mahatma gandhi university
-
న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం
ఛత్రపతి శంభాజీనగర్: న్యాయ వృత్తిలో నిజాయతీ అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే న్యాయ వ్యవస్థ, ఆ వృత్తి రాణిస్థాయి. లేదంటే వాటి పయనం సాగేది స్వీయ వినాశనం వైపే‘ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ నిజాయతీని, నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన లాయర్లు మొదలుకుని న్యాయమూర్తుల దాకా అందరి పైనా ఉంటుందన్నారు. ఆదివారం ముంబైలోని మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీలో కార్యక్రమంలో ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నవిగా అనిపించే విషయాల్లో మనం రాజీ పడ్డప్పుడే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లేది‘ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. -
డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు
కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ సీటీ అరవింద కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది. పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా...ఒక సెమిస్టర్లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్ కోల్పోరు. ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్, ల్యాబ్, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని పేర్కొంది. (చదవండి: అలా చేయకండి.. బలవంతంగా కొనిపించడం కరెక్ట్ కాదు) -
నల్లగొండ పర్యటనకు తెలంగాణ గవర్నర్: చకచకా ఏర్పాట్లు
ఎంజీయూ (నల్లగొండ రూరల్): తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణకు హాజరుకానఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన గవర్నర్ విగ్రహావిష్కరణ అనంతరం పలు అంశాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్.. వీసీ గోపాల్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం జరిగే హాల్, రక్తదాన శిబిరం ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి ఉన్నారు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ రిపబ్లిక్ డే పరేడ్‌కు వలంటీర్ల ఎంపిక యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రీ - రిపబ్లిక్ డే (ఆర్డీ) పరేడ్‌కు బుధవారం వలంటీర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం వీసీ గోపాల్‌రెడ్డి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి ఎన్ఎస్ఎస్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే పరేడ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని చెప్పి మోసం -
సీబీసీఎస్ అమలులో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) నిర్వహించడంలో వైస్ చాన్స్లర్లు అనుసరిస్తున్న ఇష్టారాజ్య విధానాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఫలితంగా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు కొనసాగుతుండగా మరికొన్ని యూనివర్సిటీల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు చర్యలు మొదలు పెట్టాయి. కొన్ని యూనివర్సిటీలు అయితే ఇటు పరీక్షలు నిర్వహిస్తూనే.. అటు కొత్త విద్యా సంవత్సర తరగతుల ప్రారంభానికి ప్రకటనలు చేస్తుండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. గత విద్యా సంవత్సరంలో సీబీసీఎస్ అమలులో వైఫల్యం కారణంగానే డిగ్రీ పరీక్షలు మే నెలలో మొదలై ఇప్పటికీ పూర్తి కాకుండా జూలై వరకు కొనసాగించే పరిస్థితి నెలకొంది. ఉస్మానియాలో జూలై 8వ తేదీ వరకు, కాకతీయలో జూలై 2 వరకు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 6 వరకు, పాలమూరు వర్సిటీలో జూన్ 29 వరకు, శాతవాహన వర్సిటీలో జూన్ 24 వరకు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జూన్ 22వ తేదీ వరకు 2018–19 విద్యా సంవత్సర డిగ్రీ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాకుండానే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు శాతవాహన, కాకతీయ, ఉస్మానియా, మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయాలు జూన్ 17వ తేదీ నుంచి, పాలమూరు విశ్వవిద్యాలయం జూన్ 19వ తేదీ నుంచి, తెలంగాణ వర్సిటీ 26వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో విద్యార్థులే కాదు.. అధ్యాపకుల్లోనూ గందరగోళం నెలకొంది. విద్యార్థుల్లో అయోమయం.. ఓవైపు పరీక్షలు పూర్తి కాకుండానే యూనివర్సిటీలు మరుసటి విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం చూసి విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారుల అసమర్థత వల్ల మండుటెండల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అసలు పరీక్షలు పూర్తి కాకుండా తరగతులకు ఎలా హాజరవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక విద్యాసంవత్సరం పూర్తి చేసి పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం రెండు వారాలైనా సెలవులు ఉండాలని ఆ తర్వాతే తరగతులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో అసమర్థత వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ఎంట్రన్స్ రాయలేకపోయారని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షలకు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, ఫలితంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈసారి అయినా పక్కా చర్యలు చేపట్టాలి కామన్ అకడమిక్ క్యాలెండర్ అన్ని యూనివర్సిటీల్లో అమలు చేసేలా చూడాలని ఉన్నత విద్యామండలిని మే మొదటి వారంలోనే తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం కోరింది. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయిలో శ్రద్ధ కనబరచడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తమకు స్వేచ్ఛ ఉందని, ఎవరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. -
తెలంగాణ సాయుధపోరుకు మలుపు బి.ఎన్.
తెలంగాణలో భూమి, భుక్తి, విముక్తి కోసం 1947–51 వరకు జరిగిన సాయుధపోరాటం మూడు వేల గ్రామాల్ని ప్రభావితం చేసింది. ఈ పోరాటానికి ముందుగా నిజాం రాష్ట్రంలో ఆర్యసమాజం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. వారి ఉద్యమమే క్రమంగా కమ్యూనిస్టుల పోరాటంగా మారింది. అదే చివరకు సాయుధపోరాటం అయ్యింది. ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన జనగామ పిర్కాలో విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం చేసింది. పండిన పంటను కల్లాల దగ్గర్నుంచి తీసుకుపోవడానికి విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు అడ్డుపడ్డారు. చాకలి ఐలమ్మ ప్రతిఘటించింది. ఇదే చరిత్రకు మలుపు. ఈ మలుపు దగ్గర్నుంచి ఒక సింహంలా దూసుకొచ్చిన యోధుడు విసునూరు రామ చంద్రారెడ్డి గూండాలను పారిపోయేటట్లు చేశాడు. ఆ వడ్ల గింజల బస్తాను భుజం మీద వేసుకుని బండ్ల పైకి ఎక్కించి చాకలి ఐలమ్మ ఇంటికి ఆ బువ్వగింజల్ని పంపించాడు. ఆ యోధుడే భీమిరెడ్డి నర్సింహారెడ్డి. అప్పటికే జనగామ పిర్కాలో ఆనాటి భూస్వాములకు వ్యతిరేకంగా సంఘాలు ఏర్పడ్డాయి. దేవరుప్పలలో తొలిసారిగా దేవులపల్లి వేంకటేశ్వరరావు నాయకత్వంలో గుతపలు తీసుకుని ఎదురుతిరిగారు. చరిత్రలో దాని పేరు గుతపల సంఘమైంది. ఐలమ్మ బువ్వగింజల పోరాటం నుంచి పిడికిలి బిగించిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధపోరాటాన్ని విరమించేంత వరకు వెనుతిరిగి చూడకుండా పోరాడిన యోధుడు. గుతపల సంఘంతో పాటు గ్రామీణ ప్రాంతంలో రైతులను సమీకరించి వారికి అందుబాటులో ఉన్న వనరులని ఆయుధాలుగా మలిచి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి భీమిరెడ్డి. కోటపాడు గ్రామంలో గడ్డివాములను తగులబెట్టి పొగబాంబులుగా మార్చి నిజాం పోలీసు, సైనికదళాలని మట్టు పెట్టిన ఘనుడు ఆయన. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సాయుధపోరాటానికి రూపకల్పన చేసిన మిలిటరీ వ్యూహకర్త. నాలుగేళ్లు కొనసాగిన సాయుధపోరాటంలో భీమిరెడ్డి ఏనాడు కూడా వెనకకు పోలేదు. చిత్రహింసలను అనుభవించాడు. అయినా ఎత్తిన తుపాకీ దించలేదు. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమిని భూస్వాములనుంచి లాక్కొని పేదలకు పంచటంలో కమ్యూనిస్టులు ప్రజలకు చేరువయ్యారు. ఈ పోరాటంలోనే శత్రువుపై పోరాడుతూ భీమిరెడ్డి తన చేతులో ఉన్న కొడుకును కూడా వదిలేసి వెళ్లిపోయాడు. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవు కొడుకో నైజాం సర్కరోడా అని పాట కట్టిన బండి యాదగిరికి కొండంత అండగా నిలిచినవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. తన పోరాటమంతా గిరిజనులు, బహుజనుల చుట్టే తిరిగింది. ప్రధానంగా ఈ పోరాటమంతా భూసమస్య చుట్టూ తిరిగింది. కాబట్టే చదువురాని నిరక్షరాస్యులైన ఆ మూగజీవాలను మహాయోధులుగా మార్చి పోరా టం చేయించిన చరిత్ర తెలంగాణ సాయుధపోరాటానికే దక్కుతుంది. ఆ ఖ్యాతిలో భీమిరెడ్డి చరిత్ర చెరిగిపోనిది. భీమిరెడ్డి దళ నాయకుడిగా వందల సంఘటనల్లో పాల్గొన్నాడు. శత్రువుతో ముఖాముఖి యుద్ధాలకు తలపడ్డాడు. ఆనాటి సంఘం చెప్పిన మాటను జవదాట కుండా పనిచేశాడు. అందుకే భీమిరెడ్డిని తెలంగాణ క్యాస్ట్రో అంటారు. (నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నేడు బీఎన్ తొలి స్మారక ఉపన్యాసం) – ప్రొ‘‘ అడపా సత్యనారాయణ (రిటైర్డ్), ఉస్మానియా యూనివర్శిటీ -
హే.. ‘మహాత్మా’!
ఎంజీయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ♦ యూనివర్సిటీ ప్రారంభం నుంచీ ఇదే పరిస్థితి ♦ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్న వైనం ♦ పదేళ్లయినా పోస్టుల భర్తీపై మీనమేషాలు ♦ పూర్తిస్థాయిలో ల్యాబ్స్ లేక విద్యార్థుల అవస్థలు ♦ రెండేళ్లయినా అతీగతీ లేని ఇంజనీరింగ్ కళాశాల యూనివర్శిటీ ప్రారంభమై పదేళ్లు అవుతున్నా రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంజీయూకు మొత్తం 70 ప్రొఫెసర్ల పోస్టులు మంజూరై తే ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 36 మాత్రమే. ఇంకా 34 రెగ్యులర్ పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. విద్యార్థుల బోధనకు సంబంధించి 52 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, 10 మంది పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీని తీసుకున్నారు. ఒక్కో సంవ త్సరం కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కూడా లేకపోవడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. నల్లగొండ నుంచి బొల్లం శ్రీనివాస్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యా బోధన మిథ్యగా మారుతోంది. యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్ల యినా ఇప్పటికీ రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకాలు లేవు. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే బోధన చేయిస్తున్నారు. యూనివ ర్సిటీకి 70 రెగ్యులర్ పోస్టులు మంజూరైతే కేవలం 36 పోస్టు లను మాత్రమే భర్తీ చేశారు. మిగతావన్నీ కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు వసతుల విషయం లోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అన్నెపర్తి గ్రామం వద్ద 2007లో యూనివర్శిటీని మంజూరు చేశారు. ఆ తర్వాత దీనికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)గా పేరు పెట్టారు. మన యూనివర్సిటీలు ⇔ మొత్తం మంజూరైన పోస్టులు70 ⇔ బోధనా విభాగంలో ఖాళీలు34 ⇔ అసోసియేట్ ప్రొఫెసర్లు 15ఖాళీలు ⇔ ప్రొఫెసర్లు 10ఖాళీలు ⇔ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 09ఖాళీలు ⇔ ‘మహాత్మాగాంధీ’లో సగం పోస్టులు ఖాళీ18 కోర్సులు, 2,300 మంది విద్యార్థులున్న ఈ యూనివర్శిటీలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. 50% మందికే హాస్టల్.. యూనివర్సిటీలో సీట్లు సాధిం చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది హాస్టల్ వసతి కావాలని అడుగుతున్నా.. ఒక్కో కోర్సు లో కేవలం 50 శాతం మందికే హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. అది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు రిజర్వేషన్ పద్ధతి ప్రకారం. 650 మంది విద్యార్థులు, 250 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఇవీ సమస్యలు.. ఇవీ కోర్సులు.. యూనివర్సిటీ పరిధిలో పీహెచ్‌డీతోపాటు బీఈడీ, ఎంఈడీ కోర్సులు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా సైన్స్ ల్యాబ్స్ లేవు. క్రీడా మైదానం లేదు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరై రెండేళ్లవుతున్నా ఇటీవలే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో మొత్తం 18 కోర్సులు... ఎంఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంకామ్, ఎంబీఏ, ఎంబీఏ టూరిజం, ఐదేళ్ల ఎంబీఏ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, బయో టెక్నా లజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, ఐదేళ్ల కెమిస్ట్రీ, ఇంజినీరింగ్‌లో ఈసీఈ, ఈఈ ఈ, సీఎస్ఈ, ఎంసీఏ కొనసాగుతున్నాయి. రిజిస్ట్రార్ పోస్టులో కూడా నాలుగేళ్లుగా ‘ఇన్చార్జే’ కొనసాగుతున్నారు.. -
కట్ పేస్ట్ పీహెచ్డీలెందుకు?
► మహాత్మాగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ ► పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ► కళాశాలలు వ్యాపార దృక్పథంతో పనిచేయడం మంచిది కాదు ► విద్యార్థి దశలో సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచాలి సాక్షి, నల్లగొండ : విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘యూనివర్సిటీల్లో ఒక్కొక్కరు 25–30 పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఒక్కో గైడ్ వందలాది మందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. ఇవన్నీ కట్ అండ్ పేస్ట్ పీహెచ్డీలే. గూగుల్, టాగుల్, ఇతర ఫన్నీ వెబ్సైట్లలో చూసి రాసుకుంటున్నారు. ఈ కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలతో సమాజానికి ఏం ఉపయోగం? విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో నాణ్యత పెరిగినప్పుడే సమాజానికి ప్రయోజనం ఉంటుంది. పరిశోధనలు, ఆవిష్కరణలు సుస్థిర భారతదేశ నిర్మాణానికి దోహదపడాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం నల్లగొండలో జరిగిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై గోల్డ్ మెడలిస్టులు, టాపర్స్‌కు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధనార్జన కోసమే విద్య అనే భావన నుంచి యువత బయటకు రావాలని, తాము సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచడం ద్వారా సమాజంలో విలువలు పెంచేందుకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. కళాశాలలు ఎన్ని ఉన్నాయి, విద్యార్థులెంత మంది చదువుకుంటున్నారనేది ప్రధానం కాదని, విద్యలో ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదే ముఖ్యమని, ఈ అంశంపై విశ్వవిద్యాలయాలు ఎక్కువ దృష్టిసారించాలని ఆయన కోరారు. ‘కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామనేది యాజమాన్యాలు ఆలోచించుకోవాలని, వ్యాపార దృక్పథంతో పనిచేయడాన్ని కళాశాలల యాజమాన్యాలు మానుకోవాలని హితవు పలికారు. కళాశాలలు ఇదే రీతిలో పనిచేస్తే ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలు రావని, వచ్చే ఏడాది నుంచి ఉగాది కానుకలేమీ ఉండవని అన్నారు. సమాజంలోని ›ప్రతి వ్యక్తి తనకు ఆహార, వైద్య, ఇంధన, గృహ, సాధారణ భద్రతల గురించి ఆలోచిస్తాడని, అవన్నీ అందించే విద్యను, విద్యార్థులను సమాజానికి అందించే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో అధ్యాపకుల కృషి కీలకమైనదని పేర్కొన్నారు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి భారతీయుడిగా గర్వించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏది చేయాలన్నా విదేశీయులు చెపితేనే చేస్తున్నామని, యోగా, ప్రాణాయామం లాంటి కార్యక్రమాల్లో కూడా మనం విదేశాలను అనుసరిస్తున్నామని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లో లేనిది ఏమీ లేదని, సమాజానికి అవసరమైన అన్ని బోధనలూ వాటిలోనే ఉన్నాయన్నారు. దేశ సాంస్కృతిక చరిత్ర గురించి కూడా భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్సలర్ మామిడాల జగదీశ్‌కుమార్ మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణల వల్లే సమాజానికి ప్రయోజనం ఉంటుందని, విశ్వవిద్యాలయాల్లో జరిగే కృషి కూడా ఆ దిశలో ఉండాలని కోరారు. దేశంలో 800 వర్సిటీలుంటే అందులో 60శాతం విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఆశించినంతగా లేవని, మొత్తం 40వేల కళాశాలల్లో 90శాతం కళాశాలల్లోనూ ఆదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంపదను సృష్టించడంలో, గ్రామీణ విద్యార్థులను ఇముడ్చుకోవడంలో వర్సిటీలు విఫలమవుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు తమ పనితీరును కనీసం సమీక్షించుకోవడం లేదని, సామాజిక విలువలను పెంపొందించే విద్యను అందించాలన్న దృక్ఫథం కొరవడిందని అన్నారు. విశ్వవిద్యాలయాలకు నిధులివ్వడం లేదని, గ్లోబల్ యూనివర్శిటీలతో పోలిస్తే మన విశ్వవిద్యాలయాల్లోని పరిశోధనాలయాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదని, అయినా ఉన్న దాంట్లోనే మంచి ఫలితాలు రాబట్టే కృషి విశ్వవిద్యాలయాల్లో జరగాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, గవర్నర్ పర్యటన సందర్భంగా వర్సిటీలో సౌకర్యాల కొరతపై కొందరు విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్‌గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందే పోలీసులు ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉదయం కొంత ఉద్రిక్తత నెలకొని గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు, ఇటు యూనివర్సిటీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలు వద్దు: గవర్నర్
నల్లగొండ : ధనార్జన కోసమే విద్య అనే భావం నుండి యువత బయటపడాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉద్బోధించారు. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని, కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలు నిరుపయోగమన్నారు. ప్రజల వాస్తవ అవసరాలపై పరిశోధనలు జరగాలన్నారు. నైతిక విలువలను బోధించడంలో అధ్యాపకులదే కీలకపాత్ర అని, నాణ్యమైన, సృజనాత్మక విద్యకు విశ్వవిద్యాలయాలు పెద్ద పీట వేయాలని సూచించారు. చదువుతోనే సమాజంలోని రుగ్మతలకు చరమ గీతం పాడాలని, ఆచార్య దేవోభవ అనే భావాన్ని ఎవ్వరూ మరవొద్దని అన్నారు. జీవితంలో ఆత్మపరిశీలన చాలా ముఖ్యమని, మానవతా విలువలకు నిలయాలు విశ్వవిద్యాలయాలని పేర్కొన్నారు. -
ఎంజీ వర్సిటీ తొలి స్నాతకోత్సవం ప్రారంభం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఛాన్స్లర్ హోదాలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు. జేఎన్టీయూ న్యూఢిల్లీ వీసీ ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ కూడా హాజరయ్యారు. వీరికి యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిష్ట్రార్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనిర్సిటీ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన 40 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 84 మందికి మెరిట్ సర్టిఫికెట్స్ అందజేయనున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విద్యార్థుల అరెస్ట్ స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతున్న సందర్భంగా కొంతమంది విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రాత్రి యూనివర్సిటీ హాస్టల్స్‌లోని విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నల్లగొండలోనూ పలు విద్యార్థి సంఘాల నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవాన్ని యూనివర్సిటీలో కాకుండా ఓ కన్వెన్షన్ హాలులో నిర్వహించి ఎంపిక చేసుకున్న విద్యార్థులను మాత్రమే అనుమతించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థుల్లో కొందరు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తూ విద్యార్థులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
ఎంజీ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన
నల్గొండ: పరీక్షల విభాగం సిబ్బంది నిర్లక్ష్యంతో తమకు సెమిస్టర్ పరీక్షలో సున్న మార్కులు వచ్చాయని, తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరీక్షల విభాగం సిబ్బందిని తప్పించాలని డిమాండ్ చేస్తూ ఎంజీ వర్సిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమ విన్నపాన్ని పట్టించుకోని వీసీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 20 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాల భవనంపైకి ఎక్కారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలలో పాస్ అని చూపిస్తూ మెమోల్లో ఫెయిల్ అయినట్లు ఉంటోందని వారు వాపోతున్నారు. దీనిపై హెచ్ఓడిని కలిస్తే 50 మార్కుల వరకు వచ్చాయని చెబుతున్నారని, మెమోల్లో తప్పినట్లు చూపుతున్నారని, వీసీని కలిస్తే తనకు సంబంధం లేదని పట్టించుకోవడంలేదని విద్యార్థులు చెప్పారు. పరీక్షల విభాగం అధికారులు, సిబ్బందిని తప్పించి తమకు న్యాయం చేయాలని వారు వారం రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. -
యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం నల్లగొండ మండలం అన్నెపర్తి పరిధిలోని ఎంజీయూలో 6 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయాన్ని, రూ. 3.2 కోట్లతో సీసీ రోడ్లను, రూ.14 కోట్ల కోట్లతో నిర్మించే ఇంజనీరింగ్ కాలేజీకి, 7.5 కోట్లతో నిర్మించే పరీక్షల విభాగం భవనాలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని యూనివర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలను నియమించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యను విద్యార్థులకు మెరుగైన రీతిలో అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎంజీయూ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందు శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్. భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్‌లు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత ఎంజీయూలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం శ్రీహరి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎంజీయూ గ్రంథాలయ ఆవరణలో టీఆర్ఎస్వీ వర్సెస్ కోమటిరెడ్డి అనుచరుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కోమటిరెడ్డి జిందాబాద్ అని ఆయన అనుచరులు నినాదాలు చేయగా ... దానికి ప్రతిగా సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి జిందాబాద్ అం టూ టీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొని ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట మంత్రులతో కలిసి మెయిన్ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోమటిరెడ్డి ఆ తరువాత తన అనుచరులతో నడుచుకుంటూ వస్తుండగా ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇలా గ్రంథాలయం వరకు చేరుకునేసరికి అప్పటికే మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రంథాలయం ప్రారంభించి లోపలికి వెళ్లారు. కోమటిరెడ్డి గ్రంథాలయం వరకు వచ్చే ఆయన అనుచరులు నినాదాలు చేయడంతో అక్కడే టీఆర్ఎస్వీ నాయకులు కోమటిరెడ్డి డౌన్, డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఎంజీయూ ఆవరణ మార్మోగింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అక్కడే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఎంజీ యూ సమస్యలపై కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు. మంత్రులు వెళ్లిన తరువాత సెమినార్ హాల్లో కోమటిరెడ్డి అనుచరులు మంత్రుల పేర్లతో ఉన్న ప్లెక్సీలను తొలగించారు. బీసీ విద్యార్థి సంఘాల నాయకుల నిరసన గురుకుల పాఠశాలలో పోస్టుల భర్తీలో టెట్ అర్హత లేకుండా అవకాశం కల్పించాలని, మార్కుల శాతం నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దాంతో వారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎంజీయూలో సమస్యలపై పలు విద్యార్థి సంఘాలు వినతిపత్రాలు అందజేశారు. అన్నెపర్తి సర్పంచ్ పుష్పలత యూనిర్సిటీకి భూములు ఇచ్చిన వారికి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయ భూములకు నష్ట పరిహారం ఇప్పించాలని డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. -
యూనివర్సిటీ సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్తా
నల్లగొండ రూరల్ : మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్తానని సీఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం యూనివర్సిటీలో సెమినార్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ వద్ద పట్టుబట్టి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చానన్నారు. సమీప జిల్లాల వారికి ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో కృషి చేయడంతో యూనివర్సిటీకి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారన్నారు. యూనివర్సిటీలోని సమస్యలను డిప్యూటీ సీఎంకు దృష్టికి తీసుకెళ్తామని వస్తే గ్రంథాలయం వద్ద ఆయనను కలిసేందుకు వెళ్తుండగా నేర చరిత్ర కలిగిన వారు, పార్టీ మారిన వారు, సొంత గ్రామంలో వార్డు మెంబర్‌గా గెలవలేని వారు నాకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారన్నా రు. ఈ విషయంపై డీజీపీని కలుస్తానన్నారు. సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. మా పార్టీ కార్యకర్తలు కోమటిరెడ్డి జిందాబాద్ అన్నారే తప్ప ఇతర ప్రజా ప్రజా ప్రతి నిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదన్నారు.పోలీసులను అడ్డుపెట్టుకొని గొడవ చేసేందుకు ప్రయత్నించారన్నారు. శానిటరీ ఉద్యోగుల వేతనాలు పెంచాలి శానిటరీ ఉద్యోగులకు నెలకు నాలుగు వేలు ఇస్తే ఎలా సరిపోతుంది... వీసీ గారు.. మీ ఇంట్లో పనిచేసేవారికి ఎంత వేతనం ఇస్తారు... వచ్చే నెల నుంచి నెలకు 10 వేలు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీసీకీ సూచించారు. సెమినార్ హాల్లో యూనివర్సిటీ వీసీ, రిజిస్టార్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఉద్యోగులు జీతాలు సరిపోవడం లేదని కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి మున్సిపల్ శానిటరీ ఉద్యోగులకు కూడా 10 వేలు జీతం ఇస్తున్నారని వీరికి కూడా జీతాలు పెంచాలన్నారు. -
అధిక ఫీజులను అరికట్టాలని వీసీ చాంబర్ ముట్టడి
ఎంజీ యూనివర్సిటీ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నీరూటి రమేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేస్తున్నప్పటికీ విద్యార్థుల నుంచి బలవంతంగా కళాశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులు కూడా తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేకపోయినా, కనీస సౌకర్యాలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. క్రీడా పోటీల పేరిట యూనివర్సిటీ వసూలు చేసిన లక్షల రూపాయలు ఏం చేశారో లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను వీసీ అల్తాఫ్ హుస్సేన్‌కు వివరించారు. దాంతో ఆయన మాట్లాడుతూ సమస్యలు తన దృష్టికి రాలేదని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దాంతో భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ తర్వాత వదిలేశారు. -
మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ఖాజా అల్తాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌ను నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన ఖాజా అల్తాఫ్ ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
వీసీ పోస్టులకు 1,289 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో వైస్‌చాన్స్‌లర్(వీసీ) పోస్టుల కోసం 1,289 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సైంటిసులూ ఉన్నారు. కొందరు ప్రొఫెసర్లు తొమ్మిది వర్సిటీలకూ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 330 మంది 1,289 దరఖాస్తులు పంపారు. గత నెలలో వర్సిటీ వీసీ పోస్టులకు నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసి, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8 వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. వీరిలో 15 మంది తాము ఏ వర్సిటీ వీసీ పోస్టును కోరుకుంటున్నారో తెలపకుండా దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు. వీటిని పరిశీలించి ప్రతి వీసీ పోస్టుకు ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కాగా దరఖాస్తు చేసుకున్న వారినే కాకుండా చేసుకోని వారిని కూడా వీసీలుగా నియమించే అవకాశం ఉండనుంది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అత్యధికంగా 182 దర ఖాస్తులు వచ్చాయి. ఆ తరువాతి స్థానంలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ పోస్టు కోసం 176 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. -
సర్టిఫికెట్లు ఇచ్చేందుకు తీరిక లేదా?
♦ బీఈడీ పాస్అవుట్ విద్యార్థులతో ఎంజీ వర్సిటీ చెలగాటం ♦ పరీక్షలు పూర్తయి మూడు నెలలైనా మెమోలు ఇవ్వని వైనం ♦ డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన ఎంజీ యూనివర్సిటీ/ నల్లగొండ రూరల్: నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తీరు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. మూడు నెలల క్రితం బీఈడీ పరీక్షలు రాసిన విద్యార్థులకు నేటి వరకు మార్కుల మెమోలు రాలేదు. ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని, నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నా యూనివర్సిటీ అధికారులలో చలనం లేదు. యూనివర్సిటీ పరిధిలో 49 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో ఐదువేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నాలుగు వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015 అక్టోబరులో ఫలితాలు ప్రకటించిన యూనివర్సిటీ.. సర్టిఫికెట్ల జారీలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విషయమై విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక కారణాల వల్ల ప్రింట్ చేయలేకపోతున్నామని ఓసారి, సరైన సిబ్బంది లేరని మరోసారి, బడ్జెట్ రాలేదని ఇంకోసారి చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. యూనివర్సిటీ అధికారులు తమకు సర్టిఫికెట్లు ఇచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయి డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే తాము అర్హత కోల్పోతామనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. గతంలో కూడా సకాలంలో మెమోలు జారీ చేయడం లేదని విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాల యం వద్ద ఆందోళనలు కూడా నిర్వహించారు. అధికారులు విద్యార్థుల పాలిట శాపంగా మారారని, సర్టిఫికెట్లు కోసం త్వర లోనే ఆందోళనలు చేపడతామని విద్యార్థిసంఘాలు హెచ్చరిస్తున్నాయి. 45 రోజుల్లో మెమోలు అందించాలి ఫలితాలు వెల్లడించిన 45 రోజుల్లోగా యూని వర్సిటీ మెమోలు విద్యార్థులకు అందించాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కారణాలేవి చెప్పడం లేదు. ఇతర కోర్సులకు, ఉద్యోగాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మెమోలను గడువులోగా అందించాలి. - కట్టా వినయ్, వర్సిటీ జేఏసీ చైర్మన్ వారం రోజుల్లోగా సర్టిఫికెట్లు జారీ చేస్తాం సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికెట్ల జారీ చేయడంలో జాప్యం జరిగింది. వారం రోజుల్లో సర్టిఫికెట్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే బీఈడీ విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రింట్ అవుతున్నాయి. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - అంజిరెడ్డి, పరీక్షలనియంత్రణ అధికారి -
మహాత్మాగాంధీ వర్సిటీ ఇంచార్జీ వీసీ నియామకం
హైదరాబాద్: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి పాఠశాల విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి టి. విజయ్ కుమార్‌ను ఇంచార్జీ వైస్ చాన్సలర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, పూర్తి స్థాయి వీసీని నియమించేంతవరకు విజయ్‌కుమార్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థుల దీక్ష
ఎంజీయూ (నల్లగొండ రూరల్): యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సును మూడేళ్లు ఒకేచోట నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అన్నెపర్తి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం ఇంజినీరింగ్ విద్యార్థులు దీక్ష చేపట్టారు. ప్రథమ సంవత్సరం అన్నెపర్తి మెయిన్ క్యాంపస్‌లో, ద్వితీయ, తృతీయ సంవత్సరం పానగల్ క్యాంపస్‌లో తరగతులు, హాస్టల్ నిర్వహిస్తే తాము అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. పానగల్ క్యాంపస్‌లో క్లాస్‌లకు హాజరయ్యే రెండో, మూడో సంవత్సరం విద్యార్థినులు హాస్టల్ కోసం మళ్లీ అన్నెపర్తి మెయిన్ క్యాంపస్‌కు రావాల్సి ఉందన్నారు. అన్నెపర్తి మెయిన్ క్యాంపస్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు హాస్టల్ కోసం పానగల్ క్యాంపస్‌కు రావాల్సి ఉందన్నారు. దీంతో విద్యార్థుల మధ్య చదువుపరంగా సహకారం అండదని ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీలో రూ.24 కోట్ల నిధులు మూలుగుతున్న ఒక్క కొత్త భవనం నిర్మించకపోవడం అధికారుల పని తీరుకు నిదర్శనమని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలను వీసీ మణిప్రసాద్ దృష్టికి తీసుకపోకుండా రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అన్ని కోర్సుల విద్యార్థులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు దీక్షను కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. -
మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా
నల్లగొండ : ఇంజనీరింగ్ విద్యను ఒకే చోట అందించాలని కోరుతూ మహాత్మాగాంధీ ఇంజనీరింగ్ విద్యార్థులు యూనివర్సిటీలో శనివారం ధర్నాకు దిగారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మొదటి సంవత్సరం తరగతులను అనపర్తి వద్ద ఉన్న యూనివర్సిటీలో చెబుతున్నారు. రెండు, మూడో ఏడాది తరగతులను నల్లగొండ పట్టణంలోని పానగల్లు చెరువు సమీపంలో ఉన్న క్యాంపస్‌లో చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని సంవత్సరాల తరగతులను ఒకేచోట బోధించాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నాకు దిగారు. -
‘ఉపకారం’ కోసం ఉద్యమం
కోదాడటౌన్: ఉపకార వేతనాల కోసం విద్యార్థులు ఉద్యమ బాట పడుతున్నారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ‘ఫాస్ట్’ పథకం గైడ్‌లైన్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇటు విద్యార్థుల్లో, అటు ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకుల్లో అలజడి మొదలైంది. ఈ నెల 7వ తేదీతో డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా జిల్లాలోని మహాత్మాగాంధీ వర్శిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉపకార వేతనాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయనందున విద్యార్థులు కళాశాల ఫీజులను చెల్లిస్తేనే పరీక్ష ఫీజును తీసుకుంటామని చెపుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 40 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఇప్పటి వరకు ఎదురుచూస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. రోజు వా రి నిర్వహణ ఖర్చులు కూడా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నెలల తరబడి అధ్యాపకులకు జీతాలు ఇవ్వకపోవడంతో పాఠాలు చెప్పడానికి వారు ముందుకు రావడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. తీవ్రమవుతున్న సమస్య జిల్లాలో వివిధ కోర్సులు చదువుతూ గత సంవత్సరం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకున్న 90, 413 మందితో పాటు ఈ విద్యాసంవత్సరం మరో 50 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 41 ఇంజనీరింగ్, 116 డిగ్రీ, 242 జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు డిప్లోమా, బీఫార్మసీ, ఐటీఐ, నర్సింగ్, డీఎడ్, బీఈడీ, పీజీ కోర్సులు చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 90 శాతానికి పైగా కళాశాలలు ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో పలు కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే విధంగా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలతోనే చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు దాదాపు 90 శాతానికి పైగా ఉన్నారు. కాలేజీకి రావడం మానేస్తున్న విద్యార్థులు ప్రభుత్వం ఉపకార వేతనాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాలలు ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తుండడంతో ఇపుడు వీరంతా కళాశాలలకు రావడం మానేస్తున్నారు. గతంలో విద్యార్ధులకు వచ్చే ఉపకార వేతనాలను కళాశాల ఫీజు కింద తీసుకొని తరగతులకు అనుమతించే వారు. కొన్ని కళాశాల లు పరీక్ష ఫీజు కూడా వారే చెల్లించేవారు. ప్రస్తుతం ఉపకార వేతనాలు రావపోవడంతో కళాశాల ఫీజు, పరీక్ష ఫీజు కలిపి దాదాపు 7 నుంచి 10 వేల రూపాయలు వరకు చెల్లించాల్సి వస్తుంది. కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో విద్యార్థులు కళాశాలలకు రావడమే మానేస్తున్నారు. 7వ తే దీ వరకు మాత్రమే సమయం ఉండడంతో డిగ్రీ విద్యార్థు లు ఉద్యమబాట పడుతున్నారు. వీరికి ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా తోడు కావడంతో ఈ సమస్య రానున్నరోజుల్లో తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలేజీలు మూసివేయడమే మిగిలింది : పి. నాగిరెడ్డి, సాయివికాస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, కోదాడ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలను ఇవ్వకపోవడంతో కళాశాలలను నడపలేకపోతున్నాం. కళాశాలల నిర్వాహకులు భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, అధ్యాపకుల జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఉపకార వేతనాలు విడుదల చేయాలి. లేని పక్షంలో కళాశాలలను మూసి వేయడమే శరణ్యం. -
వర్గీకరణ కోసం మరో ఉద్యమం : మంద కృష్ణ
నల్లగొండ రూరల్ : ఎస్సీ వర్గీకరణ కోసం డిసెంబర్ 2వ వారం నుంచి మరో ఉద్యమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. గురువారం స్థానిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ చట్టసభల్లో నాలుగు నిమిషాల మాట్లాడని దద్దమ్మలన్నారు. పోరాటం చేసేవారిని వదిలి అసమర్థ మాదిగ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్, ఎల్‌కె.అద్వాని, వెంకయ్యనాయుడులు వర్గీకరణకు మద్దతు పలికారని, దివంగత వైఎస్ఆర్ ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాగాంధీని కలిపిం చారని తెలిపారు. వర్గీకరణ ద్వారా మాదిగలకు 12శాతం రిజర్వేషన్ లభిస్తుందని, తద్వార మాదిగ జాతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను కావాలనుకుంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యేవాడినని, కానీ జాతి ఆత్మగౌరవం కోసమే పోరాటం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఉద్యమ పోరాటానికి మహాజన సోషలిస్టు పార్టీకి సంబంధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇందుకు మాయావతి, కాన్షిరాం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లింగస్వామి, నరేష్, కోళ్ల శివ, సోమయ్య, చేకూరు గణేష్, రవి, కె.మోహన్, అధ్యాపకులు ఉన్నారు. -
మహాత్మా.. ఇదేమిటయ్యా!
