న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం | Legal profession will thrive or self-destruct depending on how we maintain our integrity | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం

Published Mon, Sep 18 2023 6:07 AM | Last Updated on Mon, Sep 18 2023 6:07 AM

Legal profession will thrive or self-destruct depending on how we maintain our integrity - Sakshi

ఛత్రపతి శంభాజీనగర్‌: న్యాయ వృత్తిలో నిజాయతీ అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ‘ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే న్యాయ వ్యవస్థ, ఆ వృత్తి రాణిస్థాయి. లేదంటే వాటి పయనం సాగేది స్వీయ వినాశనం వైపే‘ అంటూ కుండబద్దలు కొట్టారు.

ఆ నిజాయతీని, నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన లాయర్లు మొదలుకుని న్యాయమూర్తుల దాకా అందరి పైనా ఉంటుందన్నారు. ఆదివారం ముంబైలోని మహాత్మా గాంధీ మిషన్‌ యూనివర్సిటీలో కార్యక్రమంలో ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నవిగా అనిపించే విషయాల్లో మనం రాజీ పడ్డప్పుడే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లేది‘ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement