Chief Justice of India
-
కుమార్తె అంటే.. సొంత ఆస్తి కాదు!
న్యూఢిల్లీ: మైనర్‌గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు. ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున, వివాహమాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతడిని జైలులో పెట్టే అధికారం మీకు లేదు. మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు, ఆమె ఓ వస్తువు కాదు. ఆ పెళ్లికి ఆమోదం తెలపండి’అని సూచించింది. పెళ్లయిన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ తదితరాల్లో తేడాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తెను నిర్బంధించి, లైంగిక దాడి చేశాడంటూ మహిద్‌పూర్‌కు చెందిన పిటిషనర్ దంపతులు వేసిన కేసును ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. ఆమె మేజరేననీ, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని స్పష్టం చేసింది. -
సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్ వెల్లడించిన టాప్ 10 తీర్పులివే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ యశ్వంత్(డీవై) చంద్రచూడ్‌కు శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే. ఆదివారం( నవంబర్ 10) ఆయన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. వృత్తిపరంగా తాను చాలా సంతృప్తి చెందానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో కేసుల పరిష్కారాల్లో డీవై చంద్రచూడ్ తనదైన ముద్ర వేశారు. అనేక మైలురాయి తీర్పులు వెల్లడించారు. అంతేగాక చంద్రచూడ్..భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ తనయుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు.. చీఫ్ జస్టిస్‌గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు డీవై చంద్రచూడ్. వైవీ చంద్రచూడ్ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. 👉1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. 👉 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్‌లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్‌లో డీవై చంద్రచూడ్ ఉన్నారు. ‘ఏడీఎం జబల్పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్ తన నిర్ణయాన్ని రాశారు. కాగా 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రచూడ్.. ఆయన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామ మందిరం, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ చర్య, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి తన తీర్పును ఇచ్చారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసుల్లో.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్టోరల్ బాండ్స్ కేసురాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ప్రచురించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ప్రైవేట్ ఆస్తి వివాదం..ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును వెలువరించింది.ఆర్టికల్ 3702023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్వలింగ వివాహం2023 అక్టోబర్‌లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది, స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపింది స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని సీజేఐ పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని, ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.సెక్షన్ 6Aగత నెల అక్టోబర్‌లో అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించించింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6(ఎ)కు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. 1996-71 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) శరణార్థులను భారత పౌరసత్వం పొందేందుకు 1985లో తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ రాజ్యాంగ బద్దమేనని 4:1 తీర్పులో వెల్లడించింది. ఇది కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తిరస్కరించింది.జైళ్లలో కుల ఆధారిత వివక్షకుల ఆధారంగా జైల్లోని ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.యూపీ మదరసా చట్టంఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.నీట్ వివాదందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొన్నది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.బాల్య వివాహంబాల్య వివాహాల నిషేద చట్టం-2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.తన పదవీకాలం చివరి రోజు సైతం. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కీలక తీర్పును వెలువరించింది. దీనిని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. -
ఇక నుంచి నేను ఇలా న్యాయం చేయలేను: సీజేఐ చంద్రచూడ్ భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పదవీ కాలం ముగిసింది. శుక్రవారమే చివరిరోజు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన హాల్లో నలుగురు సభ్యులతో కూడిన సెర్మోనియల్ బెంచ్ ఆయనకు వీడ్కోలు పలికింది. జస్టిస్ చంద్రచూడ్‌తోపాటు కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. తన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కొద్దిసేపు అందరినీ నవి్వంచారు. జైన పదం ‘మీచా మి దుఖఃదాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘రేపటి నుంచి నేను ఇలా న్యాయం చేయలేను, కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అని కోరారు. ఇతరులను నొప్పించాలన్న ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నారు. న్యాయవాద వృత్తితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. రూపురేఖలను బట్టి తనను చాలామంది యువకుడిగానే భావించేవారని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు తన వద్దకు వచ్చి ‘మీ వయసు ఎంత’ అని అడిగారని గుర్తుచేశారు. న్యాయవాద వృత్తి తనకు ఎన్నో గొప్ప విషయాలు నేరి్పంచిందని అన్నారు. యువ లాయర్‌గా కోర్టుల్లో ఎన్నో వాదనలు విన్నానని, న్యాయవాదుల్లో నైపుణ్యాలు గమనించానని, విలువైన కోర్టురూమ్ టెక్నిక్‌లు నేర్చుకున్నానని తెలిపారు. కోర్టుల్లో పనిచేసే మనమంతా వచ్చి వెళ్లిపోయే యాత్రికులమేనని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో ఎంతోమంది గొప్ప న్యాయమూర్తులుగా రాణించారని, వారసత్వాన్ని మరొకరికి అప్పగించి వెళ్లారని పేర్కొన్నారు. తాను వెళ్లిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదని, తన తర్వాత మరొకరు ఈ పదవిలోకి వస్తారని చెప్పారు. సమర్థుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, సుప్రీంకోర్టు ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింపజేస్తారన్న విశ్వాసం తనకు ఉందని వివరించారు. న్యాయమూర్తి అనే పదవి తనను ఇన్నాళ్లూ ఉత్సాహంగా ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. చట్టం, న్యాయం, జీవితం గురించి సుప్రీంకోర్టులోని ప్రతి ఒక్కరూ తనకు ఎన్నో విషయాలు నేర్పించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సీజేఐగా తాను విచారించిన 45 కేసులు సైతం తనకు జీవితం గురించి ఎన్నో కొత్త సంగతులు నేరి్పంచాయని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. అణగారిన యువత, నిరుపేదల బాగు కోసం జస్టిస్ చంద్రచూడ్ ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో విజయం సాధించిందని, కొన్ని ఓడిపోయిందని, తమ అభిప్రాయాలను జస్టిస్ చంద్రచూడ్ ఓపిగ్గా విన్నారన్న సంతృప్తి తమకు ఉందని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేసన్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రచూడ్‌ను న్యాయమూర్తులు, న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు సత్కరించారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏం చెప్పారంటే... అంతకంటే గొప్ప అనుభూతి ఉండదు ‘‘అవసరాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయగల శక్తి కలిగి ఉండడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. మనకు తెలియని, మనం ఎప్పుడూ కలవని వ్యక్తులకు సేవ చేయడం, వారి జీవితాలను ప్రభావితం చేయడం అదృష్టమే. వృత్తిలో విజయాలు సాధించడంతోపాటు దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఉన్నంతకాలం కొత్త విషయాలు నేర్చుకోలేదు అని భావించిన రోజు ఒక్కటి కూడా లేదు. న్యాయ విద్యారి్థగా కోర్టులో చివరి వరుసలో కూర్చున్న రోజుల నుంచి సుప్రీంకోర్టు కారిడార్ల దాకా నా ప్రస్థానం సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి నా వంతు సేవ చేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. దాదాపు రెండేళ్లపాటు సీజేఐగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పారదర్శకత తీసుకొచ్చేందుకు కృషి చేశా. ఈ విషయంలో తరుచుగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టారు. దూషించారు. నన్ను తప్పుపట్టారు. వాటిని మర్చిపోలేను. నేను ఇక పదవీ విరమణ చేస్తున్నా. ట్రోలర్స్‌కు, విమర్శకులకు సోమవారం నుంచి పని ఉండదు. వారంతా నిరుద్యోగులైపోతారు. ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేం మా తండ్రి పుణేలో ఒక ఫ్లాట్ కొన్నారు. న్యాయమూర్తిగా చివరి రోజు దాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నాకు చెప్పారు. నిజాయతీ, సమగ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయన చెప్పిందే ఆచరించాను. న్యాయమూర్తిగా మారిన తర్వాత మొదట ఎదుర్కోవాల్సింది మనలోని భయాన్నే. మన పరిమితులు మనం తెలుసుకోవాలి. న్యాయవాద వృత్తి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ అధికార పరిధిని కూడా గుర్తుంచుకోవాలి. న్యాయమూర్తిగా ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేమని కోర్టులో ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు చట్టబద్ధమైన పాలనలోనే అన్యాయాలు జరుగుతూ ఉండొచ్చు. చట్టబద్ధ పాలనకు అవతల జరిగే అన్యాయాలను మనం సరిదిద్దవచ్చు. బాధితులకు ఉపశమనం కలిగించడం అనేది ఓదార్పు ఇచ్చే మన సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వారి కష్టాలను, సమస్యలను ఓపికతో వినగలిగే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఇన్ఫెక్షన్లు తొలగించే శక్తి సూర్యకాంతికి ఉంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు తెలుసు. సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా. నా బాహువులు విశాలమైనవి కాబట్టి అన్ని రకాల విమర్శలను వినమ్రంగా స్వీకరించా. బార్ అసోసియేషన్ సభ్యులు, నా సహచరులు నాకు మద్దతుగా నిలిచారు. సుప్రీంకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృత కోర్టు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. పెండింగ్ కేసులు పరిష్కరించా న్యాయ వ్యవస్థను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పారదర్శకత పెంచడానికి కృషి చేశా. పెండింగ్ కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చా. నేను సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 1,500 ద్రస్తాలు రిజి్రస్టార్ కప్‌బోర్డులో పడి ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకోకపోవడం బాధ కలిగించింది. ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించా. సుప్రీంకోర్టులో నమోదయ్యే ప్రతి కేసుకు ఒక నెంబర్ కేటాయించి, వరుసగా పరిష్కరించే విధానం ప్రారంభించా. దీనివల్ల వేలాది కేసులు పరిష్కారమయ్యాయి. బ్యాక్లాగ్ కేసుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కేసుల పెండింగ్ విషయంలో మాపై ఎన్నోవిమర్శలు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న 82,000 కేసుల్లో రిజిస్టర్ కాని కేసులు చాలా ఉండేవి. ఆ విషయం చాలామందికి తెలియదు. గత రెండేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 11,000కు తగ్గిపోయింది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్ఘాటించారు. మానవత్వంతో కూడిన తీర్పులిచ్చారు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. భారత న్యాయ వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారని ప్రశంసించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ తదితరులు మాట్లాడారు. జస్టిస్ చంద్రచూడ్ వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించడంతోపాటు మానవత్వంతో కూడిన తీర్పులు ఇచ్చారని చెప్పారు. ఆయనకు అంతులేని సహనం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవన శైలి ఆయన సొంతమని అన్నారు. క్లిష్టమైన తీర్పులు ఇచ్చే సమయంలోనూ ప్రశాంతంగా ఉండేవారని, న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెట్టారని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ నిత్యం యువకుడిలా కనిపిస్తారని, ఆయనను చూసి తాము వృద్ధులమైపోయినట్లు భావిస్తామని అన్నారు. ‘‘జస్టిస్ చంద్రచూడ్ పూర్తిగా శాకాహారి. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఆయనది క్రమశిక్షణతో కూడిన జీవితం. సమోసాలంటే ఆయనకు ఇష్టం. కానీ, సమావేశాల్లో ఏమీ తీసుకోరు. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోర్టుల్లో టెక్నాలజీ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. నా పనిని మరింత సులభతరం చేశారు’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు సుప్రీంకోర్టులో తన చివరి రోజు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ విద్యాసంస్థ హోదా విషయంలో కీలక తీర్పు వెలువరించారు. -
ప్రధాని మా ఇంటికి వస్తే తప్పేముంది: సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్‌లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు. -
జస్టిస్ పేరు తప్పుగా పలికిన న్యాయవాది.. సీజేఐ ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసుల విచారణ, జైలు శిక్షలు, బెయిల్ మంజూరు, కస్టడీ పొడగింపులు ఇవే గుర్తొస్తాయి. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కొన్నిసార్లు ఆసక్తికరమైన, ఫన్నీ, సీరియస్ సంభాషణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఓ సన్నివేశం సీజేఐ, న్యాయవాదికి మధ్య జరిగింది. కేసులో విచారణలో భాగంగా ఓ న్యాయవాది జస్టిస్ హృషికేష్ రాయ్‌ను ‘జస్టిస్ హృషికేశ్ ముఖర్జీ’గా సంబోధించాడు. గతంలో సుప్రీంకోర్టు విచారించిన ఓ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ..‘ఈ కేసు జస్టిస్ మృషికేష్ ముఖర్జీ ముందు ఉంది’ అని పేర్కొన్నారు.దీంతో వెంటనే స్పందించిన సీజేఐ డీవీ చంద్రచూడ్... న్యాయవాది వ్యాఖ్యలను సరిచేశారు. హృషికేష్ ముఖర్జీనా లేఖ హృషికేశ్ రాయ్? అని ప్రశ్నించారు. రాయ్‌ను ముఖర్జీగా చేశారని అన్నారు. న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తుల పేర్లు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, వెళ్లి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. కాగా జస్టిస్ హృషికేష్ రాయ్ సెప్టెంబరు 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తి కాకముందు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా హృషికేష్ ముఖర్జీ భారతీయ సినీ దర్శకుడు, ఎడిటర్, రచయిత. -
న్యాయం మరింత బలోపేతం: చంద్రచూడ్
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు. సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు. -
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
తప్పుడు సంకేతాలకు ఆస్కారం..!
న్యూఢిల్లీ: ‘భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం ప్రధానమంత్రి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపదా? నరేంద్ర మోదీ అలా వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన సలహాదారులైనా చెప్పాలిగా.. తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉంద’ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ అన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేట్ వేడుకల పట్ల ప్రధానమంత్రి ఆసక్తి చూపకపోవడమే మంచిదని అన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రైవేట్ కార్యక్రమాన్ని ఇలా బహిరంగపర్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ గురువారం పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ గురించి ప్రజల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగేందుకు అవకాశం కలి్పంచకూడదని సూచించారు. సీజేఐ ఇంట్లో పూజలో మోదీ పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని సిబల్ వెల్లడించారు. గత 50 ఏళ్లుగా తాను సుప్రీంకోర్టులో పని చేస్తున్నానని, ఎంతోమంది గొప్పగొప్ప ప్రధాన న్యాయమూర్తులను చూశానని తెలిపారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. మనం నమ్మే మతం, మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమని, అవి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి, బయటపెట్టాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ తేలి్చచెప్పారు. తాజా వివాదంపై సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ స్పందించారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని గుర్తుచేశారు. ఈ విభజన రేఖ విషయంలో సీజేఐ రాజీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. ఆ పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలి: సంజయ్ రౌత్ సీజేఐ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజ పట్ల శివసేన(ఉద్ధవ్) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతంజస్టిస్ చంద్రచూడ్ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మోదీతో జస్టిస్ చంద్రచూడ్ బంధం బయటపడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ మనకు న్యాయం చేకూర్చగలరా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: సుప్రియా సూలే జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే గురువారం పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. వయసులో, అనుభవంలో ప్రధాని మోదీ, జస్టిస్ చంద్రచూడ్ తనకంటే చాలా పెద్దవారని, వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు. అయితే, సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం గతంలో తాను ఎప్పుడూ వినలేదన్నారు. నీచ రాజకీయాలు చేయొద్దు: సంబిత్ పాత్రా సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విరుచుకుపడ్డారు. గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచి్చన విందుకు అప్పటి సీజేఐ వెళ్లినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తంచేయని నాయకులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. గణపతి పూజలో మోదీ పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌ను కలిస్తే ఇక్కడి రాజకీయ పారీ్టలేవీ స్పందించడం లేదని సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. -
మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, బ్యాక్లాగ్ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు. -
‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు. ‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్మేట్లు కావడం గమనార్హం. న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
సుప్రీంకోర్టులో సింగిల్ మాల్ట్ ఎపిసోడ్
న్యూఢిల్లీ: సంక్లిష్టమైన కేసులపై సీరియస్‌గా విచారణ జరిగే సుప్రీంకోర్టులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విస్కీ, దాని రకాలు తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ నవ్వులు పూయించింది. సీజేఐ హాస్య చతురత అందరినీ అలరించింది. పారిశ్రామిక ఆల్కహాల్ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సంబంధించిన వివాదంపై సీజేఐ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన విచారణ ఇందుకు వేదికైంది. ఈ కేసులో యూపీ తరఫున వాదిస్తున్న ద్వివేది తెల్ల జుట్టు రంగులమయంగా కని్పంచడంపై జస్టిస్ చంద్రచూడ్ సరదాగా ఆరా తీశారు. హోలీ సంబరాలు కాస్త శ్రుతి మించడమే కారణమంటూ ద్వివేది కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ‘‘ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించాలి. నా మనవల నిర్వాకం కూడా ఇందుకు కొంతవరకు కారణమే. సంతానం, మనవలు మరీ ఎక్కువగా ఉంటే, అందులోనూ వారంతా మనతో పాటే ఉంటుంటే ఇలాంటి గమ్మత్తైన సమస్యలుంటాయి. తప్పించుకోలేం’’ అన్నారు. సీజేఐ అంతటితో వదల్లేదు. ‘అంతేగానీ, ఆల్కహాల్‌కు ఏ సంబంధమూ లేదంటారు!’ అంటూ చెణుకులు విసిరారు. విస్కీప్రియుడైన ద్వివేది అందుకు చిరునవ్వులు చిందించారు. ‘‘విస్కీ పాత్ర కూడా ఉందని నేను ఒప్పుకుని తీరాలి. హోలీ అంటేనే ఆల్కహాల్ పారీ్టలు. పైగా నేను విస్కీకి వీరాభిమానిని’’ అనడంతో అంతా గొల్లుమన్నారు. సింగిల్ మాల్ట్ విస్కీ విషయంలో ఇంగ్లండ్‌లో తనకెదురైన గమ్మత్తైన అనుభవాన్ని విచారణ సందర్భంగా ద్వివేది ఏకరువు పెట్టారు. ‘‘నేను సింగిల్ మాల్ట్ విస్కీనే ఇష్టపడతా. ఆ విస్కీకి స్వర్గధామంగా చెప్పదగ్గ ఎడింబర్గ్ వెళ్లానోసారి. సింగిల్ మాల్ట్ తెప్పించుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకోబోతుంటే వెయిటర్ అడ్డుకున్నాడు. ‘ఇదేం పని! అది సింగిల్ మాల్ట్ విస్కీ. దాన్నలాగే నేరుగా ఆస్వాదించాలి. అంతేతప్ప ఇలా ఐస్క్యూబులూ సోడాలూ కలపొద్దు! పైగా దానికంటూ ప్రత్యేకమైన గ్లాస్ ఉంటుంది. అందులో మాత్రమే తాగాలి’ అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీసుకున్నాడు. సింగిల్ మాల్ట్ తాగేందుకు ఇంత తతంగం ఉంటుందని అప్పుడే నాకు తెలిసొచి్చంది’’ అంటూ వాపోయారు. దాంతో న్యాయమూర్తులతో పాటు కోర్టు హాల్లో ఉన్నవాళ్లంతా పడీపడీ నవ్వారు. ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు కూడా తమ చెణుకులతో ఈ సరదా సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు. పారిశ్రామిక ఆల్కహాల్‌తో పాటు విస్కీ, వోడ్కా వంటివి కూడా రాష్ట్రాల నియంత్రణ పరిధిలోకే వస్తాయంటూ ద్వివేది వాదించడంతో ఒక న్యాయమూర్తి కలి్పంచుకున్నారు. ‘‘ఇంతకీ మీరనేదేమిటి? ఆల్కహాల్ మందుబాబులకు కిక్కిచి్చనా, ఇవ్వకపోయినా రాష్ట్రాల ఖజానాకు మాత్రం కిక్కివ్వాల్సిందేనంటారా?’’ అనడంతో నవ్వులు విరిశాయి. ఇంకో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘కొన్ని రకాల మద్యం రుచి కాలం గడిచేకొద్దీ పెరుగుతుందని, కొన్ని తేలిక రంగులోనూ మరికొన్ని ముదురు రంగులోనూ ఉంటాయని... ఇలా ఆల్కహాల్‌కు సంబంధించిన చాలా అంశాలను మీరు ఎంతో చక్కగా వివరించారు. సాక్ష్యంగా ఆయా రకాల మద్యం బాటిళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు!’’ అనడంతో కోర్టు హాలంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది . ‘‘ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్‌ను వెంటనే నిలిపివేయాలని.. వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మూడు వారాల్లో(మార్చి 6వ తేదీలోగా) కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియ పర్చాల్సిన అవసరం ఉందని.. ఆ వివరాలను బహిర్గత పర్చాల్సిన అవసరమూ ఉందని.. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీ లోగా తన వెబ్సైట్లో పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి ఇచ్చేయాల్సిందేనని(ఇంకా ఎన్‌క్యాష్ అవ్వని బాండ్లను) రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. తీర్పుపై పిటిషనర్ల లాయర్ స్పందన ఎన్నికల బాండ్స్‌ను సుప్రీం కోర్టు ఆపేసింది పిటిషనర్ల వాదనతో పూర్తిస్థాయిలో కోర్టు ఏకీభవించింది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీల చట్టాల్లో చేసిన సవరణలను కొట్టేసింది సమాచార చట్టం ఉల్లంఘన కింద సుప్రీం కోర్టు పరిగణించింది విరాళాలు ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది పిటిషనర్ల తరఫు వాదించిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ల నేపథ్యం.. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(ఏడీఆర్ తరఫున) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కిందటి ఏడాది అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కానిస్టిట్యూషన్ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్లు పోగు! పిటిషనర్ల వాదన ఇదే.. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది అధికారప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోంది ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయి ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కేంద్రం వాదన.. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుంది. స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసింది ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ...‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ....‘అప్పుడు అసలు విరాళాలే రావ’ని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయి గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది ఇదీ చదవండి: 2023 డిసెంబర్ నాటికి రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం రాజకీయ అభ్యంతరాలు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం ఎలక్టోరల్ బాండ్లతో అధికార పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
సుప్రీం ప్రమాణాలతో సుదృఢ ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో ఉన్నత ప్రమాణాలను నెలకొలి్పందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తద్వారా దేశ ప్రజాస్వామ్య యాత్రను మరింతగా బలోపేతం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో తొలి విచారణ జరిగి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయసూత్రాల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతోందని కితాబిచ్చారు. వ్యక్తిగత హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పులు ఇతర దేశాలకు కూడా కరదీపికలని అభిప్రాయపడ్డారు. దేశ సామాజిక, రాజకీయ ప్రస్థానాన్ని అవి మేలిమలుపు తిప్పాయన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు సాధికార న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘శరవేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా చట్టాలను కూడా హౠ ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. ఈ నూతన చట్టాలు భవిష్యత్ భారతాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. సులభ, సత్వర న్యాయం దేశ పౌరులందరి హక్కు. అందుకే ఈ–కోర్టు మిషన్ ప్రాజెక్టు–3కి నిధులు పెంచాం. కోర్టుల్లో మౌలిక సదుపాయాల పెంపుకు నిబద్ధతతో పని చేస్తున్నాం’’ అని చెప్పారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ఇతోధికంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే తాజాగా జన్ విశ్వాస్ బిల్లును తీసుకొచి్చనట్టు చెప్పారు. మున్ముందు న్యాయవ్యవస్థపై అనవసర భారాన్ని అది తగ్గిస్తుందని వివరించారు. అలాగే వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్టం కూడా కోర్టు పనిభారాన్ని బాగా తగ్గించగలదని ఆశాభావం వెలిబుచ్చారు. వాయిదా సంస్కృతికి తెర పడాలి: సీజేఐ కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కాలం చెల్లిన విధానాలు, కేసుల వాయిదా సంస్కృతి వంటి సమస్యలు న్యాయ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. వీటిని నిర్మాణాత్మక రీతిలో పరిష్కరించడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అందుకే వీటిపై అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. సమర్థంగా సకాలం న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదా సంస్కృతి నుంచి వృత్తిపరమైన సంస్కృతికి మారాలని ఉద్బోధించారు. కేసుల పరిష్కారంలో అంతులేని జాప్యానికి కారణమవుతున్న సుదీర్ఘ వాదనలకు చెక్ పెట్టాల్సి ఉందన్నారు. ‘‘న్యాయ వృత్తి ఒకప్పుడు ఉన్నత వర్గాల పురుషులకే పరిమితమైందిగా ఉండేది. కానీ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం 36 శాతానికి పెరగడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో ఎంపికైన వారిలో 50 శాతానికి పైగా మహిళలే కావడం హర్షణీయం. న్యాయ వృత్తిలోకి కొత్తవారిని ప్రోత్సహించడంలో లింగ భేదం, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా సమానావకాశాలు కలి్పంచాలి. అలాగే జడ్జిల్లోనూ, లాయర్లలోనూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఎంతగానో పెరగాల్సి ఉంది’’ అన్నారు. ‘‘కోర్టులకు సుదీర్ఘ సెలవులపైనా చర్చ జరగాల్సి ఉంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులకు ‘ఫ్లెక్సీ టైం’ వంటి ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలనూ ఆలోచించాలి. కోర్టుల లోపల, వెలుపల రాజ్యాంగ నిర్దేశిత నిబద్ధతతో నడుచుకుంటున్నామా, లేదా అని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవ వేడుకలు ఇందుకు సరైన సందర్భం’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. ఈ–కోర్టుల పురోగతిని వివరించారు. దేశ న్యాయ వ్యవస్థను సమర్థంగా, పర్యావరణహితంగా సాంకేతికతతో కూడిందిగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజల కోర్టు: సీజేఐ సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం లాంఛనంగా ఏర్పాటైన ధర్మాసనానికి సీజేఐ జస్డిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యం వహించారు. 75 ఏళ్ల క్రితం 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు తొలి విచారణ జరిగిన తీరు, అప్పుడు పాటించిన స్వతంత్ర విలువలు నేటికీ అనుసరణీయమేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి గీటురాళ్లని అభిప్రాయపడ్డారు. వారు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లకు మానవ సహజమైన మొగ్గుదలలకు అతీతంగా తీర్పులు వెలువరించాలని పేర్కొన్నారు. ఈ దిశగా జడ్జిల సామర్థ్యాలను మరింతగా పెంచే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టు తొలి విచారణ పార్లమెంటులోని ప్రిన్సెస్ చాంబర్లో సాదాసీదాగా జరిగింది. నాటినుంచి సుదీర్ఘ ప్రస్థానంలో కోర్టు పనితీరు నానాటికీ మెరుగవుతూనే వస్తోంది. ప్రజల కోర్టుగా రూపుదిద్దుకుంటోంది. ప్రజల నుంచి ఏటా ఏకంగా లక్షకు పైగా అందుతున్న లెటర్ పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంపై వారి విశ్వాసానికి అద్దం పడుతున్నాయి’’ అన్నారు. -
D Y Chandrachud: మాట వినే లక్షణమేదీ?
ముంబై: నేటి సమాజంలో ఇతరులు చెప్పేది వినే లక్షణం లోపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ఎవరికి వారు తమ వైఖరే గొప్ప అనుకుంటూ ఒక చట్రానికి పరిమితమై బతుకుతున్నారన్నారు. ‘‘ఈ ధోరణిని బద్దలు కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇతరులు చెప్పేది వినడం గొప్ప కళ. దాని ద్వారా అవగాహన పరిధి ఎంతగానో పెరుగుతుంది. ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకోగలం’’అని హితవు పలికారు. శనివారం ఆయన పుణెలోని సింబయాసిస్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఆగ్రహావేశాలు, హింస, ఇతరులను అగౌరవపరడం వంటివాటితో నష్టాలే తప్ప సాధించేదేమీ ఉండదని విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. వినయ విధేయతలు, ధైర్యం, సమగ్రతలే ఆయుధంగా ముందుకు సాగాలని హితవు పలికారు. నేటి యువత ప్రశ్నించేందుకు అస్సలు వెనకాడకపోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో విభజనవాదం నానాటికీ పెరిగిపోతోందని ముంబైలో జమునాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో సీజేఐ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘సోషల్ మీడియాలో కన్పిస్తున్న ధోరణులు, అసహనం దీనికి సంకేతాలే. భారత్ కూడా ఇందుకు అతీతం కాదు’’ అని అభిప్రాయపడ్డారు. -
నేను రాజ్యాంగానికి సేవకుడిని
న్యూఢిల్లీ/ముంబై: రాజ్యాంగానికి, చట్టానికి తానో సేవకుడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించగానే, మాథ్యూస్ జె.నెడుంపర అనే న్యాయవాది ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ..సీనియర్ న్యాయవాది హోదా విధానాన్ని రద్దు చేయడంతోపాటు కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ..‘మనస్సులో ఉన్న విషయం చెప్పే స్వేచ్ఛ మీకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా, నేను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని. నాకు నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అంతేతప్ప, నాకు నచ్చింది కాబట్టి, ఇది నేను చేస్తాను అని చెప్పలేను’అని పేర్కొన్నారు. లాయర్లకు సీనియర్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నెడుంపర మరో ఏడుగురు వేసిన పిటిషన్‌పై అక్టోబర్‌లో విచారణ చేపట్టిన అప్పటి సుప్రీంకోర్టు బెంచ్.. సీనియర్ న్యాయవాది హోదాను ప్రతిభకు గుర్తింపుగా పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఏటీ) ముంబై ధర్మాసనం కొత్త కార్యాలయాన్ని శుక్రవారం సీజేఐ ప్రారంభించారు. న్యాయమూర్తుల నియామకంపై అంతిమ నియంత్రణ ఎవరిదనే అంశంపై నిత్యం తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జడ్జీల పోస్టుల ఖాళీలు పెరుగుతుండగా, నియామకాలుపెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు. కోర్టుల్లో జాప్యాలను నివారించి, సకాలంలో న్యాయం అందించే విషయంలో ట్రిబ్యునళ్లు కీలకంగా మారాయన్నారు. -
Hindustan Times Leadership Summit: కోర్టు తీర్పులను చట్టసభలు పక్కన పెట్టజాలవు
న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు. మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు. -
హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న సీజేఐ
మసాచుసెట్స్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆయన హార్వర్డ్ లా స్కూల్లోనే 1982–83లో ఎల్ఎల్ఎం డిగ్రీ చేశారు. 1983–86 మధ్య జ్యుడీషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. గత జనవరిలో ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో టెక్నాలజీ వినియోగం మరింత పెంచడంసహా సీజేఐగా తొలి ఏడాది తాను చేపట్టిన పలు చర్యలను అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయన వివరించారు. లాయర్ల మానసిక ఆరోగ్యం తదితర అంశాలను స్పృశిస్తూ ప్రసంగించారు. -
న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం
ఛత్రపతి శంభాజీనగర్: న్యాయ వృత్తిలో నిజాయతీ అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే న్యాయ వ్యవస్థ, ఆ వృత్తి రాణిస్థాయి. లేదంటే వాటి పయనం సాగేది స్వీయ వినాశనం వైపే‘ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ నిజాయతీని, నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన లాయర్లు మొదలుకుని న్యాయమూర్తుల దాకా అందరి పైనా ఉంటుందన్నారు. ఆదివారం ముంబైలోని మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీలో కార్యక్రమంలో ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నవిగా అనిపించే విషయాల్లో మనం రాజీ పడ్డప్పుడే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లేది‘ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. -
పార్క్‌లో సరదాగా..
న్యూఢిల్లీ: నిత్యం కీలకమైన కేసుల విచారణ, వాదోపవాదనలను ఆలకించడంలో బిజీగా ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కొద్దిసేపు అవన్నీ పక్కనబెట్టారు. మధ్యాహ్నం వేళ కొన్ని కేసుల వాదనలు విన్నాక మధ్యలో కొద్దిసేపు విరామం ప్రకటించారు. వెంటనే కొందరు జడ్జీలతో కలిసి అక్కడే ఉన్న ప్రముఖమైన సుప్రీంకోర్టు పార్క్‌లో కలియతిరిగారు. అక్కడికి వచి్చన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులతో సరదాగా మాట్లాడారు. అక్కడి కెఫెటేరియాలో టీ తాగారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు సీజేఐతోపాటు నడిచారు. -
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొప్పదనానికి వందనం చేయాల్సిందే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పదవీకాలంలో అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి ఎన్నో చరిత్రాత్మక తీర్పులతో వార్తల్లో నిలిచారు. భారత అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయిన చంద్రచూడ్ నిజజీవితంలో మాత్రం ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా సాదాసీదాగా గడుపుతారన్న విషయం కొద్ది మందికే తెలుసు. తాజాగా చంద్రచూడ్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని అప్పుడే అందరికి తెలిసింది. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో గరిష్టంగా ఏడేళ్ల సుదీర్ఘ కాలం సీజేఐగా పనిచేసిన రికార్డు కూడా ఉంది. అంతే కాదు డీవై చంద్రచూడ్ ఇప్పటికే సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా ఎన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇందులో అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఉన్నాయి. నాణానికి ఒకవైపే.. ఈ విషయాలు తెలుసా? ఆయన తండ్రి గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్ని తిరగ రాసిన చరిత్ర కూడా డీవై చంద్రచూడ్‌కు సొంతం. ఇవన్నీ నాణానికి ఒకవైపే. కానీ వ్యక్తిగతంగా చూస్తే ఆయనలో మనకి తెలియని మానవతామూర్తి ఉన్నారు. కన్నబిడ్డలు కాకపోయినా తల్లిలా లాలించే ఆయన మనసు చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయం గురించి విశ్రాంత జస్టిస్ అమర్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. డీవై చంద్రచూడ్ మంచి న్యాయమూర్తే కాదు మంచి మనిషి కూడా అని వ్యాఖ్యానించారు. పిల్లలిద్దరూ వికలాంగులే, అయినా దత్తత ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ తన ఇద్దరు దత్తత కూతుళ్లను సుప్రీంకోర్టుకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో పెద్దకుమార్తె పేరు ప్రియాంక. చిన్న కూతురి పేరు మహీ. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం. కోర్టు ప్రారంభం కావడానికి అరగంట ముందే సుప్రీంకోర్టుకు వచ్చిన చంద్రచూడ్.. తన ఇద్దరు పిల్లలు ప్రియాంక, మహీలకు చాంబర్, కోర్ట్ హాల్, ఇతర న్యాయమూర్తుల చాంబర్స్ మొదలైనవి స్వయంగా చూపించారు. కోర్టులో న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? సాధారణ పౌరులు ఎక్కడ కూర్చుంటారు? మొదలైన విషయాలను వారికి వివరించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి తను కూర్చునే కోర్టు హాల్ వరకు పిల్లలను వెంట తీసుకెళ్లారు. దీంతో పిల్లలిద్దరూ ఎంతగానో సంతోషించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని తెలిసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరు కూతుళ్లు దివ్యాంగులు కావడం, వాళ్లను చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకొని మరీ కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నారని చాలామందికి అప్పుడే తెలిసింది. ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో చంద్రచూడ్ దంపతులు వాళ్లను దత్తత తీసుకున్నారట. క్యాన్సర్‌తో మొదటి భార్య మరణం 1959లో జన్మించిన చంద్రచూడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుమారు ఏడేళ్ల ఐదు నెలల పాటు సుధీర్ఘకాలం సేవలందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కుమారుడు కూడా సీజేఐగా కావడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. 2024 నవంబర్ 10 వరకూ చంద్రచూడ్ సీజీఐగా కొనసాగనున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. చంద్రచూడ్ మొదటి భార్య రష్మీ 2007లో క్యాన్సర్‌తో మరణించింది. ఆ తర్వాత కల్పనను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరు మహి, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అప్పటికే మొదటి భార్యతో చంద్రచూడ్‌కు అభినవ్, చింతన్ అనే కుమారులున్నారు. అయనప్పటికీ దివ్యంగులైన ఆడపిల్లలను దత్తత తీసుకొని వాళ్లను కన్నబిడ్డలా చూసుకోవడం అభినందనీయం. -
సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం!
సాక్షి, న్యూఢిల్లీ: వేసవి సెలవుల అనంతరం జూలై 3వ తేదీ నుంచి దాఖలైన పిటిషన్ల కేటగిరీల ఆధారంగా సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)లు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లేదా సీనియర్ జడ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తుంది. తాజా కేసుల జాబితా, ప్రస్తావనలకు సంబంధించిన నూతన ప్రక్రియ కూడా జూలై 3 నుంచి అమలులోకి రానుంది. మంగళవారం నాటికి ధ్రువీకరించిన తాజా కేసులు ఆటోమేటిక్‌గా సోమవారానికి, మిగిలినవి శుక్రవారం జాబితా చేయనున్నారు. తాజా కేసులను సీఐఐ ఎదుట లాయర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రస్తావన ప్రొఫార్మాలు మధ్యాహ్నం 3 గంటలలోపు సమరి్పస్తే తదుపరి రోజు ధర్మాసనాలు వాటిపై నిర్ణయం తీసుకుంటాయి. అదే రోజున జాబితా చేర్చాలని కోరుకొనే పక్షంలో ఉదయం 10.30 గంటల లోపు అత్యవసర లేఖతో ప్రొఫార్మాను సంబంధిత అధికారికి అందజేయాలి. వీటిపై భోజన విరామ సమయంలో సీజేఐ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
కొలీజియమే అత్యుత్తమం: సీజేఐ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పరిపూర్ణమూ, లోపరహితమూ కాజాలదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక వ్యవస్థ అయిన కొలీజియాన్ని గట్టిగా సమర్థించారు. కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియం వ్యవస్థ తీవ్ర విభేదాలకు కారణంగా మారడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియాటుడే సదస్సులో సీజేఐ మాట్లాడుతూ కొలీజియంను అత్యుత్తమ వ్యవస్థగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థపై బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా కాపాడుకోవాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడే అది స్వతంత్రంగా పని చేయగలుగుతుందన్నారు. కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు ఆమోదం తెలపకపోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలను కొలీజియం బయట పెట్టడంపై కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ‘‘వీటిపై న్యాయ మంత్రితో చర్చకు దిగదలచుకోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు సర్వసాధారణం’’ అన్నారు. అయితే కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో గత 23 ఏళ్లలో ఎవరూ తనపై ఒత్తిడి తేలేదన్నారు. అలాగే న్యాయమూర్తుల లైంగిక ప్రవృత్తికి, వారి సామర్థ్యానికి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొలీజియం సిఫార్సు చేసిన వారిలో కొందరు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకోవడం తెలిసిందే. -
ప్రేమించడం కారణంగానే చనిపోతున్నారు: చీఫ్ జస్టీస్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ప్రేమించడం వల్లే ప్రతి ఏడాది వందలాది మంది యువకులు మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన అశోక్ దేశాయ్ స్మారక ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఉపన్యాసంలో న్యాయమూర్తి చంద్రచూడ్ చట్టం, నైతికత అనే అంశాలపై ప్రసంగించారు. లీగల్ న్యూస్ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ ప్రకారం..నెతికతో ముడిపడిన బ్రెస్ట్ ట్యాక్స్, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్, మంబైలో బార్ డ్యాన్స్‌పై నిషేధం, వ్యభిచారం తదితర కేసులు గురించి ప్రస్తావిస్తూ...ఆదిపత్య సముహాలు బలహీన వర్గాలను అధిగమించే ప్రవర్తన నియమావళే నైతికతను నిర్ణయిస్తుందన్నారు. బలహీనమైన అట్టడుగు వర్గాల సభ్యులకు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అదీగాక అణిచేత వేత వర్గాల చేతిలో అవమానింపబడే వేర్పాటువాదం కారణంగా సమాజంలో బలహీన వర్గాల వారు ప్రతివాద సంస్కృతిని సృష్టించలేకపోతున్నారని అన్నారు. ఒక వేళ బలహీన వర్గాలు అభివృద్ది చెందుతుంటే.. వారిని అణిచివేసేలా కొన్ని ప్రభుత్వ సముహాలు తమ అధికారాన్ని వినయోగిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి బలహీన వర్గాలు పురోగతిని సాధిస్తున్నప్పటికి వారిని సామాజిక నిర్మాణంలో దిగువన ఉంచడంతో వివక్షతను ఎదుర్కొంటూనే ఉంటున్నారని చెప్పారు. అలాగే ఒకరికి న్యాయం అనిపించింది మరోకరికి న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. 1991లో ఉత్తప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఎలా చంపారనే కథనం గురించి విరించారు. వాస్తవానికి వారు నివశిస్తున్న సమాజంలో ప్రవర్తన నియమావళిని అనుసరించి ఇది అక్కడ సమంజసం కావచ్చు. వాస్తవానికి చట్టం ప్రకారం ఇది హేతబద్ధమైన చర్య, ఘోరమైన నేరం కూడా. కొన్ని నెలల వాదనల అనంతరం అక్కడి గ్రామస్తులు ఈ నేరాన్ని అంగీకరించారని కూడా చెప్పారు. ప్రస్తుతం యువత తమ కులానికి వ్యతిరేకంగా ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం కారణంగా పరువు హత్యలకు దారితీసి చంపబడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని సుప్రీం కోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ...న్యాయాన్ని సరిదిద్దాం. రాజ్యంగ నైతికత వ్యక్తుల హక్కులపై దృష్టి పెడుతూ...సమాజంలో నైతికతను కాపడుతుందని చెప్పారు. భారత రాజ్యంగం ప్రజల కోసం రూపొందించబడింది కాదని, ఫ్రాథమిక హక్కలు ప్రకారం వారు ఎలా ఉండాలో చెబుతోంది. ఇదే మన రోజువారీ జీవితాన్ని మార్గ నిర్దేశిస్తుందని చెప్పారు. (చదవండి: ఈవెంట్‌కి వెళ్లకుండా అడ్డుకుందని..సుత్తితో కొట్టి..పది ముక్కలుగా కోసేశాడు) -
పౌర హక్కులకు... మేమే సంరక్షకులం
ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛ తదితర హక్కులకు న్యాయస్థానాలే శ్రీరామరక్ష అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ప్రజలు కూడా ఈ విషయంలో న్యాయవ్యవస్థపైనే అపారమైన నమ్మకం పెట్టుకున్నారని స్పష్టం చేశారు. శనివారం బాంబే బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జస్టిస్ అశోక్ హెచ్.దేశాయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశంలో స్వేచ్ఛా దీపిక నేటికీ సమున్నతంగా వెలుగుతోందంటే దాని వెనక ఎందరో గొప్ప న్యాయవాదుల జీవితకాల కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘ఏ కేసూ చిన్నది కాదు, పెద్దదీ కాదు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఒక సామాన్య కేసే ఇందుకు తాజా ఉదాహరణ. విద్యుత్ పరికరాల దొంగతనం కేసులో యూపీకి చెందిన ఒక వ్యక్తికి ట్రయల్ కోర్టు తొమ్మిది కేసుల్లో రెండేసి సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. కానీ అది ఏకకాలంలో, అంటే రెండేళ్లలోనే పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలివ్వడం మర్చిపోయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దాల్సి వచ్చింది. లేదంటే చిన్న దొంగతనం కేసులో దోషి ఏకంగా 18 ఏళ్ల జైల్లో మగ్గాల్సి వచ్చేది. అందుకే మరోసారి చెప్తున్నా. జిల్లా కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా చిన్న కేసు, పెద్ద కేసు అని విడిగా ఏమీ ఉండవు. అన్ని కేసులూ ముఖ్యమైనవే’’ అన్నారు. పౌర హక్కుల్ని అంతిమంగా న్యాయవ్యవస్థే పరిరక్షిస్తుందని ఈ కేసుతో మరోసారి తేటతెల్లమైందని అభిప్రాయపడ్డారు. సదరు కేసులో అలహాబాద్ హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. దాంతో శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సీజేఐ సారథ్యంలోని ధర్మాసనమే శుక్రవారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘మనిషి ప్రవర్తన సజావుగా ఉండేలా చూడటంలో చట్టంతో పాటు నైతికతది కూడా కీలక పాత్ర. మన బయటి ప్రవర్తనను చట్టం నియంత్రిస్తే మనోభావపరమైన లోపలి ప్రవర్తనను నైతికత దారిలో ఉంచుతుంది’’ అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. కోర్టుల వల్లే సుస్థిర ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ సమయంలో కోర్టుల స్వతంత్ర వ్యవహార శైలే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బాంబే హైకోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, నిర్భీతిగా వ్యవహరించే న్యాయస్థానాలే నాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాయి. మనకబారిన ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రమిద పూర్తిగా కొడిగట్టిపోకుండా జస్టిస్ రాణే వంటి న్యాయమూర్తులే కాపాడారు. బార్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కూడా ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపారు. మన ప్రజాస్వామ్యం ఇప్పటికీ సుస్థిరంగా నిలిచి ఉందంటే అదే కారణం’’ అన్నారు. పలువురు న్యాయమూర్తులతో తాను పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘యువత న్యాయవాద వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో బాంబే బార్ అసోసియేషన్ చురుౖMðన పాత్ర పోషించాలి. ఈ విషయంలో న్యాయమూర్తులపైనా గురుతరమైన బాధ్యత ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
