టెహ్రాన్ : ఇస్లాం దేశాల చట్టాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ముఖ్యంగా సాంప్రదాయాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలే ఉంటాయి కూడా. డోస్రా డెరాక్షని అనే చెస్ గ్రాండ్ మాస్టర్ ఇప్పుడు అలానే నిషేధానికి గురైంది.
ఈ యేడాది ఫిబ్రవరిలో గిబ్రాల్టర్‌లో జరిగిన పోటీల్లో డోస్రా యూఎస్ జాతీయ ఫెడరేషన్ తరపున పాల్గొంది. అయితే ఆమె బురఖా లేకుండానే పోటీలో పాల్గొనటంతో విమర్శలు వెలువెత్తాయి. చివరకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ఇరాన్ చెస్ ఫెడరేషన్ ప్రకటించింది. ఆమె బ్యాన్ వార్తలపై చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మెహ్రదద్ స్పందించారు. అసలు 2014లో ఒక్కసారి మాత్రమే ఇరాన్ తరపున ఆడిందని.. ఆమెకు సభ్యత్వం కూడా లేదని, తర్వాత 2015లో ఆమె బార్సిలోనాకు తరలి వెళ్లిపోయిందని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ డోస్రాతోపాటు ఆమె సోదరుడు బోర్నాపై కూడా బ్యాన్ విధించినట్లు ఆయన ప్రకటించారు.
‘ఇరాన్ 1979 చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖా ధరించటం తప్పనిసరి. ఇరాన్ పాలనీ ప్రకారం ఇజ్రాయిల్ అథ్లెట్‌లతో పోటీ పడకూడదు. కానీ, డోస్రా సోదరుడు బోర్నా డెరాక్షని నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయిల్ ఆటగాడితో పోటీపడ్డాడు. అందుకే అతనిపైనా నిషేధం విధించామ’ని మెహ్రదద్ తెలిపారు. కాగా, పోటీల్లో బురఖా ధరించకూడదన్న ఆమె నిర్ణయాన్ని అమెరికా ఛెస్ ఫెడరేషన్ స్వాగతించింది.
Comments
Please login to add a commentAdd a comment