న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసుల విచారణ, జైలు శిక్షలు, బెయిల్ మంజూరు, కస్టడీ పొడగింపులు ఇవే గుర్తొస్తాయి. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కొన్నిసార్లు ఆసక్తికరమైన, ఫన్నీ, సీరియస్ సంభాషణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఓ సన్నివేశం సీజేఐ, న్యాయవాదికి మధ్య జరిగింది. కేసులో విచారణలో భాగంగా ఓ న్యాయవాది జస్టిస్ హృషికేష్ రాయ్‌ను ‘జస్టిస్ హృషికేశ్ ముఖర్జీ’గా సంబోధించాడు. గతంలో సుప్రీంకోర్టు విచారించిన ఓ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ..‘ఈ కేసు జస్టిస్ మృషికేష్ ముఖర్జీ ముందు ఉంది’ అని పేర్కొన్నారు.
దీంతో వెంటనే స్పందించిన సీజేఐ డీవీ చంద్రచూడ్... న్యాయవాది వ్యాఖ్యలను సరిచేశారు. హృషికేష్ ముఖర్జీనా లేఖ హృషికేశ్ రాయ్? అని ప్రశ్నించారు. రాయ్‌ను ముఖర్జీగా చేశారని అన్నారు. న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తుల పేర్లు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, వెళ్లి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని పేర్కొన్నారు.
కాగా జస్టిస్ హృషికేష్ రాయ్ సెప్టెంబరు 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తి కాకముందు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా హృషికేష్ ముఖర్జీ భారతీయ సినీ దర్శకుడు, ఎడిటర్, రచయిత.
Comments
Please login to add a commentAdd a comment