కామన్ ఎంట్రన్స్‌తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు: సీజేఐ
పణాజి: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్ఏటీ) ద్వారా సరైన నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ పరీక్షల్లో ఉత్తీర్ణతకే తప్ప, విలువ ఆధారిత విద్యను ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. శనివారం ఆయన గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి విద్యా సంవత్సరం సెషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. -
Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్ జస్టిస్ క్లాక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. జడ్జిలపై గురుతర బాధ్యత ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు. -
సామాన్యుడి కోసం ధర్మపీఠం
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల తన ప్రమాణ స్వీకారంలో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్లో ఆశలు రేకెత్తించేదిగా ఉంది. పాలక విధానాల ఫలితంగా దేశం నేడు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం తన స్థాయిలో ఉందని ఆ ప్రకటన ద్వారా ఆయన సూచనప్రాయమైన భరోసాను ఇచ్చారు. తన ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని అనిపిస్తోంది! కనుకనే చంద్రచూడ్ ‘సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రకటించుకోగలిగారు. ‘‘పేదసాదల కోసం మా ప్రభుత్వం అన్నీ చేస్తోందని మన పాలకులు చెప్పుకోవచ్చు గాక. కానీ అలాంటి ‘కోతలు’ బ్రిటిష్ పాలకులు కూడా కోస్తూండేవారు. కానీ అసలు నిజం – పేదల ప్రయోజనాలు మాత్రం స్వతంత్ర భారత ప్రభుత్వం కూడా నెరవేర్చడం లేదు. ఈ సత్యాన్ని మన పాలకులు హుందాగా అణకువతో ఒప్పుకుని తీరాలి’’ – మహాత్మాగాంధీ (1947 డిసెంబర్) ‘‘వెయ్యిన్నొక్క కత్తుల కన్నా ప్రజాభిప్రాయం అనేది అత్యంత బలమైన ఆయుధం. హైందవాన్ని క్షుద్ర పూజాదికాలతో రక్షించు కోలేము. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశం మనది. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కంటికి పాపలా కాపాడుకోవాలి. ఎలా? నీలో మానవత్వం, ధైర్య సాహసాలు, నిరంతర జాగరూకత ఉన్నప్పుడే నీ ధర్మం నీవు నెరవేర్చగలుగుతావు. ఈ అప్రమత్తత మనలో కొరవడిన నాడు, మనం అత్యంత ప్రేమతో సాధించుకున్న స్వాతంత్య్రం కాస్తా చేజారిపోతుంది. కానీ దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుత అశాంతికి అంతటికీ కొందరు కారణమని వింటున్నాను. భారత దేశం హిందువులకు ఎంతగా పుట్టినిల్లో, ముస్లిములకూ అంతే పుట్టినిల్లు అని మరచిపోరాదు. అలాగే ఎవరికి వారు తమ మతమే గొప్పదనీ, అదే నిజమైనదనీ భావించడం తప్పు. ఈ భావననే చిన్నప్పటి నుంచీ పిల్లల్లో కూడా నూరిపోయడం వల్ల అదే నిజమన్న ధోరణిని వారిలో పెంచిన వారవుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునేదే నిజమైన ప్రజా ప్రభుత్వం. ప్రజల దారిద్య్రాన్ని, నిరుద్యోగ పరిస్థితిని పట్టించుకోని పాలకులు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండటానికి వీలు లేదు’’. – మహాత్మాగాంధీ (అదే ఏడాది మరొక సందర్భంలో) ‘‘దేశం కోసమే నా తపన అంతా. 365 రోజులూ పని చేస్తున్నా. నేను పునాది రాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం’’. – ప్రధాని నరేంద్రమోదీ (19.11.2022) ‘దేశం కోసమే నా తపనంతా..’ అనేంతగా ‘ఆత్మవిశ్వాసం’ కొంద రిలో పెల్లుబికి వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఆయన నిర్మొహమాటంగా చేసిన ఒక ప్రకటన దేశ ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని ఆలోచింపజేసేదిగా ఉంది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు ఆ పదవిలో ఉంటారు. ఆ లోపుగా.. దేశం నేడు పాలక విధానాల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దేశ దిశాగతిని మార్చడానికి ఆయన తన స్థాయిలో తోడ్పడగల నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఆయన ప్రకటన సూచన ప్రాయంగా అదే తెలియజేస్తోంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన భరోసాను పాలకవర్గాలు హరించేస్తున్న సమయంలో చంద్ర చూడ్.. ‘ఆధార్’ పత్రం పేరిట పాలకులు పౌరహక్కుల్ని కత్తిరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏనాడో ఎదుర్కొని అడ్డుకట్ట వేశారు. ‘ఆధార్’ కార్డు పేరిట పౌరులకు ప్రశ్నించే హక్కును హరించడం ఎలా సాధ్యమో ఆయన నిరూపించారు. ‘ఆధార్’ కార్డు చెల్లుతుందంటూ ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులు మెజారిటీతో నిర్ణయిం చగా, అది ఎలా రాజ్యాంగ విరుద్ధమో నిరూపించి నెగ్గుకొచ్చిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్! కనుకనే ఇప్పుడు దేశ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన రోజున కూడా ‘సామాన్యుల సేవే తన తొలి ప్రాధాన్యమని’ ప్రకటించారు. ఆ ప్రకట నలో ఆయన పాలకులకు చేదోడువాదోడుగా ఉపయోగపడే ‘సీల్డ్ కవర్’ తతంగానికి కోర్టులు స్వస్తి చెప్పించాలని కూడా సూచించారు. న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల నమ్మకం సడలిపోతున్న సమయంలో ఆయన ఇస్తున్న భరోసా నమ్మకాన్ని కలిగిస్తోంది. చంద్రచూడ్ ఎదుగుదలలో గాంధీ, నెహ్రూల ప్రజాస్వామ్య భావాల ప్రభావమే గాక వర్గరహిత సామాజిక వ్యవస్థ ప్రతిష్ఠాపన లక్ష్యంగా ప్రపంచ శ్రమజీవుల ప్రయోజనాల రక్షణకు కారల్ మార్క్స్ రూపొందించిన ప్రపంచ ప్రసిద్ధ మేనిఫెస్టో ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు! కనుకనే చంద్రచూడ్ ‘ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణే’ తన ధ్యేయంగా బాహాటంగా ప్రక టించుకోగలిగారు. ఎలాగంటే ధనికవర్గంలో జన్మించిన ఫ్రెంచి మహా రచయిత బాల్జాక్ ఫ్రెంచి సామాజిక పరిణామ క్రమాన్నే సామాన్య ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం మార్చేసిన వాడు. అందుకే మార్క్స్ అతణ్ణి సమాజ వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టిన మహా రచయితగా వర్ణించాడు. ధనిక, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలు క్రమంగా ఏ దారుణ పరిస్థితుల వైపుగా సామాజిక వ్యవస్థల్ని నడిపిస్తాయో తన రచనల ద్వారా ధనికుడైన బాల్జాక్ వర్ణించడాన్ని మార్క్స్ ప్రశంసించాడు. అంతేగాదు, ధనిక వర్గ నాగరికతకూ, దాని అధీనంలో జరిగే నేరాలకూ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో కూడా మార్క్స్ అనేక సదృశాలతో నిరూపించాడు. అలాంటి ధనిక వర్గ సమాజాల్లో ‘ఎవరికివారే యమునాతీరే’గా ప్రజావసరాలతో నిమిత్తం లేకుండా జరిగే వస్తూత్పత్తి లాగానే నేరగాళ్లు వరుసగా నేరాలు సృష్టిస్తుంటారు. వాటితోపాటు నేర చట్టానికి దోహదం చేస్తారు. ఈ క్రమంలోనే నేర చట్టాన్ని గురించి ప్రొఫెసర్ గారు ఉపన్యాసాలు దంచేయడానికి ముందుకొస్తారు. ఆ తర్వాత ఆ ఉపన్యాసాలన్నింటినీ సంకలనం చేసుకుని ఓ గ్రంథం సిద్ధం చేసుకుని దాన్ని జనరల్ మార్కెట్లోకి ఓ ప్రత్యేక వస్తువు(కమాడిటీ)గా విడుదల చేస్తాడు. అమ్మి సొమ్ము చేసుకుంటాడు! అంతేనా, అలాంటి సమాజంలోని నేరగాడు మొత్తం పోలీస్ వ్యవస్థ సృష్టికి, తద్వారా క్రిమినల్ జస్టిస్, ఆ పిమ్మట జడ్జీలు, ఉరి తీసే తలార్లు, ఆ పిమ్మట జ్యూరీ వ్యవస్థ వగైరాల ఏర్పాటుకు కారణమౌతాడు. అటుపైన ‘తాటి తోనే దబ్బనం’ అన్నట్టుగా చిత్రహింసలు మొదలై, ఆ హింసాకాండ నిర్వహణకు గానూ అందుకు తగిన వృత్తి నిపుణుల సృష్టి అవసరం అవుతుంది (ఇలాంటివారు అవసరం అవబట్టే రా.వి. శాస్త్రి ‘సారో కథలు’, ‘సారా కథలూ’ రాయాల్సి వచ్చింది). అందుకే మార్క్స్ అంటాడు: ‘‘శ్రామిక వర్గాలు, సంపన్న వర్గాలు భిన్న ధ్రువాలు. రెండూ ప్రైవేట్ ఆస్తుల సృష్టి కారకులే!’’ అని. అందువల్ల ఈ రెండు ఒకే నాణేనికి రెండు ముఖాలని సరిపెట్టుకుంటే చాలదు. ప్రైవేట్ ఆస్తి ప్రత్యేక సంపదగా తనకు తాను రక్షించుకొనక తప్పదు, అలాగే శ్రామిక జీవులూ తమను తాము రక్షించుకొనక తప్పదు. కనుకనే వారిది అమానుషమైన దుఃస్థితి. ఈ స్థితిలోనే ప్రైవేట్ ఆస్తిపరుడు స్వార్థపరుడు అవుతాడు, కాగా తన అమానుష మైన దుఃస్థితిని వదిలించు కోవాలనుకున్న శ్రమజీవి సమాజానికి శత్రువుగా కన్పిస్తాడు. కనుకనే శ్రమజీవిని దోచుకోవడంపై ఆధార పడిన ప్రైవేట్ ఆస్తి రద్దు అయితేనే శ్రమజీవులకు బతుకు. అయితే అసమ సమాజ వ్యవస్థలోని అమానుష జీవన పరిస్థితులు రద్దు కాకుండా మాత్రం శ్రామికులకు శాశ్వత విమోచనం దుర్లభమని మార్క్స్–ఎంగెల్స్‌లు నిరూపించారు (కలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 4). అందువల్ల జస్టిస్ చంద్రచూడ్‌ను ‘న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా మీరు ఏం చర్యలు తీసుకొంటారన్న’ ప్రశ్నకు ‘చేతల్లోనే చూపిస్తానని’ భరోసా ఇచ్చారు. అంతవరకూ ప్రజల అస మ్మతిని ప్రజాస్వామ్యం మనుగడకు రక్షణ కవచంగా ప్రధాన న్యాయ మూర్తి సుప్రీంకోర్టును నిరంతరం తీర్చిదిద్దగలరని ఆశిద్దాం. సామా న్యుడికే తన ‘పెద్ద పీట’ అని చాటిన చంద్రచూడ్ దేశ దిశాగతిని తీర్చి దిద్దేందుకు తనకు సంక్రమించిన అనితరసాధ్యమైన అవకాశాన్ని 2024 ఎన్నికల సంవత్సరాని కన్నా ముందస్తుగానే తగినట్టుగా ఉపయోగించుకోగలరని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సామాన్యుడికే పెద్దపీట: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. మంగళవారం సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురి, కిరణ్ రిజుజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భార్య కల్పనా దాస్‌తో కలిసి నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా చేతల్లో చూపిస్తానని బదులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. చరిత్రాత్మక తీర్పులు అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్, కమాండ్‌పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. అసమ్మతిని స్వాగతిస్తారు అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు. తొలి రోజు ఇలా... బుధవారం బాధ్యతలు స్వీకరించాక మధ్యాహ్న వేళ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులోని సీజేఐ కోర్టు గదిలోకి ప్రవేశించారు. ‘‘ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా బహుశా నా కెరీర్లో తొలిసారి ఆలస్యంగా విధులకు వచ్చాను. మళ్లీ ఇలా జరగదనుకుంటున్నా. ఇంతసేపూ లాయర్లు తదితరులందరినీ వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు. వాదనలు, కేసుల నిర్వహణల్లో లాయర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తానన్నారు. భవిష్యత్తులో కూడా బార్ సహకారం కొనసాగాలని కోరారు. సహచర న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కలిసి విచారణలు ప్రారంభించారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అనర్హత కేసు సహా తొలి రోజు సీజేఐ ధర్మాసనం ముందు 30 ప్రస్తావనలు జరిగాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర న్యాయవాదులు సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఫలవతంగా సాగాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. దేశ చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ.. -
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి
కోల్‌కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత. ‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ -
కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: నూతన సీజేఐగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్‌ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేస్తారని రిజిజు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్ పదో తేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్ చంద్రచూడ్‌కు అందజేశారు. ప్రస్తుత సీజేఐ లలిత్ కేవలం 74 రోజులే ఆ బాధ్యతల్లో కొనసాగి రిటైర్‌కానున్నారు. ఇదీ చదవండి: Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి -
యు.యు.లలిత్ అనే నేను..
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం జస్టిస్ లలిత్‌కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్ లలిత్ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్ రంగనాథ్ లలిత్(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. 1964లో జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశముంది. 100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐ దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ 18 రోజులు, జస్టిస్ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్ జె.సి.షా 36 రోజులు, జస్టిస్ జి.బి.పట్నాయక్ 41 రోజులు, జస్టిస్ ఎల్.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు. -
తిరుపతిలో సిజెఐ ఎన్వీ రమణ పర్యటన
-
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
అధికారికం: సుప్రీం కోర్టు సీజేగా యూయూ లలిత్
న్యూఢిల్లీ: భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. అయితే.. జస్టిస్ యూయూ లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎందుకంటే.. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ 1957, నవబర్ 9న జన్మించారు. 1983లో లీగల్ కెరీర్‌ను ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ముంబై హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2004, ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు జడ్జీగా నియమితులయ్యే వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయవాదిగా పని చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీ కోర్టు జడ్జీగా నియమితులయ్యారు. ఇదీ చదవండి: పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా? -
సీజేఐగా ఉదయ్ ఉమేశ్ లలిత్.. నాడు అమిత్ షా, సల్మాన్ ఖాన్ కేసుల్లో..
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎన్నో కీలక కేసుల్లో తీర్పులిచ్చి చరిత్ర సృష్టించారు. ముస్లిం మహిళలకు నోటి మాట ద్వారా విడాకులిచ్చే త్రిపుల్ తలాక్ సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దానిని రద్దు చేస్తూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ యుయు లలిత్ కూడా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ నేరుగా సుప్రీం బెంచ్‌కు వచ్చి అత్యున్నత స్థానాన్ని అందుకున్న రెండో వ్యక్తిగా జస్టిస్ లలిత్ రికార్డులకెక్కనున్నారు. 1971 జనవరిలో 13వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఎం సిక్రి బార్ నుంచి బెంచ్‌కు వచ్చిన తొలి వ్యక్తి. ఆగస్టు 27న జస్టిస్ లలిత్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన కేవలం 74 రోజులు మాత్రమే సీజేఐ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలం ఎవరూ ఈ పదవిలో కొనసాగలేదు. కాగా, జస్టిస్ యు యు లలిత్ మహారాష్ట్రలో 1957 నవంబర్ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా లలిత్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1986లో ముంబైæ నుంచి ఢిల్లీకి వచ్చారు. 2004, ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ అయ్యారు. క్రిమినల్ లాయర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినీ తారల వరకు ఎందరో ఆయన క్లయింట్లుగా ఉన్నారు. బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిందితుడిగా ఉన్న హై ప్రొఫైల్ కేసులు సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్, తులసీరామ్ ప్రజాపతి కేసుల్ని వాదించారు. కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తరఫున కోర్టులో వాదించారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అవినీతి కేసుల్ని, ఒకప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్ పుట్టిన తేదీ వివాదం కేసుల్ని వాదించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. లలిత్ది న్యాయవాదుల కుటుంబం. ఆయన తండ్రి యుఆర్ లలిత్ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా ఉండేవారు. కీలక తీర్పులు బార్ నుంచి సుప్రీం కోర్టు బెంచ్‌కి నేరుగా వచ్చిన అతి కొద్ది మంది న్యాయవాదుల్లో లలిత్ ఒకరు. 2014 జూలైలో సుప్రీం కొలీజియం లలిత్‌ను న్యాయమూర్తిగా తీసుకోవాలని సిఫారసు చేసింది. 2017 ఆగస్టులో త్రిపుల్ తలాక్‌పై ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. అయిదుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఒకరు. ఈ తీర్పు 3–2 మెజార్టీతో వెలువడింది. త్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమంటూ జస్టిస్ యుయు లలిత్ గట్టిగా చెప్పారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేకర్, న్యాయమూర్తులు, జస్టిస్ ఎస్ అబ్దుల్లా నజీర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఆనాటి సీజేఐ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ త్రిపుల్ తలాక్‌పై కేంద్రమే చట్టం చేయాలంటూ తీర్పునివ్వకుండా ఆరు నెలలు నిలిపివేశారు. కానీ మిగిలిన ముగ్గురు త్రిపుల్ తలాక్ రద్దుకు అనుకూలంగా ఉండడంతో ఆ తీర్పు వెలువడింది. 2020 జులైలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్ రాజ కుటుంబం హక్కేనంటూ తీర్పునిచ్చిన బెంచ్‌లో జస్టిస్ లలిత్ ఉన్నారు. పోక్సో చట్టం కింద వివాదాస్పద స్కిన్ టు స్కిన్ నేరుగా శారీరక భాగాలు తాకితేనే లైంగిక నేరం కిందకి వస్తుందంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో జస్టిస్ లలిత్ తోసిపుచ్చారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా యూయూ లలిత్ -
సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఉదయ్ రమేష్ లలిత్
-
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ
సాక్షి, న్యూఢిల్లీ/శాన్ఫ్రాన్సిస్కో: భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ ప్రతి చర్యకు న్యాయపరమైన ఆమోదం లభిస్తుందని భావిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయ అవసరాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాయన్నారు. కానీ, భారత న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి.. కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నా రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతలను, వాటి పాత్రను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారంటూ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై సరైన అవగాహన లేకుంటే ప్రజలు సరైన దిశగా ఆలోచించలేరని చెప్పారు. ప్రజల్లోని ఈ అజ్ఞానమే న్యాయవ్యవస్థ స్వతంత్రను నాశనం చేయడమే ఏకైక లక్ష్యంగా ఉన్న కొన్ని శక్తులకు సహాయకారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ శుక్రవారం రాత్రి శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘దేశంలో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో తమ బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు సైతం ఇందులో చురుగ్గా వ్యవహరించారు’అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయని, కానీ పరిణతి గల ఏ ప్రభుత్వమూ తన సొంత దేశం పురోగతిని దెబ్బతీసేలా విధానాలను మార్చబోదని సీజేఐ తెలిపారు. దురదృష్టవశాత్తూ భారత్‌లో మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలాంటి సున్నితత్వం, పరిపక్వత కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతీ ఒక్కరు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. -
వివాదాలకు ‘ప్రత్యామ్నాయ’ పరిష్కారాలు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు. దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే.. తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్‌పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను పరిశీలించడానికి తగిన అధికారం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ జాతీయులను సంవత్సరంలోగా గుర్తించి, నిర్భంధించి, దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ గురువారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ‘‘పార్లమెంట్ సభ్యుల సమస్య, నామినేషన్ సమస్య, ఎన్నికల సంస్కరణలు ఇలా ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, దాంతోపాటు ఇక ప్రతిరోజూ మీ కేసును మాత్రమే వినాలి! అవి రాజకీయ అంశాలు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. మీరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను(పిల్) మేము(న్యాయస్థానం) విచారణకు స్వీకరించాల్సి వస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్‌సభ ఉన్నాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పిటిషన్‌కు కౌంటరు వేయాలని కేంద్రం భావిస్తే జాబితాలో చేరుస్తామని చెప్పారు. -
సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. -
దుబాయ్‌లో న్యాయ సహాయ కేంద్రం: జస్టిస్ రమణ
న్యూఢిల్లీ: దుబాయ్‌లో ఉంటున్న భారతీయులంతా కలిసి లీగల్ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారతీయులకు అది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దుబాయ్ పర్యటనలో ఉన్న జస్టిస్ రమణ శుక్రవారం అక్కడి గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమ కోహ్లి ఆయనతో పాటు ఉన్నారు. దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం యూనియన్ సుప్రీంకోర్టు ఆఫ్ ది యూఏఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హమద్ అల్ బదీ ఆహ్వానం మేరకు జస్టిస్ రమణ అక్కడ పర్యటిస్తున్నారు. అబుదాబిలోని భారత సంతతి వారి సన్మాన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. -
‘హిజాబ్’పై హోలీ తర్వాత విచారణ: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు. -
Hyderabad: గచ్చిబౌలిలో IAMC బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ
-
యుద్దం ఆపమని పుతిన్‌ను ఆదేశించలేము కదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా అక్కడ ఉన్న విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసి విమానాలను రద్దు చేయడంతో విద్యార్థులు స్వదేశానికి చేరుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిల్(ప్రజాహిత వ్యాజ్యం) దాఖలైంది. ఈ పిల్‌పై గురువారం విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశానని.. ఓ వీడియోలో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే విషయంలో సీజేఐ ఏం చేయలేరా అని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజేఐ స్పందిస్తూ.. విద్యార్థుల పరిస్థితుల పట్ల తమకు కూడా సానుభూతి ఉందని అన్నారు. కానీ.. యుద్దం ఆపమని తాము పుతిన్‌ను ఆదేశించలేము కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను తరలించే విషయంలో భారత ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. వారి పని వారు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తాము ఏం చేయగలమో అటార్నీ జనరల్ సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు. -
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!
NV Ramana today called Omicron a "silent killer: సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు హాజరవ్వాలన్న అభ్యర్థన పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒమిక్రాన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంభోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ భారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ భారిన పడ్డానని, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో భారిన పడి బయటపడ్డాక కూడా ఇంకా 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైబ్రిడ్ శైలిలో విచారణలు జరుగుతున్నాయి. వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు, మిగిలినవి ఆన్లైన్లో జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని ఇంకా 15 వేల కేసులు పెరిగాయని జస్టీస్ రమణ అన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ప్రజలు మాత్రం కోలుకుంటున్నారంటూ కౌంటరిచ్చారు. వెంటనే జస్టీస్ రమణ తాము చూస్తాం అని వ్యగ్యంగా బదులిచ్చారు. ఈ మేరకు గత మూడో వేవ్‌లో సుప్రీం కోర్టు న్యాయవాదులు, సిబ్బంది అధిక సంఖ్యలో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. (చదవండి: 10, 12వ తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ) -
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మక వైఖరి తీసుకున్నాం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్‌ను క్రిమినల్ నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మకమైన వైఖరిని తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. క్రిమినల్ చట్టాలకు సమగ్రమైన సవరణలు చేయడానికి.. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఇతరుల అభిప్రాయాలను కోరామని వెల్లడించింది. భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతగా కోరిక తీర్చుకుంటే దాన్ని మారిటల్ రేప్‌గా పిలుస్తారు. దంపతులైనా, సహజీవనం చేస్తున్నా.. మహిళ సమ్మతి లేకుండా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా సంభోగం చేస్తే... పాశ్చాత్య దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. రేప్‌గానే చూసి... సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అయితే భారత సమాజంలో భిన్న మతాలు, సంస్కృతులు, ఆచారాలు, నిరక్షరాస్యత తదితరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు మారిటల్ రేప్‌ను నేరంగా చేయడం సాధ్యం కాదని కొన్నేళ్లుగా న్యాయస్థానాలకు చెబుతున్నాయి. మహిళల నుంచి గట్టిగా డిమాండ్లు వచ్చినపుడు కూడా ఇదే సమాధానాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చాయి. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ రాజీవ్ షక్దర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులు గురువారం విచారణకు రాగా... సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తాజా వైఖరి గురించి తన ముందు ప్రస్తావించారని, అయితే ఇది బెంచ్‌లోని తోటి సభ్యుడు జస్టిస్ సి.హరి శంకర్, ఈ కేసులోని ఇతర పక్షాల గైర్హాజరులో జరిగిందని జస్టిస్ రాజీవ్ షక్దర్ వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మోనికా అరోరా స్పందిస్తూ.. ‘క్రిమినల్ లాలో సమగ్ర మార్పులు చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఐపీసీలోని సెక్షన్ 375 (రేప్) కూడా ఉంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల సీజేలు, ఉభయసభల ఎంపీలు, ఇతరుల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించాం’ అని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. చట్టంలో సమూల మార్పులంటే సమయం పడుతుందని, మారిటల్ రేప్ అంశాన్ని ప్రత్యేకంగా ఏమైనా పరిశీలిస్తున్నారేమో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేప్ కేసులకు సంబంధించిన సెక్షన్ 375కి సంబంధించి మీరేమైనా సూచనలు చేస్తే మేము పరిగణనలోకి తీసుకొని ఆదేశాలిస్తామని తెలిపింది. పిటిషనర్లు కోరుతున్నారని మారిటల్ రేప్‌కు ప్రస్తుతమున్న మినహాయింపులను కొట్టివేయలేమని ఇదివరకే దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో హోంశాఖ తెలిపింది. సహజ న్యాయసూత్రాల ప్రకారం... భాగస్వామ్య పక్షాలందరి వాదనలు వినడం అవసరమని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు తమ సలహాలు, సూచనలు చేసే స్వేచ్ఛ పిటిషన్‌దారులకు ఉందని పేర్కొంది. కొన్ని పరిస్థితుల్లో అది రేప్ కాదనడం సమస్యేనని ధర్మాసనం గతంలో మౌఖికంగా అభిప్రాయపడింది. ‘సెక్స్ వర్కర్ సమ్మతి లేకుండా బలవంతం చేస్తే (ఆమె ఏ దశలో నిరాకరించినా) అది రేప్ కిందకే వస్తుందని, ఎలాంటి మినహాయింపులుండవని చట్టం చెబుతోంది. మరి అర్ధాంగికి ఎందుకు నిరాకరించే హక్కు ఉండకూడదు? ఆమెను తక్కువగా చూడటం సబబేనా? అని జస్టిస్ షక్దర్ ప్రశ్నించారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీగా) నియమితులైన సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు.. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనని, అలాంటపుడు భర్త కోరిక.. భార్య నిరాకరణ కంటే ఎందుకు అధికమని ప్రశ్నించారు. మారిటల్ రేప్ నుంచి భర్తలకు మినహాయింపునివ్వడం నిర్హేతుకమని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. -
మీ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన తనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రజలిచ్చిన ఆతిథ్యం, చూపిన ప్రేమాభిమానాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతోషం వ్యక్తం చేశారు. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, పాత్రికేయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సమయాభావం వల్ల ఎందరినో కలవలేకపోయానని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని జస్టిస్ రమణ తెలిపారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, ఆ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర పర్యటనను ముగించుకున్న నేపథ్యంలో జస్టిస్ రమణ సోమవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘ఎప్పటి నుంచో నా స్వగ్రామం పొన్నవరానికి వెళ్లి రావాలనుకున్నాను. సుప్రీంకోర్టుకు శీతాకాలపు సెలవులు రావడంతో నా ఆలోచనలను అమల్లో పెట్టే అవకాశం దొరికింది. ఎంతో ఉత్సాహంగా స్వగ్రామానికి బయలుదేరాను. ఆంధ్రప్రదేశ్‌లో కాలుమోపిన నాటినుంచి ప్రజలు నన్ను అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తారు. దీనిని నేను, నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువజాలం. పొన్నవరం పొలిమేరల నుంచి ఊరేగింపుతో నన్ను తీసుకెళ్లిన వైనం ఎంతో కదలించింది. మా ఇద్దరి కుమార్తెలకు మరోసారి.. అల్లుళ్లు, చిన్నారి మనుమరాళ్లకు తొలిసారి నా ఊరిని చూపించగలగడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆప్తులు ఎంతోమంది కలుస్తుంటే భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఎంతోమంది ఎన్నో రంగాలకు చెందిన వారు నన్ను పలకరించేందుకు వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు. న్యాయవాద వృత్తిలో నడక నేర్పిన బెజవాడ బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అతితక్కువ కాలంలో అసాధారణ ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణిని సత్కారాలతో ముంచెత్తారు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులపట్ల అభిమానం, గౌరవం శ్లాఘనీయం. ఏపీలో అడుగుపెట్టిన నాటినుంచి నా బాగోగులు చూసుకున్న ఏపీ ప్రోటోకాల్ సిబ్బందికి, పోలీసులకు, రాజ్‌భవన్ సిబ్బందికి, మొత్తం అధికార యంత్రాంగానికి నా కృతజ్ఞతలు. హైదరాబాద్‌లో బయల్దేరి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు, తిరిగి ఏపీ నుంచి హైదరాబాద్ చేరే వరకు సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కూడా నా కృతజ్ఞతలు’. సుప్రీంకోర్టు సీజేకి ఘన స్వాగతం కాగా, ఏపీలో పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు కుటుంబ సమేతంగా బయలుదేరిన సీజేఐ ఎన్వీ రమణ సూర్యాపేటలో జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. -
స్వతంత్ర ప్రతిపత్తి గల ‘పీపీ’ వ్యవస్థ అవసరం
సాక్షి, అమరావతి: సామాన్యులకు పూర్తి న్యాయం అందాలన్నా, కోర్టుల్లో కేసులు పేరుకుపోకుండా ఉండాలన్నా స్వతంత్ర ప్రతిపత్తి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. దిగువ కోర్టుల్లో స్థానిక భాషలోనే వాదనలు జరగాలని, అప్పుడే సామాన్యుడికి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో జస్టిస్ రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ.. న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంతోపాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్నారు. తన ప్రస్థానం బెజవాడ బార్ అసోసియేషన్ నుంచే మొదలైందని చెబుతూ.. జూనియర్ అడ్వకేట్‌గా ఇక్కడ ప్రాక్టీస్ చేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై సరైన శ్రద్ధ చూపలేదని, పదకొండేళ్లుగా కోర్టుకు సొంత భవనం లేనప్పటికీ న్యాయవాదులు సహనంగా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అడ్వకేట్లు కొంత సమయాన్ని ఉచిత న్యాయ సహాయం చేసేందుకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రసంగించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆసోసియేషన్ సభ్యులూ పాల్గొన్నారు. ఇక తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన మణి మాస్టారును సీజేఐ సత్కరించారు. -
సమాజానికి మీరే మార్గదర్శకులు
సాక్షి, అమరావతి: న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులు తమ శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నన్నాళ్లు ఓ తెలుగువాడిగా న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని తెలిపారు. హైకోర్టులో కొత్త జడ్జీల నియామకాలు వీలైనంత త్వరలో పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. ఖాళీల భర్తీ విషయంలో హైకోర్టు సీజేకు లేఖ రాశామని, పేర్లు పంపితే ఆమోదిస్తామన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం సంయుక్తంగా ఆదివారం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి, ఇతర కార్యవర్గ ప్రతినిధులు, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, బార్ కౌన్సిల్ ఇతర సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ప్రతినిధులు గజమాలలతో సన్మానించారు. శాలువాలు కప్పి జ్ఞాపికలు బహూకరించారు. ఇతర న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ , హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాలను కూడా శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం వివిధ జిల్లాల్లోని న్యాయవాద సంఘాలకు చెందిన న్యాయవాదులు జస్టిస్ రమణను సన్మానించేందుకు పెద్ద సంఖ్యలో వేదికపైకి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్కులు లేకుండా పైకి రావడం, ఒకరినొకరు తోసుకుంటూ వస్తుండటంతో జస్టిస్ రమణ ఒకింత అసహనం వ్యక్తంచేసి న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. నేనేమీ సినిమా హీరోను కాదు ‘ఈ పర్యటనలో నాపై మీరు చూపిన ఆదరణ, అభిమానం, ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు. ప్రతీ ఒక్కరూ శాలువా కప్పాలని, దండ వేయాలని, ఫొటో తీసుకోవాలన్న తాపత్రయాన్ని పక్కన పెట్టండి. నేను ఇక్కడి వాడినే. నేనేమీ సినిమా హీరోను కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయ్యాక కొందరు నా ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదు. మనం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే మళ్లీ కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉంది’.. అని న్యాయవాదులకు హితబోధ చేశారు. ఎక్కువసేపు జరిగితే వారూ పారిపోవచ్చు.. ‘మీరు నాపై ఎంత ప్రేమ కురిపిస్తున్నారో నాకు తెలుసు. గత మూడ్రోజులుగా వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. కొద్దిసేపట్లో గవర్నర్ వద్ద తేనీటి విందుకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది న్యాయమూర్తులు బిజీ షెడ్యూల్‌వల్ల అలిసిపోయారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ అలసిపోయి నావల్ల కాదంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ సమావేశం ఎక్కువసేపు జరిగితే నా సహచర మిత్రులు జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది’.. అని జస్టిస్ రమణ అన్నారు. ఇక అప్పటికే మ.3.30 గంటల సమయం కావడంతో కార్యక్రమానికి వచ్చిన వారు భోజనం చేయకపోవడంతో మిగిలిన న్యాయమూర్తులు ప్రసంగించే అవకాశం లేకుండాపోయింది. జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు వద్దకు వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ అమరావతి రైతులకు అభివాదం చేస్తూ హైకోర్టు ప్రాంగణం చేరుకున్నారు. కార్యక్రమానికి ముందు జస్టిస్ ఎన్వీ రమణ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు మీడియాను అనుమతించలేదు. -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
ముగిసిన తేనీటి విందు
-
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
-
న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు. మౌలిక వసతుల కల్పన దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు. మహిళలను స్వాగతించాలి పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్‌చైర్మన్ కె.సునీల్ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్ నుంచి సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమైంది. కొలీజియం చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను బుధవారం రాత్రి అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 21 నెలల తర్వాత కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 25 మంది ఉన్నారు. బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య 10కి చేరింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదిస్తే న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. మొదటిసారి ముగ్గురు మహిళలు ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియమితురాలైన తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. కాబోయే తొలి మహిళా సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎనగలగుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగరత్న. ‘‘ఏదైనా బ్రాడ్‌కాస్టింగ్ చానల్ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లతో సంచలనాలను నిలిపివేయాలి’’ అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. బార్ నుంచి తొమ్మిదో న్యాయవాది కొలీజియం సిఫార్సు చేసిన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కోదండరామయ్య కుమారుడు పీఎస్ నరసింహ. ఆయన హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన ఆయన పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్‌మాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్ రామచంద్రదాస్ తరఫున పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్ క్యూరీగా సేవలందించారు. బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి న్యాయవాది జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ కూడా 13వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ కూడా 2014లో బార్ నుంచి సుప్రీం కోర్టు న్యాయయూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. నాలుగో తరం న్యాయవాది తమ పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ నాలుగో తరంలో న్యాయవాది వృత్తి చేపట్టారు జస్టిస్ విక్రమ్‌నాథ్. గుజరాత్‌లోని కౌశంబి జిల్లాకు చెందిన ఆయన అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 10న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆన్లైన్ ద్వారా కోర్టు కార్యకలాపాలు చేపట్టి లైవ్ స్ట్రీమ్‌కు జస్టిస్ విక్రమ్ నాథ్ నాంది పలికారు. జస్టిస్ హిమా కోహ్లి ప్రస్థానం జస్టిస్ హిమా కోహ్లి 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సహా పలు విభాగాలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీలో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి 2007 ఆగస్టు 29న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే 2024 సెప్టెంబర్ వరకు సేవలు అందించనున్నారు. -
విధానపర అంశాలపై విలువైన సంపుటి
డాక్టర్ యలమంచిలి శివాజీ రాసిన ఈ గ్రంథం గత ఐదు దశాబ్దాలలో వ్యవ సాయ రంగంలో ఆశించిన విధానపర అంశాలపై పేర్కొనదగిన వ్యాసాల సంపుటి. రైతుల పట్ల అమితమైన ఆవేద నను వ్యక్తపరుస్తూ రచయిత సాగునీరు, విద్యుత్, ఎరువులు, రుణసదుపాయం, పెరుగుతున్న అనుత్పాదక భూమి వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. రైతులు అందిస్తున్న సేవలు, వారికి లభిస్తున్న ఫలితాల మధ్య గల అసంబద్ధతను పుస్తకం ప్రస్తావిస్తుంది. గత 71 ఏళ్ళల్లో తమ జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి సంఖ్య కేవలం 71 నుండి 63 శాతానికి మాత్రమే తగ్గింది. గ్రామీణ ప్రాంతాల నుండి ఆదాయం పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నది. వ్యయం తగ్గించుకోవడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, ప్రాసె సింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై రైతులకు మార్గదర్శకం లేకపోవడం, వ్యవసాయ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధరలు అందకపోవడంతో గ్రామీణ ఆదాయం తగ్గిపోయి, వ్యవసాయ రంగానికి అందవలసిన ప్రయోజనాలను చాలా వరకు పట్టణ ప్రజలే ఎగరేసుకుపోతున్నారు. అదే సమయంలో మెరుగైన జీవనం కోసం పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్న వారిని వాణిజ్య, పారిశ్రామిక రంగం అక్కున చేర్చుకోలేక పోవడంతో పట్టణ ప్రాంతాలలో పుట్టగొడుగుల వలే మురికి వాడలు పెరిగి పోతున్నాయి. ఈ ప్రక్రియను నిరోధించడం కోసం గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలని రచయిత సూచించారు. ఒక అధ్యాయంలో, రైతులు చాలావరకు ప్రగతిశీలురై, మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తున్న గుంటూరు జిల్లాల్లోని వ్యవసాయ పరిస్థితుల గురించి రచయిత వివరించారు. అధిక పెట్టుబడులతో వారు అనేక రకాల పంటలు పండిస్తున్నారు. కానీ చివరకు వారి ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. రచయిత భారత్, చైనాల మధ్య ఆసక్తికరమైన సారూప్య తను చూపారు. మన దేశంలో సాగులో ఉన్న భూమిలో 60 శాతమే ఉన్న చైనా పెద్దగా దిగుమతులు లేకుండానే తన ఆహార అవసరాలను తీర్చుకోగలుగుతున్నది. భారతదేశంలో వలె చైనాలో భూమి సారవంతమైనది కాదు. కానీ, ప్రభుత్వం రైతు లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక మద్దతు కారణంగా ఇది సాధ్యమైంది. దేశంలో వివిధ సమయాలలో, వివిధ ప్రాంతాలలో జరిగిన రైతు ఉద్యమాల చరిత్ర గురించిన తన అనుభవాలను శివాజీ పంచుకున్నారు. రైతుల సమస్యలను ప్రస్తావించడంలో ఈ రచయితకు గల అంకితభావం ప్రశంసనీయమైనది. నేటి తరాలకేగాక, భవిష్యత్ తరాల వారికి కూడా ఈ గ్రంథం విలువైన వనరుగా, మార్గదర్శిగా ఉండగలదు. నాకు ప్రవేశం లేని తెలుగులో రాసిన ఈ గ్రంథంలోని కొన్ని భాగాలను శివాజీ ఆంగ్ల అనువాదం అందించారు, భాషాపరమైన అవరోధం లేకుండా. ఈ గ్రంథానికి ముందు మాట రాయమని కోరడం నేను గౌరవంగా భావిస్తున్నాను. రైతుల పరిస్థితుల పట్ల హృదయాన్ని కదిలించివేసే రచయిత తీవ్రమైన ఆవేదన దాదాపు ప్రతి వ్యాసంలో ప్రతిధ్వనిస్తుంది. తన ప్రయత్నాలలో రచయితకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. (ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్న డాక్టర్ యలమంచిలి శివాజీ రచన ‘పల్లెకు పట్టాభిషేకం’కు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి రాసిన ముందుమాట) ఎస్ఏ.బాడ్డే -
సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రమణ ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జీలు, కేంద్రమంత్రులు, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 2022 ఆగస్ట్ 26వ తేదీ వరకు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966– 67 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక తెలుగు వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేశాక చీఫ్ జస్టిస్ రమణ నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేశారు. 2014లో సుప్రీంకోర్టుకు... సీజేఐ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27 న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2013 మార్చి 10వ తేదీ నుంచి 2013 మే 20 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం 2013 సెప్టెంబర్ 2వ తేదీన జస్టిస్ రమణకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2014 ఫిబ్రవరి 17న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసులను విచారించిన ధర్మాసనాలకు నేతృత్వం వహించగా, కొన్నింటిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2020 జనవరి 10వ తేదీన కశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని జస్టిస్ రమణ తీర్పు ఇచ్చారు. 2019 నవంబర్ 13న సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన చారిత్రక ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గృహిణులు ఇంట్లో చేసే పని, కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తక్కువేం కాదని జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
సీజేఐగా నేడు జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఎన్వీ రమణ ఫిబ్రవరి 17, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాటి నుంచి సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయిన జస్టిస్ఎన్వీ రమణను ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బాబ్డే తదుపరి సీజేఐగా సిఫార్సు చేయగా ఈ నెల 5న రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26, 2022 వరకూ కొనసాగనున్నారు. మూడేళ్లపాటు ఉండాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మూడేళ్లపాటు ఉండాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీజేఐ పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ విచారకరమేనన్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విచారణల ద్వారా సుప్రీంకోర్టులో సుమారు 50వేల కేసులు విచారణ ముగించడం గొప్ప అచీవ్‌మెంట్‌గా కేకే వేణుగోపాల్ అభివర్ణించారు. సంతృప్తిగా ఉంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన వంతు కృషి చేశానన్న సంతృప్తితో ఉన్నానని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. శుక్రవారం కోర్టు హాలులో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో చాలా క్లుప్తంగా మాట్లాడారు. బాధ్యతలను జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగిస్తున్నానని, సమర్థంగా కోర్టును నడిపిస్తారన్న విశ్వాసం ఉందని జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. క్రమశిక్షణతోనే కరోనాను జయించగలం:జస్టిస్ ఎన్వీ రమణ కరోనాను క్రమశిక్షణతోనే జయించగలమని మరికొద్ది గంటల్లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరం ఉంటేనే బయటకు రావడం వంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టకాలం బలమైన వారిని సృష్టిస్తుందని, సుప్రీంకోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదుల్లో కూడా కరోనా బాధితులున్నారని తెలిపారు. -
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము. అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు. జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్‌కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్‌గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మందే.. స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత . జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్‌లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు. ఏమిటి పరిష్కారం న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు తొలి మహిళా సీజే తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు. -
48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. ఈ నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించడంతో న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ రమణ ఈ పదవిని చేపట్టనున్న తెలుగువారిలో రెండో వ్యక్తి. అంతకుముందు రాజమహేంద్ర వరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం కోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తిగా (1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు) సేవలందించారు. పదవిలో కొనసాగుతుండగానే రాజీనామా చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. రైతు కుటుంబం నుంచి..: వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం. ఆయన 1983 ఫిబ్రవరి 10న బార్ కౌన్సిల్లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునళ్లలోనూ ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా, రైల్వేలకు అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2019 మార్చి 7 నుంచి అదే ఏడాది నవంబర్ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2019 నవంబర్ 27 నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్ 27న నియమితులయ్యారు. 10.3.2013 నుంచి 20.5.2013 వరకు ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు. జస్టిస్ రమణ వెలువరించిన తీర్పుల్లో కొన్ని... ►అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జమ్మూ కశ్మీర్లో ఏడాదిపాటు ఇంటర్నెట్ నిషేధానికి ముగింపు. ►సుప్రీంకోర్టు వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం. ►శివసేన వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో బలపరీక్ష అంశంలో నైతికతను పునరుజ్జీవింపచేయడం. సత్వర న్యాయం లక్ష్యం: నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్న జస్టిస్ రమణ సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జస్టిస్ రమణ సారథ్యంలో న్యాయసేవల అథారిటీ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా సమయంలో 2,878 గృహ హింస కేసులకు సంబంధించి న్యాయ సాయం, 60 లక్షల మంది వలస కార్మికులు, 36,435 మంది ఒంటరి వ్యక్తులు, 1,04,084 మంది సీనియర్ సిటిజన్లకు సేవలు అందించినట్లు తెలిపింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ–లోక్ అదాలత్‌లో 4.11 లక్షల కేసులను పరిష్కరించినట్లు తెలిపింది. 2,06,190 మంది ఖైదీలు లీగల్ సర్వీస్ క్లినిక్‌ల ద్వారా సేవలు పొందారు. జాతీయ, రాష్ట్రస్థాయి అదాలత్‌లు నిర్వహించి 48 లక్షల కేసులు పరిష్కరించినట్లు తెలిపింది. జాతీయ మహిళా కమిషన్‌తో కలసి నల్సా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపింది. -
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఆ లేఖ కేంద్ర హోంశాఖకు, ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక ప్రక్రియ పూర్తైనట్లు అధికారిక ప్రకటన విడుదల అవుతుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. కాగా ‘‘జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి 2020 అక్టోబర్ 6న అందిన ఆరోపణల లేఖపై విచారణ జరిపి తిరస్కరించడమైనది. ఇది పూర్తిగా అంతర్గత విచారణ అయినందున ఆ వివరాలు బహిర్గతం చేయడం సాధ్యం కాదు’’అని సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది. తెలుగువారిలో రెండో వ్యక్తి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ రమణ ఆ పదవి పొందిన తెలుగు వారిలో రెండో వ్యక్తి. అంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు (జూన్ 30, 1966– ఏప్రిల్ 11, 1967) సుప్రీంకోర్టు తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ సుబ్బారావు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ సుబ్బారావు సీజేఐగా ఉన్న సమయంలోనే రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు వారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. పొన్నవరం నుంచి.. కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్నారు. -
సీజేఐ బాబ్డే తల్లికే టోకరా
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) శరత్ అరవింద్ బాబ్డే తల్లినే నమ్మించి మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్డే తల్లి ముక్తా అరవింద్ బోబ్డే అస్తుల కేర్ టేకర్‌గా ఉంటున్న వ్యక్తి ఏకంగా 2.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తపస్ ఘోష్(49)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్‌లోని జస్టిస్ బాబ్డే తల్లి ఆస్తులకు తపస్ గత10ఏళ్లుగా కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. వీటిల్లో ప్రధానంగా సిటీలోనే ప్రముఖ ఫంక్షన్ హాళ్లలో ఒకటి కావడంతో అదెప్పుడూ బిజీగా ఉండేది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన ముక్తాకు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి గోల్మాల్ వ్యవహారాలు చేశాడు తపస్. అయితే లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సిట్ ఏర్పాటు సీజేఐ జస్టిస్ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్ మోసం చేశాడన్న కేసు విచారణకు డీసీపీ వినితా సాహు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో కేసు లోతుపాతుల్ని పరిశీలించారు. ఈ మేరకు గడిచిన కొన్నేళ్లుగా తపస్ ఘోష్ రూ.2.5కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. -
లగ్జరీ బైక్‌పై చీఫ్ జస్టిస్; ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే బైక్‌పై చక్కర్లు కొడుతున్నారు. నాగ్‌పూర్‌లో లగ్జరీ బైక్ హార్లే డెవిడ్సన్పై రయ్ రయ్ అంటూ షికారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడూ కేసులు, తీర్పులు అంటూ బిజీగా ఉండే చీఫ్ జస్టిస్ ఇలా కనిపించడంతో నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. ‘ఎంత కూల్‌గా ఉన్నారు మై లార్డ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ మాస్క్ పెట్టుకోకపోవడాన్ని కొంతమంది ఆక్షేపించారు. ‘సార్.. హార్లే డేవిడ్సన్పై అడుగు పెట్టారు. వేగవంతమైన న్యాయం కోసమేనని ఆశిస్తున్నాం’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఎస్ఏ బాబ్డేకు బైకులు నడపడం చాలా ఇష్టమని ఇంతకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన వద్ద ఓ బుల్లెట్ బైక్ కూడా ఉందని పేర్కొన్నారు. (‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’) కాగా శరద్ అరవింద్ నవంబర్ 18, 2019న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తన కెరీర్లో ఎన్నో కీలకమైన కేసుల్లో ఆయన పనిచేశారు. వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో నవంబర్ 9,2019 నాటి తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు అయిదురుగు రాజ్యాంగ ధర్మాసనంలో అరవింద్ బాబ్డే ఒకరు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయి నేతృత్వం వహించిన ఇందులో జస్టిస్‌లు శరద్ అరవింద్ బాబ్డే, అశోక్ భూషణ్, డీవై చంద్రచూడ్, ఎస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. వీటిలో ఢిల్లీ కాలుష్యం కూడా ఉంది. 2016లో దేశ రాజధాని చుట్టుపక్కలా పటాసుల అమ్మకాలను నిలిపివేస్తూ సుప్రీం తీర్పునిచ్చిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో ఆయన ఒకరు. ఇదిలా ఉండగా 2019లో బైక్‌ను టెస్ట్ రైడింగ్ చేస్తున్నప్పుడు బాబ్డే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇది హై-ఎండ్ హార్లే డేవిడ్సన్ బైక్ అని తెలుస్తోంది. అతను బైక్ మీద నుంచి పడటంతో అతని కాలుకు భారీగా దెబ్బ తగిలింది. ఈ ప్రమాదం అతన్ని కోర్టు విధులతో పాటు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశాలకు దూరంగా ఉంచింది. (చైనాతో తాడోపేడో: సిలిండర్లు నిల్వ చేసుకోండి ) That's the Chief Justice of India on a weekend in Nagpur! Justice Bobde, My Lord 😃😃😃😃😃 pic.twitter.com/hYGlq2muUC — Payal Mehta/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) June 28, 2020 Chief Justice of India SA Bobde trying out Harley Davidson. (Harley Davidson Limited edition CVO 2020) @harleydavidson #SupremeCourt pic.twitter.com/6bDv0g4n2P — Bar & Bench (@barandbench) June 28, 2020 #ChiefJustice of India Justice Sharad Arvind Bobde can not hide his love for #motorbikes specially when he is in Nagpur . Last year Justice Bobde fell off while testing @harleydavidson which fractured his ankle . pic.twitter.com/01JuEkZpra — Pradeep Rai (@pradeepraiindia) June 29, 2020 -
తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, తిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్ఏ బోబ్డే శనివారం తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌లు ఆయనకు స్వాగతం పలికారు. శనివారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేయనుండగా, ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. -
సీజేఐగా బాబ్డే ప్రమాణం నేడు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నేడు ప్రమాణం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఈ పదవిలో ఉంటారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్‌గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్‌గా రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్కౌన్సిల్లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ గొగోయ్ ఆదివారం రిటైరయ్యారు. -
ఎన్నో సందేశాలు–కొన్ని సందేహాలు
న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకరమేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యాలయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకు అతీతంగా ధర్మాసనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే! తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదు లిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్థాంత వైరుధ్యాలకతీతంగా అన్ని పార్టీలూ ఒక్కటయ్యాయి. ఒక తీర్పు.... అనేక సందేశాలు. కొండొకచో సందేహాలు! తనకే సంబంధించి దాదాపు పదేళ్లుగా నలుగుతున్న ఓ వివాదాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది. పారదర్శకత–న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పరస్పర విరుద్ధాంశాలు కావని, రెండూ చెయ్యిచెయ్యి జోడించి సాగాల్సిందేనని తేటతెల్లం చేసింది. న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకర మేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యా లయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకతీతంగా ధర్మా సనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ వివాదంపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, అదే కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పులను సమర్థిస్తూ, దాన్ని విభేదించిన సుప్రీంకోర్టు కార్యాలయ వాదనను తోసిపుచ్చింది. కానీ, అదే సమయంలో... ధర్మాసనం తన తీర్పులో అక్కడక్కడ చేసిన కొన్ని వ్యాఖ్యలు సమాచారం ఇచ్చే వెసులుబాటు కన్నా ఇవ్వకూడని ఆంక్షల పరిధిని పెంచినట్టు ధ్వనిస్తున్నాయి. ఇది కొంత ప్రమాదకరం. ఏ కోణంలో చూసినా ఈ తీర్పు పద్నాలుగేళ్ల ఆర్టీఐ ప్రస్తానంలో కీలకమైందే! ఈ తీర్పుతో... పారదర్శకతకు సంబం ధించిన కొన్ని మౌలికాంశాలపై అటు శాసన వ్యవస్థ ఇటు కార్యనిర్వా హక వ్యవస్థకు గట్టి సందేశం పంపినట్టయింది. ఇంతకాలం తన మైదానంలో స్తబ్దుగా ఉన్న బంతిని శాసనవ్యవస్థ మైదానంలోకి సుప్రీంకోర్టు నెట్టినట్టే భావించాలి. ఎందుకంటే, ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే! ‘కాదు, మీరు ప్రజా సంస్థలే, సమాచారం ఇచ్చి తీరాల్సిందే...’ అని సీఐసీ ఇచ్చిన ఆదేశాల్ని అవి బేఖాతరంటున్నాయి. తాజా తీర్పు దరిమిలా ఈ వివాదం కూడా తేలాల్సిన సమయం ఆసన్నమైంది! సుప్రీం తీర్పు పరోక్షంగా రాజ కీయ వ్యవస్థపై ఒత్తిడి పెండచం ఖాయం. ఈ వివాదమూ ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) నోటీసులు ఇచ్చి ఉంది. రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని ప్రయివేటు సంస్థలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, పబ్లిక్–ప్రయివేట్ భాగస్వామ్య సంస్థలు ఇన్నాళ్లుగా ఇదే మొండి వైఖరితో ఉన్నాయి. సమాచారం నిరాకరిస్తున్నాయి. ఆర్టీఐ–2005 చట్ట నిర్వచనం (సెక్షన్ 2 హెచ్) ప్రకారం పబ్లిక్ అథారిటీస్ (పీఏ) అయిన సంస్థలు కూడా తామీ చట్ట పరిధిలోకి రామని తప్పించుకుంటున్నాయి. వాటి విషయంలో బాధి తులైన వారో, ఆర్టీఐ కార్యకర్తలో ఎక్కడికక్కడ న్యాయస్థానాలను సం ప్రదించి, ఈతాజా తీర్పును ఉటంకించడానికి మార్గం సుగమమైంది. వివాదమే దురదృష్టకరం! దేశంలోని ఎందరెందరో మేధావులు, సామాజికవేత్తలు, హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నట్టు ‘ఎవరూ చట్టానికి అతీతులు కారు’ అన్న బలమైన సందేశం తాజా తీర్పులో ఉంది. అస్పష్టత లేకపో యినా, సందేహం సృష్టించి వక్రమార్గంలో చట్టాన్ని అన్వ యించడానికి ఇక వీల్లేకుండా పోవాలి. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అనే సంస్థలోని అవిభాజ్య అంగమే తప్ప స్వతంత్ర సంస్థ కాదనీ ఈ తీర్పులో పేర్కొన్నారు. అసలు వివాదం అక్కడే మొదలయింది. సుప్రీం కోర్టు 1997లో చేసిన ఒక తీర్మానపు ప్రతిని సమాచారంగా ఇవ్వాలని హక్కుల కార్యకర్త 2007లో పెట్టుకున్న వినతిని సుప్రీంకోర్టు కార్యాలయం నిరాకరించడమే ఈ వివాదానికి బీజం. ప్రతి న్యాయమూర్తీ తన ఆస్తుల్ని వెల్లడించాలన్నది సదరు తీర్మానం. కొందరు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం –కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర సంప్ర దింపుల వివరాలనూ ఆ కార్యకర్త విడిగా కోరారు. కొన్ని అవి నీతి ఆరోపణలకు సంబంధించి మద్రాసు హైకోర్టు న్యాయ మూర్తికి–సుప్రీంకోర్టుకి మధ్య జరిగిన సంప్రదింపుల సమాచారాన్నీ మరో దరఖాస్తులో కోరారు. ఈ సమాచారమేదీ ఇవ్వబోమని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రాజ్యాంగపరమైన సంస్థ కనుక ఆర్టీఐ చట్ట పరిధిలోకి రాదంటూ దరఖాస్తుల్ని తిరస్కరించారు. దరఖాస్తు దారు సీఐసీని సంప్రదించినపుడు చీఫ్ జస్టిస్ కార్యాలయం (సీజేఐ) ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని, న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన వ్యక్తిగత గోప్య సమాచారమేమీ కానందున సమాచారం ఇవ్వాల్సిం దేనని సీఐసీ రెండు వేర్వేరు కేసుల్లోనూ తన నిర్ణయం ప్రక టించింది. సీజేఐ కార్యాలయం దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. విచారణ తర్వాత అక్కడ న్యాయమూర్తి (సింగిల్ జడ్జి), ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (2009లో, 2010లో)కూడా సీఐసీ నిర్ణయాన్ని సమర్థించాయి. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కార్యాలయమే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇంతటి సుదీర్ఘ విచారణ, తాజా తీర్పు అని వార్యమైంది. ఈ కేసు సాగతీతలో సుప్రీం కార్యాల యమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది–శిక్షణ విభాగం(డీవోపీటీ) పాత్ర కూడా ఉంది. రాజకీయ పార్టీలు అతీతమా? నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజల కొరకు ప్రజలనే ఆసరా చేసుకొని ప్రజా వ్యవహారాలు నడిపే రాజకీయ పార్టీలు తాము ప్రజా సంస్థలు (పబ్లిక్ అథారిటీ) కామని ప్రకటించుకుంటున్నాయి. పారదర్శకంగా ఉండనవసరం లేదని, పౌరులు కోరిన సమాచారం ఇవ్వబోమని వాదిస్తున్నాయి. పార్లమెంటు ద్వారా తామే తయారుచేసి, అమలు పరుస్తున్న ఓ చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయి. పిడివాదంతో, ఆరేళ్ల కింద సీఐసీ ఇచ్చిన ఉత్త ర్వుల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నాయి. పోనీ, సీఐసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్తున్నారా అంటే, అదీ లేదు. ఇది న్యాయ ధిక్కారమే! ఓ హక్కుల కార్యకర్త, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కొంత సమాచారం కోరుతూ పెట్టిన ఆర్టీఐ దరఖాస్తులకు తిరస్కరణ ఎదురవడంతో వారు సీఐసీని సంప్రదించారు. సీఐసీ ఇచ్చిన నోటీ సులకు ముందు సానుకూలంగా స్పందించిన సీపీఐ తర్వాత తన వైఖరి మార్చుకుంది. తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదులిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్ధాంత వైరుధ్యాలకతీతంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ మరోమారు ఒక్కటయ్యాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగం గా క్రిమినల్ కేసులు–పోటీ అనర్హత విషయమై లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కూడా రాజకీయ పార్టీలన్నీ ఇలా ఒక్కట య్యాయి. తాము ఆర్టీఐ పరిధిలోకి రాబోమనే వాదనతో ఇప్పుడూ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. రాజకీయ పక్షాలకు లభించే విరాళాల వివరాలు, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య అవసరాల దృష్ట్యా వారి నిర్ణాయక వ్యవస్థ సమాచారం ప్రజలకు తెలియాలని సామాజిక కార్యకర్తలంటున్నారు. విరాళాల గోప్యత వల్ల ఎన్నికల అనంతరం అధికార వ్యవస్థకు–ఆశ్రిత వర్గాలకు మధ్య పరస్పర ప్రయోజన వైరుధ్యత (కాన్ల్ఫిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఉంటుందనేది వారి వాదన. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఆర్టీఐ చట్ట నిర్వచనం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రజా సంస్థ(పీఏ)లేనని, పౌరులు అడిగిన సమా చారం ఇవ్వాల్సిందేనని 2013 జూన్‌లో సీఐసీ నిర్ణయించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సెక్షన్ 29ఎ కింద గుర్తింపు పొందిన పార్టీలన్నిం టినీ ఆర్టీఐ చట్టప్రకారం పీఏ లుగా ప్రకటించాలని కోరుతూ కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో గత మార్చిలో సుప్రీంకోర్టు సంబంధితులకు నోటీసులిచ్చింది. తుదితీర్పు రావాల్సి ఉంది. చట్టం పటిష్టతే శ్రీరామరక్ష సమచార హక్కు చట్టం–2005 గొప్పదనమంతా ఆ చట్టం కూర్పులో ఉంది. నిర్వచనాలైనా, నిబంధనలైనా పాలకుల పక్షంలో కాక నిఖా ర్సుగా ప్రజాహితంలో ఉన్నాయి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే తేల్చినా, సదరు జాగ్రత్తల్ని ఆర్టీఐ చట్టంలో పద్నాలుగేళ్ల కిందటే పొందుపరిచారు. ఏయే సంద ర్భాల్లో సమాచారం ఇవ్వనవసరం లేదో సెక్షన్ 8 (మిన హాయింపులు) విస్పష్టంగా చెబుతోంది. పౌరులు కోరిన సమాచారం ఇచ్చేప్పుడు న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దృష్టిలో ఉంచు కోవాలని తాజా తీర్పులో ధర్మాసనం వ్యాఖ్య చేసింది. దాపరికం వల్ల వ్యక్తిగత గోప్యతకు లభించే రక్షణ కన్నా వెల్లడి ద్వారా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నపుడే సమాచారం వెల్లడించాలని వ్యాఖ్య చేసింది. నిజా నికి ఇటువంటి చాలా విషయాల్లో చట్టంలోనే స్పష్టత ఉంది. పలు కీలకాంశాల్లో అస్పష్టతకు తావులేని విధంగా చట్టాన్ని రూపొం దించారు. వాటిని తిరిగి పార్లమెంటు వేదికగా సవరించనంత కాలం అవే చెల్లుబాటవుతాయి. అలా కాక ఇతరేతర ప్రయో జనాలనాశించే వారు తాజా తీర్పులోని వ్యాఖ్యల్ని ఇష్టానుసారం అన్వయించి, చట్టం స్ఫూర్తికి గండికొడితే ప్రమాదం! పెనంలోంచి పోయ్యిలో పడ్డట్టే! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పారదర్శకతకు పట్టాభిషేకం
ఎవరికి వారు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) తమకు వర్తించదంటూ మొరాయిస్తున్న వేళ...ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం ఆర్టీఐ పరిధిలోనికే వస్తుందని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఈ విషయంలో దాదాపు పదేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనంటూ సమర్థించింది. ఈ దేశంలో ఎంత శక్తిమంతులైనా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారైనా రాజ్యాంగ చట్టం వారికంటే అత్యున్నతమైనదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాటిచెప్పింది. పారదర్శకతకు పట్టాభిషేకం చేస్తూ, తెలుసుకోవడం పౌరులకుండే తిరుగులేని హక్కని నిర్ధారిస్తూ ఎన్నో సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. తాజా తీర్పు ద్వారా ఇది తనకు కూడా వర్తిస్తుందని తెలియజేసి ఆ చట్ట పరిధిని విస్తృతం చేసింది. పారదర్శకత అంశంలో రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు మూడు వేర్వేరు తీర్పులు ఇచ్చినా... ఆ మూడూ ఏకాభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది. అయితే న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకోవాలని, పారదర్శకత అన్నది దాని స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. ఇందులో పరస్పర విరు ద్ధతేమీ లేదు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సుప్రీంకోర్టు వంటి వ్యవస్థకు కొన్ని అంశాల్లో గోప్యత అవసరమవుతుంది. ఏది పారదర్శకత పరిధిలోనికొస్తుందో, ఏది గోప్యత ఉండకతప్పనిదో ఆయా సందర్భాల్లో అది తేల్చుకుంటుంది. వాటిల్లోని సహేతుకతపై ఎటూ చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ చరిత్రాత్మక తీర్పునివ్వడానికి దారితీసిన పరిణామాలను ఒక్కసారి గమనించాలి. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టు కొలీజియానికీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారాన్నివ్వాలని...న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు అందజేయాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా మొదలైంది. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయన కేంద్ర సమాచార కమి షన్(సీఐసీ)ముందు పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు అనుకూలమైన నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసి అప్పట్లో అందరినీ విస్మయపరిచింది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు వాదనను తోసిపుచ్చి సీఐసీ నిర్ణయాన్ని సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూర్తికుండే వ్యక్తిగత విశేషాధికారం కాదనీ, అది న్యాయమూర్తి గురుత బాధ్యతని ఆ సందర్భంగా తేల్చి చెప్పింది. దాంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. అది తొలుత ద్విసభ్య ధర్మాసనానికి, ఆ తర్వాత త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లింది. ఇందులో కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలున్నాయని భావించడంతో వివాదం రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చింది. ఆర్టీఐ చట్టం విషయంలో భిన్న సందర్భాల్లో ఎవరెలా మాట్లాడుతున్నారో ప్రజలకు తేటతెల్లం అవుతూనే ఉంది. మాకు ఈ చట్టం వర్తించబోదని మొరాయించేవారి జాబితా తక్కువేమీ లేదు. చట్టం వచ్చినప్పుడే పాలనా పరంగా రహస్యాలు పాటించడం తప్పనిసరంటూ కొన్ని వ్యవస్థలకు మినహాయింపునిచ్చారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ తదితర 22 సంస్థలు అందులో ఉన్నాయి. కొన్నిటిని అనం తరకాలంలో చేర్చారు. తమ కార్యకలాపాలు కూడా దీని పరిధిలోనికి రావని వాదించిన సంస్థలూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు సరేసరి. ఇవి ప్రభుత్వాల నుంచి రాయితీలు, మినహాయింపులు పొందడం దగ్గరనుంచి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల సేకరణ వరకూ ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అయినా ఆర్టీఐ చట్టం తమకు వర్తించబోదంటూ తర్కిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చూశాకైనా ఇలాంటి వాదనలు తగ్గితే మంచిదే. ప్రభుత్వంతోసహా వివిధ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజా స్వామ్యం వర్థిల్లుతుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే కొలీజియం వ్యవస్థపై ఎప్పటినుంచో ఫిర్యాదులున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక కోసం అది అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో వెల్లడికావడం లేదని, ఎవరు ఎందుకు ఎంపికవుతున్నారో, ఎందుకు కావడం లేదో తెలుసుకోవడం పౌరసమాజం హక్కు అని ఎప్పటినుంచో వాదనలున్నాయి. ఈ వ్యవస్థకు ఆద్యుడైన జస్టిస్ జేఎస్ వర్మ సైతం కొలీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కానీ ఈ అంశంలో సమాచార హక్కు చట్టం పరిధి తనకు వర్తించబోదని సుప్రీంకోర్టు వాదించింది. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అలాంటి వాదన సరికాదని స్పష్టం చేయడం హర్షించదగ్గది. న్యాయమూర్తుల పదవులకు కొలీజియం సిఫార్సు చేసినవారి పేర్లేమిటో వెల్లడించవచ్చు తప్ప అందుకు గల కారణాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజా తీర్పు చెబుతోంది. అయితే అందరి విషయంలోనూ కారణాలు చెప్పకపోయినా, ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని భావించినవారికి అభ్యంతరం లేనప్పుడు ఏయే కారణాలరీత్యా తిరస్కరించవలసి వచ్చిందో వెల్లడించడమే సరైంది. ఏదేమైనా అవసరమైన గోప్యతను పాటిస్తూనే పారదర్శకంగా ఉండటం, అదే సమయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటం ఒక సవాలే. దీన్ని మన సర్వోన్నత న్యాయస్థానం ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందో చూడాల్సి ఉంది. -
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!
-
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే, పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి..ఈ ఏడాది ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. చదవండి: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు -
నూతన సీజేఐగా శరద్ అరవింద్ బాబ్డే!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్థానంలో నూతన సీజేఐగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. నియామకానికి సంబంధించిన పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నవంబరు 18న జస్టిస్ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్ గొగోయ్ తర్వాత శరద్ అరవింద్ సీనియర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం లాంఛనప్రాయమే కానుంది. కాగా 1956 ఏప్రిల్24న మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన న్యాయవాద కుటుంబంలో బోబ్డే జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఎస్ఎఫ్ఎస్ కాలేజీలో న్యాయ విద్యనభ్యసించిన ఆయన.. 1978లో అడ్వకేట్‌గా తనపేరు నమోదు చేసుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచీలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో పాటుగా... మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ బోబ్డే.. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. ఇక జస్టిస్ శరద్ అరవింద్ తండ్రి అరవింద్ బోబ్డే 1980-85 మధ్య కాలంలో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. శరద్ అరవింద్ అన్న వినోద్ బాబ్డే కూడా పేరు మోసిన లాయర్(సుప్రీంకోర్టు)గా గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ
న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార బాధితురాలి లేఖ తనకు చేరడంలో జాప్యం కావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబం తనకి రాసిన లేఖ గురించి మీడియాలో ప్రచారం అయిన తర్వాతే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయం మంగళవారమే తన దృష్టికి వచ్చిందన్నారు. ట్రక్కు ప్రమాదానికి ముందే..తనకు ప్రాణహాని ఉందంటూ ఉన్నావ్ బాధితురాలు సీజేఐకి రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజేఐ రంజన్ గొగోయ్ బుధవారం మాట్లాడుతూ.. జూలై 12న హిందీలో బాధితురాలు రాసిన ఈ లేఖ..తన దృష్టికి రాలేదని తెలిపారు. తాను ఇంతవరకు లేఖను చదవలేదన్నారు. ఈ విషయం గురించి కోర్టు రిజిస్ట్రీని వివరణ కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించే స్నేహ పూరిత వాతావరణం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉన్నావ్ బాధితురాలి లేఖపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇక గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు బాధితురాలి తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ట్రక్కు డ్రైవర్‌తోపాటు యజమానిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. కాగా కుల్దీప్ సింగార్‌ను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు యూపీ బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
లైంగిక వేధింపుల కేసులో రంజన్ గొగోయ్‌కు క్లీన్ చిట్
-
సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు భారీ ఊరట లభించింది. ఆరోపణల్లో వాస్తవం లేదని ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ సోమవారం తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో ఇది కీలక పరిణామం. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని దాఖలు చేసిన అఫిడవిట్‌పై నియమించిన 'ఇన్ హౌజ్’ కమిటీ గొగోయ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేదంటూ తన నివేదికను సుప్రీంకోర్టు సమర్పించింది. గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలను అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చిందంటూ సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన జారీ చేశారు. అంతేకాదు ఈ రిపోర్టును బహిర్గతం చేయలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. గొగోయ్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన మహిళా ఉద్యోగి సీజేఐ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న ఆమె లేఖ రాశారు. గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్ఏ బోబ్డే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనిలో సభ్యులుగా ఉన్నారు. కాగా విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వక్తం చేసిన బాధితురాలు, ఇన్-హౌజ్ కమిటీ ప్రక్రియను గానీ, విశాఖ మార్గదర్శకాలను గానీ ఆ విచారణ కమిటీ పాటించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం లేదంటూ విచారణకు హాజరు కానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సీజేఐపై లైంగిక ఆరోపణల కేసు : కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఆరోపణల విచారణకు త్రిసభ్య ధర్మాసనం ఏరాటైంది. సీజేఐ ఆదేశం మేరకు ఏర్పాటైన ముగ్గరు సభ్యుల ఇన్‌హౌస్ ప్యానెల్‌కు జస్టిస్ శరత్అ రవింద్ బోబ్డే అధ్యక్షత వహిస్తారు. ఇందులో సీనియర్ జడ్జి ఎన్వీ రమణతో పాటు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీ ఆరోపణలు చేసిన మహిళకు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని కోరింది. ఏప్రిల్ 26 న జరిగే కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అలాగే సంబంధిత అన్ని పత్రాలు, ఇతర మెటీరియల్‌తో సిద్ధంగా ఉండాలని కోర్టు సెక్రటరీని కూడా కోరింది. కాగా తనను జస్టిస్ గొగోయ్ లైంగిక వేధించడంతో పాటు, అకారణంగా ఉద్యోగంనుంచి తొలగించారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు 22మంది సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలకు సమర్పించిన అఫిడవిట్ కలకలం రేసింది. దీనిపై ఏప్రిల్ 26, శుక్రవారం తొలి వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా అంతర్గత విచారణకు ఆదేశించడంపై విమర్శలు చెలరేగాయి. అయితే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను జస్టిస్ గొగోయ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ప్రమాదంలో ‘న్యాయ’ స్వతంత్రత
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్(జేసీఏ)గా పనిచేసిన ఓ మహిళ(35) 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తన సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన గొగోయ్.. అత్యవసరంగా విచారణను చేపట్టారు. మరోవైపు జస్టిస్ గొగోయ్‌కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ హరిత ట్రైబ్యునల్ బార్ కౌన్సిల్ సహా పలు న్యాయవాదుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. నాకంటే నా ప్యూన్ ఆస్తులే ఎక్కువ.. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ.. ‘జడ్జీలకు గౌరవం ఒక్కటే ఉంటుంది. నిరాధార ఆరోపణలతో ఏకంగా దానిపైనే దాడి జరిగితే బుద్ధి ఉన్నవారెవరూ జడ్జీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురారు. ఇలాంటి ఘటనలు జరిగితే ఏ జడ్జీ తీర్పులను వెలువరించరు. కోర్టులోకి సావధానంగా వచ్చి విచారణను వాయిదా వేస్తారు. నేను 20 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేస్తున్నా. నా బ్యాంకులో రూ.6.80 లక్షలు మాత్రమే ఉన్నాయి. మరో రూ.40 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఉంది. మరో బ్యాంకు ఖాతాలో రూ.21.80 లక్షలు ఉండగా, వాటిలో రూ.15 లక్షలను గువాహటిలో ఇంటి మరమ్మతు కోసం నా కుమార్తె అందజేసింది. నా మొత్తం ఆస్తులు ఇవే. నేను న్యాయమూర్తి కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండేవి. ఇప్పుడు నా కంటే నా ఫ్యూన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. డబ్బు విషయంలో నన్నెవరూ ఇబ్బంది పెట్టలేరు. అందుకే ఇలా తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలపై మరీ అంతగా దిగజారిపోయి ఖండించలేను’ అని స్పష్టం చేశారు. మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నాం.. గతంలో ఓ సుప్రీం జడ్జితో పాటు సీనియర్ న్యాయవాదిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించరాదని మీడియాను సుప్రీం ఆదేశించిన విషయాన్ని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గుర్తుచేశారు. తాజాగా లైంగికవేధింపులకు సంబంధించిన ఆరోపణలను పలు వెబ్సైట్లు ప్రచురించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వేణుగోపాల్ వాదనలపై జస్టిస్ గొగోయ్ స్పందిస్తూ..‘పరిస్థితులు చాలాదూరం పోవడంతోనే ఈ అసాధారణ విచారణను చేపట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో బాధ్యతాయుతంగా, నియంత్రణతో వ్యవహరించే అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని సీనియర్ జడ్జి జస్టిస్ మిశ్రాకు వదిలిపెడుతున్నా. ఇందులో నేను భాగం కాబోను’ అని తెలిపారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతీ ఉద్యోగి పట్ల న్యాయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఇలాంటి విషయాల్లో న్యాయవ్యవస్థ బలిపశువు కారాదని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినప్పుడు మౌనంగా ఉన్న సుప్రీంకోర్టు ఉద్యోగిని, అకస్మాత్తుగా సీజేఐపై ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్ ఖన్నా చెప్పారు. ఈ కేసును 30 నిమిషాలపాటు విచారించాక ఈ వ్యవహారంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయపరమైన ఉత్తర్వులు జారీచేస్తామని కోర్టు తెలిపింది. ఇలాంటి ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వసనీయత సడలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం ప్రధాన కార్యదర్శిæ సుధాకర్ మాట్లాడుతూ.. మాజీ జేసీఏ లేఖ కొన్ని మీడియా పోర్టల్స్‌లో ఉదయం 8–9 గంటల మధ్యలో రాగా, తమకు 9.30 గంటల ప్రాంతంలో తెలిసిందని వ్యాఖ్యానించారు. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనీ, ఆయన ఏ బెంచ్‌ను ఏర్పాటుచేస్తే వారే కేసును విచారిస్తారని స్పష్టం చేశారు. కాగా, ప్రత్యేకబెంచ్లో సీజేఐ జస్టిస్ గొగోయ్ సభ్యుడిగా ఉండొచ్చా? అన్న విషయమై లాయర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, నవీన్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50,000 వసూలుచేసిన కేసులో ఈ మాజీ జేసీఏకు మంజూరుచేసిన బెయిల్‌ను రద్దుచేయాలని ఢిల్లీ పోలీసులు ట్రయల్‌కోర్టును శనివారం ఆశ్రయించారు. ఆమెపై 3 ఎఫ్ఐఆర్లున్నాయ్.. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ జేసీఏకు నేరచరిత్ర ఉందని జస్టిస్ గొగోయ్ తెలిపారు. ‘కోర్టులో చేరేనాటికే ఆమెపై ఓ ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఓ సాక్షిని బెదిరించడంతో ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్య మూడుకు చేరింది. ఎఫ్ఐఆర్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టు సిబ్బందిగా ఆమెను ఎలా ఎంపికచేశారు? నేరచరిత్ర కారణంగా ఆమె నాలుగురోజుల పాటు జైలులో గడిపారు. ప్రస్తుతం స్వతంత్ర న్యాయవ్యవస్థ అదిపెద్ద ప్రమాదంలో ఉంది. దీన్ని నేను అనుమతించను. నా పదవీకాలం ఉన్న మరో 7 నెలల పాటు ఈ కుర్చీలో పక్షపాతంలేకుండా ధైర్యంగా తీర్పులను వెలువరిస్తా’ అని వెల్లడించారు. లేఖలో ఏముంది? ‘‘నేను సుప్రీంకోర్టులో జేసీఏగా లైబ్రరీలో టైపింగ్, డాక్యుమెంటేషన్ పనులను చేసేదాన్ని. జస్టిస్ గొగోయ్ వద్ద పనిచేసే జేసీఏ.. సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నన్ను 2016, అక్టోబర్‌లో నియమించారు. 2018 ఆగస్టులో తన రెసిడెన్స్ ఆఫీస్‌లో నన్ను ఆయన చేరమన్నారు. ఓరోజు ఆఫీస్‌లో ఉన్నపుడు ‘నా భార్య, నా కూతురు తర్వాత నువ్వు నా మూడో ఆస్తివి’ అని అన్నారు. తాను సీజేఐ అయ్యాక తప్పకుండా సాయం చేస్తామని పదేపదే చెప్పేవారు. అయితే మా బావ దివ్యాంగుడనీ, ఆయనకు ఉద్యోగమేదీ లేదని చెప్పా. సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే మా బావను జూనియర్ కోర్ట్ అటెండెంట్‌గా నియమించారు. తర్వాత నన్ను ఆఫీస్‌కు పిలిచి నా తలను, వీపును, వెనుకభాగాన్ని తడిమారు. 2018, అక్టోబర్ 11న ఆఫీసులో గొగోయ్ నా పక్కకు వచ్చి నిలబడి నా నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నారు. వెంటనే నేను ఆయన్ను వెనక్కి తోసి భయంతో డెస్క్‌లో కూర్చుండిపోయాను. ఇది జరిగిన కొద్దిరోజులకే తాను క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు మెమో ఇచ్చారు. అక్టోబర్, నవంబర్ మధ్యలో నన్ను మూడుసార్లు బదిలీ చేశారు. అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించాననీ, అధికారులను ప్రభావితం చేసేందుకు యత్నించాననీ, చెప్పకుండా విధులకు గైర్హాజరయ్యానని నాపై 3 అభియోగాలు నమోదుచేశారు. డిసెంబర్ 21న నన్ను విధుల నుంచి తొలగించారు’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.