యూనివర్సిటీలో అవినీతి కంపు రూ.కోట్లు వచ్చినా జరగని అభివృద్ధి అడ్డగోలు నిధుల ఖర్చుపై లేని విచారణ సెమినార్, కాన్ఫరెన్స్ హాళ్ల ఇంటీరియర్ డెకరేషన్‌కు కోటి రూపాయలు.. ఒక్క కంప్యూటర్ టేబుల్‌కు రూ.15వేలు.. టెండర్లు లేకుండానే వంద ఏసీల కొనుగోలు.. ఇవీ.. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చోటుచేసుకున్న అవినీతికి మచ్చుతునకలు. ఇదిలా ఉంటే.. నిధుల వరద పెద్దఎత్తున పారినా.. అభివృద్ధి జరిగిందా అంటే అదీ లేదు. 2011 నుంచి నేటికీ ఒక్క నూతన భవనం నిర్మించక పోవడం గమనార్హం. - ఎంజీయూ (నల్లగొండ రూరల్) విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో దివంగత సీఎం వైఎస్సార్.. జిల్లాకు మహాత్మాగాంధీ యూనివర్సిటీని మంజూరు చేశారు. యూనివర్సిటీని జిల్లాకేంద్రం శివారు అన్నెపర్తిలో నెలకొల్పారు. ఎంతో సదాశయంతో ఏర్పాటుచేసిన ఈ యూనివర్సిటీ పేరును దిగజార్చేలా అక్కడ పనులు కొనసాగడం పట్ల మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి వచ్చిన నిధులను సంబంధిత అధికారులు ‘రూ.రెండు లక్షల’ లాజిక్‌ను అడ్డుపెట్టుకుని ఎలాంటి టెండర్లూ లేకుండా అక్రమ బిల్లులు పెట్టి స్వాహాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు మాత్రం ఖర్చు అవుతున్నాయి. కానీ 2011 నుంచి నేటికీ ఒక్క నూతన భవనం నిర్మించకపోవడంతో ఎలాంటి కొత్త కోర్సులు రావడం లేదు. ఉన్న కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. పానగల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్, ల్యాబ్, తరగతి గదులు లేకపోవడంతో అసౌకర్యాల నడుమే చదువుకుంటున్నారు. 2007లో యూనివర్సిటీ ఏర్పాటు... వెనుకబడిన జిల్లాగా భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2007లో యూనివర్సిటీని మంజూరు చేశారు. పానగల్లులో పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2008లో మహాత్మాగాంధీ యూనివర్సిటీగా పేరు ప్రకటించారు. ఆ తర్వాత అన్నెపర్తిలో 249 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.10 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న భవనాలు ఇవీ.. సైన్స్ బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్, బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ భవనాలను 2008 నుంచి 2011 వరకు పూర్తి చేశారు. పునాది దశలోనే సెంట్రల్ లైబ్రరీ.. 2011 నుంచి నేటి వరకు ఒక్క కొత్త భవనం నిర్మించలేదు. అప్పటి వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి కొత్త భవనాలు నిర్మించలేదు. 2011లో సెంట్రల్ లైబ్రరీ కోసం శంకుస్థాపన చేశారు. ఇక పునాది స్థాయిలో పిల్లర్లు వేసి వదిలేశారు. ఇవీ.. వచ్చిన నిధులు 2013-14లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) 12వ ప్రణాళిక కింద : రూ.7.50 కోట్లు యూజీసీ 12 ‘బీ’ కింద : రూ.7 కోట్ల 50 లక్షలు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వచ్చినవి రూ.3 కోట్లకు పైగా.. 12వ ప్లాన్ కింద రూ. 7. 50 కోట్లు (వీటిని ఐదు సంవత్సరాల కాలంలో మౌలిక వసతులకు ఉపయోగించాలి) మెరుగులు దిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు... పై పై మెరుగులు దిద్దే పనులకు యూనివర్సిటీ అధికారులు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఎక్కువ బిల్లులను చూపుతూ అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ, రిజిస్ట్రార్ చాంబర్ల ఆధునికీకరణకు లక్షల రూపాయల బిల్లులు పెట్టి కొంత నొక్కేశారని, సైన్స్ బ్లాక్‌లో తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేసి నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. ఆర్ట్స్ బ్లాక్‌లోని సెమినార్ హాల్‌తో పాటు కాన్ఫరెన్స్ హాల్‌కు ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ.కోటి ఖర్చు చేయడం చూస్తుంటే అధికారుల అక్రమ బిల్లుల బాగోతం ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక.. కంప్యూటర్‌కు సంబంధించిన ఒక్క టేబుల్‌కు రూ.15 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం 100 ఏసీలు కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. టెండర్ ఏదీ? యూనివర్సిటీలో చేపట్టే పనులకు ఎలాంటి టెండర్ లేకుండా కంప్యూటర్ టేబుళ్లు, ల్యాబ్ సామగ్రి, లైబ్రరీ సామగ్రి, ఏసీలు, టేబుళ్లు కొనుగోలు చేశారు. వచ్చిన నిధుల్లో చేతివాటం ప్రదర్శించేందుకు వారం, 10 రోజులకు ఒకసారి సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. రూ. 