hijab
-
ధర్మాగ్రహం కట్టలు తెంచుకున్న వేళ
టెహ్రాన్: హిజాబ్ ధరించలేదంటూ సూటిపోటి మాటలతో వేధిస్తున్న మతాధికారిని తనదైన శైలితో బుద్ధిచెప్పిన వీర వనిత ఘటన ఇది. మతాచారాలను కఠినంగా అమలుచేసే ఇరాన్లో ఇటీవల జరిగిందీ ఘటన. హిజాబ్ ధరించవా ? అంటూ వేధిస్తున్న ఒక ముల్లాను అతని సంప్రదాయ తలపాగాను తొలగించి దానినే హిజాబ్గా ధరించి అక్కడి వారంతా అవాక్కయ్యేలా చేసింది. నవీద్ మొహెబ్బీ అనే ఇరాన్ మహిళా యూజర్ ఒకరు పెట్టిన వీడియో ప్రకారం టెహ్రాన్‌లోని మహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వివాహిత విమానం కోసం ఎదురుచూస్తుండగా అటుగా వచ్చిన ఒక ముస్లిం మతాధికారి ఆమె దగ్గరికి వచ్చి ‘హిజాబ్ ధరించవా?’అని మొదలెట్టి పలు రకాలుగా వేధించసాగాడు. కొద్దిసేపు ఓపిక పట్టిన ఆ మహిళ తర్వాత వీరావేశంతో ఆ ముల్లాకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. అతని తలపై ఉన్న తలపాగాను విసురుగా లాక్కొని దానిని వస్త్రంగా విడదీసి హిజాబ్గా ధరించింది. ‘‘ఇంతసేపు హిజాబ్ ఉంటేనే మహిళకు గౌరవం అని మాట్లాడావుకదా?. ఇప్పుడు నేను హిజాబ్ ధరించాను. నాకు తగిన గౌరవం ఇవ్వు ఇప్పుడు’’అని గద్దాయించింది. దీంతో ఏం చేయాలో తెలీక అతను దిక్కులు చూశాడు. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతూ ‘‘మా ఆయన ఇక్కడే ఉండాలికదా!. నేను హిజాబ్ ధరించలేదని నా భర్తను ఏమైనా చేశారా ఏంటి?’’అంటూ తన భర్తను వెతికేందుకు వెళ్లింది. మహిళ చర్యను ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు మెచ్చుకున్నారు. ఛాందసవాద ప్రవర్తనకు వీరవనిత తగిన బుద్ధి చెప్పిందని కొనియాడారు. అయితే ఈ ఘటన వార్త తెలిసి అక్కడే ఉన్న ఇరాన్ నైతిక పోలీసు విభాగం ఆమెను అరెస్ట్చేసిందని, తర్వాత ఆమెను విడుదలచేసిందని తెలుస్తోంది. -
Viral: హిజాబ్ ధరించమన్నందుకు ఏం చేసిందంటే..
వైరల్ వీడియో: హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటాయో తరచూ మనం చూస్తున్నాం. చాలావరకు దేశాలు కఠిన చట్టాలు..శిక్షలు సైతం అమలు చేస్తున్నాయి కూడా. అయితే.. ఇరాన్లో మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడి ప్రభుత్వమే దగ్గరుండి మరీ జరిపించే దారుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.అందుకే అక్కడ మహిళల పోరాటాలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా.. ఇంటర్నెట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. హిజాబ్ ధరించమని ఓ మతపెద్ద ఒకావిడను ఒత్తిడి చేశాడు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన ఆమె ఆయన వెంటపడింది. ఆయన తలపై ఉన్న పాగాను లాగిపడేసి.. దానినే తలపై కప్పేసుకుంది.‘‘ఇప్పుడు మీ గౌరవం ఏమైంది?. నా భర్తను మీరేం చేశారు?’’ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించింది. కచ్చితంగా ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్(Mehrabad) ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.మసిహ్ అలినెజద్ అనే మహిళా జర్నలిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘‘ఆ తలపాగాలు పవిత్రమైనవి, అవే తమ గౌరవమని, ఇతరులెవరూ వాటిని ముట్టుకోకూడదని ఆ మత పెద్దలు చెబుతుంటారు. కానీ, తన నిరసనతో ఈమె వాళ్లకు సరైన పాఠం చెప్పింది. లింగవివక్ష పోరాటంలో అలసిపోయిన ఇరాన్ మహిళలు.. ఇప్పుడు ఆగ్రహంతో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారన్నడానికి ఇదే ఉదాహరణ’’ అని పోస్ట్ చేశారామె.A brave woman at Tehran’s Mehrabad Airport confronted a cleric harassing her for not wearing a hijab. In a bold act of defiance, she removed his turban and wore it like a scarf, turning oppression into resistance.For years, clerics have claimed their turbans and robes are… pic.twitter.com/Mdj1c0b3Vo— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 6, 2025ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అధికార ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)కి చెందిన మీడియా సంస్థ ‘మష్రెగ్’మాత్రం ఘటనపై మరోలా కథనం ఇచ్చింది. ఆ మహిళ మతిస్థిమితం లేనిదని, ఆమెను అదుపులోకి తీసుకుని వదిలేసిట్లు ఓ వార్త ప్రచురించింది. అయితే..నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. తమ హక్కుల కోసం అనేకమంది మహిళలకు ఆమె ప్రతినిధిగా కనిపించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది నవంబర్‌లో టెహ్రాన్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ నిరసనల్లో భాగంగా ఓ యువతి ఏకంగా దుస్తులు విప్పేసి ప్రభుత్వంపై నిరసన తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మహిళల వరుస నిరసనలను వాళ్ల ఆవేశంలో తెలివితక్కువతనంతో చేస్తున్న పనులుగా పేర్కొంటూ అణచివేస్తోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్‌ను ధరించడాన్ని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. ఇది సరిగ్గా అమలయ్యేలా 2005 నుంచి నైతిక పోలీసు విభాగం పర్యవేక్షిస్తోంది. అయితే. 2022లో హిజాబ్ సరిగా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండు నెలలకుపైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకింది. చివరికి మోరల్ పోలీసింగ్‌ను ఇరాన్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే కిందటి ఏడాదిలో ఆ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల నిరసనలు మళ్లీ యధావిధిగా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ నిరసనలపై ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన పాలనకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న నిరసనలు తమ శత్రువులు చేయిస్తున్నారని ఖమేనీ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ‘స్త్రీ ఒక సున్నితమైన పుష్పం.. ఇంట్లో పనిమనిషి కాదు. స్త్రీని పువ్వులా చూసుకుంటూ.. దాని తాజాదనం, సువాసన, దానినుంచి కలిగే ప్రయోజనాలను పొందాలి’ అని ఓ కవిత్వం సైతం రాసుకొచ్చారు. -
హిజాబ్ చట్టానికి బ్రేక్
ఇరాన్లో అత్యంత వివాదాస్పదమైన ‘హిజాబ్–పవిత్రత చట్టం’అమలుకు దేశ జాతీయ భద్రతా మండలి బ్రేకులు వేసింది. ఇరాన్ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం అస్పష్టంగా ఉందని, దాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. హిజాబ్ ధరించని మహిళలకు జరిమానాలతో పాటు 15 ఏళ్ల దాకా జైలు శిక్షకు చట్టం ప్రతిపాదించింది. పలు కఠినమైన శిక్షలు సూచించింది. హిజాబ్ విషయమై ఇరాన్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పెజెష్కియాన్ గతంలోనూ అసహ నం వ్యక్తం చేశారు. ‘‘హిజాబ్‌ను బలవంతంగా తొలగించలేకపోయాం. దాన్ని ధరించాల్సిందేనంటూ మహిళల హక్కులను కాలరాసే అధికారం మాకు లేదు’’అని ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పదేపదే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల హామీని అమలు చేశారని భావిస్తున్నారు. మహిళా, కుటుంబ వ్యవహారాల మాజీ ఉపాధ్యక్షుడు మసౌమే ఎబ్టేకర్ కూడా ఈ చట్టాన్ని విమర్శించారు. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ఇరాన్లో సగం మందిపై అభియోగం మోపడమేనన్నారు. నిత్య వివాదం: హిజాబ్ వివాదం ఈనాటిది కాదు. మహిళలపై అణచివేతకు చిహ్నంగా ఉన్న హిజాబ్‌ను కొత్త తరం ధిక్కరిస్తూనే ఉంది. హిజాబ్ ధరించలేదని, వస్త్రధారణ అనుచితంగా ఉందని 2022లో మహసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళను ఇరాన్ నైతిక పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో కోమాలోకి వెళ్లిన ఆమె తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఆమె డాక్టర్ కావాలని కలలు కన్నారు. యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం పాటు తల్లిదండ్రులతో ఉందామని వచ్చి ప్రాణాలొదిలారు. అమీనీ మరణంపై ఇరాన్‌వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలే గాక పురుషులు కూడా వాటిలో పాల్గొన్నారు. పోలీసుల చిత్రహింసలే ఆమెను పొట్టన పెట్టుకున్నాయంటూ దుయ్యబట్టారు. బలూచ్, అజెరిస్, అరబ్బులు కూడా కుర్దులతో కలిసి రోడ్డెక్కారు. సున్నీలు, షియాలని తేడా లేకుండా నిరసనల్లో పాల్గొన్నారు. వేలాది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని ధిక్కరించిన, నిరసనల్లో పాల్గొన్న వారిలో 500 మంది మరణించారు. 120 మంది కంటి చూపు కోల్పోయారు. ఏడాదికి అలజడి తగ్గుముఖం పట్టాక దుస్తుల కోడ్ ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం కఠిన శిక్షలు ప్రకటించింది. గాయని అరెస్టుతో: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీ (27)ని అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. భుజాలు కనిపించేలా స్లీవ్‌లెస్ డ్రెస్‌లో నలుగురు పురుష కళాకారుల మధ్య పాడిన ఆ వీడియో అందరినీ ఆకర్షించింది. ఆమెతో పాటు అందులో ఉన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. 300 మందికి పైగా ఇరాన్ హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు కొత్త హిజాబ్ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో అహ్మదీని మర్నాడే విడుదల చేశారు. నిరసనలు పెరిగి రెండేళ్ల నాటి పరిస్థితి పునరావృతమయ్యేలా ఉండటంతో హిజాబ్ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయని అరెస్ట్
టెహ్రాన్: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్టూ అహ్మదీ(27)ని ఇరాన్ అధికారులు అరెస్ట్ చేశారు. సారి నగరంలో శనివారం అధికారులు పరస్టూను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తరఫు లాయర్ మిలాద్ చెప్పారు. ఆన్లైన్ కచేరీలో ఆమె హిజాబ్ ధరించలేదు. భుజాలు కనిపించే నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఆమె అరెస్ట్‌కు కారణాలను, ఎక్కడ నిర్బంధంలో ఉంచిందీ అధికారులు వెల్లడించలేదు. కచేరి సమయంలో ఆమెతో కనిపించిన కళాకారుల్లో సొహైల్ నసిరీ, ఎహ్సాన్ బెయిరగ్ధార్లనూ అరెస్ట్ చేశారు. న్యాయ శాఖ అధికారులతో మాట్లాడి, నిర్బంధం గురించి తెలుసుకుంటామని లాయర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా సోలోగా పాడటాన్ని ఇరాన్ నిషేధించింది. హిజాబ్ ధరించకుండా కనిపించిన అమినీ అనే యువతి పోలీసు నిర్బంధంలో ఉండగా చనిపోవడం 2022లో ఇరాన్ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీయడం తెలిసిందే. -
ఆంక్షలను ధిక్కరిస్తూ.. లో దుస్తులతో నిరసన
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్‌లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది. దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే. -
Mahsa Amini: హిజాబ్‌ను ధిక్కరించి తలెత్తుకుని...
‘‘గుమ్మానికి పరదా కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్’ కట్టారు’’ అంటూ ముస్లిం మహిళల జీవితాల్లోని దుఃఖాన్ని వినిపించారో కవయిత్రి. దుఃఖమో.. సంతోషమో.. హిజాబ్ చాటున దాచేది లేదని ఇరాన్ మహిళలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఇరాన్లో పలువురు హిజాబ్‌లను తొలగించి స్వేచ్ఛగా వీధుల్లో సంచరించారు. ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్దిష్ మహిళ అయిన మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడం తెలిసిందే. అయితే మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా స్మారక సభను నిర్వహించాలని తల్లిదండ్రులు భావించగా.. పోలీసులు అందుకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులను బలవంతంగా గృహ నిర్బంధం చేశారు. అమీనీని ఖననం చేసిన సఖెజ్ నగరంలోని స్మశాన వాటికను సైతం మూసేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇరాన్ మహిళలు మాత్రం ఆమెను స్మరించుకున్నారు. దేశ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ‘జిన్.. జియాన్.. ఆజాదీ’(స్త్రీ.. జీవితం.. స్వేచ్ఛ) నినాదాలు చేశారు. ఇక టెహ్రాన్‌లోని ఏవీఎన్ జైలులోని పలువురు మహిళా ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలతోనే తామూ ఉన్నామని చెబుతూ 34 మంది జైలు ఖైదీలునిరాహార దీక్ష చేశారు. వీరిలో ఇరాన్ ఉద్యమకారులు నర్గీస్ మొహమ్మదీ, వెరిషెహ్ మొరాది, మహబూబ్ రెజాయ్, పరివాష్ ముస్లి కూడా ఉన్నారు. తీవ్రమైన అణచివేత.. 1979లో కొత్త ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖొమేనీ ఆవిర్భవించారు. ఇస్లాం మత విలువలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు హక్కులను కల్పించిన కుటుంబ రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. నాటి నుంచి ఇస్లాం డ్రెస్‌కోడ్ పాటించని మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధిక్కరించిన మహిళలను గాయపరిచిన, జరిమానాలు విధించిన ఘటనలు అనేకం. మహిళలపై నిరంతరం కెమెరాల నిఘా కొనసాగుతోంది. 2024 టెహ్రాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మహిళలను పర్యవేక్షించడానికి ఏరియల్ డ్రోన్లను కూడా ఉపయోగించారంటే ఎంతటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిజాబ్‌ను తిరస్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా.. అణచివేత చర్యలకు పాల్పడుతోంది.ఎవరీ మహసా అమీనీ ?2022లో ఇరాన్లో హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ 22 ఏళ్ల మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయి, కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కూతురును చూడటానికి అమీనీ తల్లిదండ్రులను కూడా అనుమతించలేదు. శవ పంచనామా నివేదిక అడిగినా నిరాకరించారు. మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తరువాత ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. డాక్టర్ కావాలని కలలు కన్న యువతి.. మరో వారం రోజుల్లో యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం రోజులు తల్లిదండ్రులతో ఉందామని టెహ్రాన్‌కు వచ్చిన అమీనీ.. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలొదిలింది. -
హిజాబ్ సర్క్యులర్‌పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: తాము ధరించే దుస్తులను ఎంచుకొనే స్వేచ్ఛ విద్యారి్థనులకు ఉండాలని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. ఎలాంటి దుస్తులు ధరించాలో వారు నిర్ణయించుకోవచ్చని ఉద్ఘాటించింది. తమ విద్యా సంస్థ ప్రాంగణంలో విద్యార్థినులు హిజాబ్, బుర్ఖా, టోపీ, నఖాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. కాలేజీ సర్క్యులర్‌ను సమరి్థస్తూ బాంబే హైకోర్టు జూన్ 26న ఇచి్చన తీర్పును సవాలు చేస్తూ జైనాబ్ అబ్దుల్ ఖయ్యూంతోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీని నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలేజీ క్యాంపస్‌లో బొట్టుబిళ్ల, తిలకం ధరించడం కూడా నిషేధిస్తారా? అని ప్రశ్నించింది. హిజాబ్, బుర్ఖా వంటివి ధరించకుండా ఆంక్షలు విధిస్తే విద్యారి్థనుల సాధికారత ఎలా సాధ్యమని నిలదీసింది. -
హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ నిషేధిస్తూ కాలేజీ యాజమన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తొమ్మిది మంది విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏఎస్ చందుర్కర్, జస్టిస్ రాజేష్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (జూన్26) విచారించింది. కాలేజీ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని విద్యార్థినులు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ డివిజన్ బెంచ్ పిటిషన్‌ను కొట్టివేసింది.చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో విద్యార్థినులు హిజాబ్, నఖాబ్, బుర్ఖా, క్యాపులు, బ్యాడ్జీలు ధరించడానికి వీల్లేదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తాము ఏ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి డ్రెస్ కోడ్ పెట్టలేదని, కేవలం యూనిఫాం వేసుకుని విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. -
‘హిజాబ్’ ఉదంతంలో న్యాయం.. బాధితులకు రూ. 146 కోట్ల పరిహారం!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2017లో ఇద్దరు ముస్లిం మహిళలకు అవమానం జరిగింది. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి న్యాయం లభించింది. ఇందుకు పరిహారంగా బాధితులకు 17.5 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించడానికి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. వివరాల్లోకి వెళితే 2017లో స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో న్యూయార్క్ పోలీసులు ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్టు చేశారు. ఆ తరువాత వారిని జైలుకు పంపే ముందు నిబంధనలలో భాగంగా వారికి ఫొటోలు తీశారు. వీటిని మగ్ షాట్ అంటారు. ఈ ఫొటోల కోసం పోలీసులు ఆ మహిళల హిజాబ్‌ను తొలగించారు. దీనిని బాధిత మహిళలు అవమానంగా భావించారు. ఈ ఉదంతంపై బాధితులు 2018లో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ బాధితుల మత విశ్వాసాలను పరిగణించకుండా పోలీసులు వారి హిజాబ్ తొలగించి తీవ్రంగా అవమానించారని, వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ కేసు నేపధ్యంలో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు పలు మార్పులు చేశారు. ఈ ఫొటోల కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరంలేదని, ముఖం కనిపించేలా ఉంటేచాలని పేర్కొన్నారు. ఈ నిబంధన మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్‌ను తొలగించాల్సిన అవసరం పోలీసులు వివరించారు. ఆదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం పోలీసులు బాధిత మహిళలతో పాటు గతంలో ఈ విధంగా ఇబ్బంది పడిన వారికీ కూడా పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఇద్దరు బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. మన రూపాయల్లో ఇది సుమారు రూ. 146 కోట్లకు సమానం. -
ఆ రాష్ట్రంలోనూ హిజాబ్ చిచ్చు?
విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాజస్థాన్‌లోనూ వివాదం మొదలైంది. రాష్ట్రంలోని భజన్‌లాల్ సర్కారు కూడా హిజాబ్ నిషేధానికి సంబంధించి సన్నాహాలు మొదలుపెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఇటీవల హిజాబ్, బురఖాపై నిషేధం విధించాలని వ్యాఖ్యానించారు. అనేక ముస్లిం దేశాలలోనే హిజాబ్‌ను నిషేధించినప్పుడు ఇక్కడ హిజాబ్ ఇంకా ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో హిజాబ్ నిషేధానికి సంబంధించిన స్థితిగతులు, రాజస్థాన్‌లో దాని ప్రభావాలకు సంబంధించిన వివరాలపై ఒక నివేదికను రూపొందించి, దానిని రాష్ట్ర విద్యా మంత్రి మదన్ దిలావర్‌కు విద్యాశాఖాధికారులు పంపినట్లు సమాచారం. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బాల ముకుందాచార్య హిజాబ్‌కు సంబంధించిన ప్రశ్నను తొలుత లేవనెత్తారు. గణతంత్ర దినోత్సవం రోజున వివిధ పాఠశాలలను సందర్శించిన ఆయన పాఠశాలలో రెండు రకాల డ్రెస్ కోడ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థినులు నిరసనకు దిగారు. ఇదిలావుండగా రాష్ట్రంలో హిజాబ్‌ను నిషేధించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా పేర్కొన్నారు. స్కూళ్లలో డ్రెస్ కోడ్ ఉంటుందని, హిజాబ్ ధరించి రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ముస్లిం సమాజంలో మత ఛాందసవాదం ఉందని, కాంగ్రెస్ దానికి వత్తాసు పలుకుతున్నందున తాము హిజాబ్ నిషేధం దిశగా ముందుకు సాగలేకపోతున్నామని అన్నారు. -
Hijab: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు :కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ నిషేదంపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడూతు సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో హిజాబ్‌పై మళ్లీ చర్చ స్టార్టైంది. తమ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేదాన్ని ఇంత వరకు ఎత్తివేయలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్పందించింది. అసలు రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేదమే లేనప్పుడు దాన్ని ఎలా ఎత్తివేస్తారని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. డ్రెస్ కోడ్ అమలులో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే హిజాబ్‌ను అనుమతించడం లేదని మిగిలిన చోట్ల అంతా మామూలేనని బొమ్మై అన్నారు. మరోపక్క హిజాబ్ నిషేదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేదం ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు. ఇంకా దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు. ఇదీచదవండి..చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
కర్ణాటక: హిజాబ్ నిషేధం ఎత్తివేత
మైసూర్: హిజాబ్ ధరించిండంపై కర్ణాటక ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. హిజాబ్‌పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా శుక్రవారం ప్రకటించారు. మహిళలు వారికి ఏది నచ్చితే వాటిని ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని, హిజాబ్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. ‘నేను ఎందుకు అడ్డుకోవాలి? మీ ఇష్టం మేరకు నచ్చినట్లు హిజాబ్ ధరించవచ్చు’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హిజాబ్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరి ధరించాలన్న నియమం ఏం లేదని పేర్కొంది. విద్యా సంస్థల్లో ఏక రూప దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది. చదవండి: ఆరు నెలల పాపకు కరోనా! అప్రమత్తమైన అధికారులు -
ఆ ఇరాన్ యువతి మృతి
దుబాయ్: ఇరాన్లో కొద్ది వారాల కింద హిజాబ్ ధరించకుండా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ అంతుబట్టని రీతిలో తీవ్ర గాయాలపాలైన టీనేజ్ యువతి మరణించింది. కొద్ది రోజుల కోమా అనంతరం ఆమె తుదిశ్వాస విడిచినట్టు ప్రభుత్వ మీడియా శనివారం ఈ మేరకు వెల్లడించింది. అరి్మత గెర్వాండ్ అనే ఆ యువతి అక్టోబర్ 1న టెహ్రాన్‌లో మెట్రోలో ప్రయాణిస్తూ గాయపడింది. ఆమె ట్రైన్లోంచి ప్లాట్‌ఫాంపైకి వచ్చి పడుతున్న వీడియో బయటికి వచి్చంది. మెట్రోలో ఏమైందో ఇప్పటిదాకా బయటికి రాలేదు. హిజాబ్ ధరించనందుకే పోలీసులు ఆమెకు ఈ గతి పట్టించి ఉంటారని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాది కింద ఇలాగే హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని మోరల్ పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఆమె జైల్లో మరణించడం, దానిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గెర్వాండ్ మృతితో మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ!
బార్బీ బొమ్మలను ఇష్టపడని వారు ఉండరేమో. బార్బీ అంత అందంగా ఉండాలని అమ్మాయిలంతా అనుకుంటారు. కానీ నాలాగా బార్బీలేదే? నాలాంటి డ్రెస్ వేసుకోలేదే అని అనుకున్న ఓ ఆర్టిస్ట్ ఏకంగా సరికొత్త బార్బీని రూపొందించింది. సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన ఈ సరికొత్త బార్బీ అందర్నీ తెగ ఆకర్షిచేస్తోంది. రంగు రంగుల డ్రెస్‌లు, ప్రముఖుల రూపాలతో అందర్నీ ఆకర్షించే బార్బీ హిజాబ్ వేస్తే ఎలా ఉంటుంది అనుకుంది నైజీరియాకు చెందిన 32 ఏళ్ల హనీఫా ఆడమ్. మార్కెట్లో హిజాబ్ ధరించిన బొమ్మల కోసం వెతికింది. ఎంత గాలించినా హిజాబ్ ధరించిన ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. తనలా హిజాబ్ ధరించిన బార్బీ కనిపించలేదని బాధపడింది. దీంతో తనే... హిజాబ్ ధరించిన బార్బీని తయారు చేయాలని నిర్ణయించుకుంది. 2015 డిసెంబర్లో ..నేవీ మ్యాక్సి స్కర్ట్ కుట్టి, నీలం రంగు జాకెట్, నలుపు రంగు హిజాబ్‌ను బార్బీకి తొడిగి ఫోటో తీసింది. ‘హిజార్బీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి...చక్కగా చూడముచ్చటగా ఉన్న తొలి హిజార్బీ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా..‘‘ చాలా బావుంది. మా పిల్లలకు కూడా ఇటువంటి డ్రెస్సే కావాలని’’ అడిగారు. దీంతో హనీఫా మరింత ఉత్సాహంతో వివిధ రకాల హిజార్బీలను రూపొందించింది. డ్రస్లన్నింటిలోకి లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ హబీబీ డిసిల్వా ధరించిన బ్రిటిష్ స్టైల్ డ్రెస్ బాగా పాపులర్ అయ్యింది. మీడియా భారీ కవరేజ్‌తోపాటు, టీన్వోగ్ కూడా గుర్తించడంతో హిజార్బీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పటిదాక హిజార్బీ అకౌంట్లో రెండు వందలకు పైగా ఫోటోలు పోస్టు చేసింది. ముస్లిం సాంప్రదాయం, ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా హనీఫా హిజార్బీలు తయారు చేయడం విశేషం. ఇటీవల విడుదలైన బార్బీ సినిమాతో బార్బీ మేనియా చూసి హనీఫా మరోసారి హిజార్బీని యాక్టివ్ చేసింది. ఈ క్రమంలోనే ..ఆరేళ్ల తరువాత పింక్ రంగు వేసిన గోడ ముందు పింక్ కలర్ డ్రెస్ వేసుకుని, హిజాబ్ ధరించి నిలుచున్న హిజార్బీ పోటోను ఇన్‌స్టా అకౌంట్లో ‘‘హిజార్బీ ఈజ్ బ్యాక్’’ అంటూ పోస్టు చేసింది. ఈ పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ లైక్‌లు కొడుతున్నారు. మ్యాటెల్ హిజార్బీ.. హనీఫా తయారు చేసిన హిజార్బీ పాపులర్ కావడంతో 2017లో బార్బీ తయారీ సంస్థ కూడా హిజాబ్ దరించిన బార్బీని విడుదల చేసింది. అమెరికా ఒలింపిక్ ఫెన్సర్ ఇతిహాజ్ మహమ్మద్ రూపంతో హిజార్బీని విడుదల చేసింది. వ్యాపారిని కాదు.. ఆర్టిస్ట్ అవాలనుకోలేదు ‘‘ఫైన్ ఆర్ట్స్‌ను చదివాను. కానీ ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు. డాక్టర్ అవాలనుకున్నాను. అదీ కుదరక ఫిజియాలజీ చదివాను. ఫార్మకాలజీలో మాస్టర్స్ చేసాను. చదువు పూర్తిచేసి యూకే నుంచి నైజీరియా వచ్చాక... నాకు తెలిసిన ఫ్యాషన్ ఐడియాలను ఆన్లైన్లో పోస్టు చేసేదాన్ని. వాటిని చూసిన వారంతా అభినందించేవారు. 2016లో ఫుడ్ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొని విజేతగా నిలిచాను. అప్పుడు ఆర్టిస్ట్‌గా మారాలనుకున్నాను. అప్పటినుంచి నేను రూపొందించిన కళారూపాలను నైజీరియా, న్యూయార్క్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం మొదలు పెట్టాను. ఇలా చేస్తూ హిజార్బీని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను వ్యాపారిని కాదు. నా స్నేహితురాళ్లు ప్రోత్సహించడంతో వివిధరకాల హిజార్బీని రూపొందించాను. ఈ నెలలో హిజార్బీ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించబోతున్నాను. బట్టల తయారీతోపాటు, నైజీరియా డిష్‌లకు ఫుడ్ ఆర్ట్‌ను జోడిస్తూ మా సంప్రదాయాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను రూపొందించే హిజార్బీల్లో.. ఏసియన్, తెలుపు, నలుపు బొమ్మలు ఉన్నాయి. సెలబ్రెటీలను రోల్ మోడల్స్‌గా తీసుకునేందుకు వివిధ రంగుల్లో రూపొందిస్తున్నాను’’ అని చెబుతోంది హనీఫా. (చదవండి: కరోనాలో దొరికిన ఆ సమయమే..ఆ యువకుడుని కోటీశ్వరుడిగా చేసింది!) -
హయత్ నగర్లో హిజాబ్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని హయత్ నగర్లో హిజాబ్ వివాదం వెలుగు చూసింది. స్కార్ఫ్‌తో వెళ్లిందని ఓ పదో తరగతి అమ్మాయిని ఇంటికి పంపించేసింది స్కూల్‌యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో.. కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్‌తో వెళ్లిన ఆ టెన్త్ స్టూడెంట్ను.. స్కూల్ యాజమాన్యం లోనికి రానివ్వలేదు. హిజాబ్‌తో లోనికి రానివ్వమంటూ తేల్చేసింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లకు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థిని స్థానిక కోర్టు న్యాయమూర్తి కూతురని సమాచారం. ఇదీ చదవండి: కురచ దుస్తులెందుకు?.. తెలంగాణ హోంమంత్రి కామెంట్లపై దుమారం -
హైదరాబాద్‌లో ‘హిజాబ్’ ఘటన..హోంమంత్రి ఏమన్నారంటే..
హైదరాబాద్: నగరంలో హిజాబ్ దుమారం రేగింది. శుక్రవారం సైదాబాద్ కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఉర్దూ పరీక్ష రాయడానికి వెళ్లిన కొంతమంది విద్యార్థినులను హిజాబ్ తొలగించాలని కాలేజీ యాజమాన్యం పట్టుబట్టింది. ఊహించని ఆ పరిణామంతో కొందరు గందగోళానికి గురయ్యారు. పరీక్షకు గంటకు పైగా ఆలస్యంగా అటెండ్ అయ్యారు. అయితే కొందరు మాత్రం ఆందోళనతో అప్పటికప్పుడు బుర్జాలు తొలగించి పరీక్ష రాశారు. ఆపై విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లు హోం మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. ఉన్నతస్థాయిలో ఉన్న ఎవరైనా అక్కడ అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. లౌకికవాద సిద్ధాంతం తమదని, ప్రజలు వాళ్లకు నచ్చింది ధరించొచ్చని ఆయన అన్నారు. అలాగే.. ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారాయన. అయితే.. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. ‘‘ఒకవేళ మోడ్రన్ దుస్తులు ధరిస్తే.. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. మనం మంచి దుస్తులు ధరించాలి. ముఖ్యంగా మహిళలు. ఒకవేళ మహిళలు గనుక కురుచ దుస్తులు ధరిస్తే.. అది సమస్యగా మారొచ్చు. నిండైన దుస్తులు ధరిస్తేనే ఏ సమస్యా ఉండదు అని మహమూద్ అలీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. #WATCH | "Some Headmaster or Principal might be doing this but our policy is totally secular. People can wear whatever they want but if you wear European dress, it will not be correct...We should wear good clothes. Auratein khaas taur se, kam kapde pehn'ne se pareshaani hoti hai,… pic.twitter.com/iagCgWT1on — ANI (@ANI) June 17, 2023 -
మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి.. ప్రిన్సిపాల్ క్షమాపణ
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్ధినులను బుర్ఖా వేసుకోకూడదని వారించిన ప్రిన్సిపాల్ కు ఉగ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ ప్రినిసిపాల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తన వలన ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం క్షమించమని కోరారు. ఉవ్వెత్తున నిరసన జ్వాల.. విశ్వభారతి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు చెప్పిన వివరాల ప్రకారం సదరు ప్రిన్సిపాల్ మేడమ్ కొంతమంది విద్యార్థినులను మాత్రం స్కూల్లో బుర్ఖా ధరించవద్దని చెప్పేవారట. అది మా ఆచారమని దయచేసి అనుమతించమని పదే పదే వేడుకుంటూనే ఉన్నాము. కానీ ఆమె ఇతర విద్యార్థినులకు అనుమతినిచ్చి మాకు మాత్రమే అనుమతినిచ్చేవారు కాదు. అంతగా కావాలంటే మమ్మల్ని పోయి మదర్సాలో చేరమని చెప్పారు. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ మేము నిరసన చేపట్టామని తెలిపారు. బెదిరింపులు.. విద్యార్థినుల నిరసన వీడియోలు బాగా వైరల్ అయిన తర్వాత ఉగ్రవాదుల నుండి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. దీంతో అదేరోజు సాయంత్రం ప్రిన్సిపాల్ విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇది కూడా చదవండి: కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం! -
హిజాబ్ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్
ఇరాన్లో హిజాబ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్ విషయంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు, యువతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో ఓ వ్యక్తి ఇద్దరు యువతులపై అనుచితంగా ప్రవర్తించాడు. బహిరంగ ప్రదేశాల్లో తమ జుట్టును హిజాబ్‌తో కప్పి ఉంచనందుకు ఇద్దరు మహిళలపై పెరుగుతో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు యువతులు హిజాబ్ పూర్తిగా ధరించకుండా కిరాణ షాప్‌లోకి వెళ్లారు. వాళ్లను ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన ఓవ్యక్తి ఇద్దరితో కొద్దిసేపు ఆగ్రహంగా మాట్లాడాడు. ఎందుకు హిజాబ్ ధరించలేదంటూ వాగ్వాదానికి దిగాడు. వెంటనే కోపంలో దుకాణంలో ఉన్న పెరుగును తీసి ఇద్దరి తలలపై విసిరేశాడు. ఊహించని పరిణామంతో ఇద్దరు యువతులు అలాగే ఉండిపోయారు. దీంతో షాప్ యజమాని బయటకు వచ్చి దాడి చేసిన వ్యక్తిని చితకబాదాడు. చివరికి ఈ ఘటన పోలీసుల వరకు చేరింది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు. అతనితోపాటు ఇద్దరు యువతులను కూడా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించినందుకు అదుపులోకి తీసుకుంటున్న చెప్పారు. ఇదిలా ఉండగా ఇరాన్ అధికారిక చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల పై వయసున్న బాలికలు, మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధనలు ఉన్నాయి. مشهد، شاندیز از صفحه یاسر عرب pic.twitter.com/zstrtACMQD — Mehdi Nakhl Ahmadi (مهدی نخل احمدی) (@MehdiNakhl) March 31, 2023 -
ఇద్దరు హిజాబ్ ఆందోళనకారులను ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం
టెహ్రాన్: కొద్ది రోజుల క్రితం ఇరాన్లో హిజాబ్ ఆందోళనలు ఉద్ధృతంగా మారిన విషయం తెలిసిందే. చాలా చోట్ల ఘర్షణలు చెలరేగి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే నిరసనకారుల దాడిలో ఓ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇతడి మృతికి కారణమైన ఇద్దరు ఆందోళనకారులకు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. శనివారం ఉదయం వీరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. అలాగే మరో 11 మందికి జైలు శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం నలుగురికి మరణశిక్ష అమలు చేసింది ఇరాన్ ప్రభుత్వం. మొత్తం 26 మందికి ఇదే శిక్ష విధించాలని ఇరాన్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
'ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం'
ఇరాన్‌కు చెందిన చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వెంటనే ఇరాన్‌కు తిరిగి రావాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరేమో ఇరాన్ అడుగుపెడితే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సారా ఖాదిమ్ తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో కజకిస్తాన్ పోలీసుల సహకారంతో చెస్ ఆటగాళ్లకు భద్రత కల్పించేందుకు టోర్నమెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా సారా ఖాదిమ్ ఉంటున్న హోటల్ గది వెలుపల నలుగురు సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇరాన్‌కు చెందిన స్టార్ చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్ ప్రస్తుతం కజికిస్తాన్‌లోని ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నది. అయితే, చెస్ టేబుల్‌పై ఆమె తలకు హిజాబ్ ధరించకుండా కూర్చుండి ఆడుతున్న ఫొటోలు మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. దాంతో ఆమెకు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. హిజాబ్ ధరించకుండా చెస్ పోటీల్లో ఎలా పాల్గొంటామని ఆకతాయిలు హెచ్చరిస్తున్నారు. పోటీలను అర్దాంతరంగా ముగించి వెంటనే స్వదేశానికి రావాలని కొందరు హెచ్చరిస్తుండగా.. మరికొందరేమో ఇక్కడికి వస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. -
ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతు తెలుపుతున్న వారిపైనా ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే వందల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో వేసింది. పలువురిని బహిరంగంగానే ఉరి తీసిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలినందుకు ప్రముఖ సినీ నటి, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38)ను అరెస్ట్ చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు కారణమవుతున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తస్నిమ్ న్యూస్ నివేదించింది. 2016లో ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ద సేల్స్‌మ్యాన్’ ద్వారా నటి తరనేహ్ అలిదూస్తి అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ 8న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు అలిదూస్తి. అదే రోజు మొహ్సెన్ షేకారి(23) అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగానే ఉరి తీయటం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇన్స్టాగ్రామ్ వేదిగా ఓ పోస్ట్ చేశారు.‘మీరు మౌనంగా ఉండడం అంటే అణచివేత, అణచివేతదారులకు మద్దతుగా నిలిచినట్లే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం మానవత్వానికి అవమానకరం’అని రాసుకొచ్చారు నటి తరనేహ్ అలిదూస్తి. టీనేజ్ నుంచి ఇరాన్ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి తరనేహ్ అలిదూస్తి. ఇటీవల విడుదలైన ‘లైలా బ్రదర్స్’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
ఇరాన్లో ‘నైతిక పోలీస్’ రద్దు
టెహ్రాన్: మహ్సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు. హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది... అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. -
వైరల్ వీడియో: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే!
-
ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే!
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. సాధారణంగా తమ జట్టు మ్యాచ్ ఓడిపోతే ఆ దేశస్థులు నిరాశ చెందుతారు. కానీ అందుకు భిన్నంగా సొంత జట్టు ఓటమిపాలవ్వడంతో ఇరాన్లో వేడుకలు జరుపుకుంటున్నారు. వందలాది సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్‌లో ఉత్సాహంతో డ్యాన్లు కూడా చేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరాన్లో ఈ వేడుకలకు కారణం దేశ వ్యాప్తంగా గతకొంత కాలంగా జరుతున్న ఆందోళనలే. హిజాబ్ ధరించమంటూ అక్కడి మహిళలు కదం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అటు ఇరాన్ ప్రభుత్వం సైతం నిరసనకారులను తీవ్రంగా అణచివేస్తోంది. ఇలాంటి గంగరగోళ పరిస్థితుల్లో తమ దేశ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనడాన్ని ఖండిస్తున్నారు. ఆందోళనతో ఓవైపు జనం చనిపోతుంటే ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లడం అవసరమా అని జనం అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంతోనే ఇన్ని రోజులు రోడ్లపై ఆందోళనలు చేసిన ప్రజలు.. ఇప్పుడు ఆనందంతో వీధుల్లో చిందులేస్తున్నారు. Iran is a country where people are very passionate about football. Now they are out in the streets in the city of Sanandaj & celebrate the loss of their football team against US. They don’t want the government use sport to normalize its murderous regime.pic.twitter.com/EMh8mREsQn pic.twitter.com/MqpxQZqT20 — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) November 29, 2022 ఇదిలా ఉండగా అమెరికాతో మ్యాచ్ ముందు తమ ఆటగాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే వారి కుటుంబ సభ్యలుపై చర్యలు తీసుకొంటామని ఇరాన్ బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ప్రముఖ మీడియా కథనాలు ప్రచురించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సమయంలో ఇరాన్ ఆటగాళ్లలో కొందరు జాతీయ గీతం పాడేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇరాన్లో హిజాబ్ మంటలు రగులుతూనే ఉన్నాయి. వేలాదిగా యువత, మహిళలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఆందోళనకారులను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారురు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనల కారణంగా సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో హిజాబ్ సరిగ్గా ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మృతి చెందింది. అప్పటి నుంచి ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. తాము హిజాబ్‌ను ధరించమని చెబుతూ.. కొందరు జుట్టు కత్తిరించుకోగా.. మరికొందరు హిజాబ్‌ను తగలబెట్టారు. అలా మొదలైన నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతూనే ఉన్నాయి. చదవండి: 24 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన లంక -
FIFA WC: పిచ్చి వేషాలు వేస్తే జైలుకే.. ఇరాన్ జట్టుకు హెచ్చరిక!
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆ దేశపు ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో ఆడిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఆటగాళ్లు నిరసన అందరిని ఆశ్చర్యపరిచింది. దేశం కోసం ఆడేటప్పుడు జాతీయ గీతం ఆలపించకుండా మౌనం పాటించడం మంచి పద్దతి కాదని ఇరాన్ జట్టు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లవెత్తాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఈ మీటింగ్ లో ఐఆర్సీజీ ప్రతినిధులు.. ఫుట్‌బాల్ ప్లేయర్లను మందలించారని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు గానీ.. ఆట జరిగే సమయంలో గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జైలుకు పంపిస్తామన్నారు. అంతేకాదు ఆటగాళ్ల కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు అన్ని జట్ల మాదిరిగానే నిబంధలను పాటించాలని, నిరసనలు, మౌనం వహించడం వంటి చర్యలకు దిగితే సహించేది లేదని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు సమాచారం.మరోసారి అలా చేస్తే జైలు శిక్ష తప్పదని.. ఆటగాళ్ల కుటుంబాలకు కూడా నరకం చూపిస్తామని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీ బెదిరింపులకు భయపడిన ఇరాన్ జట్టు ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపిన ఇరాన్.. తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో మాత్రం యథావిధిగా జాతీయ గీతాలపన చేసింది. ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా బుధవారం (నవంబర్ 30) ఆ జట్టు యూఎస్ఏతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో సక్రమంగా ఉండాలని, గెలిచినా ఓడినా ఫర్వాలేదు గానీ పిచ్చి వేషాలేస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్జీసీ హెచ్చరించినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' FIFA WC: ఖతర్‌ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్ -
జాతీయ గీతం పాడనందుకు ఆటగాళ్లను చంపాలనుకున్నారు..!
ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఐరాన్ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో 6-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐరాన్.. పటిష్టమైన ఇంగ్లండ్‌ను సమర్ధవంతంగా ఢీకొట్టినప్పటికీ, ప్రత్యర్ధిని నిలువరించడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఐరాన్ ఓడినా.. ఆ జట్టు కనబర్చిన పోరాటపటిమ అందరినీ ఆకట్టుకుంది. ప్రాంతాలకతీతంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఐరాన్ ఆటగాళ్లను ప్రశంసించారు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐరాన్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపన చేయకపోవడం పలు వివాదాలకు దారి తీసింది. స్వదేశంలో హిజాబ్ విషయంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆటగాళ్లు సామూహికంగా జాతీయ గీతాలాపనను బాయ్‌కాట్ చేశారు. ఇందుకు చాలా మంది ఐరాన్ అభిమానులు కూడా మద్దతు తెలిపారు. అయితే, తమ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం కొందరు ఐరాన్ అభిమానులకు రుచించలేదు. జాతీయ గీతాన్ని ఆలాపించకపోవడం దేశాన్ని అవమానించినట్లు అని భావించిన వారు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొందరైతే ఇంగ్లండ్ చేతిలో మ్యాచ్ ఓడిపోయాక, ఆటగాళ్లను చంపాలని చూశారని ఐరాన్ మేనేజర్ కార్లోస్ క్విరోజ్ (పోర్చుగల్) ఆరోపించారు. విషయం ఏదైనప్పటికీ ఆటగాళ్లను చంపాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన అని, దీన్ని నేను పూర్తి ఖండిస్తున్నానని కార్లోస్ అన్నాడు. జట్టుకు మద్దతుగా నిలవడం ఇష్టం లేకపోతే, ఇంటికెళ్లి కూర్చోవాలే కానీ, ఆటగాళ్లను చంపుతామని ప్రకటనలు చేయడం సరికాదని అల్లరి మూకలను హెచ్చరించాడు. -
ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ పై ఇంగ్లండ్ 6-2తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్ల చర్య ప్రస్తుతం వైరల్ అవుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల జాతీయ పతాకాలతో జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపనలో భాగమయ్యారు. కానీ ఇరాన్ ఫుట్‌బాలర్లు మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో తమ జాతీయ గీతం వినిపిస్తున్నప్పటికీ శ్రుతి కలపకుండా మౌనంగా నిరసన తెలిపారు. వారి దేశంలో హిజాబ్ కట్టుబాట్లపై ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం వల్ల కొన్ని నెలలుగా ఇరాన్ అగ్నిగుండం అవుతోంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో మహిళా నిరసనకారుల గళానికి ఇరాన్ ఆటగాళ్లు దోహాలో తమ మౌనాన్ని జత చేశారు. చదవండి: FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ శుభారంభం -
ఇరాన్లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి
టెహ్రాన్: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ యువత, మహిళలు చేపట్టిన ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. సెప్టెంబర్‌లో మహ్సా అమీని మరణం తర్వాత ఈ నిరసనలు మరింత ఉదృతమయ్యాయి. వేలాది సంఖ్యలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కూడా ఆందోళనకారులను అణచివేస్తుంది. అల్లర్లలో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ ఉరిశిక్షలు విధిస్తుంది. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిగాయి. ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులు, భద్రతా బలగాలపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా, 15మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడిని ఉగ్రవాద కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటించలేదు. రెండు బైక్‌లపై వచ్చిన సాయుధ, ఉగ్రవాద శక్తులు ఇజెహ్ సీటిలోని సెంట్రల్ మార్కెట్లోకి వచ్చాయని, అక్కడే ఆందోళనకారులపై కాల్పులు జరిపాయని అక్కడి మీడియా పేర్కొంది. ఘటనలో పోలీసులు కూడా గాయపడినట్లు ఖుజెస్తాన్ డిప్యూటీ గవర్నర్ వాలియెల్లా హయాతీ తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళతోపాటు చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, నిందితుల వారికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 26న షిరాజ్‌లో నిరసనకారులపై ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 13 మంది మరణించిన విషయం తెలిసిందే. చదవండి: చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి.. -
Hijab: నిరసనకారులకు గుణపాఠమా?!
హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన అందరికీ ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానించింది. 290 మంది సభ్యులున్న ఇరాన్ పార్లమెంటులో 227 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మసూద్ సెతాయ్షి నవంబర్ 6వ తేదీన పార్లమెంటు సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలియజేశారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 15 వేల మంది అరెస్టయ్యారు. నిర్ణయాత్మక శిక్ష అంటే మరణ శిక్షా అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇరాన్ కోర్టులు ఎలా వ్యవహరిస్తాయనేది చూడాలి. మనిషి మనుగడ పూర్తిగా ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళిపోవడం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవాంఛనీయం. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన సుమారు 15 వేల మందికి ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి నియమించిన 16 మంది మానవ హక్కుల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. నవంబర్ 11వ తేదీన ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిరసనలను, ఉద్యమాలను అణచి వేయాలనే లక్ష్యంతో ఇరాన్ ప్రభుత్వం విధించిన శిక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ప్రాథమికమైన స్వేచ్ఛను సాధించుకోవడానికి చేస్తున్న ఉద్యమాలను అణచివేసే పద్ధతిని మానుకోవాలని కోరారు. ఇప్పటికే... అంటే అక్టోబర్ 29న తెహరాన్ రాష్ట్ర పరిధిలోని ఇస్లామిక్ రివల్యూషన్ కోర్టు ఈ ఉద్యమంలో పాల్గొన్న 8 మందికి మరణశిక్షను విధించింది. ఇరాన్ చట్టం ప్రకారం ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం’ అనే నిబంధన ప్రకారం ఈ శిక్షలు విధిస్తారు. అదేవిధంగా అదే కోర్టు ప్రాసిక్యూటర్ మరో వేయిమంది పేర్లను ఈ కేసులో చేర్చారు. దీని తర్వాతనే ఇరాన్ పార్లమెంటు అన్ని కోర్టులకు ఇదే విధమైన కఠిన చర్యలను తీసుకోవాలని తీర్మానించింది. ఒక ఉద్యమంలో పాల్గొన్నందుకు మూకుమ్మడిగా ‘15 వేల మందికి’ పైగా కార్యకర్తలకు ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించాలని ఒక ప్రజాప్రతినిధుల సభ తీర్మానం చేయడం ప్రపంచ చరిత్రలోనే చాలా దుర్మార్గమైన చర్య. ఇంతమందికి గుణపాఠం నేర్పాలని ఇరాన్ ప్రభుత్వం ఎందుకు అంతగా ఉద్రేకపడుతున్నదనేది ప్రశ్న. ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఇరాన్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 638లో పేర్కొన్నదాని ప్రకారం హిజాబ్‌ను ఉల్లంఘిస్తే, పదిరోజుల నుంచి రెండు నెలల వరకు జైలు శిక్షను అనుభవించాలి. 55,500 రూపాయల జరిమానాను చెల్లించాలి. ఇంకా అవసరమైతే 74 కొరడా దెబ్బల శిక్షను కూడా అమలు చేస్తారు. కోర్టుకన్నా ముందు హిజాబ్‌ను సక్రమంగా పాటిస్తు న్నారా లేదా అని పర్యవేక్షించడానికి ‘మెరాలిటీ పోలీసు’ ప్రత్యేక విభాగమే ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న 22 ఏళ్ళ కుర్దిష్–ఇరానియన్ యువతి మహసా అమీని హిజాబ్‌ను సక్రమంగా ధరించలేదని అరెస్టు చేశారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులతో ఉంది. తెహరాన్ నగరాన్ని చూడటానికి కుటుంబ సమేతంగా వచ్చింది. అమీనీని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించుకొని, తీసుకెళ్ళారు. అదే వాహనంలో ఆమెను కొట్టి, తీవ్రంగా హింసించినట్టు ఆమె సోదరుడు చెప్పారు. ముఖం ఉబ్బిపోయి, కాళ్ళు చేతులు నల్లగా మారిపోయిన స్థితిలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పితే, వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. మూడు రోజుల తర్వాత మహసా అమీని మరణించింది. ప్రభుత్వం మాత్రం ఆమె గుండెనొప్పితో బాధపడితే కుటుంబానికి అప్పజెప్పామని ప్రకటించింది. ఈ దారుణానికి నిరసనగా, వేలమంది వీధుల్లోకి వచ్చి ‘మహిళ–జీవితం–స్వేచ్ఛ’ అంటూ యావత్ ప్రపంచమే కదలిపోయే మహిళా ప్రభంజనానికి ఊపిరిలూదారు. ప్రపంచ మహిళా ఉద్యమాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలువదగిన మహోద్యమాన్ని ప్రారంభిం చారు. పోలీసులు, భద్రతా బలగాలు తమ నిర్బంధ కాండతో ఉద్యమాన్ని అణచివేయాలని చూశాయి. నిరసన ఆరంభమైన వారం రోజులకే అంటే సెప్టెంబర్ 20న పదహారేళ్ల నికా శకరామీని అపహరించి, చంపేశారు. సెప్టెంబర్ 21న 22 ఏళ్ళ హదీస్ నజఫీ కూడా భద్రతా బలగాల చేతిలో బలైపోయింది. ఈ రెండు ఘటనలూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకూ 326 మందిని ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపినట్టు ఇరాన్ మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. ఇందులో 43 మంది పిల్లలు, 25 మంది మహిళలున్నారు. ఈ ఉద్యమంలో కేవలం మహిళలే కాకుండా, మగవారు, ప్రత్యేకించి కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు మహిళలకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కేవలం హిజాబ్‌కు వ్యతిరేక ఉద్యమం మాత్రమే కాదు, అయాతుల్లాహ్ ఖొమైనీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాల పట్ల నిరసన కూడా. ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఈనాటిది కాదు. 1935 నాటికి సాంప్రదాయికంగా అమలులో ఉన్న హిజాబ్ విధానాన్ని రజా షా ప్రభుత్వం సడలించింది. ఇది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాదని తేల్చి చెప్పింది. అయితే 1979లో ఇరాన్లో సంభవించిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మళ్ళీ హిజాబ్‌ను తప్పనిసరి చేశారు. 1983 వరకు ఇది పకడ్బందీగా అమలు జరిగింది. 1979 హిజాబ్ నిర్భంధాన్ని మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. కానీ 1983లో అది మళ్ళీ అమలులోకి తెచ్చారు. అయినా నిరసన ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ 2017లో, ఇరాన్ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. హిజాబ్‌ను సక్రమంగా ధరించకపోతే, అరెస్టులు ఉండవని చెప్పింది. చిన్న చిన్న జరిమానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణ యాన్ని పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు పాత పద్ధతిలోనే మహిళలపై వేధింపులను కొనసాగించారు. 2018లో ఫర్హాద్ మెసామీ అనే డాక్టర్ హిజాబ్ ఆంక్షలను సంపూర్ణంగా తొలగించాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ని అరెస్టు చేసి, జైలుకి పంపారు. 2019 ఏప్రిల్‌లో నస్రీన్ సోతోదేహ్ అనే మానవ హక్కుల కార్యకర్త జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని 38 సంవత్సరాల జైలు, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2019 ఆగస్ట్‌లో ఇరాన్ పౌరహక్కుల కార్యకర్త సబా కొర్ద్ అఫ్షారీ బహిరంగంగా తన హిజాబ్‌ను తొలగించినందుకు 24 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఇవన్నీ కేవలం దేశభద్రత, దైవదూషణ పేరుతో వేసిన కఠోర శి„ý లేనన్న విషయం మర్చి పోకూడదు. 2022 జూలైలో సెపిదే రష్ను అనే రచయిత్రిని కూడా హిజాబ్ నేరం కింద అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ దెబ్బ లతో ఆమె చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి నిరసనగా వందలాది మంది మహిళలు బహి రంగంగా ముఖం మీద, తలమీద ఉన్న దుస్తులను తొలగించి నిరసన తెలిపారు. 2022 ఆగస్ట్ 15న హిజాబ్ నిబంధనలను మరింత కఠిన తరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్ ధరించని మహిళలను ప్రభుత్వోద్యోగాల నుంచి తొలగించడం లాంటి కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ పరంపరలోనే సెప్టెంబర్ 13న మహసా అమీనీ అరెస్టు, తదనంతరం ఆమె మరణం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. ఇరాన్‌లోనే కాదు, చాలా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజల జీవి తాల్లోకి, వారి అలవాట్లలోకి చొరబడి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను నలిపి వేస్తున్నాయి. మన దేశంలో కొన్ని చోట్ల ఇటీవల హిజాబ్ ధరించిన ముస్లిం యువతులను వేధించే సంఘ టనలు జరిగాయి. ఇరాన్లో బలవంతంగా హిజాబ్‌ను అమలు చేయడం, భారత్‌లో తమ ఇష్టాలకు, అభిప్రాయాలకు భిన్నంగా హిజాబ్‌ను తొలగించాలని చూడడం రెండూ తప్పే. ప్రజలు తినే తిండి మీద, ధరించే దుస్తుల మీద, మాట్లాడే భాష మీద, ఆచరించే అల వాట్ల మీద ఆంక్షలు విధించడం, వేధించడం ఎంతమాత్రం వాంఛ నీయం కాదు. ప్రస్తుతం ఇరాన్లో పార్లమెంటు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనీ, ఇరాన్ మహిళల హక్కులను రక్షించాలనీ, అంతిమంగా మానవ హక్కులను పరిరక్షించాలనీ ప్రపంచ ప్రజలంతా ఇరాన్ మహిళలకు అండగా నిలబడాలి. మనమంతా ఒక్కటే అనే భావనను ఎలుగెత్తి చాటాలి. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 81063 22077 -
హిజాబ్ హీట్: పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ ‘జామీ ఆలివర్’ మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు తీవ్రంగా కొట్టటం వల్ల ప్రముఖ చెఫ్ మెహర్షాద్ షాహిదీ అలియాస్ ‘జామీ ఆలివర్’ మృతి చెందటం కలకలం సృష్టించింది. ఆయన అంత్యక్రియలకు శనివారం వేలాది మంది హాజరయ్యారు. మెహర్షాద్ షాహిదీ 20వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. అరక్ సిటీలో మెహర్షద్ షాహిదీని అదుపులోకి తీసుకున్నారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. వారు తీవ్రంగా కొట్టటం ద్వారా మెహర్షద్ షాహిదీ పుర్రె దెబ్బతిని బుధవారం మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘అరెస్ట్ చేసిన తర్వాత లాఠీతో కొట్టటం ద్వారానే మా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల ఒత్తిడి కారణంగా గుండె పోటుతో మరణించాడని చెప్పాల్సి వచ్చింది.’ అని బాధితుడి బంధువు ఒకరు ఇరాన్ ఇంటర్నేషనల్ టీవీకి తెలిపారు. మెహర్షద్ షాహిదీ గుండెపోటుతోనే మరణించాడని చెప్పాలని అధికారులు ఒత్తిడి చేశారని ఆయన కుటుంబం సభ్యులు సైతం వెల్లడించారు. మెహర్షద్ షాహిదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 25వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేసిన వంటలు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇదీ చదవండి: హిజాబ్ ధరించలేదని పోలీసుల టార్చర్?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి -
ఎట్టకేలకు ముసుగు తీసి.. ముఖం చూపెట్టింది
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలిని పోలిన ముఖ కవళికలతో.. ఓవరాల్‌గా భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆ మధ్య ఫేమస్ అయ్యింది ఒక యువతి(21). అయితే ఎట్టకేలకు ఆమె తన ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అదీ జైలు నుంచి విడుదలైన తర్వాతే!. ఇరాన్‌కు చెందిన సహర్ తబర్.. 2019లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లింది. ఎంజెలీనా జోలిలా మారాలనే ఆశతో సర్జరీలు చేయించుకుంటే.. అవి వికటించిన వికృతంగా మారినట్లు తబర్పై ఓ ప్రచారం ఉండేది. ఆపై జరిగిన పరిణామాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. మోసం, దైవదూషణ నేరానికిగానూ ఆమెకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. హిజాబ్‌ను అవమానించిన ఆరోపణలకుగానూ ఆమె ఈ శిక్ష పడింది. అయితే.. 14 నెలలకే ఆమెకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. అందుకు కారణం.. 40 రోజులుకు పైగా అక్కడ మహిళా లోకం చేస్తున్న పోరాటం. మహ్సా అమినీ మృతి తర్వాత.. ఇరాన్లో ఉవ్వెత్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది. ఇదే అదనుగా సహర్ తబర్‌ను సైతం విడుదల చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో నినదించారు. మసిహ్ అలినెజద్ లాంటి ఉద్యమకారిణి సహా పలువురు సామాజిక వేత్తలు తబర్ విముక్తి కోసం పోరాడారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం తగ్గి.. తబర్‌ను విడుదల చేసింది. హిజాబ్ విషయంలో ఆమె చేసిన ఒక చిన్న జోక్.. ఆమెను కటకటాల పాల్జేసింది. ఆమె కన్నతల్లి రోజూ కన్నీరు కార్చింది. ఈ వ్యవహారంలో నటి ఏంజెలీనా కలగజేసుకోవాలని మసిహ్ అలినెజద్ కోరారు కూడా. అయితే.. హిజాబ్ వ్యతిరేక నిరసనల నడుమ జైలు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఇక బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాక.. తబర్ ఓ టీవీ ఛానెల్ ద్వారా తన అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది. గతంలో ముఖానికి తాను కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమేనని, అయితే.. వికృతంగా రూపం మాత్రం మారలేదని ఆమె వెల్లడించింది. సోషల్ మీడియాలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫొటోల వెనుక.. ఫొటోషాప్ ఎడిటింగ్, కంప్యూటర్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆమె తెలిపింది. ఇదిలా ఉంటే.. 2017లో సర్జరీలు వికటించడంతో దెయ్యంలా మారిందంటూ తబర్ గురించి కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆ ఫొటోలతోనే జాంబీ ఎంజెలీనా జోలిగా ఆమెకు సోషల్ మీడియాలో పేరు ముద్రపడిపోయింది. తబర్ అసలు పేరు ఫతేమెహ్ కిష్వంద్. సుమారు 50 సర్జరీలు చేయించుకున్నట్లు.. అవి వికటించడంతో దెయ్యంలా మారినట్లు అబద్ధం చెప్పింది. ఒక హీరోయిన్గా కంటే.. ఇలా సర్జరీలు వికటించిన బాధితురాలిగా పేరు ఎక్కువే దక్కించుకోవచ్చన్న ఆలోచన కొంతమేర వర్కవుట్ అయినా.. ఆపై బెడిసి కొట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
Hijab: అరెస్ట్ కాదు.. ఆమెకు ఘన స్వాగతం!
టెహ్రాన్: అంతర్జాతీయ క్రీడా వేదికలో హిజాబ్ లేకుండా పాల్గొని.. వార్తల్లో ప్రముఖంగా నిలిచింది ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ. అయితే.. ఆపై ఆమె ప్రభుత్వాగ్రహానికి గురికాకతప్పదని, జైలు శిక్ష ఖాయమని అంతా భావించారు. అంతేకాదు.. స్వయంగా ఆమె తన అరెస్ట్ భయాన్ని సైతం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కనిపించడం లేదన్న కథనాలతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇక భయాందోళనల నడుమ బుధవారం వేకువజామున రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. వేల మంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఆమెకు ఘనస్వాగతం పలికారు. హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్న ఆమె తెగువకు సలాం చేస్తూ నినాదాలు చేశారు. ఆ గ్రాండ్ వెల్కమ్ను రెకాబీ సైతం అంతే ఆత్మీయంగా స్వీకరించింది. 33 ఏళ్ల వయసున్న రెకాబీ.. ఇరాన్ తరపున సియోల్(దక్షిణ కొరియా రాజధాని)లో ఆదివారం జరిగిన క్లయింబింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో హిజాబ్‌తోనే ఆమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆదివారం ఈవెంట్ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకపోవడంతో ఆమె ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పదని అంతా భావించారు. ఇరాన్లో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో భాగంగానే ఆమె అలా చేసి ఉంటుందని అంతా చర్చించుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అరెస్ట్ కాక తప్పదని అనుకున్నారు. కానీ, ఆ అంచనా తప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని గతంలో స్పందిస్తూ.. ఇరాన్ మహిళా అథ్లెట్లకు మెడల్స్ కంటే హిజాబ్ ముఖ్యమని సూచించారు. అయితే.. రెకాబీ మాత్రం హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో పాల్గొంది. ఇక హిజాబ్ తొలగింపుపై ఇరాన్ నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్తూ.. అది అనుకోకుండా జరిగిందంటూ ఓ సందేశం సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన ఆమెకు.. ముందు ముందు ఎలా ఉంటుందన్నది చూడాలి మరి!. ఇదీ చదవండి: తప్పు జరిగిపోయింది.. క్షమించండి -
బిహార్‌లోనూ హిజాబ్ లొల్లి
ముజఫర్‌పూర్: హిజాబ్ తొలగించేందుకు నిరాకరించినందుకు టీచర్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ విద్యార్థిని ఆరోపించడం బిహార్‌లో దుమారం రేపింది. ముజఫర్‌పూర్‌లోని మహంత్ దర్శన్ దాస్ మహిళా కాలేజీలో ఆదివారం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష పాసైన వారే ఇంటర్ ఫైనల్ పరీక్షకు అర్హులవుతారు. చెవులు కనిపించేలా హిజాబ్‌ను తొలగించాలని ఓ ఇన్విజిలేటర్‌గా వచ్చిన టీచర్ కోరగా పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని తిరస్కరించింది. దీంతో, టీచర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారంటూ ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారంపై పరీక్ష నిర్వాహకులు రెండు వర్గాల వారితో మాట్లాడి సర్ది చెప్పి పంపించారు. విద్యార్థులు కొందరు మొబైళ్లు, హెడ్ ఫోన్లతో పరీక్ష హాల్లోకి వస్తున్నారని, బ్లూటూత్‌ను ధరిస్తున్నారనే అనుమానంతోనే ఇన్విజిలేటర్ ఆమెను హిజాబ్‌ను చెవులు కనిపించేలా వెనక్కి తప్పించాలని అడిగారే తప్ప, తీసివేయాలని కాదని కాలేజీ ప్రిన్సిపాల్ కాను ప్రియ తెలిపారు. సదరు విద్యార్థిని చేసిన ఆరోపణలు అవాస్తవాలని తమ విచారణలో తేలిందని అన్నారు. -
హిజాబ్ తీర్పుపై సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం
-
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
Hijab Protests: వలువలు విప్పేసి స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ: మహ్సా అమినీ(22) మృతి చెంది నెలన్నర గడుస్తోంది. అయినా ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల సెగ చల్లారడం లేదు. పైగా ఇరాన్ వనితాలోకం పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతూ పోతోంది. తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ నటి తన వలువలు విప్పి తన నిరసనను బహిరంగంగా తెలియజేసింది. ఇరాన్ నటి, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో నటించిన ఎల్నాజ్ నోరౌజీ(30) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరాన్ పోలీసుల నైతికతకు వ్యతిరేకంగా ఓ వీడియోను ఉంచింది. నిండుగా బుర్ఖాలో వచ్చిన ఆమె.. ఒక్కొక్కటిగా ఒంటిపై ఉన్న వలువలు విప్పేస్తూ చివర్లో.. యాంటీ హిజాబ్ నినాదాన్ని పోస్టు చేసి నిరసనను తెలియజేసింది. ‘‘ప్రతి స్త్రీ.. ప్రపంచంలో ఏమూల ఉన్నా.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచ్చింది ఆమె ధరించే హక్కును కలిగి ఉండాలి. ఏ మగవాడుగానీ, మరేయితర స్త్రీగానీ ఆమెను వేరే దుస్తులు ధరించమని అడిగే హక్కు ఉండకూడదు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఉంచింది. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వారిని అంతా గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం. ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని ప్రచారం చేయడం లేదు.. స్వేచ్ఛను మాత్రమే ప్రచారం చేస్తున్నాను అంటూ పోస్ట్ చేసిందామె. ఇరాన్‌కు చెందిన నటి నోరౌజీ.. నటన కంటే ముందు పదేళ్ల పాటు డియోర్, లాకాస్టే, లె కాక్యూ స్పోర్టివ్ లాంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా పని చేశారు. పర్షియన్ ట్రెడిషనల్ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకున్నారు. View this post on Instagram A post shared by Elnaaz Norouzi (@iamelnaaz) This Video Is Not To Promote Nudity -
Iran Hijab Protest: మరో ఇద్దరు ఆందోళకారులు మృతి
సులిమానియా: ఇరాన్లో నాలుగు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరో ఇద్దరు చనిపోయారు. నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కుర్దిష్ ప్రాబల్య సనందాజ్ పట్టణంలో శనివారం ప్రదర్శన చేపట్టారు. నిరసనలో భాగంగా కారు హారన్ మోగించిన ఓ వ్యక్తి భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోయాడని పేర్కొన్నాయి. హిజాబ్ ధరించలేదనే కారణంతో మోరల్ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని(22) అనే కుర్దిష్ మహిళ కస్టడీలో మృతి చెందింది. నిరసనగా సెప్టెంబర్ 17 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. చదవండి: పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం! -
హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్!
టెహరాన్: మాహ్సా అమీని(22) అనే యువతి మృతితో ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిజాబ్ సరిగా ధరించలేదన్న ఆరోపణలతో నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, అమీని మృతిపై విచారణ చేపట్టిన అధికారి నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆమె అనారోగ్య కారణాలతోనే మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. తల, శరీర భాగాలకు దెబ్బలు తగలడం వల్ల ఆమె చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు అందులో తేలిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ శుక్రవారం పేర్కొంది. కుటుంబంతో కలిసి టెహ్రాన్ ట్రిప్‌కు వెళ్లిన యువతిని హిజాబ్ ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. అయితే.. ఆ తర్వాత స్ప్రహ కోల్పోయిందంటూ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో అమినీకి గాయాలయ్యాయని, ఆమె మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, తల, కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం వల్ల అమినీ మరణించలేదని నివేదిక పేర్కొనటం గమనార్హం. కానీ, ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతర్లీన వ్యాధుల కారణంగా కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కుప్పకూలిందని తెలిపింది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ఆమె హైపాక్సియాకు గురైందని, ఫలితంగా మెదడు దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: హిజాబ్ ధరించలేదని పోలీసుల టార్చర్?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి -
ఇక చాలూ.. ఆమె చర్యతో పార్లమెంట్లో మౌనం
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్స్): యూరోపియన్ పార్లమెంట్లో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్వీడన్ సభ్యురాలైన అల్ సహ్లానీ ఎవరూ ఊహించని చేష్టలకు దిగారు. ఇరాన్ మహిళలకు సంఘీభావంగా పార్లమెంట్‌లోనే ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో.. తోటి సభ్యులంతా షాక్ తిన్నారు. మహ్సా అమినీ అనే యువతి మృతి నేపథ్యంతో మొదలైన హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృత స్థాయిలో కొనసాగుతున్నాయి అక్కడ. ఈ పోరాటంలో పాల్గొంటున్న ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలిపే క్రమంలో తన జుట్టు కత్తిరించుకున్నారు అల్ సహ్లానీ. ఈయూ పార్లమెంట్లో ఇరాన్ ఆందోళనలపై ఆమె ప్రసంగించారు. ‘‘మౌనంగా ఉంది ఇక చాలూ. ఈయూ పౌరులమైన మనం.. ఇరాన్లో సాధారణ పౌరులపై జరుగుతున్న హింసాకాండను ఆపేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. వాళ్లు(ఇరాన్ పౌరులను ఉద్దేశించి) తమ జీవితాలను పణంగా పెట్టి అక్కడ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఇరాన్‌కు స్వేచ్చ లభించేంత వరకు.. అణచివేతదారుల కంటే మన ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. ఇరాన్ మహిళలు.. మీకు స్వేచ్ఛ లభించేంత వరకు మేం మీకు అండగా ఉంటాం. జిన్ జియాన్ ఆజాదీ(వుమెన్, లైఫ్, ఫ్రీడమ్) అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కత్తెరతో తన పోనీ టేల్‌ను కత్తిరించుకున్నారామె. Traditionen att klippa av sig håret i protest är tusenårig. Den visar att ilskan är starkare än förtryckarens makt. Irans kvinnor har fått nog. EU borde visa samma mod och ge dem fullt stöd. pic.twitter.com/0FdMB9XoXu — AbirAlsahlani (@AbirAlsahlani) October 4, 2022 ఇరాన్లో పుట్టిన అబిర్ అల్-సహ్లానీ.. స్టాక్‌హోమ్(స్వీడన్) హగెర్స్టన్లో స్థిరపడ్డారు. 2009 జులై నుంచి ఆమె స్వీడన్ సభ్యురాలిగా యూరోపియన్ పార్లమెంట్లో కొనసాగుతున్నారు. ఇక ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందికి పైగా సాధారణ పౌరులు మరణించారు. మరోవైపు ఇరాన్ మహిళలు, స్కూల్ చిన్నారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీళ్ల ఆందోళనకు మద్దతుగా ప్రముఖులు సైతం జుట్టు కత్తిరించుకుని సంఘీభావం తెలుపుతున్నారు. -
కుట్ర కోణం?.. ఇరాన్ హిజాబ్ ఆందోళనలపై సంచలన ఆరోపణలు
టెహ్రాన్: హిజాబ్ వేసుకోలేదని మహ్సా అమినీ(22)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అనుమానాస్పద రీతిలో ఆ యువతి మృతి చెందడం.. ఇరాన్లో కార్చిచ్చును రాజేసింది. యావత్ ప్రపంచం తల తిప్పి చూసేలా.. అక్కడి మహిళా లోకం హిజాబ్ వ్యతిరేక నిరసనలు చేపట్టింది. భద్రతా సిబ్బంది ఉక్కుపాదంతో వంద మందిని బలిగొన్న.. తగ్గేదేలే అంటూ ప్రభుత్వ వ్యతిరేక గొంతుకను వినిపిస్తోంది అక్కడి వనితాలోకం. ఇదిలా ఉంటే.. హిజాబ్ ఆందోళలనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని తొలిసారి పెదవి విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నా అయతుల్లా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 83 ఏళ్ల ఇరాన్ సుప్రీం స్పందిస్తూ.. సంచలన ఆరోపణలకు దిగారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల వెనుక కుట్ర కోణం ఉందన్న ఆయన.. వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌లు ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ఈ అల్లర్లకు, అభద్రతా భావానికి కారణం ఏంటో తెలిసింది. ప్రణాళికాబద్దంగా ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే అవి అసాధారణ రీతిలో ఉంటున్నాయి. ఇందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణం. విదేశాల్లో ఉన్న కొంతమంది ఇరానియన్ల సహాయంతో, పెయిడ్ ఏజెంట్లతో ఈ రచ్చకు కారణం అయ్యాయి ఆ రెండు దేశాలు. పోలీసులు నేరస్థులకు ఎదురొడ్డి పోరాడాలి. పోలీసులపై ఎవరు దాడి చేసినా.. వాళ్ల వల్ల నేరస్థులు, దుండగులు, దొంగల నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని గుర్తించాలి. ఈ హింసాత్మక ఆందోళనలను ఖండిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. అలాగే.. అమినీ మృతి ఘటనపై స్పందిస్తూ.. చాలా బాధాకర ఘటన. యువతి మరణం గుండెను బద్దలు చేసింది. అయితే.. ఇది సాధారణ విషయం కాకున్నా.. కొందరు వ్యక్తులు ఎలాంటి ఆధారాలు, విచారణ లేకుండా.. ఆందోళన పేర్లతో ఇరాన్ వీధుల్ని రణరంగంగా మార్చేశారు. ఖురాన్‌ను తగులబెట్టారు. బలవంతంగా కొందరి హిజాబ్‌లను తొలగించారు. మసీదులకు, కార్లకు నిప్పు పెట్టారు. కాబట్టి, హిజాబ్ వ్యతిరేక కుట్రను గుర్తించి.. నిరసనకారులు ఆందోళన విరమించాలని సోమవారం విద్యార్థులు పాల్గొన్న ఓ కార్యక్రమం నుంచి ఆయన పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. నిరసనలు మూడవ వారం సైతం ఉధృతంగా కొనసాగుతుండగా.. ఇరాన్ శత్రువులు కుట్రలో విఫలమయ్యారు అంటూ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక ప్రకటన విడుదల చేశారు. -
‘గీత’ దాటితే శిక్ష తప్పదు.. హిజాబ్ అల్లర్లపై అధ్యక్షుడి ‘రెడ్ లైన్’
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు కదంతొక్కటంతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నారు. మరోవైపు.. నిరసనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బుధవారం తలెత్తిన గందరగోళ పరిస్థితులను తప్పుపట్టారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని రైసీ హెచ్చరించారు. ‘పౌరుల రక్షణే ఇరాన్ ప్రజల రెడ్ లైన్. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరికీ అధికారం లేదు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం‘ అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని, ఇరాన్‌కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందని.. ఫోరెన్సిక్, నిపుణుల బృందం నివేదిక త్వరలోనే వస్తుందని తెలిపారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే 22 ఏళ్ల యువతి సెప్టెంబర్ 16న పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. అమీని మరణించిన మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి -
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. జుట్టు ముడవడమే ఆమె తప్పైంది..
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు హిజాబ్‌పై వ్యతిరేకత తీవ్రతరమవుతోంది. హిజాబ్ ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు మృత్యువాతపడగా.. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. అనేకమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. This 20 Yr old girl who was getting ready to join the protest against the murdering of #MahsaAmini got killed by 6 bullets.#HadisNajafi, 20، was shot in the chest, face and neck by Islamic Republic’s security forces. Be our voice.#مهسا_امینیpic.twitter.com/NnJX6kufNW — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 25, 2022 కాగా 23 ఏళ్ల హదీస్ నజాఫీ అనే ఇరాన్ యువతి.. తన జుట్టు ముడుచుకుంటూ హిజాబ్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నాని తెలుపుతూ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే సదరు యువతిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. యువతి చాతీ, ముఖం, చేతులు, మెడపై కాల్పులు జరిపారు. హదీస్ మరణించినట్లు జర్నలిస్ట్, మహిళా హక్కుల నేత మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ట్వీట్ చేశారు. చదవండి: చరిత్రలోనే తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ఓ మహిళ.. ఎవరీ జార్జియా మెలోని? This is the funeral of 20 year old #HadisNajafi, who was shot dead on the streets by security forces for protesting. Hadis was a kind hearted girl & loved dancing. She was protesting against the brutal death of #MahsaAmini. Their crime: wanting freedom.#مهسا_امینی pic.twitter.com/do9dMoxtxE — isa (@isa63241322) September 25, 2022 అసలేంటి హిజాబ్ వివాదం హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేయగా.. సెప్టెంబర్ 16న కస్టడీలోనే ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండగా.. యువతి గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు హింసించడం వల్లే మరణించిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు, యువత గళమెత్తారు. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ, తమ జుట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. -
హిజాబ్ ఆందోళనల్లో సోదరుడు మృతి.. జుట్టుకత్తిరించుకున్న యువతి
టెహ్రాన్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. 10వ రోజుకు చేరుకున్న ఈ నిరసనలు యావత్ ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేశాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారి పోలీసులు కాల్పులు జరపడంతో ఇప్పటివరకు 41 మంది చనిపోయారు. 2019 చమురు ధరల ఆందోళనల తర్వాత ఇరాన్లో ఇవే అతిపెద్ద నిరసనలు కావడం గమనార్హం. అయితే నిరసనల్లో భాగంగా ఇటీవల జరిగిన ఓ హింసాత్మక ఘటనలో జవాద్ హెయ్దరి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కాల్పుల్లో ఇతను చనిపోయాడు. కాగా.. అంత్యక్రియల్లో అతని సోదరి శోకసంద్రంలో మునిగిపోయింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న అతని మృతికి సంతాపంగా భౌతికకాయం పక్కనే ఏడుస్తూ జుట్టు కత్తిరించుకుంది. ఇందుకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Javad Heydari's sister, who is one of the victims of protests against the murder of #Mahsa_Amini, cuts her hair at her brother's funeral.#IranRevolution #مهسا_امینیpic.twitter.com/6PJ21FECWg — 1500tasvir_en (@1500tasvir_en) September 25, 2022 22 ఏళ్ల మహ్సా అమీని మృతితో ఇరాన్లో హిజాబ్ నిరసనలు ఉద్ధృత రూపం దాల్చాయి. ఆమె హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో దారుణంగా కొట్టడం వల్లే అమీని చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మాత్రం గుండెపోటు వల్లే ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత హిజాబ్ ఆందోళనలు ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు విస్తరించాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లండన్‌లోని ఇరాన్ ఎంబసీ ముందు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. చదవండి: మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు -
ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తున్నాయి. కొత్త నగరాలు, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి, నిర్బంధ హిజాబ్ ధారణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు నిరసనలను ఇరాన్ భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. భద్రతా సిబ్బంది దాడుల్లో ఇప్పటిదాకా 50 మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ హ్యూమన్ రైట్స్(ఐహెచ్ఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రకటించింది. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని రెజ్‌వన్‌షాహర్ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు బలయ్యారని తెలియజేసింది. బబోల్, అమోల్‌లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయా పట్టణాల్లో కాల్పుల్లో పలువురు మృతిచెందారని ఫ్రాన్స్ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ అత్యున్నత మతపెద్ద ఖమేనీ విగ్రహాన్ని ఆయన స్వస్థలం మషాద్‌లో నిరసనకారులు దహనం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా టెహ్రాన్‌లో పలువురు ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్లో పరిస్థితులపై ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
Iran anti-hijab protest: హిజాబ్ అల్లర్లతో...అట్టుడుకుతున్న ఇరాన్
దుబాయ్: ఇరాన్లో హిజాబ్ కల్లోలం చినికిచినికి గాలివానగా మారుతోంది. నిర్బంధ హిజాబ్ ధారణ నిబంధనను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు నానాటికీ మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్‌లను చేబూని జెండాల మాదిరిగా ఊపుతూ భారీ సంఖ్యలో నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటంటూ నిరసిస్తున్నారు. ‘మాకు స్వేచ్ఛ కావాల్సిందే’ అంటూ వీధుల్లోకి వస్తున్నారు. ‘నియంత ఖొమేనీకి మరణమే’, ‘ముల్లాల పీడ వదలాల్సిందే’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బహిరంగంగా జుత్తు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్‌లను తగలబెడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని టెహ్రాన్‌లో ఆందోళనకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పు పెడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పలుచోట్ల ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతూ కన్పించారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. ‘ఓ దేవుడా! వాళ్లు విచక్షణారహితంగా కాల్చి పారేస్తున్నారు’ అని ఆక్రోశిస్తూ జనం చెల్లాచెదురుగా పారిపోతున్న దృశ్యాలు కొన్ని వీడియోల్లో కన్పిస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటిదాకా 26 మంది దాకా మరణించారని దేశ అధికారిక మీడియా సంస్థ చెబుతున్నా శుక్రవారమే ఏకంగా 30 మందికి పైగా బలైనట్టు తెలుస్తోంది. ఆందోళనకారుల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వెలిబుచ్చింది. అతి సమీపం నుంచి కాల్పులకు పాల్పడుతున్నారని ఆక్షేపించింది. ఇరాన్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు అల్లర్లను నిరసిస్తూ ప్రభుత్వ అనుకూల ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. సర్కారు ఉక్కుపాదం నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ర్యాలీలు, ఆందోళనల పిలుపుకు ఆందోళనకారులు ప్రధానంగా ఆధారపడుతున్న ఇన్స్టాగ్రాం, వాట్సాప్ వంటివాటిపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. అనుమానితుల కోసం పోలీసులు ఇంటింటి సోదాలకు దిగుతున్నారు! వందలాది మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేయడం, ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గత శనివారం నుంచి దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు రోడ్లెక్కుతున్నారు. హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ! ఇరాన్ పాలకవర్గంలో గూడుకట్టుకుపోయిన సంప్రదాయవాదానికి తార్కాణమీ ఫొటో. కుర్చీలో కూర్చున్నది సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియాన్ అమన్‌పోర్ (64). ఆమె ఎదురు చూస్తున్నది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కోసం. ఐరాస సర్వసభ్య ప్రతినిధి సభలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన రైసీ ఇరాన్లో చెలరేగుతున్న హిజాబ్ హింసాకాండపై ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తీరా సమయానికి ఆమె హిజాబ్ ధరించాలంటూ పట్టుబట్టారు. అందుకు క్రిస్టియాన్ ససేమిరా అన్నారు. 1995 నుంచీ ఇరాన్ అధ్యక్షులందరినీ హిజాబ్ ధరించకుండానే ఇంటర్వ్యూ చేశానని గుర్తు చేశారు. ‘‘ఇంటర్వ్యూ కోసం వారాల ముందునుంచీ ఏర్పాట్లు చేసుకున్నాం. నేను షెడ్యూల్ ప్రకారం సిద్ధమై అధ్యక్షుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ ఆయన జాడే లేదు. 40 నిమిషాల తర్వాత సహాయకుడొచ్చి నేను హిజాబ్ ధరించి తీరాల్సిందేనని ఆయన కోరుతున్నట్టు తెగేసి చెప్పాడు. అందుకు నిరాకరించి ఇంటర్వ్యూనే రద్దు చేసుకున్నా’’ అంటూ ఈ అనుభవాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. ఇరాన్లో పుట్టిన క్రిస్టియానా 11 ఏళ్లొచ్చేదాకా టెహ్రాన్‌లోనే పెరిగారు. -
హిజాబ్ వేస్కోను.. ఇరాన్ అధ్యక్షుడికి జర్నలిస్ట్ ఝలక్
న్యూయార్క్: ఇరాన్లో హిజాబ్ హీట్ కొనసాగుతున్నవేళ.. మరో ‘అంతర్జాతీయ’ పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత్రికేయ దిగ్గజం క్రిస్టియానే అమన్‌పౌర్(64).. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసికి ఝలక్ ఇచ్చారు. సీఎన్ఎన్ ఛానెల్ తరపున ఆమె, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే.. హిజాబ్ ధరించాలన్న షరతుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెనుదిరిగారు అధ్యక్షుడు రైసి. అమన్‌పౌర్ పుట్టింది లండన్‌లోనే అయినా ఆమె తండ్రి మొహమ్మద్ తఘీ ఇరాన్వాసి. పైగా పదకొండేళ్లవరకు అమన్, టెహ్రాన్‌లోనే పెరిగారు. ప్రస్తుతం CNNకు చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్‌గా పని చేస్తున్నారామె. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసి న్యూయార్క్‌కు వెళ్లారు. ఈ క్రమంలో.. అమన్‌పౌర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే.. ఇంటర్వ్యూకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో అధ్యక్షుడు రైసి సిబ్బంది వచ్చి.. హిజాబ్ ధరించాలంటూ అమన్‌పౌర్‌కు సూచించారు. ‘‘గతంలో ఏ ఇరాన్ అధ్యక్షుడు.. విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతు విధించడం చూడలేదు. కాబట్టి, నేను అంగీకరించను’’ అని ఆమె తేల్చి చెప్పింది. అయితే ఇరాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా(హిజాబ్ వ్యతిరేక నిరసనలు)ధరించాలని, కనీసం తలను కప్పేస్తూ ఏదైనా గుడ్డ చుట్టుకోవాలని రైసీ అనుచరుడొకరు ఆమెకు సూచించాడు. అయినప్పటికీ ఆమె ససేమీరా అనడంతో సిబ్బంది వెనుదిరిగారు. కాసేపటికే.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే అధ్యక్షుడు రైసి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమె ట్విటర్లో తన నిరసన వ్యక్తం చేశారు. తన ఎదురుగా ఖాళీ చెయిర్‌ను చూపిస్తూ.. ఇంటర్వ్యూ తాలుకా సెట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె అందులో వివరిస్తూ.. అధ్యక్షుడు రైసి తీరును తప్పుబట్టారు. And so we walked away. The interview didn’t happen. As protests continue in Iran and people are being killed, it would have been an important moment to speak with President Raisi. 7/7 pic.twitter.com/kMFyQY99Zh — Christiane Amanpour (@amanpour) September 22, 2022 President Raisi “has a history of blood of his hands,” says @hdagres. “There’s a rise in repression in Iran in recent months… [But] Iranians are fed up with the Islamic Republic and as long as things stay as they are, these protests are going to be continuing for years to come.” pic.twitter.com/vy6FpsPpmc — Christiane Amanpour (@amanpour) September 22, 2022 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ నెల మొదటి వారంలో 22 ఏళ్ల వయసున్న మహ్సా అమిని హిజాబ్ అనే యువతిని హిజాబ్ ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్ చేయగా.. కస్టడీలోనే ఆమె కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు గుప్పుమన్నాయి. మహిళలు జుట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇక ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో 31 మంది మృతి చెందినట్లు అనధికార సమాచారం. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి.. హిజాబ్ వ్యతిరేక నిరసనలను ‘గందరగోళ చర్య’గా అభివర్ణిస్తున్నారు. స్వేచ్ఛా హక్కు ఇరాన్‌లోనూ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం చోటు చేసుకున్న అల్లర్లను మాత్రం అంగీకరించబోమని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: హూ ఈజ్ హుస్సేన్?.. గిన్నిస్ రికార్డు -
సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం
ఢిల్లీ: హిజాబ్ పిటిషన్లపై విచారణలో వాదనలు త్వరగతిన పూర్తి చేయాలని, తాము సహనాన్ని కోల్పోతున్నామంటూ విచారణ కొనసాగిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత తొమ్మిది రోజులుగా సుప్రీం బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వింటూనే ఉంది. అయితే.. బుధవారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఉద్దేశించి మందలింపు వ్యాఖ్యలు చేసింది. గురువారం(ఇవాళ) వాదనలు వినిపించేందుకు ఒక గంట టైం ఇస్తాం. ఆలోపు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు పూర్తిగా వినిపించాలి. వాదనలు మరీ శ్రుతిమించి పోతున్నాయి. ఇంతేసి టైం వృధా చేయడం సరికాదు అని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా.. పిటిషనర్లలో ఒకరి తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హుజేఫా అహ్మదికి గట్టిగానే సూచించారు. కర్ణాటక హిజాబ్ బ్యాన్ వివాదంపై.. సుప్రీం కోర్టులో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సల్మాన్ ఖుర్సీద్ల బృందం వాదనలు వినిపిస్తోంది. ఇక కర్ణాటక ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కర్ణాటక అడ్వొకేట్ జనరల్ ప్రభూలింగ్ నవడ్గి, అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపిస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి! -
హిజాబ్ హీట్
ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వారం రోజుల క్రితం 22 ఏళ్ల యువతి మోరల్ పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోవడంతో యువతరం భగ్గుమంది. లక్షలాది మంది అమ్మాయిలు రోడ్డెక్కి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను ఇక ధరించే ప్రసక్తే లేదని తగులబెడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం మతపరంగా తమ హక్కు అని, వాటిని ధరించే విద్యాసంస్థలకు వస్తామని డిమాండ్ చేస్తూ ఉంటే, ఇరాన్లో పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. పోలీసు కస్టడీలో ఏం జరిగింది ? కుర్దిష్ ప్రాంతంలోని సాకేజ్ నగరానికి చెందిన 22 ఏళ్ల వయసున్న మహస అమిని టెహ్రాన్‌కు వచ్చింది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో సెప్టెంబర్ 13న మోరల్ పోలీసులు మెట్రోస్టేషన్ బయట ఆమెని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు కొట్టే దెబ్బలకు తాళలేక నిర్బంధ కేంద్రంలో కోమాలోకి వెళ్లిపోయిన అమిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. వ్యాన్‌లోకి ఎక్కించేటప్పుడే మహిళా పోలీసులు ఆమెను చితకబాదుతూ కనిపించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అమిని అప్పటికే అనారోగ్యంతో ఉందని గుండె పోటుతో మరణించిందని పోలీసుల వాదనగా ఉంది. పోలీసుల వాదనను ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తమ అమ్మాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని వారు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అరెస్ట్‌ల్లో అమ్మాయిల ముఖం మీద గట్టిగా కొడుతూ, లాఠీలు ఝుళిపిస్తూ, వారిని వ్యాన్లలోకి తోసేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయంటూ ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమిని మరణానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసింది. మహిళల్ని ఎలా చూస్తారు ? ఇరాన్లో మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చెయ్యడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రభుత్వ అధికారులుగా కూడా మహిళలున్నారు. కానీ ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు వస్త్రధారణపై కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తారు. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించడం, శరీరం కనిపించకుండా పొడవైన వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలన్న నిబంధనలున్నాయి. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరితో ఒకరు కలిసిమెలిసి తిరగకూడదు. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలపై ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు మహిళలు స్వేచ్ఛగా తమకిష్టమైన దుస్తులు ధరించేవారు. ఇరాన్లో అమ్మాయిల వస్త్రధారణపై ఫిర్యాదుల్ని పరిశీలించడానికి 2005లో మోరల్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల మోరల్ పోలీసులు అత్యంత దారుణంగా అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2017లో హసన్ రౌహని అధ్యక్షుడయ్యాక మోరల్ పోలీసుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశారు. డ్రెస్‌కోడ్ నిబంధనల్ని అమ్మాయిలు ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మత ఛాందసవాది అయిన ఇబ్రహీం రైజి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక మోరలిటీ పోలీసులు చెలరేగిపోతున్నారు. షరియా చట్టాలపై అవగాహన పెంచాల్సిన పోలీసులు అమ్మాయిలపై జులుం ప్రదర్శిస్తున్నారు. గతంలోనూ నిరసనలు ఇరాన్లో మహిళలు హిజాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ 2014లో పెద్ద ఎత్తున ఆన్లైన్ ఉద్యమం నడిపించారు. మై స్టెల్తీ ఫ్రీడమ్ పేరుతో పెద్ద సంఖ్యలో నెటిజన్ల హిజాబ్‌ను ధరించబోమంటూ ఫోటోలు , వీడియోలు చేశారు. వైట్ వెడ్నస్డేస్, గర్ల్సŠ ఆప్ రివల్యూషన్ స్ట్రీట్ అన్న పేరుతో కూడా షరియా చట్టాలకు వ్యతిరేకంగా అమ్మాయిలు ఉద్యమాలు నిర్వహించారు. నిరసనల్లో ఏడుగురు మృతి హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్లో టెహ్రాన్‌తో దాదాపు 15 నగరాలు దద్దరిల్లుతున్నాయి. అమ్మాయిలు, వారికి మద్దతుగా యువకులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో గత ఐదారు రోజుల్లో ఇద్దరు యువకులు సహా ఏడుగురు మరణించారు. నిరసనలు కుర్దిష్ వేర్పాటువాదుల పనేనని ప్రభుత్వం అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిజాబ్‌పై నిషేధం సబబే!
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద కుట్రకు తెరతీసిందని ఆరోపించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషిన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అనంతరం ముస్లిం పిటిషనర్ల తరఫున దుష్యంత్ దవే..‘హిజాబ్‌పై నిషేధంతో దేశంలోని మైనారిటీల మత విశ్వాసాన్ని దెబ్బతీసింది. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లింది’అని పేర్కొన్నారు. హిజాబ్ వంటి మతాచారాలు అత్యవసరమైనవి కాకపోయినా, ఒక వ్యక్తి నచ్చిన వాటిని ఆచరించే క్రమంలో కోర్టులు, యంత్రాంగం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఇదీ చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు -
హిజాబ్‌లు తొలగించి.. జుట్టు కత్తిరించుకుని నిరసనలు
అన్యాయంగా ఓ యువతిని పొట్టనబెట్టుకున్న మోరల్ పోలీసింగ్‌పై.. అక్కడి మహిళా లోకం ఎదురు తిరిగింది. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. 22 ఏళ్ల మహ్సా అమినీ పోలీసుల వేధింపుల వల్లే మరణించిందనే నేపథ్యంతో.. మహిళలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులను తీవ్రంగా అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం యత్నిస్తుండగా.. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను కొనసాగిస్తున్నారు పలువురు. ఇరాన్ మహిళలు చాలామంది బహిరంగంగానే హిజాబ్‌లు తొలగించి.. వాటిని తగలబెడుతున్నారు. మరికొందరు జుట్టును కత్తిరించుకుని.. వాటిని వీడియోలుగా తీసి వైరల్ చేస్తున్నారు. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండంటూ ఇరాన్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిండిన వీడియోలే ఇప్పుడు అక్కడ సోషల్ మీడియాలో పోటెత్తుతున్నాయి. మరోపక్క రోడ్డెక్కిన వేలమంది మహిళలను అణిచివేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టియర్ గ్యాస్, తుపాకులు ప్రయోగించి చెల్లాచెదురు చేస్తున్న దృశ్యాలు ట్విటర్లో కనిపిస్తున్నాయి. Iranian women show their anger by cutting their hair and burning their hijab to protest against the killing of #Mahsa_Amini by hijab police. From the age of 7 if we don’t cover our hair we won’t be able to go to school or get a job. We are fed up with this gender apartheid regime pic.twitter.com/nqNSYL8dUb — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 18, 2022 This is the real Iran, Security forces in Iran’s Saqqez opened fire at peaceful protesters following the burial of #Mahsa_Amini. Several protesters have been injured. First Hijab police killed a 22 Yr old girl and now using guns and tear gas against grieving people.#مهسا_امینی pic.twitter.com/IgUdFEnJCS — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 17, 2022 ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబంధన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టును కవర్ చేసుకోవడంతో పాటు నిండుగా ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే.. బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ కూడా చేస్తారు. దీనిపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. సవరించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా లేదు. Do you really want to know how Iranian morality police killed Mahsa Amini 22 year old woman? Watch this video and do not allow anyone to normalize compulsory hijab and morality police. The Handmaid's Tale by @MargaretAtwood is not a fiction for us Iranian women. It’s a reality. pic.twitter.com/qRcY0KsnDk — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 16, 2022 తాజాగా తన కుటుంబంతో ఆ దేశ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లిన మహ్సా అమినీ.. ఆమె కుటుంబీలకు సమక్షంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఆపై హఠాత్తుగా ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. కోమాలో నుంచే కన్నుమూసిందామె. ఈ ఘటనపై ఇరాన్ మహిళా లోకం భగ్గుమంది. ఆమెపై ఒంటిపై గాయాలున్నాయని ఆమెది ముమ్మాటికీ వేధింపుల హత్యే అని అమినీ కుటుంబంతో సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుండడంతో.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. ఇదీ చదవండి: వాళ్లను తాకొద్దు.. మంకీపాక్స్ వస్తది! -
హిజాబ్: కర్ణాటక సర్కార్‌కు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు.. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందించాలని సర్కార్‌ను కోరింది. అదే సమయంలో పిటిషనర్లను సైతం మందలించింది ధర్మాసనం. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మీరే కోరారు. మళ్లీ వాయిదా అడిగారు. ఆపై మళ్లీ విచారణకు కోరారు. ఇప్పుడు మళ్లీ వాయిదా అడుగుతున్నారు. ఇలాంటి వాటికి ఇక్కడ అనుమతి లేదు.. వాదనలు వింటాం అని పేర్కొంటూ సెప్టెంబర్ 5వ తేదీన వాదనలు ఉంటాయని స్పష్టం చేసింది. యూనిఫాం నిబంధనలను విద్యాసంస్థల్లో కఠినంగా అమలు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి సూచిస్తూ.. హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తన తీర్పులో ఆదేశాలు వెల్లడించింది. దీంతో చాలామంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా అధికారులను ప్రొత్సహిస్తూ.. ప్రభుత్వం సవతి ప్రేమను ప్రదర్శిస్తోందంటూ పలువురు పిటిషన్లలో పేర్కొన్నారు. హిజాబ్ దుమారం ఈ ఏడాది మొదట్లో.. ఉడిపి నుంచి మొదలై దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపెట్టింది. ఇదీ చదవండి: ఆపరేషన్ కమలం విఫలమైందని చూపించేందుకే.. -
మూకస్వామ్యం!
చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. కర్ణాటకలో హఠాత్తుగా తెరపైకొచ్చిన హిజాబ్, హలాల్ వివాదాలు రగిల్చిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈలోగా ఢిల్లీ పరిధిలో బీజేపీ నేతృత్వంలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థల మేయర్లు ఈ నెల 2 నుంచి 11 వరకూ జరిగే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ ఇద్దరు మేయర్లూ తమ తమ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు లేఖలు రాశారు. అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులేవీ లేకపోయినా ఆ నగర పాలక సంస్థల పరిధుల్లో చాలా మాంసం దుకాణాలు మూసివేశారంటేనే సాధారణ దుకాణదారుల్లో ఎంతగా భయం రాజ్య మేలుతున్నదో అర్థమవుతుంది. దేశ రాజధానిగా ఉన్న ఒక మహా నగరంలో ఇలాంటి పరిస్థితు లుండటం సరికాదన్న కనీస ఆలోచన కూడా మన నేతలకు కొరవడుతోంది. మన దేశంలో పుట్టుక చాలా అంశాలను నిర్ణయిస్తుంది. ఏ మతంలో, ఏ కులంలో పుట్టారు.. ఏ జెండర్ వగైరా అంశాల ఆధారంగా ఎవరెలా నడుచుకోవాలో, ఎలాంటి వస్త్రధారణ అవసరమో ముందుగానే నిర్దేశితమవుతాయి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా! రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ 2016లో వెల్లడించిన అంశాల ప్రకారం మన దేశంలో మెజారిటీ జనాభా మాంసాహార ప్రియులు. ఆసక్తి కరమైన అంశమేమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్, హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో శాకాహార ప్రియుల శాతం కాస్త ఎక్కువగా ఉంటే దక్షిణాది రాష్ట్రాలన్నిటా పూర్తిగా మాంసాహార ప్రియులదే ఆధిక్యత. మొత్తంగా దేశంలో 71 శాతం మంది పైగా మాంసాహారాన్ని భుజిస్తుంటే... దాదాపు 29 శాతం మంది శాకాహారులు. ఆహారపుటలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మాంసాహారంలో లభించే ప్రొటీన్లు కొన్ని శాకాహారులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆహార నిపుణులు చెబుతారు. వారికోసం కొన్ని ప్రత్యామ్నా యాలు సూచిస్తారు. కొన్నిచోట్ల శాకాహారులుగా ముద్రపడిన కులాలకు చెందినవారు వేరే ప్రాంతాల్లో మాంసాహారులుగా ఉండటం కూడా కనబడుతుంది. ఏడేళ్ల క్రితం మహారాష్ట్రలో బీజేపీ –శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మూడు రోజులపాటు మాంసం అమ్మరాదని నిషేధం విధించింది. జైనుల పండుగ పర్యూషణ్ సందర్భంగా ఈ నిషేధం తెచ్చినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సంద ర్భంగా బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి ఈ నిషేధంలో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించినప్పుడు.. అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని జవాబిచ్చి అడ్వొకేట్ జనరల్ నవ్వుల పాలయ్యారు. ఇష్టపడిన ఆహారాన్ని తినడం, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, నచ్చిన మతాన్ని అనుస రించడం లేదా మతాతీతంగా ఉండాలనుకోవడం, నచ్చిన వ్యాపారం చేసుకోవడం రాజ్యాంగం ఈ దేశ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కొన్ని. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైనుల పండుగ సందర్భంగా మాంసం విక్రయాన్ని నియంత్రిస్తూ ఇచ్చిన ఆదేశాల చెల్లుబాటును 2008లో ధ్రువీకరిస్తూనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. ‘ఎవరు ఏం తినాలనేది వ్యక్తుల ఇష్టానిష్టాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, వారి జీవించే హక్కుకూ రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోకొస్తుంది’ అని స్పష్టం చేసింది. ఈ హక్కును ఉల్లంఘిస్తున్నామనిగానీ, తమ చర్య ద్వారా మెజారిటీ జనాభా ఆహారపు అలవాట్లను నియంత్రిస్తున్నామనిగానీ ఢిల్లీ మేయర్లకూ, అక్కడి బీజేపీ నాయకులకూ తోచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ పౌరుల హక్కులను గుర్తించి, గౌరవించడమే ఏ పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థకైనా గీటురాయి. కేవలం అయిదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడమే ప్రజాస్వామ్యం అను కునే పాలకులున్న వ్యవస్థ బనానా రిపబ్లిక్‌గానే మిగిలిపోతుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఉల్లి, వెల్లుల్లి వంటివి కూడా తినబోరని, అలాంటి పరిస్థితుల్లో మాంసం బహిరంగ విక్రయం వారి మనోభావాలను దెబ్బతీస్తుందని మేయర్లు వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2015లో ముంబై హైకోర్టు మాంసం విక్రయాల నియంత్రణపై తీర్పునిస్తూ ‘జైన మత సోదర, సోదరీ మణులతో సంఘీభావం ప్రకటించడం వేరు... ప్రజానీకానికి మార్కెట్లో మాంసం దొరక్కుండా చర్యలు తీసుకోవడం, వారికి నచ్చిన ఆహారం అందుబాటులో లేకుండా చేయడం వేరు’ అని చెప్పింది. పౌరులు స్వచ్ఛందంగా ఏ పనైనా చేయడం స్వాగతించదగ్గది. కానీ వారితో బలవంతంగా అమలు చేయించాలని చూడటం వివాదాలకూ, అనవసర భయాందోళనలకూ దారితీస్తుంది. ఏం చదవాలో, ఎలా ఆలోచించాలో, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో, ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్దేశించడంతో మొదలుపెట్టి వంటింట్లో ఏం వండాలో కూడా నిర్ణయించే స్థాయికి మన నేతలు చేరడం దురదృష్టకరమైన స్థితి. ఢిల్లీలో కేవలం మందబలం ఆధారంగా ప్రస్తుతం అనధికారికంగా అమలవుతున్న నిషేధాలను పాలనాధికార వ్యవస్థ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం సరికాదు. నిజానిజాలేమిటో ప్రజల ముందుంచాలి. ఇవి అనధికారికమైనవేనని తేల్చి చెప్పాలి. కనీసం న్యాయస్థానాలైనా జోక్యం చేసుకుని బాధ్యులైనవారిపై చర్యలకు ఆదేశించాలి. మూకస్వామ్యం చేటు తెస్తుందని అందరూ గుర్తించాలి. -
హిజాబ్: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కామెంట్లు వైరల్
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిజాబ్ అంశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. హిజాబ్‌తో పాటు పలు అంశాలలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాలంటూ ఆమె సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హిజాబ్ అంశంపై మీ స్పందన ఏంటంటూ ఓ రిపోర్టర్ హర్నాజ్సంధును ప్రశ్నించగా.. ఆమె స్పందించారు. మహిళలను వాళ్లకు నచ్చినట్లుగా బతకనివ్వాలంటూ ఆమె.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. మార్చి 17న ఆమె రాకకు గౌరవంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి.. ఆమె మిస్ యూనివర్స్ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని నిర్వాహకులు ముందుగానే రిపోర్టర్లకు సూచించారు. అయితే ఓ రిపోర్టర్ మాత్రం హిజాబ్‌కు సంబంధించిన ప్రశ్నను అడిగాడు. దీంతో నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆమెను మాట్లాడనివ్వండంటూ రిపోర్టర్ బదులు ఇచ్చాడు. దీంతో ఆమె స్పందించారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. మీరు ఎప్పుడూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. హిజాబ్ విషయంలో కూడా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు (అమ్మాయిలు) వాళ్లు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి.. వాళ్ల గమ్యాన్ని చేరుకోనివ్వండి, ఎగరనివ్వండి, ఎందుకంటే అవి వాళ్ల రెక్కలు, వాటిని కత్తిరించవద్దు. ఒకవేళ కత్తిరించాల్సి వస్తే.. మీ రెక్కలు కత్తిరించుకోండి’ అంటూ సమాధానమిచ్చారు ఆమె. అంతేకాదు తన ప్రయాణం, తాను ఎదుర్కొన్న కష్టాలు.. ఇబ్బందుల గురించి ఎదైనా ప్రశ్నలు అడిగితే సంతోషిస్తానని ఆ రిపోర్టర్‌కు బదులిచ్చారు. దీంతో సదరు రిపోర్టర్ గమ్మున ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. हिजाब पर बोलती हुई मिस यूनिवर्स हरनाज़ संधु♥️#Hijab #HarnaazSandhu pic.twitter.com/imSJamLrTh — Mohd Amir Mintoee (@MAmintoee) March 26, 2022 -
‘హిజాబ్ తీర్పు’ జడ్జిలకు బెదిరింపులు.. వై కేటగిరీ భద్రత
హిజాబ్ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోకి ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు తీర్పు హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన Tamil Nadu Thowheed Jamath (TNTJ) నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. జార్ఖండ్‌లో వాకింగ్‌కు వెళ్లిన ఓ జడ్జి దారుణ హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ వ్యక్తి తీసిన బెదిరింపు వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్ ఉమాపతితో పాటు మరికొందరు అడ్వొకేట్లు.. హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు సదరు వీడియోపై ఫిర్యాదు చేశారు. భగవద్గీత సిలబస్‌లో.. నైతిక విద్యలో భాగంగా కర్ణాటక స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చబోతున్నట్లు సీఎం బొమ్మై, శనివారం వెల్లడించారు. ఇదివరకే గుజరాత్ స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడెంట్స్‌కు షాక్ హిజాబ్ నిరసనల్లో భాగంగా పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేదే లేదని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. తీర్పు ముందు బహిష్కరించిన వాళ్లకే అవకాశం అని, తీర్పు వచ్చాక కొందరు పరీక్షలను బహిష్కరించారని, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. -
‘హిజాబ్’పై హోలీ తర్వాత విచారణ: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు. -
హిజాబ్ తీర్పుపై ఒవైసీ స్పందన ఇది
హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసి మరీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోంది. ఈ తరుణంలో.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోర్టు తీర్పుపై స్పందించారు. తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ పదిహేను పాయింట్లతో ట్విటర్లో ఒవైసీ సుదీర్ఘమైన సందేశం ఉంచారు. తీర్పు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉంది. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుంది. ముస్లిం మహిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు. హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య? అని ఒవైసీ స్పందించారు. తీర్పు వెలువడిన వెంటనే ట్విటర్లోనూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించను. తీర్పుతో విభేదించడం నా హక్కు. పిటిషనర్లు సుప్రీం కోర్టు ముందు అప్పీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, మతం, సంస్కృతి, స్వేచ్ఛపై ప్రాథమిక హక్కులను నిలిపివేసినందున @AIMPLB_Official మాత్రమే కాకుండా ఇతర మత సమూహాల సంస్థలు కూడా ఈ తీర్పును అప్పీలు చేయాలని ఆశిస్తున్నాను అంటూ వరుస పోస్టులు చేశారు. 1. I disagree with Karnataka High Court's judgement on #hijab. It’s my right to disagree with the judgement & I hope that petitioners appeal before SC 2. I also hope that not only @AIMPLB_Official but also organisations of other religious groups appeal this judgement... — Asaduddin Owaisi (@asadowaisi) March 15, 2022 -
హిజాబ్ వ్యవహారం: అందుకే హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది
నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్ ఇయర్ మధ్యలో.. హిజాబ్ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్‌పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్ జనలర్ ప్రభూలింగ్ నవద్గి అభిప్రాయపడ్డారు. మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. HC verdict on Hijab row | Everyone should follow court order for benefit of children. It is a question of fate & education of our children. Necessary arrangements have been made to maintain law and order: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/5aw1GiKoX1 — ANI (@ANI) March 15, 2022 I welcome the HC's decision. Muslim students of the state faced problems for a long time. Someone had misguided them that's why there was this issue. Quality education should be given to all students, so everyone should accept the order: Karnataka Min KS Eshwarappa #HijabRow pic.twitter.com/R4Ni7mlSQn — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the judgment of the Karnataka High Court; it's a very important step towards strengthening the educational opportunities & rights of girl students, especially for those belonging to the Muslim community: BJP MP Tejasvi Surya pic.twitter.com/xBSTurLxiB — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the decision of the Karnataka High Court, as it is firstly not a religious practice, as per Quran. Secondly, when a student enters an institute, they must follow the rules & regulations...: Rekha Sharma, Chairperson, National Commission for Women pic.twitter.com/YDuu3JO9F1 — ANI (@ANI) March 15, 2022 -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక తీర్పు
-
హిజాబ్ వివాదం.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 129 పేజీలు తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ కొందరు మంగళవారమే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. తామూ సుప్రీంకు వెళ్తామని వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉందని, ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. తీర్పును ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకించారు. కర్ణాటకలో పలుచోట్ల వారు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్ కూడా ముఖ్యమేనని, దాన్ని ధరించి తీరతామని అన్నారు. 11 రోజుల విచారణ కర్ణాటకలో జనవరిలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హిజాబ్‌కు పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సింగిల్ బెంచ్ కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సీజే ఇంటికి భద్రత తీర్పు నేపథ్యంలో బెంగళూరులో సీజే, మిగతా ఇద్దరు న్యాయమూర్తుల నివాసాలకు పోలీసు భద్రత పెంచారు. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ►వివాదంపై హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు ఆదేశాలను అంతా పాటించాలి. శాంతిభద్రతలను కాపాడాలి. –సీఎం బసవరాజు బొమ్మై ►పిల్లలకు చదువు ముఖ్యం. హైకోర్టు ఆదేశాలను పాటించాలి. –జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ►హైకోర్టు తీర్పును శిరసావహించాలి. తీర్పును చదివాక పూర్తిగా స్పందిస్తా. –సీఎల్పీ నేత సిద్ధరామయ్య ►హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉంది. – వక్ఫ్ బోర్డు కీలకమైన నాలుగు ప్రశ్నలు, సమాధానాలు కేసుకు సంబంధించి నాలుగు ప్రముఖ వివాదాంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 1.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి ఆచరణా. హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కింద సమర్థనీయమేనా? ధర్మాసనం: ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదు. 2.విద్యా సంస్థల్లో యూనిఫాంను తప్పనిసరి చేయడం ఆర్టికల్ 19 (1) కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆర్టికల్ 21 కింద వ్యక్తి హక్కును కాలరాయడం అవుతుందా? ధర్మాసనం: విద్యా సంస్థల్లో యూనిఫాంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని అంశాల్లో నిషేధాజ్ఞలను విధించడం ప్రభుత్వానికున్న రాజ్యాంగ హక్కు. దీన్ని విద్యార్థులు ప్రశ్నించడానికి వీల్లేదు. 3.యూనిఫాం జీవో నిబంధనలకు వ్యతిరేకమా? ఆర్టికల్ 14, 115లను ఉల్లంఘించడమా? ధర్మాసనం: జీవోలో ఎలాంటి ఉల్లంఘన, చట్ట వ్యతిరేక చర్య లేవు. 4.విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా, అందుకు కాలేజీలు అభ్యంతరపెట్టకుండా ఆదేశాలివ్వాలా? ధర్మాసనం: అవసరం లేదు. -
Hijab Row: తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
బెంగళూరు: హిజాబ్ వ్యవహారం.. ప్రధానంగా కర్ణాటకను ఆపై దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అంతా ఎదురు చూస్తున్న కర్ణాటక హైకోర్టు తీర్పు రేపు(మార్చి 15న) వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిజాబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై 11 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. తీర్పును ఫిబ్రవరి 25వ తేదీన రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. మార్చి 15న మంగళవారం ఉదయం 10గం.30ని. తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. ఇక ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి కూడా ఉన్నారు. తీర్పు నేపథ్యంలో కన్నడనాట పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. హిజాబ్ దుమారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఉడుపికి చెందిన ప్రభుత్వ కళాశాలలో.. హిజాబ్ ధరించిన ఆరుగురు విద్యార్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్లను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి హిజాబ్ వ్యవహారం మొదలైంది. ఈ విషయంలో విజ్ఞప్తులను సైతం కళాశాల ప్రిన్సిపాల్ రుద్రే గౌడ తోసిపుచ్చారు. అంతేకాదు.. తల మీద గుడ్డతో క్యాంపస్‌లోకి అనుమతించినా.. తరగతి గదిలోకి మాత్రం అనుమతించలేదు. దీంతో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్‌లతో విద్యాసంస్థల దగ్గర నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేశారు. ఆపై ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. హిజాబ్ అభ్యంతరాలు.. పోటీగా కాషాయపు కండువాతో స్టూడెంట్స్ ర్యాలీలు నిర్వహించేదాకా చేరుకుంది. వాళ్లను అనుమతిస్తే.. మమ్మల్ని అనుమతించాలంటూ హిందూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆపై హిజాబ్ అభ్యంతరాలు.. కర్ణాటక నుంచి దేశంలోని మరికొన్ని చోట్లకు విస్తరించాయి. ఆపై ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు ఇవ్వగా.. ఆ ఆదేశాలు తమకు అభ్యంతరకంగా ఉన్నాయంటూ కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత వార్త: హిజాబ్‌పై కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఏమన్నారంటే.. -
వివక్ష లేదు... అందరూ సమానమే!
బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలో రోజురోజుకూ ‘మత అసహనం’ పెరుగుతోం దనీ, మైనారిటీలు అభద్రతతో జీవిస్తున్నారనీ మాజీ ఉప రాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ ఇటీవల ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమా రాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలు ప్రపంచంలో మన దేశం గౌరవ మర్యాదలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు ఈ దేశంలో అభద్రతాభావంతో జీవిస్తున్నారనే విషయం వాస్తవ మైందేనా? సంభవించిన, సంభవి స్తున్న పరిణామాలను దృష్టిలో ఉంచు కుంటే– ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లో లేని హక్కులను ఈ దేశ ముస్లింలు అనుభవిస్తున్నారు అనే సంగతి వాస్తవం కాదా? ఈ దేశంలో నూటికి 90 మంది హిందువులు ముస్లింలను తమ దేశ పౌరులుగానే చూస్తున్నారు. మతపరమైన కోణంతో చూడడం లేదు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో 9 శాతం హిందువులు ఉండేవారు. ప్రస్తుతం ఆ దేశంలో హిందూ జనాభా 1.6 శాతం మాత్రమే. బంగ్లాదేశ్‌లో 27 శాతం ఉన్న హిందువులు నేడు 9 శాతానికి పడిపోయారు. భారత్‌లో 8 శాతం ఉన్న ముస్లింలు 18 శాతానికి చేరుకున్నారు. అన్సారీ ఆరోపిస్తున్నట్లు వివక్ష ఉంటే ముస్లింల ఈ స్థితి సాధ్యమయ్యేదేనా? ముస్లిం లకు ఈ దేశంలో భద్రత లేదని వాపోయే అన్సారీ ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ ఇస్లాం శాఖల ప్రజలు భద్రతతో జీవిస్తున్నారని సర్టిఫై చేయగలరా? ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీలకు భద్రత కరువైందనే ఆరోపణలో వాస్తవ మెంతో చూద్దాం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీ ‘సనాతన భారతీయ సంస్కృతి పరిరక్షణ’ అనే సాంస్కృతిక జాతీయవాదాన్ని తన రాజకీయ సిద్ధాం తానికి భూమికగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లౌకికవాద ముసుగు వేసుకున్న బీజేపీ వ్యతిరేక పార్టీలూ, వర్గాలూ... ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల్లో మతోన్మాదాన్ని బీజేపీ నూరిపోస్తుందనే ఒక విషప్రచారాన్ని సాగిస్తున్నాయి. వాస్తవంగా హిందూ ముస్లిం మత ఘర్షణలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే లెక్క లేనన్ని జరిగాయి. 1990 జనవరి 19న కశ్మీర్ లోయలో జరిగిన నరమేధం, మూడు లక్షల మంది హిందు వులను లోయ నుండి తరిమి వేయడం, హైదరాబాద్ మత ఘర్షణలు; బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాంలలో అధికార మార్పిడి కోసం సృష్టించిన మతకలహాలు... లాంటివన్నీ లౌకికవాదానికి చిరునామా అని చెప్పు కుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే! ఉల్లి బాలరంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
హిజాబ్ తప్ప దేశంలో సమస్యలే లేవా?
ఉత్తర భారతంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం భారతీయ జనతాపార్టీ కర్ణా టకలో హిజాబ్ చిచ్చు రాజేసింది. ఎన్ని కలు జరిగే రాష్ట్రాల్లో నేరుగా మంట రాజేస్తే బాగుండదనీ, దక్షిణాదిలో తమ ఏలుబడిలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణా టకలో పొగబెడితే అది ఎలాగూ దేశ మంతా విస్తరించి తమకు మేలు జరుగు తుందనీ బీజేపీ పథకం వేసింది. ఒక దెబ్బకు రెండు పిట్టల న్నట్లు... బీజేపీ దీనిద్వారా రెండు ప్రయోజనాలు సాధించ దలచింది. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం ఒకటైతే, బడుగు బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేయడం రెండవది. నిజానికి ఇప్పుడు అందరూ భావిస్తున్నట్లు హిజాబ్ సంప్ర దాయం కేవలం, ముస్లింలతోనే ముడిపడి లేదు. అంతకంటే శతాబ్దాల ముందు నుంచే వేరువేరు రూపాల్లో ఇది ప్రపంచంలో ఉంది. ప్రాచీన గ్రీక్, ౖ»ñ జాంటైన్ నాగరికతల్లోనూ ఇది ఉనికిలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం ఇప్పటికీ ముస్లిమేతరుల్లో కొనసాగుతూనే ఉంది. భర్తకు, ఇంట్లోని కొంతమంది పురుషులకు తప్ప, బయటి పురుషులకు ముఖం, వెంట్రుకలు, ఇతర భాగాలు కనిపించ కూడదనేదే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ఒక సమూహానికి చిహ్నంగా మాత్రమే స్థిరపడిపోయింది. పరదా వేసుకున్న మహిళలపై వేధింపులు ఉండవనే ఉద్దేశంతో కూడా చాలామంది దీన్ని పాటిస్తారు, పాటిస్తున్నారు కూడా! ఖురాన్ గ్రంథంలో పరదా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నూర్ సూరా, అహెజాబ్ సూరాల్లో పరదాకు సంబంధించి అనేక విషయాలు చర్చించబడ్డాయి. గోప్యంగా ఉంచదగిన శరీర భాగాలను గోప్యం గానే ఉంచాలనీ, దానికోసం తల, మెడ, వక్షభాగం వస్త్రంతో కప్పుకోవాలనీ ధర్మం చెబుతోంది. ముస్లింలు పాటిస్తున్న పరదా సంప్రదాయం వల్ల నేటిదాకా ఎవరికీ ఇబ్బంది కలిగింది లేదు. అందులో ఇతరులు జోక్యం చేసుకునే అవసరం ఎంతమాత్రం లేదు. కానీ దేశంలో ఏ సమస్యలూ లేనట్లు, హిజాబ్ ఒక్కటే ఇప్పుడు సమస్య అయినట్లు దాన్నొక వివాదంగా మార్చి తమాషా చేస్తున్నారు కొందరు. ఇప్పుడు దేశంలో సమస్య హిజాబ్ కాదు. అందరికీ నాణ్యమైన విద్య కావాలి. వైద్యం కావాలి. ఉపాధి కావాలి. ఉద్యోగాలు కావాలి. జీవికకు భద్రత కావాలి. ప్రాణాలకు రక్షణ కావాలి. బేటీ పఢావో... బేటీ బచావో అని; సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనీ చేసిన వాగ్దానాల నుండి ప్రజల దృష్టి మరల్చి, ప్రభుత్వ పాఠశాలల్లో అంతంత మాత్రమైనా చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల పిల్లలను విద్యకు దూరం చేసి, ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలనీ; అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకోవా లనీ పాలక పక్షం హిజా బ్‌ను తెరపైకి తెచ్చింది. స్వప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిణామాలను భావి తరాలు ఎంతమాత్రం క్షమించవు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మనందరి బాధ్యత. వ్యాసకర్త: ఎండి. ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్ట్ -
హిజాబ్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టులో నమోదైన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. విద్యాసంస్థల్లో నిర్దేశిత యూనిఫాం మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గత 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించి శుక్రవారం పూర్తి చేసింది. తుది తీర్పును వాయిదా(రిజర్వ్) వేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. హిజాబ్‌ను నిరాకరించేందుకు కాలేజీ అభివృద్ధి మండలికి(సీడీసీ) ఎలాంటి అధికారం లేదని అన్నారు. ప్రభుత్వం తన అధికారాలను సీడీసీకి అప్పగించడం సబబు కాదని తెలిపారు. వందల ఏళ్లుగా హిజాబ్ ధారణ కొనసాగుతోందని ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను పూర్తి చేసి, తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఇకపై ఏ న్యాయవాది అయినా అవసరమైతే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. -
రెండురోజులు జైళ్లోనే హీరో.. అనుచిత ట్వీట్ ఎఫెక్ట్
హిజాబ్ వ్యవహారంలో విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తిపైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కన్నడ హీరో చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బెయిల్ దొరక్కపోవడంతో.. రెండురోజులు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అతనికి. కన్నడనాట హిజాబ్ వివాదం నడుస్తుండగా.. నటుడు చేతన్ చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ. సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్ చేసి లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘‘హిజాబ్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పైనే చేతన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్ అభ్యర్థించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. శుక్రవారానికి బెయిల్ పిటిషన్ పరిశీలిస్తామని తెలిపింది. చేతన్ చేసిన ట్వీట్‌గా వైరల్ అవుతోంది ఇదే అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని చేతన్ భార్య మేఘ ఆరోపిస్తోంది. చేతన్ అరెస్ట్ విషయంలో పోలీసులు అతిప్రదర్శించారన్నది ఆమె వాదన. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి.. తన భర్తనే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఆమె. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. చేతన్ వ్యవహారం హిజాబ్ అంశంలో కొత్త వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష అరెస్ట్‌ను.. హిజాబ్‌కు ముడిపెట్టడం, ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించడం చూశాం. ఈ తరుణంలో చేతన్ మద్దతుదారులంటూ కొందరు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ బయట ఆందోళనచేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట క్రేజ్ సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. డజనుకుపైగా సినిమాల్లో నటించిన చేతన్.. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా. -
హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కిందకు రాదు: కర్ణాటక ప్రభుత్వం
సాక్షి, బెంగుళూరు: భారత్‌లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే విద్యా సంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్‌పై కొన్ని రకాల పరిమితులున్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్ ధరించే హక్కుని రాజ్యాంగం కల్పించిందన్నారు. చదవండి: హిజాబ్ కాకున్నా చద్దర్‌తో అయినా కప్పుకోండి! దీని ప్రకారం కొన్ని సంస్థల్లో సహేతుకమైన కారణాలతో హిజాబ్ ధరించకూడదని చెప్పే అధికారాలు ఉంటాయని తన వాదనల్ని వినిపించారు. ఫుల్ బెంచ్ ఈ వారంలో విచారణను పూర్తి చేయనుంది. హిజాబ్ పిటిషన్‌దారుల్లో ఒకరైన హజ్రా షిఫా అల్లరిమూకలు తన సోదరుడిపై దాడికి దిగారని, తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే దాడులకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సంఘ్ పరివార్ పనేనని ఆమె ఆరోపించారు. చదవండి: హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం -
హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం
Bihar Bank Stops Muslim Girl From Withdrawing Money: హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో మొదలైన ఈ వివాదం కాస్త ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ఓ ముస్లిం యువతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా హిజాబ్ తొలగించాలంటూ ఆమెతో వాదనకు దిగారు. ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగింది. ఓ ముస్లిం యువతి డబ్బులు విత్ డ్రా చేసేందుకు మన్సూర్ చౌక్‌లోని యూకో(యూసీవో) బ్యాంకు శాఖకు శనివారం వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. హిజాబ్‌ను తీసి డబ్బులు డ్రా చేయాలని వాదనకు దిగారు. దీంతో సదరు యువతి హిజాబ్ తీసివేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనను ఆ యువతి తన మొబైల్లో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా షేర్ చేశారు. ఈ ఘటనపై ఆయన బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు. माननीय मुख्यमंत्री @NitishKumar जी, कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX — Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022 -
హిజాబ్ వివాదం: ఎట్టకేలకు స్పందించిన అమిత్ షా
Amit Shah On Hijhab Row: హిజాబ్‌పై ప్రభుత్వ నిషేధాజ్ఞాలపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ‘హిజాబ్’ ఎఫెక్ట్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెదవి విప్పారు. సోమవారం ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఎట్టకేలకు హిజాబ్ అంశంపై స్పందించారు. ‘నా వరకైతే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే.. యూనిఫామ్ ధరించి మాత్రమే స్కూల్‌కు వెళ్లడం మంచిది. ఒకవేళ కోర్టు గనుక తీర్పు వెలువరించాక నా ఈ నిర్ణయంలో ఏమైనా మార్పు రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యాయస్థానాల నిర్ణయాల్ని ఎవరైనా అంగీకరించాలి కాబట్టి. అంతిమంగా.. దేశం రాజ్యాంగం లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా? అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉండగా.. హిజాబ్ వ్యతిరేక ఆజ్ఞలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం వాదనల సందర్భంగా కోర్టులో గట్టిగా తన చర్యలను సమర్థించుకుంటోంది. మరోపక్క బీజేపీ, అనుబంధ విభాగాలు కొన్ని ఈ వ్యవహారాన్ని దేశస్థాయిలోకి విస్తరిస్తున్నాయి. -
తమిళనాడును తాకిన హిజాబ్ సెగ.. రియాక్షన్ ఇది
Hijab Row In Tamil Nadu: దాదాపు పదేళ్ల తర్వాత విరామం తర్వాత తమిళనాట స్థానిక సంస్థల హడావుడి నెలకొంది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 640 స్థానాలకు.. 12, 800 పోస్టులకు శనివారం పోలింగ్ జరుగుతోంది. చాలాకాలం తర్వాత జరుగుతుండడంతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో హిజాబ్ సెగ తమిళనాడుకు పాకింది. కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్’ పరిణామం.. దేశంలో పలుచోట్ల రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆమెతో హిజాబ్ తొలగించి.. ఓటు వేయడానికి అనుమతించాలంటూ ఆ బూత్ ఏజెంట్ వీరంగం సృష్టించాడు. అయితే అతన్ని నిలువరించాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యలు కోరగా.. పోలీసుల జోక్యంతో అతను బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్‌నిధి స్టాలిన్ స్పందించాడు. #TamilNadu Urban Local Body Poll |A BJP booth committee member objected to a woman voter who arrived at a polling booth in Madurai while wearing a hijab;he asked her to take it off. DMK, AIADMK members objected to him following which Police intervened. He was asked to leave booth pic.twitter.com/UEDAG5J0eH — ANI (@ANI) February 19, 2022 బీజేపీ చేష్టలను తమిళనాడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశాడు. ‘‘బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో.. ఇక్కడి జనాలకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించబోదు’’ అంటూ ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరిట మనుషుల్ని తిరస్కరించడం బాధాకరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనేది వ్యక్తిగత విషయం, హక్కు కూడా. అది ఎక్కువా.. తక్కువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారామె. தமிழகத்தில் இன்று நடைபெறும் நகர்ப்புற உள்ளாட்சித் தேர்தலை முன்னிட்டு சென்னை,சாலிகிராமத்தில் உள்ள வாக்குச்சாவடியில் எனது வாக்கினை செலுத்தி ஜனநாயக கடமையாற்றினேன். #LocalBodyElection pic.twitter.com/v4ItGVnkdn — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 19, 2022 ఇక తమిళనాట పదకొండేళ్ల తర్వాత అర్బన్ లోకల్ బాడీ పోల్స్ జరుగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే తమ మధ్య పోటీ ఉండాలనే ఉద్దేశంతో.. బీజేపీని ప్రచారంలో ఏకీపడేశాయి. ఉదయం ఏడు గంటలకే మొదలైన పోలింగ్.. చాలా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతోంది. కాకపోతే లాంగ్ క్యూలతో జనం విసిగిపోయి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31, 180 పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించింది పోలీస్ శాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు కమల్ హాసన్ తెయ్‌నామ్‌పేట్‌లో, తెలంగాణ గవర్నర్ తమిళసై, తమిళ స్టార్ హీరో విజయ్ నీలాన్‌గరైలో, పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగిల్ ఫేజ్‌లో ముగియనున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 22న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. సంబంధిత వార్త: హిజాబ్ వివాదం.. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు -
కర్ణాటకలో హిజాబ్ ఆందోళన: 58 మంది విద్యార్థుల సస్పెన్షన్
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. హిజాబ్ ఆందోళనలో పాల్గొన్న 58 మంది విద్యార్థులను శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదట నుంచి హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు. అయితే తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హైకోర్టు సూచించింది. అయినప్పటికీ కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన శివమొగలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 58 మందిని సస్పెండ్ చేసింది. అలాగే హిజాబ్‌కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిపై 144 సెక్షన్ ఉల్లంఘన కింద శివమొగ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..) మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫామ్ ధరించాలన్న గవర్నమెంట్ ఆర్డర్స్ రాజ్యాంగంలోని మత స్వేచ్చ, భావప్రకటనా స్వేచ్చకు వ్యతిరేకం కాదని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
హిజాబ్ వివాదం : హైకోర్టులో కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ప్రభులింగ్ నవాద్గీ వాదనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు విచారణలో భాగంగా ఏజీ.. హిజాబ్ ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని ఉపయోగాన్ని నిరోధించడం మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టు కాదన్నారు. మత స్వేచ్ఛకు హామీనిచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-25ను ఉల్లంఘించినట్టుకాదని చెప్పారు. హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించకుండా నిషేధిస్తూ ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేసిన కొంతమంది ముస్లిం బాలికల చేసిన ఆరోపణలను ఏజీ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారమే ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. వారు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈ వివాదంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
హిజాబ్ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్టు మధ్యంతర ఆదేశాలతో రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నప్పటికీ పలు చోట్ల హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో నిషేధాజ్ఞలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. హిజాబ్ వివాదం కారణంగా ప్రభుత్వం నగరంలోని అన్ని పాఠశాలల వద్ద 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అనేక పట్టణాలు, విద్యాసంస్థల వద్ద పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా హిజాబ్ వివాదం నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలను నిషేధించారు. ఫంక్షన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహాల్లో 200-300 మంది హాజరయ్యేందుకే అనుమతించారు. మరోవైపు క్రీడా మైదానాల్లో వాటి సామర్థ్యంలో 50 శాతానికి మించి ప్రేక్షకులు హాజరు కాకుడదని పేర్కొన్నారు. -
మా మీద విద్వేషపూరిత వివక్ష
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాము ధరించే హిజాబ్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వివక్ష చూపుతోందని కర్ణాటక హైకోర్టులో ముస్లిం విద్యార్థినులు వాదించారు. ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ చట్టవ్యతిరేకమని, ఈ విషయంపై ఎంఎల్ఏ ఆధ్వర్యంలోని కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ(సీడీసీ)కి నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. భారతీయులు లాకెట్లు, శిలువ, బుర్కా, గాజులు, హిజాబ్, బొట్టు, తలపాగా లాంటి పలురకాల మత చిహ్నాలు ధరిస్తారని విద్యార్థినుల తరఫు న్యాయవాది రవి వర్మ కుమార్ చెప్పారు. ఈ పిటీషన్‌ను సీజే జస్టిస్ అవస్తీతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 1995 విద్యా శాఖ నిబంధనల్లో 11వ నిబంధన ప్రకారం విద్యాసంస్థలు యూనిఫామ్ మార్పుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీసం ఏడాది ముందు తెలియజేయాలన్నారు. అలాగే ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ గురించి పీయూ విద్యాశాఖ నిబంధనలు ఎక్కడా ప్రస్తావించలేదని కుమార్ చెప్పారు. ఎక్కడా హిజాబ్‌ను నిషేధించాలని లేనప్పుడు ఏ అధికారంతో పిల్లలను క్లాసు నుంచి బయటకు పంపుతున్నారని ప్రశ్నించారు. సీడీసీలను విద్యాప్రమాణాల మెరుగుదల కోసం, నిధుల సక్రమ వినియోగ పర్యవేక్షణ కోసం ఒక సర్క్యులర్ ద్వారా 2014లో ఏర్పాటు చేశారని, ఈ కమిటీకి విద్యార్థుల సంక్షేమంతో సంబంధం లేదని వాదించారు. కమిటీ అధిపతులైన ఎంఎల్ఏకు కార్యనిర్వాహక అధికారాలివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వాదనల అనంతరం కోర్టు విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో అదే తంతు వారం రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కాలేజీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే పలు చోట్ల బుర్కా ధరించిన విద్యార్థినులకు కాలేజీల్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లోని కాలేజీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలామంది ముస్లిం విద్యార్థినులు బుర్కా తీసివేయడానికి నిరాకరించారు. ఉడిపిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హిజాబ్‌పై హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం బాలికలు కళాశాలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ చప్పారు. మిగిలిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి క్లాసులకు హాజరయ్యారని చెప్పారు. కుందాపూర్‌లో హిజాబ్ తీసివేయడానికి నిరాకరించిన 23 మంది విద్యార్థినులు కూడా కాలేజీకి హాజరుకాలేదు. గతవారం గందరగోళం జరిగిన మణిపాల్‌లోని ఎంజీఎం కాలేజీ సహా ఆందోళనలు తలెత్తిన ప్రాంతాల్లో కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం హిజాబ్ తీసివేసిన విద్యార్థినులనే తరగతులకు అనుమతించారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సైతం బుధవారం ఆరంభమయ్యాయి. అయితే వీటిలో ఎలాంటి యూనిఫామ్ నిబంధన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అసెంబ్లీలో వెల్లడించారు. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ యూనిఫామ్ నిబంధన డిగ్రీ కాలేజీలకు వర్తించదని వివరణ ఇచ్చారు. గాజులు మత చిహ్నాలు కాదా? సమాజంలోని భిన్న వర్గాలు భిన్న మత చిహ్నాలు ఉపయోగిస్తాయని, కానీ ప్రభుత్వం కేవలం హిజాబ్‌పై వివక్ష చూపుతోందన్నారు. అలాంటప్పుడు గాజులు మత చిహ్నాల కిందకు రావా? అని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఇతర మత చిహ్నాలను వదిలికేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించిన ఆయన కేవలం ముస్లింల విశ్వాసానికి చెందినది కాబట్టే హిజాబ్‌ను వద్దంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలపై ఈ వివక్ష 15వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినకుండా నేరుగా శిక్ష విధించినట్లయిందని, ఇది అమానుషమని వాదించారు. విద్య బహుళత్వాన్ని బోధించాలని, తరగతి గదులు సమాజంలో భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని చెప్పారు. -
హిజాబ్ వివాదం
-
పరీక్షలను బహిష్కరించిన విద్యార్థినులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పలుచోట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలల సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి, తుమకూరు, కొడగు తదితర ప్రాంతాల్లో మంగళవారం విద్యార్థినులు నిరసనకు దిగారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు మత చిహ్నాలతో విద్యాలయాల్లోకి రాకూడదని ఉపాధ్యాయులు, పోలీసులు చెప్పడంతో తమకు సంప్రదాయమే ముఖ్యమని కొందరు విద్యార్థినులు తరగతులను, ప్రిపరేటరీ పరీక్షలను బహిష్కరించారు. ఉడుపి జిల్లా కాపు మల్లారు ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో హిజాబ్ తొలగించి తరగతిలోకి ప్రవేశించేందుకు విద్యార్థినులు అంగీకరించలేదు. చివరికి హిజాబ్ ధరించి పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను విద్యార్థినులు రాశారు. శివమొగ్గ నగరంలోని కేపీఎస్ ఉన్నత పాఠశాలలో హిజాబ్ తీసేయడం ఇష్టం లేదని తరగతులను బహిష్కరించి ఇద్దరు విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు. చిక్కమగళూరు మౌలానా ఆజాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 11 మంది విద్యార్థినులు పాఠశాలలో బైఠాయించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చెలరేగింది. పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గదగ్ జిల్లాలోనూ ఒక పాఠశాలలోనూ కొందరు బాలికలు నిరసన తెలిపారు. దావణగెరె జిల్లా హోన్నాళిలో 50, చెన్నగిరలో 30, నల్లూరిలో 20, హరిహరలో 23 మంది విద్యార్థినులు హిజాబ్ తీసేందుకు నిరాకరించి, తమకు మత సంప్రదాయమే ముఖ్యమని తరగతులను బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోయారు.తుమకూరు ఎస్వీఎస్ స్కూల్ ముందు విద్యార్థినుల తల్లిదండ్రులు ‘అల్లా హు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. జగత్‌లోని ఉర్దూ పాఠశాలకు 80 మందికి పైగా విద్యార్థినులు గైర్హాజరయ్యారు. రాయచూరులో చదువుతో పాటు తమకు హిజాబ్ కూడా ముఖ్యమని, హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో గొడవకు దిగారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తాం.. హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును కచ్చితంగా అమలు చేస్తామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి ప్రకటించారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం హిజాబ్ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు యు.టి.ఖాదర్ లేవనెత్తారు. హైకోర్టు ఉత్తర్వును పాటించే విషయంలో క్షేత్రస్థాయిలో స్పష్టత లేకుండా పోయిందని అన్నారు. ఆ మత సంస్థలపై కఠిన చర్యలు.. సమాజంలో అలజడి సృష్టిస్తూ, అమాయక విద్యార్థుల మనసుల్లో విష బీజాలు నాటుతున్న మత సంస్థలను గుర్తించి, వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి జ్ఞానేంద్ర మంగళవారం చెప్పారు. చర్యలు తీసుకోవాలి.. హిజాబ్ రగడ వెనుక ఉన్న సంస్థలు, శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వారు మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని కలిశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు భారీగా పెంచాలని కోరారు. హిజాబ్ మత వ్యక్తీకరణ కాదు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఉడుపిలోని పీయూసీ ప్రభుత్వ కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. భారత్‌లోని లౌకికవాదం సానుకూలమైనదని, టర్కీ తరహా లౌకికవాదం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హిజాబ్ వివాదంపై హైకోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తమ ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. -
నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి: గుత్తా జ్వాల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. 'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అంటూ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. Stop humiliating small girls at the gates of the school where they come to empower themselves…school is supposed to be their safe haven!! Head scarf or no head scarf Spare them from this ugly politics….stop scarring there small minds 🙏🏻🙏🏻 Just stop this!! 💔 — Gutta Jwala (@Guttajwala) February 15, 2022 చదవండి: (హిజబ్ వివాదం.. టీచర్ శశికళ రాజీనామా) -
హిజాబ్ ఎఫెక్ట్ : పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా హిజాబ్ వివాదం సంచలనంగా మారింది. హిజాబ్ అంశంపై కర్నాటకలో ఇప్పటికీ పలు వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ స్కూల్స్ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉపాధ్యాయులు ముస్లిం విద్యార్థులను అడ్డుకొని హిజాబ్ ను తొలగించి వెళ్లాలని కోరారు. దీంతో వారి విన్నపాన్ని విద్యార్థులు నిరాకరించారు. ఎస్ఎస్ఎల్సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షలు జరుగుతుండటంతో వారిని అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వారికి హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు రాయాలని సూచించారు. ఈ సూచనను సైతం 13 విద్యార్థులు నిరాకరిస్తూ పరీక్షలను బహిష్కరించారు. ఈ విషయం కాస్తా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకొని పిల్లలను సపోర్ట్ చేశారు. అనంతరం హిజాబ్ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పి విద్యార్థులను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. -
భారతదేశం రాజ్యంగం ప్రకారమే నడుస్తుంది! : యోగి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఏడు దశల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నేడు సెకండ్ ఫేస్ ఎన్నికల జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నవీన భారతదేశం రాజ్యంగం ప్రకారమే నడుస్తుంది తప్ప షరియత్ చట్టల ప్రకారం కాదని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. భారత్‌ని అంతిమంగా జయించాలనే కోరిక ఎప్పటికి సాకారం కాదని నొక్కి చెప్పారు. ఈ మేరకు యోగి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్రంలో " "80 వర్సెస్ 20"లను సూచించేలా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అభివృద్ధిని వెనకేసుకొచ్చే 80 శాతం మందికి.. ప్రతిదీ వ్యతిరేకించే 20 శాతం మంది మధ్య జరుతున్న పోరుగా అభివర్ణించారు. ఈ నవీన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భారతదేశ నాయకుడు నరేంద్ర మోదీ అని నేను చాలా స్పషంగా చెప్పగలను. ఈ అభివృద్ధి అందర్నీ సంతృప్తి పరచలేకపోతోంది. తాలిబానీ ఆలోచనల మత ఛాందసవాదులు ఇది అర్థం చేసుకోండి. భారతదేశం షరియత్ ప్రకారం కాదు, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది." అని అన్నారు. అంతేకాదు కాలేజీలలో హిజాబ్ ఆంక్షలపై కర్ణాటకలో జరిగిన భారీ గొడవపై కూడా మాట్లాడారు. మన వ్యక్తిగత విశ్వాసాలు, ఇష్టాలు, అయిష్టాలను దేశం లేదా సంస్థలపై విధించలేమన్నారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ ఉండాలని, ఇది పాఠశాల క్రమశిక్షణకు సంబంధించిన విషయం అని చెప్పారు. అంతేకాదు ఒకరి వ్యక్తిగత విశ్వాసం వేరు, కానీ సంస్థల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ నిబంధనలను అంగీకరించాలి అని అన్నారు. హిజాబ్ విషయమై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను యోగి ఖండించారు. భారతదేశపు ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛ, హక్కుల కోసమే ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ దుర్వినియోగాన్ని ఆపారనే విషయాన్ని ప్రస్తావిస్తూ గట్టి కౌంటరిచ్చారు. బాలిక సాధికారత కోసమే బీజేపీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుటుందని చెప్పుకొచ్చారు. యూపిలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీకి బలమైన సవాలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం ప్రచారం చేయడానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కూడా ధ్వజమెత్తారు. కొంత మంది వ్యక్తులు బెంగాల్ నుండి వచ్చి ఇక్కడ అరాచకాలను వ్యాప్తి చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలకు అందుతున్న గౌరవం, భద్రత అభివృద్ధిని అడ్డుకునేందుకు వచ్చారని ప్రజలు దీన్ని వ్యతిరేకించేలా వారిని అప్రమత్తం చేయడం తన బాధ్యతని అన్నారు. అంతేకాదు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్‌పై యోగి మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు (2012-2017) రాష్ట్ర నిధులను సక్రమంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టకుండా నిద్రపోతూ కలలు కంటున్నారంటూ విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ నేతల రాహుల్ గాంధీ, ప్రియాంకా తనను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ని ముంచడానికి ఎవరూ అవసరం లేదు ఈ అక్కాతమ్ముడు చాలు అంటూ యోగి ధ్వజమెత్తారు. (చదవండి: హిజాబ్ ధరించకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు'.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
హిజాబ్ వివాదంపై కర్ణాటక అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కాలేజీలో చిన్నపాటి గొడవగా మొదలై చినికి చినికి గాలి వానల మారిన రగడ దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయ నాయకులు కూడా హిజాబ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ హిజాబ్ రగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. చదవండి: హిజాబ్ వ్యవహారం: అత్యవసర పిటిషన్‌కు సుప్రీం నో.. చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఏఎన్ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' హిబాజ్ అనే పదానికి ఇస్లాంలో పరదా అనే అర్థం ఉంది. యువతులు తమ అందాన్ని దాచుకోవడానికి హిజాబ్‌ను ధరించాల్సి ఉంటుంది. దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మహిళలు హిజాబ్ ధరించకపోవడమే. అంటూ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయేమోనని ఎమ్మెల్యే జమీర్ వెంటనూ మాట మార్చారు. హిజాబ్ అనేది కచ్చితంగా ధరించాలనే రూల్ ఏం లేదు. ఎవరైతే తమ అందాన్ని కాపాడుకోవాలనుకుంటారో.. ఇతరుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు మాత్రమే హిజాబ్‌ను ధరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది అమలులో ఉంది'' అంటూ చెప్పుకొచ్చారు. కాగా జమీర్ అహ్మద్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్‌తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. చదవండి: పాఠశాలలు ప్రశాంతమేనా?.. ఉద్రిక్తతల మధ్య నేడు పునఃప్రారంభం #WATCH | Hijab means 'Parda' in Islam...to hide the beauty of women...women get raped when they don't wear Hijab: Congress leader Zameer Ahmed on #HijabRow in Hubli, Karnataka pic.twitter.com/8Ole8wjLQF — ANI (@ANI) February 13, 2022