అయిదుగురు సీఎంల రణరంగం | Five former CMs in Karnataka fray | Sakshi
Sakshi News home page

అయిదుగురు సీఎంల రణరంగం

Published Mon, Mar 24 2014 5:23 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Five former CMs in Karnataka fray

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు మాజీ సీఎంలు కర్నాటక ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ చాలరన్నట్టు ఇంకో మాజీ సీఎం కూడా రంగంలో దిగేందుకు రెడీగా ఉన్నారు.


మాజీ ప్రధాని, మాజీ సీఎం దేవెగౌడ మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్ ధరమ్ సింగ్, వీరప్పమొయిలీలు తమ తమ నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. ఇక బిజెపి కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు - సదానంద గౌడ, ఎడియోరప్పలు రంగంలో ఉన్నారు. ఎడియోరప్ప షిమోగా నుంచి, సదానంద గౌడ బెంగుళూరు నార్త్ నుంచి పోటీలో ఉన్నారు.
మరో మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ సుపుత్రుడు హెచ్ డీ కుమార స్వామి కూడా తాను లోకసభకు పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఆరో సీఎం కూడా రంగంలోకి దిగుతున్నారన్నమాట.


ఏయే సీఎంలు గెలుస్తారో, ఏయే సీఎంలు ఓడిపోతారో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement