ముంబై: ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో (ఏఐ129) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాన్ని తిరిగి ముంబైకు దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అనంతరం విమానానికి ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
‘ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI129లో సాంకేతిక సమస్య కారణంగా ముంబైకి తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’ అని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
విమానయాన సంస్థ ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అంతేగాక విమాన టికెట్ రద్దుపై ప్రయాణీకులకు విమాన ఛార్జీల పూర్తి వాపసును కూడా అందించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా సదరు అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment