న్యూఢిల్లీ: హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment