
మైసూర్: హిజాబ్ ధరించిండంపై కర్ణాటక ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైసూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. హిజాబ్‌పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా శుక్రవారం ప్రకటించారు.
మహిళలు వారికి ఏది నచ్చితే వాటిని ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని, హిజాబ్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. ‘నేను ఎందుకు అడ్డుకోవాలి? మీ ఇష్టం మేరకు నచ్చినట్లు హిజాబ్ ధరించవచ్చు’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హిజాబ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరి ధరించాలన్న నియమం ఏం లేదని పేర్కొంది. విద్యా సంస్థల్లో ఏక రూప దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment