనుప చక్రాలను వాడుతుంది. ఒకేసారి 21 మంది ప్రయాణించవచ్చు. -
మొన్న చాక్ లెట్లు ... తాజాగా కూల్ డ్రింక్స్ పడేసిన వైనం
-
నడి రోడ్డుపై ప్రసవం
నగరంలో నిండు గర్భిణి నడి రోడ్డుపైనే ప్రసవించింది. చిట్టినగర్ సొరంగం రోడ్డులో సోమవారం ఈ ఘటన జరిగింది. భర్త ఈసూబ్తో కలిసి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గర్భిణి షేక్ గౌష్య (21).. ఇటీవల నెలలు నిండటంతో పాపాయమ్మ వీధిలోని చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం ఉదయం 6.30 సమయంలో గౌష్యకు నొప్పులు రావడంతో కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. ఇంటి నుంచి నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చేసరికే నొప్పులు బాగా ఎక్కువవటంతో ఆమె రోడ్డుపైనే కుప్పకూలింది. దీంతో చుట్టుపక్కల మహిళలు గౌష్య చుట్టూ చీరలు పట్టుకుని నిలుచున్నారు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానిక ఆర్ఎంపీ అక్కడికి చేరుకొని ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. - చిట్టినగర్ -
వాళ్లకూ మనకూ తేడా....
జాక్ కొరియాక్ రాసిన ‘ఆన్ ది రోడ్’ నవల చాలా ప్రసిద్ధి. దీని గురించి కథలు కథలు చెప్పుకుంటారు. కారణం దీనిని జాక్- కేవలం మూడు వారాల్లో రాశాడు. ఈ అమెరికన్ నవలా రచయిత ఈ ఒక్క నవలతోనే అమెరికా మొత్తం తెలిసిపోయాడంటే ఆన్ ది రోడ్ సాధించిన పేరు అలాంటిది. ఇంతా చేసి దీనిలో గొప్పతనం ఏమీ లేదు. జాక్ తన స్నేహితులతో కలిసి అమెరికా మొత్తం తిరిగిన తిరుగుళ్ల గురించిన కథ. కాని అందులోనే ఉన్న వేగం, శిల్పం, శైలి, జీవం దానిని అమెరికన్లు అందరూ నెత్తిన పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా 1950ల నాటి అమెరికన్ లైఫ్‌ని ఈ నవల యధాతథంగా పట్టుకుందని పేరు. 1951లో జాక్ ఈ నవల రాయాలనుకున్నప్పుడు తన మెదడులో తిరుగుతున్న అక్షరాల వేగానికి సాధారణ టైపింగ్ కాగితాలు పనికిరావని అనుకున్నాడు. టైప్ మిషన్ మీద ఒక కాగితం నిండాక ఇంకో కాగితం ఎక్కించడానికి మధ్య ఆ విరామంలో ఎక్కడ తన ఫ్లో దెబ్బ తింటుందోనని ఏకంగా 120 అడుగుల పొడవున్న టైపింగ్ రోల్‌ని టైప్ మిషన్కి బిగించి ఒకేసారి చాలా వేగంగా నవల టైప్ చేశాడు. అందుకే అది 3 వారాల్లో ముగిసి 1957లో న్యూయార్క్ టైమ్స్‌లో మొదటిసారి అచ్చయ్యి సంచలనం రేపింది. అమెరికన్లు జాక్ టైప్ చేసిన ఆ కాగితాల రోల్స్‌ని దేవుని పటాల కంటే మిన్నగా దాచుకున్నారు. మాసచుసెట్స్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచి ప్రదర్శనకు పెట్టారు. ఇది అక్కడ కథ. కాని మన దగ్గర? రాత ప్రతులను దాచే గౌరవించే సంస్కృతి తక్కువ. ఎన్నో విలువైన తాళపత్ర గ్రంథాలు శిథిలమై, జీర్ణమై నాశనమైపోవడం తెలుసు. సరే పాతకాలం అనుకుందాం. ఇటీవలి కాలంలోని రాతప్రతులైనా అందుబాటులో ఉన్నాయా? మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీపాద, విశ్వనాథ, సురవరం, కాళోజి, అడవి బాపిరాజు, మునిమాణిక్యం, జాషువా, చలం, భండారు అచ్చమాంబ, ఇల్లిందుల సరస్వతీదేవి, పి.శ్రీదేవి... వీళ్లందరి చేతి రాతలూ ఆ రాతలు నిండిన కాగితాలు ఎటు పోయాయో. కథానిలయం పుణ్యాన కథలు పోగవుతున్నాయిగాని అందుబాటులో ఉన్న రాతప్రతులను సేకరించే ఈ కృషి చాలదు. భవిష్యత్ తరాల రాత బాగుండాలంటే ఈ రాత గురించి శ్రద్ధ పెట్టక తప్పదు.