2లక్షలు దాటితే టెండర్ పిలవాల్సిన నిబంధన ఉండడంతో రూ.2 లక్షలు మించకుండా నిధులను ఖర్చు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవీ.. అసంపూర్తి పనులు యూనివర్సిటీకి నిధుల వరద పారినా.. యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, సైన్స్బ్లాక్లోని సెమినార్ హాల్, మొదటి, రెండవ ఫ్లొర్లోని అసంపూర్తి గదులు, స్పోర్ట్స్ గ్రౌండ్, అంతర్గత రోడ్ల కోసం కంకరపోసి రెండేళ్లు గడిచినా తట్టెడు పని జరగలేదు. ఔట్సోర్సింగ్, రెగ్యులర్ నియామకాలపై విచారణ పెండింగ్‌లో ఉంది. యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై ప్రస్తుత వీసీ దృష్టి సారించాల్సిన అవసరముందని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. ఖర్చుల విషయం నాకు తెలియదు యూనివర్సిటీకి గతంలో వచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చుల విషయం నాకు తెలియదు. రూ.140 కోట్లు కావాలని 14వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు ఇచ్చాం. రూ.40 కోట్లు ఇంజినీరింగ్ కోసం, మరో రూ.40 కోట్ల యూనివర్సిటీ వ్యవహరాలకు ఖర్చు చేస్తాం. కొత్త భవనాలు, కొత్త కోర్సులు తీసుకురావాల్సి ఉంది. - నరేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్ -
నేటినుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ(అన్నెపర్తి)లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 51 బీఈడీ కాలేజీలు ఉండగా, 5100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 21 నుంచి 28వ తేదీ దాకా కౌన్సెలింగ్ మ్యాథ్స్ కౌన్సెలింగ్ 21వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. మ్యాథ్స్ అభ్యర్థులు 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించారు. ఫిజికల్సైన్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 23వ తేదీ ఒక్కరోజే కౌన్సెలింగ్ ఉంటుండగా, ఫిజికల్సైన్స్వారికి 25, 26 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. 24, 25 తేదీల్లో బయాలాజికల్ సైన్స్వారి కౌన్సెలింగ్ జరుగుతుంది. వీరికి 26, 27 తేదీల్లో వెబ్ఆప్షన్స్ ఇచ్చారు. 26 నుంచి 28వ తేదీ దాకా సోషల్ స్టడీస్ వారికి కౌన్సెలింగ్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ విషయాని వస్తే 26వ తేదీన కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారికి 28, 29న, 27న కౌన్సెలింగ్ హాజరయ్యేవారికి 29, 30 తేదీల్లో, 28న కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారికి 30, అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక కేటగిరి వారికి.... 22న మ్యాథ్స్ - ఎన్సీసీ, క్యాప్, పీహెచ్సీ, స్పోర్ట్స్ 23న ఫిజికల్సైన్స్/ఇంగ్లిష్ -ఎన్సీసీ, క్యాప్, పీహెచ్సీ, స్పోర్ట్స్ 24న బయాలాజికల్ సైన్స్ -ఎన్సీసీ, క్యాప్ 25న బయోలాజికల్ సైన్స్-స్పోర్ట్స్, పీహెచ్సీ 26న సోషల్ స్టడీస్ - ఎన్సీసీ, క్యాప్ 27న సోషల్ స్టడీస్ -స్పోర్ట్స్, పీహెచ్సీ ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు నిజాం కాలేజీ హైదరాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి, వరంగల్‌లో కౌన్సెలింగ్ జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా హాజరుకావాలి : అంజిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 10గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభిస్తాం. అభ్యర్థులు ఒరిజినల్, జీరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్ ర్యాంకుల వారీగా.. తేదీ సబ్జెక్టు సమయం హెల్ప్‌లైన్ సెంటర్స్ ఎన్జీ కాలేజీ ఎంజీ యూనివర్సిటీ 21న మ్యాథ్స్ ఉదయం 1 -2500 2501-5000 మధ్యాహ్నం 5001-7500 7501-10,000 22న ॥ ఉదయం 10,001-14,000 14,001-18,000 మధ్యాహ్నం 18,001-24,000 24,000 నుంచి చివరి ర్యాంకు దాకా 23న ఫిజిక్స్,ఇంగ్లిష్ ఉదయం 1-2500 2501-5000 మధ్యాహ్నం 5001-9500 9501 నుంచి చివరి ర్యాంకు దాకా 24న జీవశాస్త్రం ఉదయం 1-4000 4001-8000 మధ్యామ్నం 8001-12,000 12,001-16,000 25న ॥ ఉదయం 16,001-20,000 20,001-24,000 మధ్యాహ్నం 24,001-30,000 30,001 నుంచి చివరి ర్యాంకు దాకా 26న సాంఘికశాస్త్రం ఉదయం 1-5000 5001-10,000 మధ్యాహ్నం 10,001-15,000 15,001-20,000 27న ॥ ఉదయం 20,001-25,000 25,001-30,000 మధ్యాహ్నం 30,001-35,000 35,000-40,000 28న ॥ ఉదయం 40,001-45,000 45001-50,000 మధ్యాహ్నం 50,001-58,000 58,001 నుంచి చివరి ర్యాంకు దాకా -
ఎంసెట్ పరీక్ష కేంద్రానికి వెళుతూ దుర్మరణం
నల్లగొండ: కొడుకుని ఎంసెట్ పరీక్ష కేంద్రానికి తీసుకువెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందారు. కొడుకుకు గాయాలయ్యాయి. నార్కెట్పల్లికి చెందిన ఈ తండ్రీకొడుకులు తెల్లవారుజామునే లేచి నల్లగొండలోని పరీక్షా కేంద్రానికి బైకుపై బయలుదేరారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షాకేంద్రలోకి అనుమతించరని, వీరు కాస్త ముందుగానే బయలుదేరారు. ఒక్కగానొక్క కొడుకు చేత పరీక్ష రాయించడానికి తండ్రి స్వయంగా తీసుకువస్తున్నారు. వారి బైకు మహాత్మగాంధీ యూనివర్సిటీ సమీపంలోకి రాగానే ఒక లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు గాయపడ్డారు. తన కళ్ల ఎదుటే తండ్రి మరణించడం చూసి కొడుకు తట్టుకోలేకపోతున్నాడు. పరీక్ష రాసే పరిస్థితి కూడాలేదు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. -
ఎంసెట్ పరీక్ష కేంద్రానికి వెళుతూ దుర్మరణం