Devegowda
-
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన దేవెగౌడ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీ వాసులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఢిల్లీ మెట్రో రైలులో దేవెగౌడ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా దేవెగౌడ మెట్రో ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోను దేవెగౌడ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. VIDEO | Former Prime Minister of India HD Devegowda (@H_D_Devegowda) travels in Delhi metro.(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/Oa6WJSYcQT— Press Trust of India (@PTI_News) August 4, 2024 91 ఏళ్ల వయసున్న దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన 1996 నుంచి 1997 దాకా దేశ ప్రధానిగా పనిచేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పుడే రూపొందించారు. దేవెగౌడ కుమారుడు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ చీఫ్ కుమారస్వామి ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. -
ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడే దగ్గరుండి ప్రజ్వల్‌ను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేవెగౌడ సూచనలతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ప్రజ్వల్ పాస్‌పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్‌పోర్టు రద్దయితే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది. -
త్వరలో దేశంలో భారీ మార్పు
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: త్వరలో జాతీయస్థాయిలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. రాబోయే మార్పును ఎవరూ ఆపలేరని, రానున్న రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని పునరుద్ఘాటించారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చిన కేసీఆర్.. మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతోపాటు కర్ణాటక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేసీఆర్.. కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతోత్సవాలు జరుపుకుంటున్నామని, కానీ దేశంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించారు. ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయి. అయినా పరిస్థితి మారలేదు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. భారత్ కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు 16 ట్రిలియన్ డాలర్లతో దూసుకుపోతోంటే.. మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల స్వప్నాల్లో మునిగిఉన్నాం’అని కేసీఆర్ అన్నారు. గొప్ప మానవ, నైసర్గిక వనరులున్న మన దేశంలో నిజంగా మనసుపెట్టి అభివృద్ధి చేస్తే అమెరికా కంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, వనరులను వినియోగించుకోవడంలో వెనకబడ్డామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉజ్వల భారత్ కోసం శ్రమించాలి దేశంలో ప్రస్తుతం స్వతంత్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్నామని, అయినా భారత్ కరెంట్, మంచినీళ్లు, సాగు నీటి కోసం ఇంకా అల్లాడుతూనే ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్.. ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ప్రధానం కాదని, ఒక ఉజ్వల హిందుస్తాన్ కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో ఎస్సీలు, ఆదివాసీలు ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారి పోతోందన్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో జాతీయ, కర్ణాటక రాజకీయాలు చర్చించినట్లు చెప్పారు. గతంలో బెంగళూరు పర్యటనలో ఉన్నప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పానని, ఆ తర్వాత అది నిజమైందని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశంలో మార్పు రాబోతుందని, రానున్న రెండు, మూడు నెలల్లో ఒక సంచలన వార్త బహిర్గతం చేస్తానని చెప్పారు. ఉదయం 9 గంటలకు పయనం గురువారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంటనే ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లారు. స్వల్ప విశ్రాంతి అనంతరం దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం దేవెగౌడ కుటుంబసభ్యులతో భోజనం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుగుపయనమైన కేసీఆర్ 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొత్త ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ కొత్త ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కేసీఆర్ అనేకమంది నేతలతో భేటీ అవుతున్నారని, అందుకోసమే ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరమని, పేదల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్లు మరో మూడు నెలలు వేచిచూడాలని, మీరే మార్పులు చూస్తారని అన్నారు. విజయదశమి నాటికి దేశంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. దేశ భవిష్యత్ దృష్ట్యా చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రణాళికలపై మూడు గంటలపాటు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయం అవసరమని, తృతీయ శక్తి ఆవశ్యకత ఉందన్నారు. గతంలో తృతీయ శక్తిపై తీసుకున్న నిర్ణయం వేరని, ఇప్పుడు వేరని స్పష్టంచేశారు. దేశ చరిత్రకు ఇది పునాది అని పేర్కొన్నారు. -
డబ్బుల్లేక ఎన్నికలకు దూరం అంటున్న మాజీ ప్రధాని
బెంగళూరు: భారత మాజీ ప్రధాని, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవేగౌడ బుధవారం సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో త్వరలో జరుగబోయే ఓ లోక్‌సభ, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని ప్రకటించారు. డబ్బుల్లేక పోవడంతో వారి పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో బెల్గాం లోక్‌సభతో పాటు బసవకళ్యాణ్, సింధి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే 2023లో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషిని చేస్తానని దేవేగౌడ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని కాపాడుకునేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. కాగా, దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవేగౌడ చేసిన ప్రకటనను రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన ఇలాంటి ప్రకటన చేసివుండవచ్చని అభిప్రాపడుతున్నాయి. -
నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!
బెంగళూరు: జేడీఎస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బహిర్గతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీఎస్‌ను వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పడు ఏ రకంగా బాంబు పేల్చుతారోనని పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడంతో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అసమ్మతి మరింత తారా స్థాయికి చేరింది. మంత్రిగా పని చేసిన జీ.టి. దేవెగౌడ.. సంకీర్ణ సర్కార్ పతనం తర్వాత జేడీఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. మరో ఆరుగురు కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అనంతరం బెర్తులు ఖరారు చేసుకునే పనిలోపడ్డారు. బీజేపీ నేతలతో జీటీ దేవెగౌడ చెట్టాపట్టాల్ గత శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం.హెచ్డి.కుమార స్వామితో కలిసి మొత్తం జేడీఎస్ పార్టీ 37 మంది శాసన సభ్యులు విజయం సాధించారు. ఆపరేషన్ కమలం నేపథ్యంలో ఎమ్మెల్యే హెచ్ విశ్వనాథ్, మహాలక్ష్మి లేఔట్ ఎమ్మెల్యే గోపాలయ్య, కేఆర్‌పేట ఎమ్మెల్యే నారాయణగౌడలు పార్టీని వీడారు. వీరిపై అనర్హత వేటు పడింది. దీంతో జేడీఎస్ బలం 34కు చేరింది. వీరిలో మరో ఆరుగురు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అదేవిధంగా మాజీ మంత్రి చెన్నిగప్ప కుమారుడు బీ.సీ.గౌరి శంకర్ కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి మాజీ మంత్రి జీటీ దెవెగౌడ.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షాలను నిరంతరం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మైసూరులో బీజేపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అప్పడపుడు సీఎంను కూడా కలుస్తున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే అయిన గుబ్బి శ్రీనివాస్ ఇటీవల మాజీ మంత్రి డీకే. శివకుమార్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు హాజరు కాని మాజీ సీఎం కుమారస్వామిపై ఆరోపణలు చేశారు. వీడేది వీరేనా ? జీటీ దేవెగౌడ (చాముండేశ్వరి), ఆర్.శ్రీనివాస్ (గుబ్బి), శివలింగేగౌడ (ఆరిసికెరె), మహాదేవ్ (పిరియాపట్టణ), సురేష్‌గౌడ (నాగమంగల), రవీంద్ర శ్రీకంఠయ్య (శ్రీరంగపట్టణ), సత్యనారాయణ (సిరా)లు పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు?
బెంగళూరు: సంకీర్ణ సర్కార్ పతనానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణమని బహిరంగంగా ధ్వజమెత్తిన జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ 17 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధం కావాలని సంకేతం ఇచ్చారు. ఉప ఎన్నికల తేదీ నిర్ధారించలేదు. అంతలోగా కాంగ్రెస్, జేడీఎస్ మైత్రిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆమోదానికి రావాలని విన్నవించారు. 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈ మూడు నియోజకవర్గాలు జేడీఎస్ నుంచి తప్పిపోయే ఆందోళన దేవేగౌడను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన ముందుంచటం రాజకీయ రంగంలో కుతూహలానికి కారణమైంది. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ శక్తి ఏమిటనేది చూపిస్తానని, పార్టీ గురించి నోటికి వచ్చినట్లు ఎవరుపడితేవారు మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉన్నానని, ఇకపై సహించుకోవటానికి సాధ్యం లేదని, ఇకపై ఇటువంటి మాటలకు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు. తాను మాజీ ప్రధాని బెంగళూరులో మాజీ మంత్రి డీ.కే.శివకుమార్ అరెస్టును ఖండిస్తూ జరిగిన ధర్నాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే తాను మాజీ ప్రధాని కావటంతో సభలో పాల్గొనలేదని దేవేగౌడ తెలియజేశారు. అయితే పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారన్నారు. -
దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సీఎల్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమని జేడీఎస్ అధినేత దేవెగౌడ ఆరోపించారు. సీఎం కుర్చీపై తన కుమారుడు కుమారస్వామి ఉండటం సిద్ధరామయ్యకు ఇష్టం లేదని, ఈక్రమంలో బీజేపీతో లోపాయకారీగా చేతులు కలిపినట్లు ఉందని ఆరోపించారు. దేవెగౌడ గురువారం పార్టీ కార్యాలయంలో నేతల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో తిరుగుబాటు చేసి ముంబై తరలివెళ్లిన ఎమ్మెల్యేలందరూ సిద్ధరామయ్య మద్దతుదారులే అన్నారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం పతనమైందని, సిద్ధరామయ్య వైఖరిని కాంగ్రెస్ నాయకత్వం గమనించాలని కోరారు. సీఎల్పీ నేతగా ఉన్న సిద్ధరామయ్యకు ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకూడదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలను అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. మైసూరు జిల్లా చాముండేశ్వరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి జేడీఎస్ నేత జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోవడంతో సిద్ధరామయ్య గతం మరువలేదన్నారు. అది తట్టుకోలేక కుమారస్వామి ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీతో కలిసి కుట్ర పన్నినట్లు అనుమానం ఉందన్నాన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరులో తాను ఓడిపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు సరికాదన్నారు. -
కుమారస్వామికి అభినందనలు తెలిపిన కేసీఆర్
-
బీజేపీ 200 కోట్లు ఆఫర్ చేసినా..!
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కర్ణాటక రాజకీయాలు దేశ వ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా.. లేక కాంగ్రెస్-జేడీఎస్ అధికారం హస్తగతం చేసుకుంటుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. గవర్నర్ వజుభాయ్ వాలా సీఎం యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వగా, శనివారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం హైదరాబాద్‌కు మకాం మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్ సీనియర్ నేత, చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. బల పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కచ్చితంగా నెగ్గి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగలేదు. బీజేపీ 100 కోట్లు కాదు 200 కోట్ల రూపాయలు ఇచ్చినా మా ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరలేదని గ్రహించాలి. మా ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే మా వద్దే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం వేకువజామున బెంగళూరుకు తిరిగి వెళ్లనున్నట్లు వివరించారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో మాజీ సీఎం సిద్దరామయ్యపై నెగ్గిన వ్యక్తి టీజీ దేవెగౌడ కావడం గమనార్హం. శనివారం సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని, ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సమావేశమై బల పరీక్షలో నెగ్గడంపై చర్చించనున్నట్లు సమాచారం. -
షాక్ : బాహుబలి కోసం 400 మెట్లెక్కి...
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పెద్ద షాకే ఇచ్చారు. దాదాపు 400లకి పైగా మెట్లు ఎక్కి ఆశ్చర్యానికి గురి చేశారు. శనివారం శ్రావణ బెళగొళ లోని బాహుబలి మహామస్తకాభిషేక కార్యక్రమానికి వెళ్లిన ఆయన ఈ పని చేశారు. 86 ఏళ్ల దేవెగౌడ తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి బాహుబలి(గోమఠేశ్వర విగ్రహ) 88వ మహామస్తకాభిషేకం నిర్వహించేందుకు వింధ్యగిరి పర్వతాలకు వెళ్లారు. ఆయన భార్య చిన్నమ్మ పల్లకిలో వెళ్లగా.. ఈయన మాత్రం కాలినడకన బయలుదేరారు. ఆరోగ్య సమస్యల రిత్యా డోలిలో(పల్లకి తరహా) వెళ్లాలంటూ బంధువులు ఆయనకు సూచించారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటూ మెట్లు ఎక్కేశారు. ఇద్దరు భద్రతా సిబ్బంది సాయంతో 50 నిమిషాల్లో మెట్లు ఎక్కేశారు. కొందరు అనుచరులు ఆయన్ని వెంబడిస్తూ బాహుబలి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగించారు. అయితే అన్ని మెట్లు ఒకేసారి ఎక్కేసరికి ఆయన కాస్త అలసటకు లోనయ్యారు. దీంతో కొండ పైన ఉన్న ఆరోగ్య కేంద్రంలో కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆపై మహామస్తకాభిషేకంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆయన కాలి నడకనే దిగటం విశేషం. గత వారం సిద్ధరామయ్య కూడా డోలిని తిరస్కరించి మెట్లెక్కి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సత్యదేవుని దర్శించిన మాజీ ప్రధాని
వ్రతమాచరించిన దేవెగౌడ దంపతులు ఘన స్వాగతం పలికిన ఆలయ వర్గాలు అన్నవరం : విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి ఒకేచోట కొలువైన సత్యదేవుని ఆలయాన్ని దర్శించడం, ఆ స్వామి వ్రతమాచరించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. సోమవారం ఆయన భార్య చెన్నమ్మతో కలిసి రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సత్యదేవుని ఆలయం చాలా బాగుందన్నారు. సత్యదేవుడిని దర్శించి వ్రతమాచరించమన్న కొందరి సూచనతోనే వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్టంలోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడిని కూడా దర్శించుకున్నట్టు చెప్పారు. రత్నగిరి పశ్చిమ రాజగోపురం వద్ద గల లిఫ్ట్ ద్వారా స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న దేవెగౌడ దంపతులకు ఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఘనంగా స్వాగతం పలికారు. ఆంగ్లంలో వ్రతకథ సత్యదేవుని వ్రతమాచరించిన దేవెగౌడ దంపతులకు పండితులు ఆంగ్లంలో వ్రతకథ వినిపించారు. మొదట విఘ్నేశ్వర పూజ, అష్టదిక్పాలకుల ఆవాహనను కల్యాణబ్రహ్మ ముత్య సత్యనారాయణ చేయించగా, వ్రతకథను భాగవతుల వేంకట చలపతి ఆంగ్లంలో చెప్పారు. అనంతరం ఆ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందచేశారు. సత్యదేవుని దర్శించిన భక్తులు ఆలయానికి దిగువ భాగంలో గల యంత్రాలయాన్ని కూడా దర్శిస్తారు. అయితే వయోవృద్ధులైన దేవెగౌడ దంపతులు స్వామివారి వ్రతం, దర్శనం అనంతరం తిరిగి లిఫ్ట్ ద్వారా పశ్చిమరాజగోపురం వద్దకు చేరుకుని బస చేసిన వినాయక అతిథి గృహానికి వెళ్లారు. వారి వెంట పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుంకర మురళీమోహన్ తదితరులున్నారు. దేవెగౌడ బస చేసిన వినాయక అతిథిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మర్యాద కోసం పిలిస్తే.. రాద్ధాంతమా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన ఒకరోజు తర్వాత పీఎంఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మాజీ ప్రధానమంత్రులు చాలామందిని ఈ భేటీకి పిలిచామని పీఎంఓ అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడకు కూడా ఆహ్వానం వెల్లిందని, అయితే ఆయన బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో రాలేకపోతున్నట్లు చెప్పారని అన్నారు. దాంతో ప్రధాని ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి.. ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మోదీని కలవాల్సిందిగా ఆహ్వానించారు. ఏడాది పాలన పూర్తయిన ఒకరోజు తర్వాత.. మే 27న ప్రధాని నరేంద్రమోదీ తన అధికారిక నివాసం నెం.7 రేస్‌కోర్సు రోడ్డు నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ విమర్శించడం.. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా తిప్పికొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. -
'గుజరాత్ వస్తే కొడుకులా చూసుకుంటా'
బెంగళూరు/చిక్కబళ్లాపుర: తాను ప్రధాని అయిన తరువాత మీరు కర్ణాటకలో ఉండలేకపోతే గుజరాత్ వస్తే తాను కొడుకులా చూసుకుంటానని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడను బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. బీజేపీ తరఫున ప్రచారంలో భాగంగా చిక్కబళ్లాపూర్, చిక్కమంగళూరు, హావేరిల్లో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు. మోడీ ప్రధాని అయితే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని దేవేగౌడ చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ''దేవేగౌడ జీ, రాజకీయాల్లో మీరు కురువద్ధులు. దేశ ప్రధానిగా పనిచేసిన అనుభవం మీకుంది. నేను మీ కుమారుడి లాంటివాడిని. మీకు మాట ఇస్తున్నాను, నేను దేశ ప్రధాని అయిన తరువాత మీరు కనుక కర్ణాటకలో ఉండలేక పోతే గుజరాత్‌కు వచ్చేయండి. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయిస్తాను. అంతేకాకుండా మీరు అంగీకరిస్తే మీకు ఓ కొడుకులా సేవలు చేయడానికి అక్కడ నేను సిద్ధంగా ఉంటాను'' అని మోడీ చెప్పారు. కేంద్రమంత్రి, చిక్కబళ్లాపుర కాంగ్రెస్ అభ్యర్థి వీరప్పమొయిలీని తీవ్రంగా విమర్శించారు. 2009 నుండి చిక్కబళ్లాపుర ప్రాంతానికి మొయిలీ ఏమీ చేయలేక పోయారన్నారు. ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మొయిలీ నెరవేర్చలేక పోయారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తానని అప్పట్లో భువనేశ్వరి మాతపై ప్రమాణం చేసి మొయిలీ గెలిచిన తర్వాత ఆ ప్రమాణాన్ని పక్కన పెట్టేశారన్నారు. దేశంలోని నదులను అనుసంధానం చేయాలని అటల్ బిహారి వాజ్‌పేయి కలలు కన్నారని, ఆ కలను సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో యువత ఉపాధి అవకాశాల కోసం జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. -
అయిదుగురు సీఎంల రణరంగం
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు మాజీ సీఎంలు కర్నాటక ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ చాలరన్నట్టు ఇంకో మాజీ సీఎం కూడా రంగంలో దిగేందుకు రెడీగా ఉన్నారు. మాజీ ప్రధాని, మాజీ సీఎం దేవెగౌడ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధరమ్ సింగ్, వీరప్పమొయిలీలు తమ తమ నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. ఇక బిజెపి కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు - సదానంద గౌడ, ఎడియోరప్పలు రంగంలో ఉన్నారు. ఎడియోరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ బెంగుళూరు నార్త్ నుంచి పోటీలో ఉన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ సుపుత్రుడు హెచ్ డీ కుమార స్వామి కూడా తాను లోకసభకు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఆరో సీఎం కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట. ఏయే సీఎంలు గెలుస్తారో, ఏయే సీఎంలు ఓడిపోతారో చూడాలి!