ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన దేవెగౌడ | Deve Gowda Takes Delhi Metro Ride Chats With Commuters, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన దేవెగౌడ

Published Sun, Aug 4 2024 4:18 PM | Last Updated on Sun, Aug 4 2024 5:13 PM

Deve Gowda Takes Delhi Metro Ride Chats With Commuters

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీ వాసులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఢిల్లీ మెట్రో రైలులో దేవెగౌడ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా దేవెగౌడ మెట్రో ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోను దేవెగౌడ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. 

 91 ఏళ్ల వయసున్న దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.  ఈయన 1996 నుంచి 1997 దాకా దేశ ప్రధానిగా పనిచేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పుడే రూపొందించారు. దేవెగౌడ కుమారుడు జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) పార్టీ చీఫ్‌ కుమారస్వామి ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement